Showing posts with label (శ). Show all posts
Showing posts with label (శ). Show all posts

Wednesday, December 13, 2023

నిలవదే మది నిలవదే





చిత్రం : శతమానంభవతి (2017)

సంగీతం : మిక్కీ.జె.మేయర్

గీతరచయిత : రామజోగయ్య శాస్త్రి 

నేపథ్య గానం : బాలు


పల్లవి : 


నిలవదే మది నిలవదే... సిరి సొగసును చూసి 

ఉలకదే మరి పలకదే... తొలి వలపున తడిసి 

దేవదాసే... కాళిదాసై...  

ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది 


నిలవదే మది నిలవదే... సిరి సొగసును చూసి 

ఉలకదే మరి పలకదే... తొలి వలపున తడిసి

 

చరణం 1 : 


అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి

ఆదోలాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి

నువ్వు నడిచే దారులలో పూలగంధాలే ఊపిరిగా

జత నడిచే మనసు కదే హాయి రాగాలు ఆమనిగా

దినమొక రకముగ పెరిగిన సరదా నినువిడి మనగలదా


నిలవదే మది నిలవదే... సిరి సొగసును చూసి 

ఉలకదే మరి పలకదే... తొలి వలపున తడిసి


చరణం 2 : 


ఎలా నీకు అందించాలో  ఎదలో కదిలే మధురిమను

నేనే ప్రేమ లేఖగ మారి ఎదుటే నిలిచాను

చదువుకుని బదులిదని చెప్పుకో లేవులే మనసా

పదములతో పనిపడని మౌనమే ప్రేమ పరిభాష

తెలుపగ తెలిపిన వలపొక వరమని కడలిగ అలలెగశా


నిలవదే మది నిలవదే... సిరి సొగసును చూసి 

ఉలకదే మరి పలకదే... తొలి వలపున తడిసి 

దేవదాసే... కాళిదాసై...  

ఎంత పొగిడినా కొంత మిగిలిపోయేంత అందం నీది 



Wednesday, September 2, 2020

ముద్దబంతి ముసిముసినవ్వుల



చిత్రం : శీలానికి శిక్ష (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : రామకృష్ణ  


పల్లవి :


ముద్దబంతి ముసిముసినవ్వుల వచ్చెనమ్మా సంక్రాంతి
సంపదలెత్తిన సిరిసిరిమువ్వలు తెచ్చెనమ్మా సంక్రాంతి
ముద్దబంతి ముసిముసినవ్వుల వచ్చెనమ్మా సంక్రాంతి



తోరణాల వాకిళ్లో దోరనవ్వు లోగిళ్లో
ముంగిట్లో ముగ్గుల్లో మొగ్గలైన సిగ్గుల్లో
అల్లుళ్లొచ్చే గొబ్బిళ్లో అమ్మాయికి అవి పొంగళ్లో


ముద్దబంతి ముసిముసినవ్వుల వచ్చెనమ్మా సంక్రాంతి
వచ్చెనమ్మా సంక్రాంతి... వచ్చెనమ్మా సంక్రాంతి 


చరణం 1 :



హరిలోరంగ హరి...
ధశరథ రామ నీకు దయరాదా సార్వభౌమ
ధశరథ రామ నీకు దయరాదా సార్వభౌమ
ఉన్నది వనసీమలందున చిన్నది సీతమ్మ వయసున
ధశరథా రామ నీకు దయరాదా సార్వభౌమ


ఎన్నడో నీరాక తెలియక తెన్నులన్ని వెదికివేసరి
ఉన్నదేమొగాని ప్రాణము కన్నుల నిను చూడవలెనని         
ధశరథారామ నీకు దయరాదా సార్వభౌమా


పరులమాటలు నమ్మి ఆ పరమసాధ్విని అడవికంపి
ఏమిరాజ్యము నేలుచుంటివో భామనీగతి వదిలి నీవు             
ధశరథారామ నీకు దయరాదా సార్వభౌమా... కృష్ణార్పణం




చరణం 2 :



పెద్దపండుగొచ్చింది బుడుగో బుడుగో
ముద్దబంతి విచ్చింది బుడుగో బుడుగో
గంగిరెద్దు వచ్చింది బుడుగో బుడుగో
వంగిదణ్ణమెట్టింది బుడుగో బుడుగో
పంటచేను కురిసింది బుడుగో బుడుగో
ఇంటరాత్రి వెలిసింది బుడుగో బుడుగో
సంకురాత్రి వచ్చింది బుడుగో బుడుగో
జంకురాత్రి వెళ్లింది బుడుగో బుడుగో



శుభమస్తు శుభమస్తు



చిత్రం : శీలానికి శిక్ష (1976)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల   


పల్లవి :


శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
తథాస్తు...  తథాస్తు...  అనుకున్నది మనజంట
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట



