Showing posts with label దసరా బుల్లోడు (1971). Show all posts
Showing posts with label దసరా బుల్లోడు (1971). Show all posts

Tuesday, December 6, 2016

చేతిలో చెయ్యేసి చెప్పు బావా

చిత్రం : దసరా బుల్లోడు (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : సుశీల



పల్లవి :


చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ


చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ

చేతిలో చెయ్యేసి చెప్పు బావా


చరణం 1 :


పాడుకొన్న పాటలూ పాతవని ఊరుకో
పాడుకొన్న పాటలూ పాతవని ఊరుకో
ఆ మాటలన్ని మాపేసి కొత్తపాట పాడుకో


చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా



చరణం 2 :



మాట తప్పిపోయినా మనిషి బ్రతికితే చాలూ
మాట తప్పిపోయినా మనిషి బ్రతికితే చాలూ
మన మమత చంపుకొన్న...  ఒక మంచి మిగిలితేచాలు


చేతిలో చెయ్యేసి చెప్పు బావా



చరణం 3 :


తెలియక మనసిచ్చినా తెలిసికుమిలిపోతున్నా
తెలియక మనసిచ్చినా తెలిసికుమిలిపోతున్నా
మిమ్ము కలపమనీ ముక్కోటి దేవతలకు మొక్కుతున్న


చేతిలో చెయ్యేసి చెప్పు బావా
చేసుకొన్న బాసలు చెప్పుకొన్న ఊసులు
చెరిపి వేస్తాననీ... మరచిపోతాననీ
చేతిలో చెయ్యేసి చెప్పు బావా







నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: సుశీల, జానకి




పల్లవి : 


నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే
చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే



చరణం  1 :



వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే
వెన్నెవంటి మనసున్న చిన్నవాడే
చిన్న నాటినుండి నువ్వు కోరుకొన్నవాడే



ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే
ప్రేమకే బానిసైపోతాడే
కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే



నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ రాధకే చిక్కినాడే
లేదమ్మా లేదు రుక్మిణికే దక్కినాడె
నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే




చరణం  2 :




నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ
నువ్వు వాని వరస వున్నదానివీ
నువ్వు వలపుదోచుకొన్నదానివీ


మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
నీ మనసిచ్చి మాట పుచ్చుకొంటివీ
మంచితనముతో నువ్వు గెలుచుకొంటివీ


నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే




చరణం  3 : 


రాధా కృష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కృష్ణులు కథలేనమ్మా
వారు ఎన్నడూ ఆలుమగలు కాలేదమ్మా
రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ
రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ
లోకానికే అది ఆదర్శమూ





గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు
గోపాల బాలుడూ...నీ ప్రేమలోలుడూ
గోపాల కృష్ణుడూ...నీ పాలి దేవుడు


వాడు నీ వాడే... కాదు నీ వాడే
వాడు నీ వాడే... కాదు కాదు కానేకాడు


నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే...







Wednesday, December 17, 2014

పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల, ఘంటసాల



పల్లవి:



పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్.. నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్.. నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా 


కొంగు జారితేముంది కొంటె పిల్లోడా.. నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా
అహ..కొంగు జారితేముంది కొంటె పిల్లోడా
నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా



చరణం 1:


కొప్పులోన బంతి పూలు గొలుస్తున్నవి.. చెప్పలేని ఊసులేవొ చెప్పుచున్నవీ
కొప్పులోన బంతి పూలు గొలుస్తున్నవి..  చెప్పలేని ఊసులేవొ చెప్పుచున్నవీ


ఊసులన్ని వింటివా ఊరుకోవవీ.. ఆశలై బాసలై అంటుకుంటవి
ఊసులన్ని వింటివా ఊరుకోవవీ.. ఆశలై బాసలై అంటుకుంటవి


పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్.. నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ.. కొంగు జారితేముంది కొంటె పిల్లోడా.. నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా



చరణం 2 :



