Wednesday, October 7, 2015
నారాయణ నీ లీల నవరసభరితం
చిత్రం: బాలభారతము (1972)
నారాయణ నీ లీల నవరసభరితం
ముని శాపముచే వగచే సతీపతులకూ
మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేతా.. ఆ.. ఆ
కృష్ణాగ్రజుడై బలరాముడు గోకులమున జనియించే
ఆ శుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినదీ
వరమునిచ్చెను వాయుదేవుడు.. అంత వనిత కుంతికి పుట్టె భీముడు
దుర్యోధన జననముచే దుశ్శకునమ్ములు దోచే
దుష్టుల శిక్షించుటకై.. శిష్టుల రక్షించుటకై
జనియించిన హరి జననీ జనకుల జ్ఞానుల గావించే
అమరేంద్రుని అతినిష్టతొ అర్చించెను కుంతి
శతపుత్రుల పిదప నొక్కసుతను గాంచె గాంధారీ
కౌరవులూ.. పాండవులూ.. కమనీయులు యాదవులూ
దారుణ హింసా కాండల దానవ పతి కంసుడూ
Labels:
(బ),
ఆరుద్ర,
ఎస్. రాజేశ్వరరావు,
ఘంటసాల,
బాలభారతము (1972)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment