Thursday, May 18, 2017

మరచిపో నేస్తమా

చిత్రం : జీవన పోరాటం (1986)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : ఏసుదాసు





పల్లవి : 


మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..


జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు
నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో..
గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యలు... ఇక వినిపించునా కనిపించునా
వినిపించునా....  కనిపించునా


మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..


చరణం 1 :


ఆ... ఆ... ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ..
నీ కంటి పాపతో....
నీ కంటి పాపతో....  కన్నీరు చల్లకు..
పన్నీట వెన్నెలా జల్లుకో..
కొత్త ఆశలే తీగలల్లుకో
మన్నిస్తున్నాలే మాజీ ప్రేయసి


పచ్చని సిరులు... వెచ్చని మరులు... నచ్చిన వరుడు...నూరేళ్ళు
నీ తోడుగా వర్థిల్లుగా..
నీ తోడుగా వర్థిల్లుగా..





చరణం 2 :


ఆకాశ వీధిలో...
ఆకాశ వీధిలో ఏ తారనడిగినా..
చెబుతుందిలే మన ప్రేమ గాధలు..
భగ్న జీవుల గుండె కోతలు
గెలుపే నీదమ్మ... జొహరందుకో


పగిలిన హృదయం.. చిలికిన రక్తం.. కుంకుమ తిలకం.. ఈనాడు..
నీ శోభలై వర్దిల్లగా....
నీ శోభలై వర్దిల్లగా....


మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా..


జ్ఞాపకల నీడలు... తీపి చేదు బాసలు
నీ గుండెలో చెరిపేసుకో... నీ కోసమే తుడిచేసుకో..
గుడ్డి ప్రేమల్లో మూగ సాక్ష్యాలు... ఇక వినిపించునా కనిపించునా
వినిపించునా....  కనిపించునా
మరచిపో నేస్తమా... హృదయముంటే సాధ్యమా.. 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2788

No comments:

Post a Comment