చరణం 1 :


వయసు తోటలో తొలివలపు వసంతం   
మనసులో విరితేనెలు కురిసింది
మనువే తనువై అణువణువు వేణువై
నీ మమతై కవితై మెరిసింది...  నాలో మెరిసింది

శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట


చరణం 2 :



గూటిపడవలో వెన్నెల ఏటవాలుగా పడుతుంటే
పైటజారు నీ పరువం మాట మాట అంటుంటే
మాటలే పాటలై మనసు పరవశిస్తుంటే
ఆ పాట జిలుగుపైటగా నిన్ను దాచుకుంటే.... ఆ... ఆ... ఆ


శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట



చరణం 3 :



కలిసి మెలిసి కలకాలం బతికె
కలల పంట మనతియ్యని కాపురము
అది దిక్కులు దాచిన... దీపం వెలిగినా
దైవం వెలిసిన గోపురము...  గుడిగోపురము 



శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట
తథాస్తు...  తథాస్తు...  అనుకున్నది మనజంట
శుభమస్తు... శుభమస్తు... అన్నదీ గుడిగంట





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4613

Saturday, December 29, 2018

కోరికలా కుటీరములో

చిత్రం : శ్రీమతి (1966)
సంగీతం : శ్రీ నిత్యానంద్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల  




పల్లవి :


కోరికలా కుటీరములో... చేరియుందము ప్రియా
మరుమల్లే నీడా... అందాల మేడా...  వెలిసింది మనకోసమేకాదా


కోరికలా కుటీరములో... చేరియుందము ప్రియా
మరుమల్లే నీడా... అందాల మేడా...  వెలిసింది మనకోసమేకాదా


చరణం 1 : 


వేయి కనులా నీ కొరకే వేచియుంటానూ రోజు
నీలి నీలి మేఘములా తేలి వస్తానూ నీకై
కాపురాన తీనెలూరే ప్రేమ నిండేనూ
నిండి నోము పండేనూ



కోరికలా కుటీరములో... చేరియుందము ప్రియా
మరుమల్లే నీడా... అందాల మేడా...  వెలిసింది మనకోసమేకాదా


చరణం 2 : 



చందమామ మనకు వేసే చలువ పందిరీ..
అందు సాటిలేని తనివి తీరు ప్రణయసుందరీ


మరపురాని మరువలేని మమతలన్ని డోలలూగు
మమతలన్ని డోలలూగు..
చందమామ మనకు వేసే చలువ పందిరీ..ఆహా
   

ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో


ఊహ నేడు ఊయలాయే హృదయమూపగ నీవు
నిదుర పోవుమా మదిలో... 


జో జోజో జోజో జో జోజో జోజో
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ జోజో జోజో జోజో జోజో 

మ్రోగింది గుడిలోని గంట

చిత్రం : శ్రీమతి (1966)
సంగీతం : శ్రీ నిత్యానంద్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల  




పల్లవి :


మ్రోగింది గుడిలోని గంట... మురిసింది హృదయాల జంట
నీలో నాలో వెలిగే ప్రేమా... నింపింది కిరణాల పంట




చరణం 1 : 


నా మనసే ప్రియా... నీవుండే విడిది
నాలో పొంగింది... ఆనంద జలధి


వికసించే మనోభావాలు కలిసే
వెండి పందిరిగా లోకమె వెలసే


నీవే నేనుగా... ఒకటైన చోట
నీవే నేనుగా... ఒకటైన చోట
పూచే వలపుల..తోటా..ఆ... ఆ 


మ్రోగింది గుడిలోని గంట... మురిసింది హృదయాల జంట
నీలో నాలో వెలిగే ప్రేమా... నింపింది కిరణాల పంట




చరణం 2 : 



ప్రేమించి..నిను సేవింతుగానా
ఇల్లాలినైనాను..ఈ ముహుర్తానా


దేవతలే చెలీ... దీవించినారూ..
ఇద్దరినొకటిగా... కావించినారూ..


ఎపుడు మనలో... ఎడబాటు లేక
ఎపుడు మనలో... ఎడబాటు లేక
బ్రతుకే పూవుల..బాటా..ఆ... ఆ 


మ్రోగింది గుడిలోని గంట... మురిసింది హృదయాల జంట
నీలో నాలో వెలిగే ప్రేమా... నింపింది కిరణాల పంట





చెలరేగు చీకటిలోనే

చిత్రం : శ్రీమతి (1966)
సంగీతం : శ్రీ నిత్యానంద్
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం : సుశీల 




పల్లవి :


చెలరేగు చీకటిలోనే ... ప్రాకాశించు దీపమూ 
పరీక్షించే వేదనలోనే...   విరాజిల్లు జీవమూ
విరాజిల్లు..జీవమూ..


