Sunday, June 10, 2018

జయీభవ! దిగ్విజయయీభవ

చిత్రం : దాన వీర శూర కర్ణ (1977)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, జి. ఆనంద్, కోరస్



పల్లవి : 


జయీభవ.. విజయీభవ.. 

జయీభవ.. విజయీభవ 


చంద్రవంశ పాదోది చంద్రమా 

కురుకుల సరసీ రాజహంసమా 

జయీభవ.. విజయీభవ.. 



చరణం 1 : 




ధన్య గాంధారి గర్భశుక్తి  ముక్తాఫలా
మాన్య ధృతరాష్ట్ర  తిమిరనయన తేజఃఫలా..ఆ..
ధన్య గాంధారి గర్భశుక్తి  ముక్తాఫలా
మాన్య ధృతరాష్ట్ర  తిమిరనయన తేజఃఫలా.. 


దిగ్గజ కుంభవిదారణచణ శతసోదరగణ పరివేష్టితా
చతుర్దశ భువన చమూ నిర్దళణ చటుల భుజార్గళ శోభితా 


జయీభవ.. విజయీభవ.. 



చరణం 2 : 




కవిగాయక నట వైతాళిక సంస్తూయమాన విభవాభరణా 
నిఖిల రాజన్య మకుటమణి ఘ్రుణీ నీరాజిత మంగళచరణా 
మేరు శిఖరి శిఖరాయమాన గంభీర..ధీరగుణ మానధనా 
క్షీరపయోధి తరంగ విమల విస్ఫార యశోధన సుయోధనా  


జగనొబ్బ గండ జయహో.. గండరగండ జయహో.. 
అహిరాజకేతనా జయహో.. ఆశ్రిత పోషణ జయహో.. 
జయహో.. జయహో.. జయహో..




No comments:

Post a Comment