Monday, December 31, 2018

రుక్కు రుక్కు రుక్కుమిణి

చిత్రం :  పెళ్లి (1997)
సంగీతం :  ఎస్.ఎ.రాజ్ కుమార్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  మనో  



పల్లవి : 


రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రధమును తెమ్మనె...  రబ్బా హోయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా


కిలాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవ్వా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట.. రెడీగ ఉందిర వారెవా..
రుక్కు రుక్కు రుక్కుమిణీ...హో...
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును తెమ్మనె...  రబ్బా హోయ్ రబ్బా


ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మా
బుగ్గమీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా
ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మా
బుగ్గమీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా    



చరణం 1 :


విరిసీ విరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా


అందమైన కుందనాల కూన
నీ అండ చేరుకున్నది కదరా కన్నా
పొందికైన సుందర వదనా
నీ పొందు కోరుకున్నది పదరా నాన్నా


సొంపులందుకో స్వర్గమేలుకో
చిన్నదాన్ని వన్నెలన్నీ కన్నె దానమందుకోని
నవాబువైపోరా నీ నసీబు మారెనురా


ఏయ్.. రుక్కు రుక్కు రుక్కుమిణీ.. హో..
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును... తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా  



చరణం 2 :


కలికీ నీ కల తీరగా...  ఇలకే చంద్రుడు జారెగా
చిలకా నీ జత చేరగా...  ఒడిలో ఇంద్రుడు వాలెగా
అరెరెరె బంగారు జింక... నీకు ఇంతలోనె అంతటి సిగ్గా సిగ్గా
అప్పుడే ఏమైంది గనకా...  ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా జంట కట్టగా...
హోరు హోరు హోరుమంటూ ఊరువాడా
అంత చేరి హుషారు హంగామా అహా ఖుషీగా చేద్దామా


అరెరెరె.. 

రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రధమును తెమ్మనె...  రబ్బా హోయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా


కిలాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవ్వా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట.. రెడీగ ఉందిర వారెవా..

యవ్వన వీణ

చిత్రం : పెళ్లి (1997)
సంగీతం :  ఎస్.ఎ.రాజ్ కుమార్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు 



పల్లవి : 


యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో... యవ్వన వీణ పువ్వుల వాన



చరణం 1 :


నువ్వంటు పుట్టినట్టు నా కొరకు
ఆచూకి అందలేదు ఇంతవరకూ
వచ్చిందిగాని ఈడు ఒంటివరకూ
వేధించలేదు నన్ను జంట కొరకు


చూసాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు


ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా

హో... యవ్వన వీణ పువ్వుల వాన



చరణం 2 :



ఏ పూలతీగ కాస్త ఊగుతున్నా... నీ లేత నడుమే అనుకున్నా
ఏ గువ్వ కిలకిల వినబడినా... నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనపడినా... ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో...  ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా


నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో...హో...హో...హో...
యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా

జాబిలమ్మ నీకు అంత కోపమా

చిత్రం :  పెళ్లి (1997) 

సంగీతం :  ఎస్.ఎ.రాజ్ కుమార్

గీతరచయిత :  సిరివెన్నెల

నేపథ్య గానం :  బాలు 



పల్లవి : 


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 

అల్లాడిపోదా రేయి ఆపుమా


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .



చరణం 1 :


చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా

చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా

ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా

హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా

మరి అంత దూరమా కలలుకన్న తీరమా

 

జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..




చరణం 2 :



మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా

మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా

ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా

తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా

ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 

అల్లాడిపోదా రేయి ఆపుమా


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..



Sunday, December 30, 2018

మానవత్వం పరిమళించే

చిత్రం :  నేటి భారతం (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  అదృష్ట దీపక్
నేపథ్య గానం :  జానకి  



పల్లవి : 


మపనిపా మపనిపా నిసగసా... పమప గమసా...


మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం
స్వాగతం..స్వాగతం..
బ్రతుకు అర్థం తెలియజేసిన... మంచి మనిషికి స్వాగతం
స్వాగతం..స్వాగతం..


మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం




చరణం 1 :



కారుమబ్బులు ఆవరించిన కటిక చీకటిజీవితంలో
వెలుగులనుప్రసరింపజేసిన ... కాంతిమూర్తీ..స్వాగతం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం 

మానవత్వం పరిమళించే... మంచి మనసుకు..స్వాగతం


చరణం 2 : 




అంతు తెలియని యాతనలతో... అలమటించేఆర్తజనులకు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొత్త ఊపిరి అందజేసిన స్నేహశీలీ.. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
స్నేహశీలీ..స్వాగతం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం 

మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం


చరణం 3 : 



పనికిరావని..పారవేసిన మోడువారినజీవితాలకు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
చిగురుటాశల దారి చూపిన... మార్గదర్శీ..స్వాగతం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం
తననతం తననంతననం 


మానవత్వం పరిమళించే... మంచి మనసుకు స్వాగతం
స్వాగతం..స్వాగతం..మ్మ్
బ్రతుకు అర్థం తెలియజేసిన... మంచి మనిషికి స్వాగతం..మ్మ్
స్వాగతం..మ్మ్



ఉత్తరాల ఊర్వశి

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి

నేపథ్య గానం :  బాలు, చిత్ర    




పల్లవి : 


ఉత్తరాల ఊర్వశి...ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత... వేడి వెన్నెల
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా


గీత గోవిందుడు...  వీనులో విందుడు
రాగమాలతోనే రాసలీలలాడగా
మజా మజా మజా...  ఘుమాఘుమాలయా
నిజానికి ఇదంత ఒట్టు నీదయ



చరణం 1 :  


పువ్వులెన్నొ విచ్చినట్టుగా చెలీ...  నవ్వగానె నచ్చినావులే
చుక్కలెన్నొ పుట్టినట్టుగా ప్రియా...  చూసుకోరా పట్టి కౌగిలీ
ఖవాలీల కన్నులతోనే...  జవానీల జాబులురాసే
జగడమొకటి సాగిందోయమ్మో...
అజంతాల ప్రాసలు వేసి వసంతాల ఆశలు రేపి
లలిత కవిత నీకే పాలగా...


దోరసోకు తోరణాలు...  కౌగిలింత కారణాలై
వంశధార నీటి మీద హంసలేఖ రాసినా...


ఉత్తరాల ఊర్వశి... ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
అలా అలా అదెంత వేడి వెన్నెలా
నిజానికీ ఇదంత ఒట్టు నీదయా..




చరణం 2 :



సమ్ముఖాల రాయబారమా సరే సందెగాలి ఒప్పుకోదులే
చందమామతోటి బేరమా అదే అందగత్తె గొప్పకాదులే


పెదాలమ్మ కచ్చేరీలో పదాలెన్నొ కవ్విస్తుంటే
హృదయమొకటి పుట్టిందోయమ్మా...
సరాగాల సంపెగల్లో పరాగాల పండిస్తుంటే
పరువమొకటి వచ్చే వాంఛలా...
కన్నెచెట్టు కొమ్మమీద పొన్నతోట తుమ్మెదాడె
జుంటి తేనె మత్తులోన కొంటెవేణువూదినా


గీతగోవిందుడూ...  వీనులోవిందుడూ
రాగమాలతోనె రాసలీలలాడగా
మజా మజా మజా...  ఘుమాఘుమాలయా...
నిజానికీ ఇదంత...  ఒట్టు నీదయా...


ఉత్తరాల ఊర్వశి...  ప్రేమలేఖ ప్రేయసి
అందమంత అక్షరాల హారతివ్వగా
హలా హలా అదెంత వేడివెన్నెలా...
ముఖాముఖి ముడేసుకున్న ముద్దులా... 