చెలరేగు చీకటిలోనే...  ప్రాకాశించు దీపమూ




చరణం 1 : 


తెరమీద నీడనుచేసి... విధి నీతో ఆటలాడు..ఆ ఆ ఆ ఆ ఆ
విరబూసిన నందనవనమే... మరుభూమిగ మారిపోవు
నిరాశలో ఆశవేణువు... రవళించును..రాగమునే..ఆ
రవళించును..రాగము..


చెలరేగు చీకటిలోనే...  ప్రాకాశించు దీపమూ


చరణం 2 : 



సేవించు దీక్షను మించీ... సిరిసంపద వేరే లేదు..
ఆ ఆ ఆ ఆ ఆ
కావించు త్యాగము కన్నా... ధన ధాన్యము..కానరాదు
కరుణించే హృదయములోనే... నివసించును దైవమూ
నివసించును..దైవమూ..ఊఊఊఊ


చెలరేగు చీకటిలోనే...  ప్రాకాశించు దీపమూ 

Thursday, October 11, 2018

ఈ గంగకెంత దిగులు

చిత్రం : శ్రీరామ పట్టాభిషేకం (1978)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  దేవులపల్లి
నేపథ్య గానం :  బాలు  




పల్లవి :


ఈ గంగకెంత దిగులు... ఈ గాలికెంత గుబులు
కదలదయా... రామా ..ఆ ఆ
కదలదయా... రామా
నా హృదయంలా...  నావా


ఈ గంగకెంత దిగులు... ఈ గాలికెంత గుబులు
ఓ..ఓ...ఓ..ఓ..ఓ..ఓ..




చరణం 1 :



వడిదుడుకుల సంసారపు కదలులకే కారకుడవు
వడిదుడుకుల సంసారపు కదలులకే కారకుడవు
నీకు గుహుడు కావాలా... రామా... ఆ... ఆ..
నీకు గుహుడు కావాలా... ఈ కొద్దిపాటి ఏరు దాటా


ఈ గంగకెంత దిగులు... ఈ గాలికెంత గుబులు
ఓ..ఓ...ఓ..ఓ..ఓ..ఓ..ఆ.ఆ.ఆ.ఆ.ఆ... ఓయ్



చరణం 2 :


నిదరపోను కనుమూయను... ఎదురుతెన్ను చూస్తూ
నిదరపోను కనుమూయను ....ఎదురుతెన్ను చూస్తూ
పదునాలుగేండ్లు పైన క్షణం బతకను సుమ్మీ...ఈ ..ఈ.ఈ...


ధన్యుడవు గదయ్యా తమ్ముడ లక్ష్మణా..... ఆ.... ఆ....
భద్రమయా శ్రీరామభద్రునకు...  సీతమ్మకు
భద్రము సుమ్మా...  మన వదిన గారికి...  అన్నయ్యకు






http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=318

Monday, October 8, 2018

వన్నెల చిన్నెల నెర

చిత్రం :  శ్రీ పాండురంగ మహత్యం (1957)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత :  సముద్రాల (సీనియర్)
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల 




పల్లవి :


వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి

వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి 




చరణం 1 :



కని విని ఎరుగము గదా...  ఇది ఎంతో వింత సుమా
కని విని ఎరుగము గదా...  ఇది ఎంతో వింత సుమా
కాలులే సతికి కన్నులే గీటు చతురులే పెనిమిటైనా


వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి 



చరణం 2 :



అలక లేలనె చెలీ...  అలవాటున పొరపాటదీ
అలక లేలనె చెలీ...  అలవాటున పొరపాటదీ
మురిసిపోవాలి చల్లని ఈ రేయి...  పరిమళించాలి హాయి


వన్నెల చిన్నెల నెర... కన్నెల వేటల దొరా
జాణవు నా హృది రాణివి నీవే... కూరిమి చేరగ రావె చెలి 



అహహహహహ.. ఓహొహొ ఓహొహొహో..
ఉమ్మ్..ఉమ్మ్.. ఉమ్మ్మ్ 







Tuesday, October 2, 2018

ప్రియా ప్రియా మధురం

చిత్రం :  శ్రీకృష్ణ సత్య (1971)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  ఘంటసాల, జానకి  





పల్లవి :


ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
ప్రియా ప్రియా మధురం
పిల్లనగ్రోవి పిల్లవాయువు
పిల్లనగ్రోవి పిల్లవాయువు... భలే భలే మధురం...
అంతకు మించీ ప్రియుని కౌగిలీ... ఎంతో ఎంతో మధురం




ఇన్నీ ఉన్నా సరసిజలోచన... సరసన ఉంటేనె మధురాం
మనసిచ్చిన ఆ అలివేణి... అధరం..మరీ మరీ మధురం
ప్రియా ప్రియా మధురం




చరణం 1 :



ఏనాటి నా పూజాఫలమో
ఏ జన్మలో పొందిన వరమో
అందరుకోరే శ్యామసుందరుడే
అందరుకోరే శ్యామసుందరుడే... నా పొందు కోరుట మధురం





సత్యా కృష్ణుల సరసజీవనం
సత్యా కృష్ణుల సరసజీవనం
నిత్యం నిత్యం మధురం..
ప్రతినిత్యం అతి మధురం
ప్రతినిత్యం అతి మధురం... 


