| చిత్రం : కథానాయకురాలు (1970) సంగీతం : ఆకుల అప్పల రాజ్ గీతరచయిత : విజయ రత్నం నేపధ్య గానం : బాలు, సుశీల పల్లవి: తనువ.. హరిచందనమే.. పలుకా..ఉహు.. అది మకరందమే తనువా... ఉహు.. హరిచందనమే.. పలుకా.. ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను తనువా...ఉహు.. హరిచందనమే.. పలుకా..ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను తనువా హరిచందనమే.. చరణం 1: నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే ఉహు .. హు .. ఓహో నీ సోయగాలు కనుసైగ చేసే.. అనురాగ లతలు బంధాలు వేసే హరివిల్లునై ఈ విరి బాణమే హరివిల్లునై ఈ విరి బాణమే గురి చూసి హృదయాన విసిరేయనా.. నిను చేరనా.. మురిపించనా.. తనువా...ఉహు.. హరిచందనమే.. పలుకా..ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను చరణం 2: నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే... ఆ...ఆ...ఆ... నీకోసమే ఈ నవ పారిజాతం .. విరబూసి నీముందు నిలచిందిలే మధుపాయినై మరులూరించనా మధుపాయినై మరులూరించనా ఉయ్యాల జంపాల ఊగించనా.. లాలించనా.. పాలించనా తనువా ...ఉహు.. హరిచందనమే.. పలుకా ..ఉహు.. అది మకరందమే.. కుసుమాలు తాకగనే.. నలిగేను కాదా ఈ మేను నలిగేను కాదా నీ మేను | |
Showing posts with label ఆకుల అప్పల రాజ్. Show all posts
Showing posts with label ఆకుల అప్పల రాజ్. Show all posts
Monday, September 10, 2012
తనువా హరిచందనమే
Subscribe to:
Posts (Atom)