ప్రణయమా నీపేరేమిటి

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపథ్య గానం :  బాలు, చిత్ర  




పల్లవి : 


ప్రణయమా నీ పేరేమిటి ... ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా
గమ్యం తెలియని పయనమా
ప్రేమకు పట్టిన గ్రహణమా
తెలుపుమా తెలుపుమా..  తెలుపుమా


ప్రణయమా నీపేరేమిటి...  ప్రళయమా 



చరణం 1 :



ప్రేమ కవితా గానమా... నా ప్రాణమున్నది శ్రుతి లేక
గేయమే ఎద గాయమైనది...  వలపు చితిని రగిలించగా
తీగచాటున రాగమా...  ఈ దేహమున్నది జత లేక
దాహమారని స్నేహమై...  ఎద శిథిల శిశిరమై మారగా


ఓ హృదయమా... ఇది సాధ్యమా...
రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన
రెండుగ గుండే చీలునా... ఇంకా ఎందుకు శోధన



తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా 





చరణం 2 : 



ప్రేమసాగర మధనమే...  జరిగింది గుండెలో ఈ వేళ
రాగమన్నది త్యాగమైనది...  చివరికెవరికీ అమృతం
తీరమెరుగని కెరటమై...  చెలరేగు మనసులో ఈ వేళ
అశ్రుధారలే అక్షరాలుగా...  అనువదించెనా జీవితం


ఓ ప్రాణమా... ఇది న్యాయమా
రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా
రాగం అంటే త్యాగమా... వలపుకు ఫలితం శూన్యమా



తెలుపుమా తెలుపుమా తెలుపుమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా
ప్రణయమా నీ పేరేమిటి...  ప్రళయమా 

ఒక మనసుకు నేడే పుట్టినరోజు

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు, చిత్ర   




పల్లవి : 


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే..ఇదే..కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక...  జనించు రోజు


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు  



చరణం 1 :


మాట పలుకు తెలియనిది...  మాటున ఉండే మూగ మది
కమ్మని తలపుల కావ్యమయి...  కవితలు రాసే మౌనమది..ఈ.. ఈ.. ఈ


రాగల రోజుల ఊహలకి... స్వాగతమిచ్చే రాగమది
 శ్రుతిలయలెరుగని ఊపిరికి స్వరములు కూర్చే గానమది..ఈ.. ఈ.. ఈ


ఋతువుల రంగులు మార్చేది...  కల్పన కలిగిన మది భావం
బ్రతుకును పాటగ మలిచేది...  మనసున కదిలిన మృదునాదం


కలవని దిక్కులు కలిపేది...  నింగిని నేలకి దింపేది
అదే కదా వారధి క్షణాలకే సారధి...  మనస్సనేది


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు




చరణం 2 : 



చూపులకెన్నడు దొరకనిది...  రంగురూపు లేని మది
రెప్పలు తెరవని కన్నులకు...  స్వప్నాలెన్నో చూపినది..ఈ.. ఈ.. ఈ
వెచ్చని చెలిమిని పొందినది...  వెన్నెల తరగల నిండు మది
కాటుక చీకటి రాతిరికి బాటను చూపే నేస్తమది..ఈ.. ఈ.. ఈ


చేతికి అందని జాబిలిలా...  కాంతులు పంచే మణిదీపం
కొమ్మల చాటున కొయిలలా...  కాలం నిలిపే అనురాగం
అడగని వరములు కురిపించి...  అమృత వర్షిణి అనిపించే
అముల్యమైన పెన్నిధి శుభోదయాల సన్నిధి మనస్సనేది


అహో..ఓ..ఒక మనసుకు నేడే పుట్టినరోజు
అహో..ఓ..తన పల్లవి పాడే చల్లని రోజు
ఇదే ఇదే కుహు స్వరాల కానుక
మరో వసంత గీతిక జనించు రోజు


చెప్పకనే చెబుతున్నవి

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)

సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  భువనచంద్ర
నేపథ్య గానం :  బాలు, చిత్ర   




పల్లవి : 


కనులు విప్పి కలువ మొగ్గ జాబిల్లిని చూచెను
తమకంతో పాలబుగ్గ తొలిముద్దును కోరెను
తడియారని పెదవులపై... తొణికిన వెన్నెల మెరుపులు
చెప్పకనే... చెప్పకనే...  చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని  


చెప్పకనే  చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని


చరణం 1 :


చిలిపిగ నీ చేతులు అణువణువు తడుముతుంటే...
మోహపు తెరలిక తొలిగేనా
చలి చలి చిరు గాలులు గిలిగింత రేపుతుంటే
ఆశల అల్లరి అణిగేనా 


పదాలతోనే వరించనా... సరాగ మాలై తరించనా
స్వరాలతోనే స్పృశించనా... సుఖాల వీణ శృతించనా
ఆ వెన్నెల నీ కన్నుల... రేపెక్కిన ఆ కోరిక
పొగలై సెగలై యెదలో రగిలిన క్షణమే


చెప్పకనే ... చెప్పకనే...
చెప్పకనే చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి...  ఇదే ఇదే ప్రేమని 



చరణం 2 : 



తనువును పెనవేసిన నీ చీరకెంత గర్వం
యవ్వన గిరులను తడిమెననా
నీ కౌగిట నలిగినందుకే అంత గర్వం
మదనుడి మలుపులు తెలిసెననీ


తెల్లారనీకే వయ్యారమా ... అల్లాడిపోయే ఈ రేయిని
సవాలు చేసే శృంగారమా... సంధించమాకే ఓ హాయిని
ఆ మల్లెల కేరింతలు... నీ నవ్వుల లాలింతలు
వలలై అలలై వొడిలో...  ఒదిగిన క్షణమే


చెప్పకనే... చెప్పకనే
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని
చెప్పకనే చెబుతున్నవి ఇదే ఇదే ప్రేమని




రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా

చిత్రం :  అల్లరి ప్రియుడు  (1993)
సంగీతం :   కీరవాణి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, చిత్ర   



పల్లవి : 


ఆహ హాహా హాహా..ఆహా హాహా
ఆహ హాహా హాహా..హహహా హహహా
హహహా..హహహా..హాహా
ఆఆ ఆఆఆఆ..ఆఆ ఆఆఆఆ..ఆఆహాహ


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వే నువ్వా
రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ ఘల్లుమన్న మువ్వే నువ్వా 


పడుచుదనపు గడసు వలపు  పాటవు నువ్వా..వా..వా  


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా..రోజాపువ్వా..పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా...  పువ్వే నువ్వా..నవ్వే నువ్వా



చరణం 1 :


గులాబి గు..గు..గు..
గులాబి గు..గు..గు 


చక్కదనానికి చక్కిలిగింతవు నువ్వా నువ్వా
కన్నె  పువ్వా... కన్నె  పువ్వా
వెన్నెలవాకిట ఎర్రగ పండిన దివ్వే నువ్వా ... చిందే రవ్వా పొద్దే నువ్వా
గుండెచాటు ప్రేమలెన్నొ పోటుమీద చాటుతున్న రోజాపువ్వా
అందమైన ఆడపిల్ల బుగ్గపండు గిల్లుతున్న సిగ్గే నువ్వా
చిగురు ఎరుపు తెలుపు పొగడమాలిక నువ్వా... ఆ..ఆ.. ఆ..ఆ



రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా... నవ్వేనువ్వా


చరణం 2 : 

గులాబి గు..గు..గు..
గులాబి గు..గు..గు 



ప్రేమ సువాసన పెదవుల వంతెన వేసే నువ్వే పూసే పువ్వా బాసే నువ్వా
కౌగిలి చాటున కాముడు మీటిన వీణే నువ్వా జాణే నువ్వ జాజే నువ్వా
గుప్పుమన్న ఆశలెన్నో కొప్పులోన దాచుకున్న రోజాపువ్వా
సందెపొద్దు సంతకాల ప్రేమలేఖ పంపుకున్న గువ్వే నువ్వా
మధుర కవిత చదివి పెదవి పండిన పువ్వా


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా
రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వేనువ్వా...నవ్వేనువ్వా


రేకు విచ్చుకున్న సోకుబంతి పువ్వేనువ్వా
ముద్దు పెట్టకుండ గళ్లుమన్న  మువ్వే నువ్వా
పడుచుదనపు గడసువలపు  పాటవు నువ్వా..వా..వా  


రోజ్ రోజ్ రోజ్ రోజ్..రోజాపువ్వా
రోజాపువ్వా...పువ్వాపువ్వా
రోజు రోజు రోజు రోజు..పూస్తూ ఉన్నా
పువ్వే నువ్వా...నవ్వే నువ్వా


బృందావని ఉంది

చిత్రం :  కాంచన గంగ (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు 




పల్లవి : 



బృందావని ఉంది... హా
యమునా నది ఉంది... హా
మధురాపురి ఉంది... కాళింది ఉంది
లేని వాడొక్కడే... శ్రీకృష్ణమూర్తి


కలిలోన శిలయైన... కల్యాణ మూర్తి
కలిలోన శిలయైన... కల్యాణ మూర్తి

హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్



చరణం 1 :


పుట్టగానే పెరిగేటి... మాయబంధనాలకన్నా 

పుడుతూనే తొలిగేటి... చెరసాలలే మిన్న
ఆ కిటుకు తెలిసేరా...  హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూర్తి


కలిలోన శిలయైన..కల్యాణ మూరితి 

కలిలోన శిలయైన..కల్యాణ మూరితి


హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్



చరణం 2 :


వెంటపడి వేధించే... వేలమంది స్త్రీలున్నా
ఇంటనుండి పూజించే... ఇంతి ఉంటె చాలన్నా
ఆ కిటుకు తెలిసేరా ... హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూర్తి
రాధ గుండె దోచినాడు... వేదాంతమూరితి
రాధ గుండె దోచినాడు... వేదాంతమూరితి
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్


చరణం 3 :


గేయాలుగా మారే గీతాలు ఎన్నున్నా...
గాయాలు మాంపేటి గానాలు మిన్నా...
ఆ కిటుకు తెలిసేరా.. హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూరితి
వేణువూది లాలించే గీతానువర్తి...
వేణువూది లాలించే గీతానువర్తి...
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ 



బృందావని ఉంది..యమునా నది ఉందిమధురాపురి ఉంది..కాళింది ఉంది లేని వాడొక్కడే..శ్రీకృష్ణమూర్తి


కలిలోన శిలయైన..కల్యాణ మూరితి కలిలోన శిలయైన..కల్యాణ మూరితి

హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ 

Saturday, December 29, 2018

గౌరీ శంకర శృంగం

చిత్రం :  మయూరి (1985)
సంగీతం :  బాలు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :   జానకి



పల్లవి :



గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం... కళలకు కళ్యాణం


గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 




చరణం 1 : 


పాదపూజకై మందారమైనా
నాద మధువుతో మంజీరమాయె
దేవతార్చనకు ఏ కీర్తనైనా
జీవితాంతమీ రస నర్తనాయె

వాఙ్మయమే వచనం...  ఆంగికమే భువనం
వాఙ్మయమే వచనం...  ఆంగికమే భువనం


అకాశాలలో తారలన్నీ... ఆహార్యాలుగా అందుకుంటూ
కైలాసాల శిఖరాగ్రాలందు... కైవల్యాలు చవిచూసే వేళలో


గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ



చరణం 2 : 



పడమటెండల పారాణి తూలె... సంధ్యారాగాలతో ఊసులాడే
కొలనులు నిదరోవు కార్తీక వేళ... కలువలలో తేనె గిలిగింతలాయె
సకల కళా శిఖరం...  నర్తనమే మధురం
సకల కళా శిఖరం...  నర్తనమే మధురం


కాశ్మీరాలలో పూల గంధం... కేదారాలలో సస్యగీతం
శివలాస్యాల శృంగారాలెన్నో... అంగాంగాల విరబూసే వేళలో


గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఇది నటనకు సోపానం... కళలకు కళ్యాణం
గౌరీ శంకర శృంగం... నరనారీ సంగమ రంగం
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ



కదలకు..కన్ను కన్ను కలుపు

చిత్రం :  మజ్ఞు (1989)
సంగీతం :  లక్ష్మీకాంత్-ప్యారేలాల్
గీతరచయిత : దాసరి
నేపథ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు... మ్ మ్ మ్ మ్


కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు... మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ 




చరణం 1 : 



కలలు ఎంత కమ్మన... ప్రేమకు
కనులు ఎంత చల్లన... ప్రేమకు
రాతిరెఒత వెచ్చన... ప్రేమకు..
లోకమెంత పచ్చన... ప్రేమకు..
ఎన్ని ఎన్ని రంగులో... ప్రేమకు..
ఎన్ని ఎన్ని గురుతులో... ప్రేమకు..
రంగులన్నీ కలబోసి... గురుతులన్ని ముడి వేసి
బ్రతికించు  ప్రేమని... బ్రతుకంతా
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ 


అడగకు... ఆశ రేపి పోకు
తాకకు... తనువు విడిచి పోకు
రేపకు... రేపు మాపు అనకు
అడగకు...మ్ మ్ మ్ మ్ మ్ 



చరణం 2 : 



ఏమిటీ... జీవితం
ప్రేమేలే...  జీవితం
ఎవరికీ...  అంకితం
ప్రేమకే... అంకితం
కొలనే ప్రేమైతే... మునకంతా నేనే
వరదె ప్రేమైతే... పొంగంతా  నేనే..
నేనే..నేనే..నేనే


కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు..మ్ మ్ మ్ మ్


కదలకు..కన్ను కన్ను కలుపు
వదలకు..వలపు కథలు తెలుపు
బెదరకు..గుండె వేడి తెలుపు
మరువకు..మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ


అడగకు... ఆశ రేపి పోకు
తాకకు... తనువు విడిచి పోకు
రేపకు... రేపు మాపు అనకు
అడగకు... మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్






ఆకు చాటున పిందె

చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు,  జానకి 



పల్లవి :



ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకువేసి మారాలుచేసే గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్..మామ..మామ..మామ..మామ..మామ..మామ
మామ..మామ..మామ..మామ..మామ..మామ


హోయ్... ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు
దోచుకోనా నేరాలు చేసుకోనా
భామ..భామ..భామ..మామ..మామ..మామ




చరణం 1 : 


పందిరి నువ్వై తీగల్లే అల్లుకుపోనీ
అందాలూరె నీ పాటకు పల్లవి కానీ
వేసిందమ్మా జాబిల్లి వెన్నెల ఓణి
నవ్విందమ్మా నడకల్లో కిన్నెరసాని


అండదండ నువ్వే నాకింకా...
కైదండ లేకా ఉండలేను.. రారా నా వంక
కొండమల్లి పువ్వే నువ్వంట
నా గుండెలోన ఉండిపోతే అంతే చాలంట


ఆకు చాటున పిందె తడిసెనోయ్ మామ
మారాకువేసి మారాలుచేసే గారాలు చూడు మామ
నేరాలు చెయ్యి మామ
హోయ్.. మామ..మామ..మామ..
హోయ్..భామ..భామ..భామా..  