ప్రియా ప్రియా మధురం


చరణం 2 :



సవతులెందరున్నా..ఆ ఆ ఆ
సవతులెందరున్నా కృష్ణయ్యా
సత్యను వలచుట మధురం
భక్తికి రక్తికి లొంగని స్వామిని
కొంగున ముడుచుట మధురం
నా కడకొంగున ముడుచుట మధురం




ఈ భామామణి ఏమి పలికినా
ఈ భామామణి ఏమి పలికినా... ఔననుటే మధురం
ఈ చెలి పలుకుల పర్యవసానం
ఇంకా ఇంకా... మధురం..

ప్రియా ప్రియా మధురం



చరణం 3 :


నను దైవముగా నమ్మిన దానవు
కడ కొంగున నను ముడువని దానవు
చల్లని ఓ సతీ జాంబవతీ..ఈ... ఈ..
చల్లని ఓ సతీ జాంబవతీ
నీ సాహచర్యమే మధురం 


ప్రాణనాథా నీ పాద సేవలో
పరవశించుటే మధురం
తరియించుటే మధురాతి మధురం





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=681

Thursday, September 27, 2018

అలుకమానవే చిలుకలకొలికిరో

చిత్రం :  శ్రీకృష్ణ సత్య (1971)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  పింగళి
నేపథ్య గానం :  ఘంటసాల, జానకి  



పల్లవి :



అలుకమానవే చిలుకలకొలికిరో... తలుపు తీయవే ప్రాణసఖి...
తలుపు తీయవే ప్రాణసఖి


దారి తప్పి ఇటు చేరితివా... నీ దారి చూసుకోవోయి...
నా దరికి రాకు... రాకోయి..


చరణం 1 :


కూరిమి కలిగిన తరుణివి నీవని... తరుణమునెరిగియే చేరితినే
కూరిమి కలిగిన తరుణివి నీవని.. తరుణమునెరిగియే చేరితినే
నీ నెరినెరి వలపునే కోరితినే...
నీ నెరినెరి వలపునే వేడితినే... 


అలుకమానవే చిలుకలకొలికిరో... తలుపు తీయవే ప్రాణసఖి...
తలుపు తీయవే ప్రాణసఖి



చరణం 2 :



చేసిన బాసలు చెల్లించని భల్ మోసగావేవోయి...
చేసిన బాసలు చెల్లించని భల్ మోసగావేవోయి...
ఇక ఆశ లేదు లేదోయి...
ఇక ఆశ లేదు పోవోయి...



దాసుని నేరము దండంతో సరి... బుసలు మాని ఓ వగలాడి...
దాసుని నేరము దండంతో సరి... బుసలు మాని ఓ వగలాడి.
నా సరసకు రావే సరసాంగి...
నా సరసకు రావే లలితాంగి...


అలుకమానవే చిలుకలకొలికిరో... తలుపు తీయవే ప్రాణసఖి...
తలుపు తీయవే ప్రాణసఖి




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18257

Wednesday, September 26, 2018

భళా భళి నా బండీ

చిత్రం :  శ్రీకృష్ణ పాండవీయం (1966)

సంగీతం :  టి.వి. రాజు

గీతరచయిత :  కొసరాజు

నేపథ్య గానం :  మాధవపెద్ది సత్యం 





పల్లవి :




ఓ..ఓ..ఓహో..
ఓ..ఓ..ఓ..ఓ....ఓ..ఓ..


ఏయ్...భళా భళి నా బండీ... పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ... బ్రహ్మకు నోరూరునండి


భళా భళి నా బండీ... పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
ఎహెహెహె... ఎహెహెహె..






చరణం 1 :






తిండి లేనిదే కండ లేదురా... కండ లేనిదే గుండె రాదురా... హే తమ్ముడూ
తిండి లేనిదే కండ లేదురా... కండ లేనిదే గుండె రాదురా
గుండె దిటవుగా నున్నచో...  బ్రహ్మాండములోనే ఎదురు లేదురా...
ఆ.. ఆ.. ఆ.. 