వరిచేను కోతకొచ్చి వంగుతున్నదీ . . వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవీ
వరిచేను కోతకొచ్చి వంగుతున్నదీ . . వంపులన్ని వయసొచ్చి పొంగుతున్నవీ


వయసుతోటి మనసేమొ కోరుతున్నదీ . . వయసుతోటి మనసేమొ కోరుతున్నదీ
వలపులోనే రెంటికీ ఒద్దికున్నదీ . . వలపులోనే రెంటికీ ఒద్దికున్నదీ


పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ . . నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ . . కొంగు జారితేముంది కొంటె పిల్లోడా . . నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా



చరణం 3 :



కొడవలితో లేత గడ్డి కోసుకుంటివీ . . కొంటె చూపుతో గుండె దూసుకుంటివీ
కొడవలితో లేత గడ్డి కోసుకుంటివీ . . కొంటె చూపుతో గుండె దూసుకుంటివీ


గడ్డిమోపు తలపైనా మోసుకొస్తినీ . . గడుసువాణ్ణి తలపుల్లో దాచుకుంటినీగడ్డిమోపు తలపైనా మోసుకొస్తినీ . . గడుసువాణ్ణి తలపుల్లో దాచుకుంటినీ



పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయ్ . . నీ పైటకొంగు జారిందే గడుసు పిల్లా
అహ . . కొంగు జారితేముంది కొంటె పిల్లోడా . . నీ గుండె చిక్కుకుందేమో చూడు బుల్లోడా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1673

నల్లవాడే.. అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: సుశీల, జానకి,  ఘంటసాల



పల్లవి:



నల్లవాడే..  అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే.. అయ్యయ్యో మన చేత చిక్కినాడే
నల్లవాడే.. అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే.. అయ్యయ్యో మన చేత చిక్కినాడే


ఒలమ్మీ.. చిన్న వాడనుకొని చేరదీస్తే
చిన్న వాడనుకొని చేరదీస్తే.. ముంచుతాడే.. కొంప ముంచుతాడే



చరణం 1:


సున్నమైన వెన్నలా మింగుతాడే.. సద్ది నీళ్ళైనా చల్లలా తాగుతాడే
సున్నమైన వెన్నలా మింగుతాడే.. సద్ది నీళ్ళైనా చల్లలా తాగుతాడే


వెన్న ముద్దకని ఎనకెనక వస్తాడే.. వెన్న ముద్దకని ఎనకెనక వస్తాడే
వచ్చాడే వచ్చాడే వచ్చాడే..  ఇచ్చాడే ఇచ్చాడే ఇచ్చాడే
వెచ్చగా ఒక్కటిచ్చి వెక్కిరించి పోతాడే


నల్లవాడే.. అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే.. అయ్యయ్యో మన చేత చిక్కినాడే



చరణం 2:



నెమలి ఈక పెట్టవే..  డుడుం డుడుం డుం
మురళి చేతి కివ్వవే..  టింగ్ టొంగ్ టింగ్ టొంగ్
అబ్బొ వాయిస్తాడిప్పుడూ ఉండవే.. అబ్బొ వాయిస్తాడిప్పుడూ ఉండవే
వదగొడతాడు తుప్పులు.. చూడు.. చూడు.. చూడవే



నల్లవాడే.. అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే..  అయ్యయ్యో మన చేత చిక్కినాడే



చరణం 3:


ఆ ముద్దు కృష్ణుడే ఈ మొద్దు గుమ్మడే..
ఆలమంద ఎక్కడే కోతి మూక ఉన్నదే
హహహహ డుర్ డుర్ డుర్
ఆ ముద్దు కృష్ణుడే ఈ మొద్దు గుమ్మడే
ఆలమంద ఎక్కడే కోతి మూక ఉన్నదే

ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరూ.. మీలో నా ముద్దుగుమ్మ ఎవ్వరూ
ఆనాడు నాకున్న ఆరువేల భామల్లో మీరిద్దరెవ్వరూ.. మీలో నా ముద్దుగుమ్మ ఎవ్వరూ


