Monday, October 27, 2014

అసురసంధ్య వేళ

చిత్రం :  అమరజీవి (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల
 


సాకి :  

శ్రీ రంగనాథ చరణారవింద చారణ చక్రవర్తి! పుంభావ భక్తి!
ముక్తికై మూడు పుండ్రాలు నుదుట దాల్చిన ముగ్ధ మోహన సుకుమార మూర్తీ.....ఈ ..ఈ..ఈ..
తొండరడిప్పొడి... నీ అడుగుదమ్ముల పడి..ధన్యమైనది ..
నీ దీన దీన దేవ దేవీ..నీ దాసాను దాసి..


నీ పూజలకు పూవుగా.. జపములకు మాలగా.. పులకించి పూమాలగా..
గళమునను.. కరమునను.. ఉరమునను..
ఇహమునకు... పరమునకు నీదాననై.. ధన్యనై..
జీవన వదాన్యనై  తరియించుదాన.. మన్నించవే... మన్నించవే..
అని విన్నవించు నీ ప్రియసేవికా.. దేవ దేవీ. .


పల్లవి :

అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ...
ముసురుకున్న మమతలతో.. కొసరిన అపరాధమేమి?
స్వామీ...  స్వామీ... 
స్వామీ


అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామి ఉసురు తగలనీకు దేవి..
మరులుకొన్న హరిని వీడి...  

మరలిన ఈ నర జన్మ మేమి ..దేవీ ..దేవీ... దేవీ..


చరణం 1 :



హరి హర సుర జ్యేష్ఠాదులు.. కౌశికశుకవ్యాసాదులు

హరి హర సుర జ్యేష్ఠాదులు.. కౌశికశుకవ్యాసాదులు

నిగ తత్వములను తెలిసి.. నీమ నిష్ఠలకు అలసి

పూనిన శృంగార యోగమిది కాదని .. నను కాదని..
జడదారీ !..ఆ..ఆ..ఆ..ఆ.. పడకు పెడదారి 


అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు స్వామీ..
ఆడ ఉసురు తగలనీకు స్వామీ... 


అసురసంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ...
స్వామి ఉసురు తగలనీకు దేవీ...


చరణం 2 : 


నశ్వరమది..నాటకమిది...నాలుగు గడియల వెలుగిది..
కడలిని కలిసేవరకే... కావేరికి రూపు ఉన్నది
రంగని కీర్తన చేసే రాగమాలికను కానీ..
రంగని భక్తుల ముంగిట రంగవల్లికను కానీ..
దేవీ..దేవీ..దేవ దేవీ... 


అసుర సంధ్య వేళ ఉసురు తగలనీకు దేవీ ..
స్వామి ఉసురు తగలనీకు దే..వీ...


చరణం 3 : 

అలిగేనిట శ్రీరంగము.. తొలగేనట వైకుంఠము
యాతనకేనా దేహము?... ఈ దేహము సందేహం
ఈ క్షణమే సమ్మోహము...  వీక్షణమే మరుదాహము


రంగా! రంగా... రంగ రంగ శ్రీ రంగ  !!

ఎటులోపను...ఎటులాపను?
ఒకసారి.. 
అ.. అ.. అనుభవించు ఒడిచేరి.. 




1 comment:

  1. అద్భుత పదకూర్పు.
    శృంగారం, భక్తి జీవిత పరమార్థాలు

    ReplyDelete