కరకర ఆకలి మండుతువుంటే... కమ్మని భోజన మెదురుగవుంటే
కరకర ఆకలి మండుతువుంటే... కమ్మని భోజన మెదురుగవుంటే
గుటకలు మ్రింగుచు కూర్చొనువాడు... ఉంటే వాడు వెర్రివాడు




భళా భళి నా బండీ... పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
డ్ర్రు ఊ... ఎహెహెహె.. 






చరణం 2 :




అట్టురా మినపట్టురా...  దీన్నొదిలి పెట్టేదెట్టురా
తీపి తీపి బొబ్బట్టురా...  అహ తింటే ఆకలి కట్టురా
పప్పుతోటి ఒక ముద్ద కలిపి... పచ్చడితో అనుపానమేసి..ఓహో..
పప్పుతోటి ఒక ముద్ద కలిపి... పచ్చడితో అనుపానమేసి
బక్క పేగులకు పట్టిస్తుంటే... చెప్ప శక్యమా దీని రుచి 




భళా భళి నా బండీ... పరుగుతీసే బండి... పరుగుతీసే బండి
డ్ర్రు ఊ... ఎహెహెహె..






చరణం 3 :






సాటిలేని జగజెట్టి భీముని చేతుల తీట తీరునులే...
అరి చేతుల తీట తీరునులే
ఏక చక్ర పురావాసుల బెడద నేటి తోనే పరిమారునులే
తల్లి ఋణమ్మును తీర్చెద నా ధర్మమ్మును నెరవేర్చెద..
ఓ ఆత్మబంధూ...
ఓ ఆత్మబంధూ... నీ అండ ఉంటే ఎవరడ్డమైన పరిమార్చెద






భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
బండిలో తిండి జూడ... మాయమైనదండి...
భళా భళి నా బండీ... పరుగుతీసే బండి
పరుగుతీసే బండి... పరుగుతీసే బండి




Monday, September 24, 2018

ఈ వెన్నెల... ఈ పున్నమి వెన్నెల

చిత్రం  :  శభాష్ సూరి (1964)
సంగీతం  : పెండ్యాల
గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం  :  ఘంటసాల, సుశీల  




పల్లవి :


ఈ వెన్నెల... జజజ..
ఈ పున్నమి వెన్నెల... జజజ
ఈనాడూ ఆనాడూ.. ఒకే వెన్నెల


ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


ఈ వెన్నెల... జజజ..
ఈ పున్నమి వెన్నెల... జజజ
ఈనాడూ ఆనాడూ.. ఒకే వెన్నెల




చరణం 1 :



వలపుల వెన్నెల... జజజ
జతకలిపే వెన్నెల... జజజ
వలపుల వెన్నెల... జజజ
జతకలిపే వెన్నెల ... జజజ


అల్లరి వెన్నెల... కలలల్లే వెన్నెల
ఆ..ఆ..ఆ..ఆ


ఈ వెన్నెల... జజజ..
ఈ పున్నమి వెన్నెల... జజజ
ఈనాడూ ఆనాడూ.. ఒకే వెన్నెల... ఆ.. ఆ.. ఆ.. 




చరణం 2 :



లైలా నవ్వుల చల్లదనం
మజ్ఞు మమతల వెచ్చదనం
లైల నవ్వుల చల్లదనం
మజ్ఞు మమతల వెచ్చదనం


తార కోర్కెలో దుడుకుతనం
కలబోసిన కమ్మని వెన్నెల..ఆ..ఆ..ఆ


ఈ వెన్నెల... జజజ..
ఈ పున్నమి వెన్నెల... జజజ
ఈనాడూ ఆనాడూ.. ఒకే వెన్నెల... ఆ.. ఆ.. ఆ..



చరణం 3 :



ఒంటరి వాళ్ళు ఓపనిదీ
జంటకు చాలీ చాలనిదీ
ఒంటరి వాళ్ళు ఓపనిదీ
జంటకు చాలీ చాలనిదీ


చెలి కన్నులలో వెలిగేదీ
చిలిపి పనులు చేయించేది ఈ..ఈ..ఈ 



ఈ వెన్నెల... జజజ..
ఈ పున్నమి వెన్నెల... జజజ
ఈనాడూ ఆనాడూ.. ఒకే వెన్నెల... ఆ.. ఆ.. ఆ..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=576




Friday, September 14, 2018

రేయి మించేనోయి రాజా

చిత్రం  :  శభాష్ రాముడు (1959)
సంగీతం  : ఘంటసాల
గీతరచయిత  : సదాశివబ్రహ్మం
నేపథ్య గానం  :  సుశీల 



పల్లవి :




రేయి మించేనోయి రాజా

హాయిగ నిదురించరా ఆ...