చరణం 2 : 



తళుకుల పుట్ట వచ్చింది తపనల పుట్ట
కులుకుల పిట్ట నచ్చింది వదిలేదెట్ట


అక్కరకొచ్చె అందాల చక్కని చుక్క
చక్కర ముద్దే ఇచ్చింది చెక్కిలి నొక్క
హోయ్..పట్టరాని పాలపిట్టరో పండంటి ఈడు
ముట్టబోతే ముద్దు పుట్టెరో
పుట్టతేనె పట్టు పెదవిరో ఓ చిట్టి ముద్దు
పెట్టకుంటే ఆగేదెట్టారో


అరె..ఆకు చాటున పిందె తడిసెనా భామ
మారాకులోన మారాలు చేసి గారాలు దోచుకోనా
నేరాలు చేసుకోనా
భామ..భామ..భామ..మామ..మామ..మామ
హోయ్..భామ..భామ..భామ..





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10343

చెంగు చెంగు ముద్దాడంగ

చిత్రం : ముద్దుల మావయ్య (1989)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, జానకి  



పల్లవి :


చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
చెంగున దూకే ఒయ్యారంగా...  తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ


చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ 



చరణం 1 : 


అందాలు దాచి పెట్టి ఊరిస్తే పాపం
అందిస్తే తీరుతుంది సందిట్లో తాపం
ఒళ్ళంతా కళ్ళు జేసి వెయ్యోద్దు తాళం
ముళ్ళంటి చూపుతోటి తీయొద్దు ప్రాణం


వయసేమో రెగుతుంది...  చకచకచెమ్మచెక్క
మనసేమో ఆగమంది.. చకచకచమ్మచక్క 


ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు
ఎన్నాళ్ళీ లేనిపోని రాయబారాలు
పందిట్లో మొగనీవోయ్ పెళ్ళి బాజాలు
ఈ పొద్దే మన ముద్దు ఇక హద్దు పొద్దు వద్దే వద్దు


చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
చెంగున దూకే ఒయ్యారంగా...  తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ



చరణం 2 : 



గారాలు పొంగు వేళ గోరంత ముద్దు
కోరింది కొంగుజోల గోరింటపొద్దు
చీరల్లే చుట్టేనమ్మా నీ చూపు నేడు
ఆరాలు తీసేనమ్మ  మారాల ఈడు


తియ్యంగా కొంటెరంగ...  చక చక చెమ్మచెక్క
తీరాలి సామిరంగ...  చక చక చెమ్మచెక్క
చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా
అందాల కన్నెసోకు హారతిచ్చేనా
చుక్కల్లే దూసి నీకే  హారమేసేయ్ నా
అందాల కన్నెసోకు హారతిచ్చేనా
సందిళ్ళే పందిళ్ళు ఈ అల్లరి మల్లెల జల్లులోన



చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
చెంగున దూకే ఒయ్యారంగా...  తొలి పొంగుల గంగ
చెంగు చెంగు ముద్దాడంగ...  చల్ మోహనరంగ
కొంగే దోచే శృంగారంగా...  ఈ ముద్దుల దొంగ




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10344

పండు పండు నా బుజ్జిపండు

చిత్రం : స్వాతి (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు,  శైలజ 




పల్లవి :


పండు పండు నా బుజ్జిపండు... రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం 

నేర్చుకొంటే మంచిదంట కవ్విస్తున్న కళ్లవాడా..ఆ ఆ ఆ ఆ ఆ  


పండు పండు నా బుజ్జిపండు...  ముద్దు ముద్దుకి నా నోరు పండు
సిగ్నలివ్వటం సిగ్గు పెంచటం...  కోరి నాకు నేర్పుకోవె కోలకళ్ల చిన్నదానా 



చరణం 1 : 



రారా నా సామిరంగ... ఆసామి నువ్వే అందాలకి
నీదేరా ఈ పూలతోట... ఆడుకో అందాల వేట


రాణి రవ్వంతకానీ... రాగాలబోణీ ఈ పూటకీ
గుట్టుదాటిపోతేను ఎట్టా... గూడుదాటినా ఈడు పిట్ట


వళ్ళంత ఏడెక్కి... వయసంతా గుండెక్కె
అంతో ఇంతో ఆదుకోర... చెంత చేరి చిన్నవాడా


పండు పండు నా బుజ్జిపండు...రేపటికిస్తాను రేగుపండు 



చరణం 2 : 


నవ్వు  నీగుమ్మ నవ్వు..దానిమ్మపువ్వు దక్కించవా
పువ్వులే పండించుకొంటా... పులుపంతనే నంజుకొంట
సిగ్గు ఆనాటి సిగ్గు... వచ్చింది తగ్గు కవ్వించక
సిగ్గువుంటే సింగారమంటా... ఉన్నసిగ్గు ఊదేయకంట
ఈ పూట నలుపెక్కె... నీ బుగ్గ ఎరుపెక్కె
రెగిందంటె రేపుమాపు... ఎట్టగంట నీతో తంట



పండు పండు నా బుజ్జిపండు... రేపటికిస్తాను రేగుపండు
సైటు కొట్టడం పైట లాగడం నేర్చుకొంటే
మంచిదంట కవ్విస్తున్న కళ్లవాడా..ఆ ఆ ఆ ఆ ఆ  


పండు పండు నా బుజ్జిపండు...  ముద్దు ముద్దుకి నా నోరు పండు



కల్యాణం కమనీయం

చిత్రం : స్వాతి (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : సుశీల,  శైలజ 




పల్లవి :


కల్యాణం కమనీయం..  కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం
కల్యాణం కమనీయం ... కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం


అమ్మను వధువుగా  చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం... ఈ పాపలకేంతో ఆనందం 


                                                   
కల్యాణం కమనీయం...  కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం 




చరణం 1 : 



ఆ వేదమంత్రాల అర్థాలు తెలిసి...  ఆశీర్వదించండి ఈ జంటని
ఆ పుష్య రాగాల ఆంతర్యమెరిగి...  దీవించి పంపండి ఈ ఇంటికి 


మనసుపడే సౌభాగ్యం మమత అనే మాంగల్యం
స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా... స్త్రీ జన్మ కోరేటి సిరులే కదా
శివ పార్వతులు మాకు మీరే కదా... శివ పార్వతులు మాకు మీరే కదా


కల్యాణం కమనీయం...  కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం 



చరణం 2 : 


ముక్కోటి దేవుళ్ళ ముధ్దంత తెచ్చి...  ముగ్గెసు కోవాలి ఈ ఇంటికి
శతకోటి తారల్ల చిరునవ్వు తెచ్చి...  హారాలు వెయ్యాలి ఈ జంటకి
సగమైన సహధర్మం కలిసిందే సంసారం


ఏడేడు జన్మాల బంధాలతో... ఏడేడు జన్మాల బంధాలతో
మీ జన్మ పండాలి అనురాగమై... మీ జన్మ పండాలి అనురాగమై



కల్యాణం కమనీయం ... కలలే పండిన వైభోగం
అనురాగం అభిమానం...  అమ్మకు నాన్నకు శతమానం


అమ్మను వధువుగా  చేస్తున్న
వరునిగా నాన్నను చూస్తున్న
కనుపాపలకేంతో ఆహ్లాదం... ఈ పాపలకేంతో ఆనందం 


                                                     




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12009

ఓహో మేఘమొచ్చెను

చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపథ్య గానం : జానకి 




పల్లవి :


