చిత్రం : బంగారు చెల్లెలు (1979) సంగీతం : కె.వి. మహదేవన్ గీతరచయిత : ఆచార్య ఆత్రేయ నేపథ్య గానం : బాలు
పల్లవి :
అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం..ఊఁ..ఊఁ.. అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం
అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అన్నయ్య హృదయం దేవాలయం.. ఊఁ..ఊఁ.
చరణం 2 :
ఊయలలూపి జోలలు పాడే తల్లినెరగను.. మోసుకు తిరిగి... ముచ్చట తీర్చే తండ్రినెరగను.. కళ్ళు తెరిచి నే చూచినదే ఈ కరుణామూర్తిని మాట నేర్చి నే పిలిచినదే అన్నా అన్నది
అన్నయ్య హృదయం దేవాలయం..
చరణం 3 :
కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకూ..ఊ.. కృష్ణుడు పలికిన గీతవాక్కు.. వేదం అయినా ఎందుకు నాకు నా పాలి వేదం అన్నయ్య పలుకు.. నా పాలి వేదం అన్నయ్య పలుకు.. అన్నయ్య నవ్వే నా దారి వెలుగు....
అన్నయ్య హృదయం దేవాలయం చెల్లెలే ఆ గుడి మణిదీపం అనురాగమే కొలువున్న దైవం అనుబంధమే గోపురం మా అనుబంధమే గోపురం
No comments:
Post a Comment