నువ్వా నా ముద్దుగుమ్మా.. ఆ
ఐతే ఒక ముద్దు ఇమ్మా..  ఆహా
నువ్వా నా ముద్దుగుమ్మా.. ఆ
ఐతే ఒక ముద్దు ఇమ్మా . . ఆహా
ఇవ్వనా.. ఇవ్వనా.. ఇచ్చింది చాలునా
ఒహొహొ కృష్ణుడు ఓ ముద్దు గుమ్మడు


నల్లవాడే.. అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే
చిన్నవాడే.. అయ్యయ్యో మన చేత చిక్కినాడే
ఒలమ్మీ.. చిన్న వాడనుకొని చేరదీస్తే
చిన్న వాడనుకొని చేరదీస్తే ముంచుతాడే.. కొంప ముంచుతాడే





Thursday, July 25, 2013

వెళ్ళిపోతున్నావా అమ్మా

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల

పల్లవి: వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా
వెళ్ళిపోతున్నావా..అమ్మా

చరణం: 1

నువ్వే అమ్మని అన్నే నాన్నని అల్లారుముద్దుగా పెరిగానే
ఈ లోకం ఎరుగక బాధే తెలియక పసిపాపడిలా పెంచారే
అమ్మా ఏమై పోవాలి..నేనెలా బ్రతకాలి

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా

చరణం: 2

పంపకాలే తలవంపులనీ..రెండు యిళ్ళను కలుపుతాననీ
పెంపక మిచ్చారానాడు..ఆ దత్తే నేడు నా దేవుళ్ళను
నడివీధికీ లాగిందమ్మా..నవ్వుల పాలు చేసిందమ్మా

వెళ్ళిపోతున్నావా..అమ్మా
యిల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా

చరణం: 3

ప్రాణం దేహం విడిపోతున్నవి..పాలమనసూ కన్నీరైనది
ఎవరో పెట్టిన అనలం రగిలీ..యిందరి మమతలు బలికోరినదీ
అమ్మా ఏమై పోవాలి..నేనింకెలా బ్రతకాలి
నేఇంకెలా బ్రతకాలి..ఎలా బ్రతాకాలీ..

మల్లయ్యగారి ఎల్లయ్యగారి బుల్లెమ్మా

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
గానం: ఘంటసాల,పిఠాపురం


పల్లవి::

ఓ..మల్లయ్యగారి ఎల్లయ్యగారి..బుల్లెమ్మా
బుల్లెయ్యగారి చెల్లెమ్మా..
నీ పురాణమంతా బుర్ర కధగా చెబుతామమ్మా
వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
తందానా..తాన
ఓహో..బుల్లెమ్మంటే పల్లెటూళ్ళలో ఎల్లరెరిగిన యిల్లాలండి
తందానా..తాన

వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ..

చరణం::1

పిల్లికి బిచ్చం పెట్టని తల్లి...
బుల్లెమ్మా...
ఎంగిలి చేత్తో కాకిని తోలని...
బుల్లెమ్మా...
తవుడూ చిట్టూ ధాన్యం గీన్యం ఊళ్ళో అమ్మీ
పాలు పెరుగు వెన్నా నెయ్యి బస్తీ కమ్మీ
కడుగు నీళ్ళే మొగుడి ముఖాన కొడతావమ్మా
అయ్యో..
కడుపు కట్టి..మూటలు కట్టి దాస్తావమ్మా... దాస్తావమ్మా

హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా

చరణం::2

చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
చదివేదేమో రామాయణము సంసారంలో రావణయుద్దము
పాతివ్రత్యమే పారాయణము..పచ్చడి మెతుకులె భర్తకు దినము
పాతివ్రత్యమే పారాయణము..పచ్చడి మెతుకులె భర్తకు దినము
పిల్లా మేకా లేరు కదమ్మా..ఆ..అహా..లేరుకదమ్మా
యీ పిసినిగొట్టు బ్రతుకేం ఖర్మా
నీ ఖర్మా..
హేయ్..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా
అహా..వినరా..బుల్లెమ్మా వీరగాధలు వీనులవిందుగా