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే... పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే... వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం... ముచ్చటలే విరిసేను


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను




చరణం 1 : 



నాలో ఊగేను సోయగం... రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే


ఈ పన్నీటిలో...  గారాలే చిందవా
ఓ అందాల గనికి పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా...  వలపించే జ్ఞాపకం
పులకరించి...  పలకరించెనే


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను




చరణం 2 : 



కలలో ఈ నాటి జీవితం... ఆమని రాగాల బంధనం
వెండి మేఘాలలో ఊరేగుదాం... మధుర సంగీతం పాడుదాం


లే చిగురాకులై ఈనాడు మారుదాం
రా వినువీధిలోన నవ్వుల్లో పాకుదాం
ఈ పరువాలలోన శంఖాలై ఊగుదాం
రయ్...  సెలయేరులై ఉరికురికి పొంగుదాం
ఇంత వింత వగలు పంచగా


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే... పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే...  వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను
ఆహా.. ఆ... పప... పప్ప... ప్పా.... ఆహా




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12450

చిన్ని చిన్ని కోయిలల్లే

చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపథ్య గానం : జానకి 




పల్లవి :


లాలలాల లాలలాల లాలలాల లాలలాల
లలలాల లలలాల లలలాల లలలాల
లలలాల లలలాల లాలా లాలాలాలా


చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..  నేనే


చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా




చరణం 1 : 



మల్లెల బాటలోన...  పాటలే కోరుకుందీ
మన్మథుని పాటలోన...  గాధలే పాడుకుంది
ఊహలే జీవితం...  చిందెనే మాటలే
సాగెనే ఆశలే...  రేగెనే ఊసులే


మనసు ఊగి... మ్... మ్.. మ్.. మ్
మరులు రేగి... మ్.మ్.మ్.మ్
మనసు ఊగి... మ్.మ్.మ్.మ్
మరులు రేగి... మ్.మ్.మ్.మ్
అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే


చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసేనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా




చరణం 2 : 



వెచ్చని సందె వేళ... బాసలే ఆడేనులే
పచ్చని కన్నెవయసు...  గంగలా పొంగేనులే
కమ్మని తేనెలే... గుండెలో తేలెనే
చీకటే వచ్చినా... ఊహలే ఊరేనే


జీవితాంతం... మ్.మ్.మ్.మ్
స్నేహరాగం... మ్.మ్.మ్.మ్
జీవితాంతం..మ్.మ్.మ్.మ్
స్నేహరాగం... మ్.మ్.మ్.మ్
పరువ రాగ కీర్తనం పాడె... పాడె... పాడె


చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..నేనే


చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా
చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12452

కోరికలా కుటీరములో

చిత్రం : శ్రీమతి (1966)
సంగీతం : శ్రీ నిత్యానంద్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల  




పల్లవి :


కోరికలా కుటీరములో... చేరియుందము ప్రియా
మరుమల్లే నీడా... అందాల మేడా...  వెలిసింది మనకోసమేకాదా


కోరికలా కుటీరములో... చేరియుందము ప్రియా
మరుమల్లే నీడా... అందాల మేడా...  వెలిసింది మనకోసమేకాదా


చరణం 1 : 


వేయి కనులా నీ కొరకే వేచియుంటానూ రోజు
నీలి నీలి మేఘములా తేలి వస్తానూ నీకై
కాపురాన తీనెలూరే ప్రేమ నిండేనూ
నిండి నోము పండేనూ



కోరికలా కుటీరములో... చేరియుందము ప్రియా
మరుమల్లే నీడా... అందాల మేడా...  వెలిసింది మనకోసమేకాదా


చరణం 2 : 



చందమామ మనకు వేసే చలువ పందిరీ..
అందు సాటిలేని తనివి తీరు ప్రణయసుందరీ


మరపురాని మరువలేని మమతలన్ని డోలలూగు
మమతలన్ని డోలలూగు..
చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఆహా
   

ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో


ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో... 


జో జోజో జోజో జో జోజో జోజో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జోజో జోజో జోజో జోజో 

మ్రోగింది గుడిలోని గంట

చిత్రం : శ్రీమతి (1966)
సంగీతం : శ్రీ నిత్యానంద్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల  




పల్లవి :


మ్రోగింది గుడిలోని గంట... మురిసింది హృదయాల జంట
నీలో నాలో వెలిగే ప్రేమా... నింపింది కిరణాల పంట




చరణం 1 : 


నా మనసే ప్రియా... నీవుండే విడిది
నాలో పొంగింది... ఆనంద జలధి


వికసించే మనోభావాలు కలిసే
వెండి పందిరిగా లోకమె వెలసే


నీవే నేనుగా... ఒకటైన చోట
నీవే నేనుగా... ఒకటైన చోట
పూచే వలపుల..తోటా..ఆ... ఆ 


మ్రోగింది గుడిలోని గంట... మురిసింది హృదయాల జంట
నీలో నాలో వెలిగే ప్రేమా... నింపింది కిరణాల పంట




చరణం 2 : 



ప్రేమించి..నిను సేవింతుగానా
ఇల్లాలినైనాను..ఈ ముహుర్తానా


దేవతలే చెలీ... దీవించినారూ..
ఇద్దరినొకటిగా... కావించినారూ..


ఎపుడు మనలో... ఎడబాటు లేక
ఎపుడు మనలో... ఎడబాటు లేక
బ్రతుకే పూవుల..బాటా..ఆ... ఆ 


మ్రోగింది గుడిలోని గంట... మురిసింది హృదయాల జంట
నీలో నాలో వెలిగే ప్రేమా... నింపింది కిరణాల పంట





చెలరేగు చీకటిలోనే

చిత్రం : శ్రీమతి (1966)
సంగీతం : శ్రీ నిత్యానంద్
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం : సుశీల 




పల్లవి :


చెలరేగు చీకటిలోనే ... ప్రాకాశించు దీపమూ 
పరీక్షించే వేదనలోనే...   విరాజిల్లు జీవమూ
విరాజిల్లు..జీవమూ..


చెలరేగు చీకటిలోనే...  ప్రాకాశించు దీపమూ




చరణం 1 : 


తెరమీద నీడనుచేసి... విధి నీతో ఆటలాడు..ఆ ఆ ఆ ఆ ఆ
విరబూసిన నందనవనమే... మరుభూమిగ మారిపోవు
నిరాశలో ఆశవేణువు... రవళించును..రాగమునే..ఆ
రవళించును..రాగము..


చెలరేగు చీకటిలోనే...  ప్రాకాశించు దీపమూ


చరణం 2 : 



సేవించు దీక్షను మించీ... సిరిసంపద వేరే లేదు..
ఆ ఆ ఆ ఆ ఆ
కావించు త్యాగము కన్నా... ధన ధాన్యము..కానరాదు
కరుణించే హృదయములోనే... నివసించును దైవమూ
నివసించును..దైవమూ..ఊఊఊఊ


చెలరేగు చీకటిలోనే...  ప్రాకాశించు దీపమూ 

మనసూ మమతా

చిత్రం : ప్రాణమిత్రులు (1967)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల 



పల్లవి :


మనసూ మమతా మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే శత్రువు చేసే
మనసూ మమతా... మనిషికి యిచ్చి
మనిషికి మనిషినే... శత్రువు చేసే
రాగం కన్నా... త్యాగం గొప్పని
చల్లని నిప్పును... రగిలించి... రగిలించి
నాటకమాడుట నీ లీల...  నలిగినపించుట మా పాలా
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ
ఓ భగవాన్ నీదీ... నీదీ..