హాయిగ నిదురించరా


రేయి మించేనోయి రాజా
హాయిగ నిదురించరా ఆ...
హాయిగ నిదురించరా




చరణం 1 :


వెల్లివిరిసి వెన్నెళ్లు కాచి

వెల్లివిరిసి వెన్నెళ్లు కాచి

చల్లన్ని చిరుగాలి మెల్లంగ వీచి 

స్వప్నాలలోన స్వర్గాలు కంటూ

స్వర్గాలలో దేవగానాలు వింటూ

హాయిగా నీవింక నిదురించవోయి


రేయి మించేనోయి రాజా

హాయిగ నిదురించరా ఆ...

హాయిగ నిదురించరా



చరణం 2 :



చీకటి వెంట వెలుగే రాదా 

కష్టసుఖాలు అంతే కాదా

చీకటి వెంట వెలుగే రాదా 

కష్టసుఖాలు అంతే కాదా

చింతా వంతా నీకేలనోయి  

అంతా జయమౌను శాంతించవోయి

హాయిగ నీవింక నిదురించరోయి 


రేయి మించేనోయి రాజా

హాయిగ నిదురించరా ఆ...

హాయిగ నిదురించరా... హాయిగ నిదురించరా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11

Thursday, September 13, 2018

జయమ్ము నిశ్చయమ్మురా

చిత్రం  :  శభాష్ రాముడు (1959)
సంగీతం  : ఘంటసాల
గీతరచయిత  : కొసరాజు
నేపథ్య గానం  :  ఘంటసాల, సుశీల 



పల్లవి :

అహహా.. ఆహహ.. ఆహహా
జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా



చరణం 1 :


ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏనాటికైన స్వార్ధము నశించి తీరును
ఏరోజుకైన సత్యమే జయించి తీరును... జయించి తీరును
కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును...  సుఖాలు దక్కును


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


చరణం 2 :


విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విద్యార్ధులంత విజ్ఞానం సాధించాలి
విశాల దృష్టి తప్పకుండ బోధించాలి... బోధించాలి
పెద్దలను గౌరవించి పూజించాలి... పూజించాలి


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


చరణం 3 :

జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


కష్టాలకోర్చుకున్ననే సుఖాలు దక్కును... సుఖాలు దక్కును
ఈ లోకమందు సోమరులై ఉండకూడదు...  ఉండకూడదు
పవిత్రమైన ఆశయాన మరువకూడదు... మరువకూడదు


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


చరణం 4 :


గృహాన్ని స్వర్గసీమగా చేయుము దేవా...  బ్రోవుము దేవా
కుటుంబమొక్క త్రాటిపైన నిలుపుము దైవా... నడుపుము దేవా
బీదసాదలాదరించు బుద్ది నొసగుమా... శక్తి నొసగుమా


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


చరణం 5 :


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా



గాఢాంధకారమలముకున్న భీతిచెందకు
సందేహపడక వెల్గు చూపి సాగుముందుకు... సాగుముందుకు
నిరాశలోన జీవితాన్ని క్రుంగదీయకు… క్రుంగదీయకు


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


చరణం 6 :



పరాభవమ్ము గల్గునంత పారిపోకుమోయ్
జయమ్ము నిమ్మరించుదాక పోరి గెల్వవోయ్... పోరి గెల్వవోయ్
స్వతంత్ర యోధుడన్న పేరు నిల్వబెట్టవోయ్...  నిల్వబెట్టవోయ్


జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
జంకుగొంకు లేక ముందు సాగిపొమ్మురా సాగిపొమ్మురా


జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా
జయమ్ము నిశ్చయమ్మురా... జయమ్ము నిశ్చయమ్మురా





Tuesday, January 30, 2018

కొంటె చూపు లెందుకులేరా

చిత్రం :  శ్రీమంతుడు (1971)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల, ఘంటసాల



పల్లవి :


కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనెలందిస్తారా
కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనెలందిస్తారా
నీవు నాకు తోడై ఉంటే లోకాలే గెలిచేస్తారా
కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనె లందిస్తారా




చరణం 1 :

కన్ను కలిపి కవ్వించేవు... వెన్న లాగ కరిగించేవు
నిన్ను చేరి నీరైపోతే...  నన్ను చూసి నవ్వేసేవు


ఇన్నినాళ్ళు దాచిన వయసు...  ఈనాడే కానుక నీకు
కలకాలం నీ కౌగిలిలో...  కరగాలని కోరిక నాకు


కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనెలందిస్తారా
నీవు నాకు తోడై ఉంటే లోకాలే గెలిచేస్తారా
కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనె లందిస్తారా



చరణం 2 :


మధుశాలవు నీవైనావు...  బాటసారి నేనైనాను
ఓ..లైలా నీ వాకిలిలో...  మజునూనై నిలుచున్నాను


నీలికురుల నీడలోన ... నిన్ను దాచుకుంటా నేను
నిండువలపు నీడలోన...  నిన్ను దోచుకుంటా నేను



కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనెలందిస్తారా
నీవు నాకు తోడై ఉంటే లోకాలే గెలిచేస్తారా
కొంటె చూపు లెందుకులేరా...  జుంటె తేనె లందిస్తారా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1308

మొదటి పెగ్గులో మజా

చిత్రం :  శ్రీమంతుడు (1971)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  ఘంటసాల 



పల్లవి :

లలలలాలలలాలలల లలలా
హేయ్... చీయర్స్... చీయర్స్


మొదటి పెగ్గులో మజా... ఓహొహొ
వేడి ముద్దులో నిషా... ఓహొహొ
కొత్త వలపుల రుచీ... రుచీ
అనుభవిస్తే ఖుషీ...  ఖుషీ
అమ్మమ్మ పపప... దదద... నినిని... షా


మొదటి పెగ్గులో మజా... మజా
వేడి ముద్దులో నిషా... నిషా
కొత్త వలపుల రుచీ... రుచీ
అనుభవిస్తే ఖుషీ...  ఖుషీ
అమ్మమ్మ పపప... దదద... నినిని...షా
ఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓఓ.....



చరణం 1 :

రేపు సంగతి మనకేల...  నేడు సుఖపడు మనసారా
లాఆఆ లలలలాలలలాలలల లలలా..
రేపు సంగతి మనకేల...  నేడు సుఖపడు మనసారా


పండితే నీ మోజు...  పండుగే ప్రతి రోజూ
పండితే నీ మోజు...  పండుగే ప్రతి రోజూ
అమ్మమ్మమ్మమ్మా ... ఏమి మజా


మొదటి పెగ్గులో మజా... మజా
వేడి ముద్దులో నిషా... నిషా
కొత్త వలపుల రుచీ... రుచీ
అనుభవిస్తే ఖుషీ ... ఖుషీ
అమ్మమ్మ పపప దదద నినినిషా
లాఆఆ లలలలాలలలాలలల లలలా..



చరణం 2 :

తన పర భేదం లేనిది...  తాగుడు లోనే ఉన్నది
లాఆఆ లలలలాలలలాలలల లలలా..
తన పర భేదం లేనిది...  తాగుడు లోనే ఉన్నది
నింపుకో మధుపాత్ర...  సాగనీ సుఖ యాత్ర
నింపుకో మధుపాత్ర...  సాగనీ సుఖ యాత్ర
అమ్మమ్మమ్మమ్మా...  ఏమి మజా


మొదటి పెగ్గులో మజా... మజా
వేడి ముద్దులో నిషా... నిషా
కొత్త వలపుల రుచీ... రుచీ
అనుభవిస్తే ఖుషీ...  ఖుషీ
అమ్మమ్మ...  పపప దదద నినినిషా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1169

చల్లని వెన్నెలలో

చిత్రం :  శ్రీమంతుడు (1971)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  సుశీల, ఘంటసాల 





పల్లవి :


చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో


చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో



చరణం 1 :


కలతలు పోవాలనీ... తొలకరి రావాలనీ
వలపుల జల్లులో... బ్రతుకులు పండాలనీ
వేచిన కన్నులతో... వేసారి ఉన్నాను


చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో


చరణం 2 :


మమతల ఉయ్యాలలో... మనసులు ఊగాలనీ
మల్లెలపందిరిలో... మనువులు కూడాలనీ
కోటిదేవుళ్ళనే... కొంగుచాచి అడిగేను


చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో


చరణం 3 :


నీ కన్నులరేకులలో... నిండుకలలు పూయాలనీ
వాడని ఆ కలలలో... నా నీడ చూచుకోవాలనీ
ఎన్నెన్నో ఆశలతో... ఇన్నాళ్ళు ఉన్నాను..


చల్లని వెన్నెలలో... నా ఒడిలో నిదురపో
అల్లరి మానుకొని... నా మదిలో ఒదిగిపో 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1307

ఎంతో చిన్నది జీవితం

చిత్రం :  శ్రీమంతుడు (1971)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల





పల్లవి :


ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యౌవనం
ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యౌవనం
అనుభవించరా... జీవితం
ఆగదు ఆగదు ఆగదు ఆగదు...  యౌవనం  

         
ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యౌవనం



చరణం 1 :


ప్రతి నిమిషం  విలువైనది... ప్రతి మగువ సొగసైనది

లలలలలలలలలాలలాఓహో..
రోజొక తాజా రోజాపై... మోజు పడేదే యౌవనం
అనుభవించరా...
అనుభవించరా...  జీవితం
ఆగదు ఆగదు ఆగదు ఆగదు...  యౌవనం    

         

ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యౌవనం



చరణం 2 :


