Showing posts with label ధనమా? దైవమా? (1973). Show all posts
Showing posts with label ధనమా? దైవమా? (1973). Show all posts

Saturday, July 27, 2013

నీ మది చల్లగా

చిత్రం: ధనమా? దైవమా? (1973)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...

చరణం 1:

ఏ సిరులెందుకు?... ఏ నిధులెందుకు?
ఏ సౌఖ్యములెందుకు?... ఆత్మశాంతి లేనిదే..
మనిషి బ్రతుకు నరకమౌను... మనసు తనది కానిదే...

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...

చరణం 2:

చీకటి ముసిరినా?... వేకువ ఆగునా?
ఏ విధి మారినా... దైవం మారునా?
కలిమిలోన లేమిలోన... పరమాత్ముని తలచుకో...

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...

చరణం 3:

జానకి సహనము... రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచె ఆదర్శము
వారి దారిలోన నడచువారి జన్మ ధన్యము...

నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=276

గుడు గుడు గుంజం

చిత్రం: ధనమా? దైవమా? (1973)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఏమిటో ఇది... ఏమిటో... ఎందుకో ఇది.... ఎందుకో
గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం
ఇది తొలి వయసు వేసిన తాళం
ఇది తొలి వయసు వేసిన తాళం
గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం

చరణం 1:

నీ కళ్ళు చూసాను... నా ఇల్లే మరిచాను
నీ కళ్ళు చూసాను... నా ఇల్లే మరిచాను
నీ పెదవులే చూసాను...
నీ పెదవులే చూసాను...జున్ను... మీగడ మరిచాను ...ఎందుకో...

గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంజం హెహె... గుండెరాగం

చరణం 2:

నీ రూపం చూశాను... ఈ లోకం మరిచాను
నీ రూపం చూశాను... ఈ లోకం మరిచాను
నా పేరే అడుగుతుంటే...
నా పేరే అడుగుతుంటే... నీ పేరే తెలిపాను... ఎందుకో...

గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంజం ఆ...హ్హ... గుండెరాగం

చరణం 3:

నిద్దురలో పిలిచాను... ముద్దులతో కొలిచాను
నిద్దురలో పిలిచాను... ముద్దులతో కొలిచాను
నీ కౌగిట కరిగిపోయి...
నీ కౌగిట కరిగిపోయి...నిన్ను.. నన్ను.. మరిచాను...ఆ..హా..

గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం
గుడు గుడు గుంజం అహ్హ... గుండెరాగం...
ఆహ..ఆ....హె...హే....
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7264