చేతిలో చెయ్యేసి చెప్పు బావ

చిత్రం: దసరా బుల్లోడు (1971) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

చేతిలో చెయ్యేసి చెప్పు బావ 
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని 
చేతిలో చెయ్యేసి చెప్పు బావ 
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని 
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని 

చేతిలో చెయ్యేసి చెప్పు బావ 

చరణం 1: 

పాడుకున్న పాటలు పాతబడి పోవని 
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని 
పాడుకున్న పాటలు పాతబడి పోవని 
చిలిపిగ ఆడుకున్న ఆటలకు అలుపురానివ్వనని 

పడుచు గుండె బిగువులు సడలిపోనివ్వనని 
దుడుకుగ ఉరికిన పరువానికి ఉడుకు తగ్గిపోదని 

చేతిలో చెయ్యేసి చెప్పు బావ 
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని 
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 

చరణం 2: 

కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి 
మన కధ కల కాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి 
కన్నెగా కన్న కలలు కధలుగా చెప్పాలి 
మన కధ కల కాలం చెప్పినా కంచి కెళ్ళకుండాలి 

మన జంట జంటలకే కన్ను కుట్టు కావాలి 
ఇంక ఒంటరిగా ఉన్నవాళ్ళు జంటలై పోవాలి 

చేతిలో చెయ్యేసి చెప్పు బావ 
చేసుకొన్న బాసలు చెరిగిపోవని మరచిపోనని 
చేతిలో చెయ్యేసి చెప్పు రాధ 
చెప్పుకున్న ఊసులు మాసిపోవని మారిపోనని 
చేతిలో చెయ్యేసి చెప్పు బావ

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1675

ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ

చిత్రం: దసరా బుల్లోడు (1971)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ
ఆర్ని...ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ
ఆర్నీ..అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ

చరణం 1:

మొలలోతు నీళ్లల్లో మొగ్గల్లె నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్లూ మెరుస్తుంటే....
మొలలోతు నీళ్లల్లో మొగ్గల్లె నువ్వుంటే
నీ ఒంటి నిగనిగతో నీళ్లూ మెరుస్తుంటే
పొదచాటున నేను మాటేసి చూస్తుంటే.....
నువ్వు తానాలు ఆడావు ఓలమ్మీ
నా ప్రాణాలు తీశావే చిన్నమ్మీ....

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....

చరణం 2:

మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటొకటె చూశాను...
మొగ్గలు ఒక్కొక్కరేకిప్పుకున్నట్టు
నీ చక్కదనాలు నేనొకటొకటె చూశాను....

జడచూస్తి ఆ... మెడచూస్తి ఆహా...
జబ్బల నునుపు చూస్తి హా...
కనరాని ఒంపులన్నీ ఓలమ్మీ
కసికసిగా చూస్తినే చిన్నమ్మీ....

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....

చరణం 3:

తడిసీ నీ తెల్లకోక తపాతపామన్నది
తడబడి నా గడుసు మనసు దడాదడామన్నది..ఓర్నీ..
తడిసీ నీ తెల్లకోక తపాతపామన్నది
తడబడి నా గడుసు మనసు దడాదడామన్నది

కళ్లు మూసికొస్తినని...ఘొల్లున నువ్వు నవ్వితే ఆహ్హహ్హా
చురకల్లె తగిలింది ఓలమ్మీ...ఉడుకెక్కిపోయిందే చిన్నమ్మీ...

అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మీ
ఏటేటో ఔతుందే చిన్నమ్మీ ...
అరె రె రె రె రె రె రె రె రె రె రె రె
అట్టాగే ఉంటాది ఓరబ్బీ
ఎట్టాగొ ఔతాది చిన్నబ్బీ....


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1674