Thursday, December 14, 2017

ఇదేనన్నమాట

చిత్రం : కొడుకు కోడలు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, జానకి 




పల్లవి :


ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట
మతి మతిలోలేకుంది... మనసేదో లాగుంది... అంటే... 


ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట
మతి మతిలోలేకుంది... మనసేదో లాగుంది... అంటే
ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట 



చరణం 1 :



ప్రేమంటే అదోరకం... పిచ్చన్న మాట
ఆ పిచ్చిలోనే  వెచ్చదనం... ఉన్నదన్నమాట
ప్రేమంటే అదోరకం... పిచ్చన్నమాట
ఆ పిచ్చిలోనే  వెచ్చదనం... ఉన్నదన్నమాట


మనసిస్తే మతి పొయిందన్నమాట
మనసిస్తే మతి పొయిందన్నమాట
మతిపోయే...  మత్తేదో... కమ్మునన్నమాట


ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట





చరణం 2 :



కొత్త కొత్త సొగసులు... మొగ్గ తొడుగుతున్నవి
అవి గుండెలో ఉండుండి..గుబులు రేపుతున్నవి
కొత్త కొత్త సొగసులు..మొగ్గ తొడుగుతున్నవి
అవి గుండెలో ఉండుండి..గుబులు రేపుతున్నవి


కుర్రతనం చేష్టలు... ముద్దులొలుకుతున్నవి
కుర్రతనం చేష్టలు... ముద్దులొలుకుతున్నవి
అవి కునుకురాని కళ్ళకు..హ్హ..కలలుగా వచ్చినవి


ఇదేనన్నమాట..ఇది అదేనన్న మాట




చరణం 3 :




ఆడదాని జీవితమే... అరిటాకు అన్నారు
అన్నవాళ్ళందరూ... అనురాగం కోరారు
ఆడదాని జీవితమే... అరిటాకు అన్నారు
అన్నవాళ్ళందరూ... అనురాగం కోరారు


తేటి ఎగిరిపోతుంది... పువ్వు మిగిలిపోతుంది
తేటి ఎగిరిపోతుంది... పువ్వు మిగిలిపోతుంది
తేనె వున్నసంగతే... తేటి గుర్తు చేస్తుంది


ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట 



చరణం 4 :



వలపే ఒక వేదనా... అది గెలిచిందా తీయనా... ఆవలపే ఒక వేదనా... అది గెలిచిందా తీయనా... ఆ 


కన్నెబ్రతుకే ఒక శోధనా... కలలు పండిస్తే సాధనా..ఆ ఆ... మనసు మెత్తపడుతుంది కన్నీటిలోనాఆ... మమతల పంటకదే... తొలకరి వాన



ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట
మతి మతిలోలేకుంది... మనసేదో లాగుంది... అంటే
ఇదేనన్నమాట... ఇది అదేనన్న మాట 

No comments:

Post a Comment