మమతలు నీలో పెంచకు ..బ్రమలో  కాలం గడపకు
మమతలు నీలో పెంచకు ..బ్రమలో కాలం గడపకు
ఎవరికి వారే తెలుసుకో... యమునా తీరే కలుసుకో
అనుభవించరా....
అనుభవించరా....  జీవితం
ఆగదు ఆగదు ఆగదు ఆగదు...  యౌవనం           
 


ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యౌవనం



చరణం 3 :


హాయిగా జీవించేందుకు... వెనకా ముందు ఎందుకు
లలలలలలలలలాలలాఓహో..
మధువులు నిండిన అధరం... అన్నిటిలో అతి మధురము
అనుభవించరా..ఆ..
అనుభవించరా...  జీవితం


ఆగదు ఆగదు ఆగదు ఆగదు...  యౌవనం






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1168

హరీల రంగ అనవలెరా

చిత్రం :  శ్రీమంతుడు (1971)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి,  
జె.వి. రాఘవులు



పల్లవి :


హరీల రంగ అనవలెరా... చెప్పినది వినవలెరా
ఎందుకని అడగకురా... ముందుగతి కనవలెరా


హరీల రంగ అనవలెరా... చెప్పినది వినవలెరా
మన గురువుల బోధలు విననివారికి... ముక్తిలేదు గదరా

హరీల రంగ అనవలెరా... చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా... చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా... చెప్పినది వినవలెరా



చరణం 1 :



అమృతం తాగిన దేవతలు... చావన్నది లేకున్నారు
జలసాలో మునిగున్నారు
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ

మాయా దేహం వున్న మానవులు... మమతలలో పడివున్నారు
మట్టి బొమ్మలుగ వున్నారు
శివ..శివ..శివ..శివ..ఆ


హరీల రంగ అనవలెరా...  చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా...  చెప్పినది వినవలెరా
హరీల రంగ అనవలెరా...  చెప్పినది వినవలెరా



చరణం 2 :



నువ్వూ నేను నాస్తి... నీ వెంబడిరాదీ ఆస్తి
వున్నంతవరకేరా యీ గస్తీ

పరుల దోచి నువు దాచిన ధనము ఎంతో కాలము నిలువదురా
పోయేటప్పుడు తెలియదురా 
శివ..శివ..శివ..శివ


హరీల రంగ అనవలెరా...  చెప్పినది వినవలెరా




చరణం 3 :


వెయ్యకురా మాయ వేషాలు... చెయ్యకురా పాడు మోసాలు
చాలించరా చిద్విలాసాలు
ఓహో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..ఓ


తిన్నయింటి వాసాల నెన్నితే... చిత్రగుప్తుడు చూస్తాడు
యముడు తోలు ఒలిచేస్తాడు
శివ..శివ..శివ..శివ..శివ..శివ..ఆ


హరీల రంగ అనవలెరా...  చెప్పినది వినవలెరా
హరీల రంగ హరీ...  హరీల రంగ హరీ
హరీల రంగ హరీ...  హరీల రంగ హరీ
హరీల రంగ హరీ...  హరీల రంగ హరీ
హరీల రంగ హరీ...  హరీల రంగ హరీ
పాండురంగ విఠలా..  పాండురంగ హరి
పాండురంగ విఠలా...  పాండురంగ హరి
హరీ హరీ హరీ హరీ హరీ హరీ హరీ హరీ
హరీ హరీ హరీ హరీ ఓం శివ..శివ..ఆ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1738

Friday, January 19, 2018

శ్రీ రఘురాం జయరఘురాం

చిత్రం : శాంతినివాసం (1960)
సంగీతం : ఘంటసాల 
గీతరచయిత : 
నేపధ్య గానం : పి.బి. శ్రీనివాస్, సుశీల  





పల్లవి :



శ్రీరామచంద్రః ఆశ్రితపారిజాతః
సమస్త కళ్యాణ గుణాభిరామః
సీతాముఖాంభోరుహచంచరీకః...
నిరంతరం మంగళ మాతనోతు


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


శ్రీ రఘురాం జయరఘురాం... సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 



చరణం 1 :



అన్నదమ్ముల ఆదర్శమైనా...  ఆలూమగల అన్యోన్యమైనా
అన్నదమ్ముల ఆదర్శమైనా...  ఆలూమగల అన్యోన్యమైనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..
తండ్రిమాటను నిలుపుటకైనా...  ధరలో మీరే దశరథరాం 


శ్రీ రఘురాం జయరఘురాం... సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం 


చరణం 2 :



వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ...  వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలయునే ఎడ నీ దివ్యమూర్తీ...  వెలిగేనా ఎడ ఆనందజ్యోతీ
వెలసి మాగృహం శాంతినివాసం...  సలుపవె శుభగుణ శోభితరాం


శ్రీ రఘురాం జయరఘురాం... సీతామనోభిరాం...
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం
శ్రీ రఘురాం జయరఘురాం