చరణం 1 : 



ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ
ఈ పాపం ఫలితం... ఎవ్వరిదీ... ఓ భగవాన్ నీదీ...నీదీ


పరిహాసానికి ఏదో అన్నది...  ప్రళయంగా ఇటు ముగిసినదీ
పరిహాసానికి ఏదో అన్నది...  ప్రళయంగా ఇటు ముగిసినదీ
ప్రణయ జీవులను విడదీసి... బ్రతుకులు బద్దలు చేసినదీ..


ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ...  ఓ భగవాన్ నీదీ...నీదీ 



చరణం 2 : 


నాకున్నది ఒకటే హృదయం... అది చేసినదొకటే..స్నేహం
నాకున్నది ఒకటే హృదయం...  అది చేసినదొకటే..స్నేహం


నే నెరిగినదొకటే ధర్మం...  అది చూపిన దొకటే..మార్గం
ఏ కన్నులు కన్నీరైనా....   ఏ కలలే కరిగిపోయినా


ఈ పాపం ఫలితం ఎవ్వరిదీ...  ఓ భగవాన్ నీదీ...నీదీ..






Friday, December 28, 2018

భావనలొకటై

చిత్రం : పూలపల్లకి (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత : 
నేపథ్య గానం :  బాలు, జానకి 



పల్లవి :

ఆ... లలలలలలా... భావనలొకటై...
లలలలలలా... సాగిపోయే వేళలో
లలలలలలా.. మానసములు ఒకటై
లలలలలలా... ఆలపించే పాటలలో
లలలలలలా... చెలిమే పెరిగి
లలలలలలా... నిలుచును ప్రేమగా


భావనలొకటై... సాగిపోయే వేళలో..ఓ... ఓ



చరణం 1 : 



ఆ ఆ ఆ ఆహా... తరతర... తర్తతరతర
లలలలలలాలలలాలలలా..లాలలలలల్లలలలా.లలలా
లలలా..లా..లా..ఆ ఆ ఆ


నా పెన్నిది నీవేలే
నా ఊహల్లో రేగిన కోరికవే
తీయని స్వప్నానివే
ఈ గుండెల్లో దాగిన కామనవే
నా ఒడిలో నీ తనువే... ఊగిన చాలునులే
చెలి చూపుల వెన్నెల్లలో... సిరి కౌగిలి ఊయలలో
బ్రతుకే... ఒక పండుగలే
ప్రణయుం ఒక స్వర్గములే... అప్పుడే..ఏ... ఏ.. న.. న.. న


లలలలలలా... భావనలొకటై..
లలలలలలా... సాగిపోయే వేళలో
లలలలలలా... స్వేచ్చ విలసిల్లే..
లలలలలలా... ప్రేమ రాగాల బాటలలో
లలలలలలా... విరిసే తలపే..
లలలలలలా... నిలుచును హాయిగ


భావనలొకటై... సాగిపోయే వేళలో..ఓఓఓ



చరణం 2 : 


జతకలవని... శ్రుతి ముదరని
బ్రతుకున విలాశాల... కులాశాల తరిద్దాం
మధువొలకని... కసిపెరగని
కలతల ప్రపంచాన..విషాదాన్ని మరుద్దాం
నిషాలోని స్వర్గాని..చూపిస్తా..ఆ..తరిస్తా
ఖుషిలోని అంచులను దాటేస్తా మొలుస్తా
రపప్ప రపప్ప... రపపరప్పా..ఆఆ
రపప్ప రపప్ప... రపపరప్పా..ఆఆ 


లలలలలలా... భావనలొకటై..
లలలలలలా... సాగిపోయే వేళలో
లలలలలలా... ప్రేమమయ హృదిలో..
లలలలలలా... మ్రూగు రాగాల మేళనలో
లలలలలలా... విరిసే వలపే..
లలలలలలా... నిలుచును నిత్యమై


భావనలొకటై... సాగిపోయే వేళలో





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12088

అగ్గిని నేనూ

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, రామకృష్ణ 




పల్లవి :


అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ


అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ



చరణం 1 :


అడవిలో సీత కడుపున..పుట్టిన కవలలం
మేము..లవకుశులం
అయోధ్య రాముని సీతను కలిపే
ఆంజనేయులం..వీరాంజనేయులం


అడవిలో సీత కడుపున పుట్టిన కవలలం
మేము..లవకుశులం
అయోధ్య రాముని..సీతను కలిపే
ఆంజనేయులం... వీరాంజనేయులం


అగ్గిని నేనూ..సుడిగాలిని నేనూ
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ 




చరణం 2 :


అన్యాయానికి అధర్మానికి శత్రువులం
అనురాగానికి అభిమానానికి సేతువులం
అన్యాయానికి అధర్మానికి శత్రువులం
అనురాగానికి అభిమానానికి సేతువులం


మంచికి బానిసలం... వంచితులకు బంధువులం
మంచికి బానిసలం... వంచితులకు బంధువులం
అగ్నిహోత్రమే భగ భగ మండే... ఫాలనేత్రులం
కఠిన చిత్తులకు... మదోన్మత్తులకు కాళరాత్రులం


అగ్గిని నేనూ..సుడిగాలిని నేనూ
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ



చరణం 3 :


తల్లి ఋణం తీరుస్తాం... తండ్రి చెఱను విడిపిస్తాం
దెబ్బకు దెయ్యం దించేస్తాం... అబ్బకు బిడ్డల మనిపిస్తాం


ఇదే మా శపధం... ఇదే మా శపధం... ఇదే మా శపథం
ఇదే మా శపధం... ఇదే మా శపధం... ఇదే మా శపథం 





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3184

ఈ జీవితం వసంతం

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు




పల్లవి :


సీతాకోక చిలుకలు... స్వాతివాన చినుకులు
తడిమిన కొద్దీ తళుకులు... పడు చందాల పలుకులు
సీతాకోక చిలుకలు...స్వాతివాన చినుకులు
తడిమిన కొద్దీ తళుకులు... పడు చందాల పలుకులు


ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం
ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం


ఆరు ఋతువులు... పూల ఋతువులే
అన్ని పెదవుల... ప్రేమ మధువులే


అనుభవించరా..పదే పదే.. పదే పదే... పదే పదే..
ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం 



చరణం 1 :



లలల లాల లలలాల..లలలలాలా లాలా
లైఫ్ అనేది... ఒక ఛాన్స్ రా
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
లైఫ్ అనేది... ఒక ఛాన్స్ రా
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
స్వీటీలందరి బ్యూటీ చూసే డ్యూటీ నీదిరా
అది పడుచోళ్ళ నీతిరా


సీతాకోక చిలుకలు..ఓహో..
స్వాతివాన చినుకులు..అహా
తడిమిన కొద్దీ తళుకులు..ఏహే..పడు చందాల పలుకులు 


ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం 



చరణం 2 :


లలల లాల లలలాల..లలలలాలా లాలా

రామచిలుకనే తెచ్చుకో... ప్రేమపలుకులే నేర్పుకో
వెచ్చగ మచ్చిక చేసుకో... అచ్చిక బుచ్చిక లాడుకో
రామచిలుకనే తెచ్చుకో... ప్రేమపలుకులే నేర్పుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో


నీపులకరింతలే పూవులై... ఆ పువ్వులే పడుచు నవ్వులై
నీపులకరింతలే పూవులై... ఆ పువ్వులే పడుచు నవ్వులై
ఆ నవ్వులే పూలబాటలై... సాగిపో... బాటసారీ..
చెప్పుకోవోయ్..నీవు సారీ..


సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమిన కొద్దీ తళుకులు... ఏహే..పడుచందాల పలుకులు


ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం
యవ్వనం ప్రేమగీతం... యవ్వనం ప్రేమగీతం





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3698

ఒకటి..రెండు..మూడు

చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :


ఒకటి..రెండు..మూడు..నాలుగు..ఐదు..ఆరు..ఏడు
అబ్బో..అమ్మో..అయ్యయ్యో..
ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో 
నా వల్ల కాదు కాదురో... ఓరి నాయనో
కళ్ళు తిరిగిపోతున్నాయ్... కాళ్ళు వణికిపోతున్నాయ్
తియ్యలేను గుంజీలు... తిప్పలు పెట్టకురో..ఓఓఓ 


ఒకటి..రెండు,మూడు... తీయ్ గుంజీలు
వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ
కళ్ళు తిరిగిపోతున్నా... కాళ్ళువణికిపోతున్నా
తియ్యాలి గుంజీలు... తిమ్మిరి అణిగేదాకా


ఒకటా..రెండా..మూడా... ఓరి దేవుడో
హహహా..వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ..




చరణం 1 :



మబ్బులేని మెరుపల్లే ఎవ్వడు రమ్మన్నాడు..
ఆహా ఆహా హా హా హా...ఆ
మల్లెపూల జల్లులో తడిపేసి పొమ్మన్నాడు..ఊ
ఆహా ఆహా హా హా హా...ఆ 


అందుకే వేస్తున్నా... అందమైన శిక్షా
అందుకే వేస్తున్నా... అందమైన శిక్షా
తీర్చుకొంటున్నా... తియ్య తియ్యగా కక్షా


ఏమిటి పరీక్షా?


ఒకటా..రెండా..మూడా... ఓరి దేవుడో
నీ వల్లకాదు కాదంటే..చెల్లదమ్మడూ... అమ్మడూ  



చరణం 2 :



చలిగాలి వడదెబ్బ..ఎవ్వడు తీయమన్నాడు..
ఊ..ఊ అహహా
సూదిమెరుపంటి చూపుల్తో..చురకేసి పొమ్మన్నాడూ..
ఊ..అట్లగా..ఒహోహో
వయసొచ్చి చేసింది వలపన్న నేరం
వయసొచ్చి చేసింది వలపన్న నేరం
కౌగిట్లో ఖైది చేసేయ్... నను జీవితాంతం..అయ్యో పాపం
 


ఒకటి..రెండు,మూడు... తీయ్ గుంజీలు
వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ


కళ్ళు తిరిగిపోతున్నాయ్... కాళ్ళు వణికిపోతున్నాయ్
తియ్యలేను గుంజీలు... తిప్పలు పెట్టకురో..ఓ.. 


ఒకటా..రెండా..మూడా..ఓరి దేవుడో
నీ..వల్లకాదు కాదంటే... చెల్లదమ్మడూ... అమ్మడూ  





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=772

అందం చూశాను

చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి :



అహా..అహా..అందం చూశాను
ఎహే..ఎహే..హృదయం చూశాను


అహా..అహా..అందం చూశాను..ఊఊఊ
ఎహే..ఎహే..హృదయం చూశాను


చారెడు చారెడు కళ్ళల్లోన
బారెడు బారెడు కోరికలెన్నో


అహా..అహా..అందం చూశాను..హా
ఎహే..ఎహే..హృదయం చూశాను  



చరణం 1 :


అహా..ఓహో..వయ్యారిజాణ... వన్నె నడకాలదాన
ఆ..ఓహో..వయ్యారిజాణ... వన్నె నడకాలదాన
నీ సొగసే చూడాలి... ఈ చుక్కల చీరలోన
నీ సొగసే చూడాలి... ఈ చుక్కల చీరలోన


ముద్దూ ముద్దుగ చీరకడతా..
అ ఆ హహ..హహ..
ముద్దూ ముద్దుగ చీరకడతా..ముచ్చటగా కుచ్చెళ్ళు పెడతా 



అహా..అహా... అందం చూశాను..
ఎహే..ఎహే... హృదయం చూశాను..
మెత్తామెత్తని మాటలతోనే... మత్తెకించే ఎత్తులెన్నో


అహా..అహా... అందం చూశాను..
ఎహే..ఎహే... హృదయం చూశాను..




చరణం 2 :




అహా..విలువున్న వన్నెకాడా... అసలైన అందగాడా
ఆ..అహా..విలువున్న వన్నెకాడా... అసలైన అందగాడా
రోజు రోజు పలుకుతు ఉంది... నీ పేరు ఊరువాడ 


నువ్వంటున్నది చెవిలో చెప్పు..మ్మ్..
నువ్వంటున్నది చెవిలో చెప్పు... చెప్పకపోతే నామీదొట్టు  


అహా..అహా..అందం చూశాను..ఊఊఊ
ఎహే..ఎహే..హృదయం చూశాను..ఊ


మెత్తా మెత్తని మాటలతోనే... మత్తెకించే ఎత్తులెన్నో
అహా..అహా..అందం చూశాను..ఊఊఊ 


ఎహే..ఎహే..హృదయం చూశాను..ఊ..ఊ..ఊ..హా






http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=777


మారింది మారింది కాలం


చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె 
నేపథ్య గానం : బాలు, సుశీల  



పల్లవి :


హ్హా..హ్హా..హే..ఆ..ఆ
అ అ అ అ అ ఆ ఆ ఆ అ అ... హేయ్


మారింది మారింది కాలం
మారింది మారింది లోకం 
ఎక్కడమారిందమ్మా... ఇంకాదిగజారిందమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..


మారింది మారింది కాలం
మారింది మారింది లోకం..
ఎక్కడమారిందమ్మా....ఇంకాదిగజారిందమ్మా..హ్హా
ఇక ఏమని చెప్పేదమ్మా.. 


దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 


చరణం 1 :


మనిషిని మనిషి దగా చేసే..మామూలు రోజులు  కావమ్మా 
ధనికులు పేదల అణి చేసే... మునుపటిరోజులు..కావమ్మా


దేవుడి నగలను నిలువున దోచే...నాగన్నలున్నారమ్మా... నామాట నిజమేనమ్మా  కాదంటే... అప్పన్ననడగాలమ్మాసింహాద్రి... అప్పన్ననడగాలమ్మా  



మారింది మారింది..కాలంమారింది మారింది..లోకం..  ఎక్కడమారిందమ్మా... ఇంకాదిగజారిందమ్మా... అమ్మాఇక ఏమని చెప్పేదమ్మా.. 


దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 



చరణం 2 :


హ్హ..హ్హా..హ్హ..హ్హా హ్హ..హ్హా..హ్హ..హ్హా 
నిరుపేదల పూరిళ్ళకు నిప్పంటించని రోజుందా  
నలుగురిలో నడివీధిలో తలలు నరికితే దిక్కుందా


ఆ రామరాజ్యం.... ఆ సామ్యవాదం
ప్రభవెలిగి పోతుందమ్మా..ఆ... హ్హా..బ్రతుకంటే మాదేనమ్మా 
ఈ శుభవార్త... గాంధీజీ చెప్పాలమ్మా
ఆ..పైనున్న... గాంధీజీ చెప్పాలమ్మా



మారింది మారింది కాలం
మారింది మారింది లోకం..ఆ 
ఎక్కడమారిందమ్మా...ఇంకాదిగజారిందమ్మా..అమ్మా
ఇక ఏమని చెప్పేదమ్మా..


దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు
దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు

దండాలమ్మా దండాలు..జేజేలమ్మా..జేజేలు 




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=771

ఏం దెబ్బతీశావు

చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..ఏం ఎత్తు వేశావు
ఏం మాయచేశావబ్బీ..ఈ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది  


అహా..ఏం బాగా అన్నావు ..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ....
నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...
ఒకలాగున్నది... మతిపోతున్నది..
అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది  



చరణం 1 :


ఓ..ఉరికేటి ఓ కొండవాగు..ఒక కొంతసేపైన ఆగు
ఆ ఊపు తగ్గించుకొంటే....నీ ఒంటికి బాగు బాగు


నాదేమో నునుపైన సొగసు... నీదేమో కరుకరుకున్న వయసు
నీతోటి సరితూగకుంటే... నీరౌను నా బేలమనసు


అహ్హా..అహా..ఏం బాగా ఉన్నావు..ఏం ముద్దుగున్నావు... ఏం చూపుతున్నావమ్మీ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..కలగా ఉన్నది..ఉలుకేస్తున్నాది 




చరణం 2 :


నీకుంది పదునైన పొగరు... లేదెవరు నీకింక ఎదురు
నిను తలచుకుంటేనే చాలు... గుండెల్లో ఒక తీపి అదురు 


అరే..పడబోకు నావెంట వెంటా... ఉడికించకు ఓరకంటా..
పైటల్లె నను చూసుకుంటే... పదిలంగ నీతోనే ఉంటా..


హా..ఓఓఓ..ఏం దెబ్బతీశావు..ఏం ఎత్తు వేశావు
ఏం మాయచేశావబ్బీ..ఈ..
నీ కన్నుల పిలుపు చూస్తూ ఉంటే...
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది..
కలగా ఉన్నది... ఉలుకేస్తున్నాది  


అహా..ఏం బాగా అన్నావు ..ఏం ముద్దుగున్నావు
ఏం చూపుతున్నావమ్మీ..అహా
నీ ఒంపులు సొంపులు చూస్తూ ఉంటే ...
ఒకలాగున్నది... మతిపోతున్నది..
అబ్భా..ఒకలాగున్నది... మతిపోతున్నది  



చేసుకొన్న వాళ్ళకు

చిత్రం : టైగర్ (1979)
సంగీతం : సత్యం
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు


పల్లవి :


చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత...  మహాదేవా కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను... గురుదేవా ఔనంటావా?


చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత...  మహాదేవా కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను... గురుదేవా ఔనంటావా?
అరె బచ్చా అరె కచ్చా....  అరె లుచ్చా అరె తుచ్చా



చరణం 1 :


తేలును చంపాలంటే... చెప్పే చాలు
పామును చంపాలంటే... కర్రే చాలు
తేలును చంపాలంటే... చెప్పే చాలు
పామును చంపాలంటే... కర్రే చాలు 


నిలువెల్ల విషమున్న మీలాంటి నీచులను
మనుషుల్లా కనిపించే మీలాంటి బూచులను
కొట్టాలంటే చాలు... చిట్టి చిటకెనవేలు


అరె బచ్చా అరె కచ్చా...  అరె లుచ్చా అరె తుచ్చా
చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా... కాదంటావా?
కొవ్వుముదిరినోళ్ళకు కొమ్ములిరగ్గొడతాను... గురుదేవా ఔనంటావా?



చరణం 2 :


అసలైన పెళ్ళికొడుకు  వచ్చాడురా
అడుగులకు మడుగులొత్తి సేవ చేయరా
అసలైన పెళ్ళికొడుకు  వచ్చాడురా
అడుగులకు మడుగులొత్తి సేవ చేయరా 

ఊదరా బాకాలు... కొట్టరా బాజాలు
పట్టరా హారతులు... వెయ్యరా తలంబ్రాలు
జరిగింది కల్యాణం... ముందుంది వైభోగం
 


చేసుకొన్న వాళ్ళకు చేసుకొన్నంత మహాదేవా... కాదంటావా..





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=331

Thursday, December 27, 2018

ఎప్పుడు ఎప్పుడు

చిత్రం : ఆఖరి పోరాటం (1988)

సంగీతం : ఇళయరాజా

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : బాలు, చిత్ర 




పల్లవి :


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



చరణం 1 :


ఒక మాటు ఒడిని మీటి...  

ఒక మాటు ఒడిని మీటి... వలపు రాగాలు లాగేసుకుంటాలే 


పొద చాటు కథలు దాటి...  

పొద చాటు కథలు దాటి... చిలిపి తాళాలు మోగించుకుంటాలే  


ఎప్పటికప్పుడు దప్పిక తీరని చెప్పని దాహాలే

ఏమని చెప్పను నీకు జవాబులు పైటల పాప


అచ్చట ముచ్చట ఇచ్చట గిచ్చుడు పెంచిన మొహాలే

ఎంతని ఆపను నిన్ను మరీ మది బిత్తరపోక


చక్కని చుక్క తన సొంతం అనుకోమాక బలవంతం 

కోరికలే ఓపికలై మోజులు తెచ్చిన అల్లరిలో 


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 



నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....

ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 




చరణం 2 :



పొరపాటో తెరకు చాటో...  

పొరపాటో తెరకు చాటో... వయసులాటాడుకోవాలి ఈనాడే 

అది ఆటో పెదవి గాటో...  

అది ఆటో పెదవి గాటో ... మధుర గాయాలు తాకాలి లోలోనే


చప్పున ఆరని నిప్పుల కుంపటి రేపిన తాపాలే

చల్లని వెన్నెల చిచ్చుల ఉచ్చులు వేసెను నాకే


అచ్చిక బుచ్చిక పిచ్చిగ మచ్చిక చేసిన అందాలే

జంటగ తుంటరి రెప్పల గంటలు కొట్టెను నేడే


చమ్మని చక్కే మన ఆట...  మల్లెల పక్కే మన తోట

నవ్వులతో పువ్వులతో రివ్వులు పెట్టిన ప్రేమలలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 


నీ వంపుల సొంపే నా వంటికి పంపే

అల్లికలో అందికలో మల్లిక పూసిన మాపటిలో


ఎప్పుడు ఎప్పుడు గుప్పెడు ముద్దుల చప్పుడు బుగ్గల్లో

హత్తుకునే మత్తులలో మెత్తని వత్తిడిలో....


ఇప్పటికిప్పుడు చిచ్చుల కుంపటి పెట్టకు గుండెల్లో

తాకిడికో దూకుడుకో దక్కిన చెక్కిలిలో 







ఏమనెనే... చిన్నారి ఏమనెనే

చిత్రం : షావుకారు (1950)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం : ఘంటసాల 




పల్లవి : 


ఏమనెనే...
ఏమనెనే...  చిన్నారి ఏమనెనే...
ఏమనెనే..


వన్నెల సిగపూవ...  కనుసన్నలలో భావమేమే
వన్నెల సిగపూవ...  కనుసన్నలలో భావమేమే


ఏమనెనే... ఏమనెనే... 



చరణం 1 : 



ఆమని కోయిల పాటల
గోములు చిలికించు వలపు కిన్నెర
తానేమని రవళించెనే.... 


ఏమనెనే...  చిన్నారి ఏమనెనే...
ఏమనెనే..


చరణం 2 : 

వనరుగా చనువైన నెనరుగా
పలుకె బంగారమై...
కులుకె సింగారమై...
మావాడ రాచిలుక మౌనమౌనముగా



ఏమనెనే...  చిన్నారి ఏమనెనే... 

వన్నెల సిగపూవ...  కనుసన్నలలో భావమేమే
వన్నెల సిగపూవ...  కనుసన్నలలో భావమేమే


ఏమనెనే... 

ఏమనెనే...  చిన్నారి ఏమనెనే...