Showing posts with label మజ్ఞు (1989). Show all posts
Showing posts with label మజ్ఞు (1989). Show all posts

Saturday, December 29, 2018

కదలకు..కన్ను కన్ను కలుపు

చిత్రం :  మజ్ఞు (1989)
సంగీతం :  లక్ష్మీకాంత్-ప్యారేలాల్
గీతరచయిత : దాసరి
నేపథ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు... మ్ మ్ మ్ మ్


కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు... మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ 




చరణం 1 : 



కలలు ఎంత కమ్మన... ప్రేమకు
కనులు ఎంత చల్లన... ప్రేమకు
రాతిరెఒత వెచ్చన... ప్రేమకు..
లోకమెంత పచ్చన... ప్రేమకు..
ఎన్ని ఎన్ని రంగులో... ప్రేమకు..
ఎన్ని ఎన్ని గురుతులో... ప్రేమకు..
రంగులన్నీ కలబోసి... గురుతులన్ని ముడి వేసి
బ్రతికించు  ప్రేమని... బ్రతుకంతా
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ 


అడగకు... ఆశ రేపి పోకు
తాకకు... తనువు విడిచి పోకు
రేపకు... రేపు మాపు అనకు
అడగకు...మ్ మ్ మ్ మ్ మ్ 



చరణం 2 : 



ఏమిటీ... జీవితం
ప్రేమేలే...  జీవితం
ఎవరికీ...  అంకితం
ప్రేమకే... అంకితం
కొలనే ప్రేమైతే... మునకంతా నేనే
వరదె ప్రేమైతే... పొంగంతా  నేనే..
నేనే..నేనే..నేనే


కదలకు... కన్ను కన్ను కలుపు
వదలకు... వలపు కథలు తెలుపు
బెదరకు... గుండె వేడి తెలుపు
మరువకు..మ్ మ్ మ్ మ్


కదలకు..కన్ను కన్ను కలుపు
వదలకు..వలపు కథలు తెలుపు
బెదరకు..గుండె వేడి తెలుపు
మరువకు..మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్
లలాలలాలలా లలాలలాలలా
లలాలలాలలా లలాలలాలా ఆ


అడగకు... ఆశ రేపి పోకు
తాకకు... తనువు విడిచి పోకు
రేపకు... రేపు మాపు అనకు
అడగకు... మ్ మ్ మ్ మ్ మ్
మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్ మ్






Sunday, May 11, 2014

ప్రేయసీ రావే... ఊర్వశి రావే

చిత్రం :  మజ్ఞు (1989)
సంగీతం : లక్ష్మీకాంత్-ప్యారేలాల్
నేపధ్య గానం :  బాలు


పల్లవి:


ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
నీవు నాకు .. నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే... ఊర్వశి రావే
ప్రేయసీ రావే... ఊర్వశి రావే..

ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
ఇది తొలి రాత్రి... కదలని రాత్రి
నీవు నాకు .. నేను నీకు చెప్పుకున్న కథల రాత్రీ
ప్రేయసీ రావే... ఊర్వశి రావే
ప్రేయసీ రావే... ఊర్వశి రావే..


చరణం 1:


వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
వెన్నెలమ్మ దీపాన్నీ ఆర్పమన్నదీ.. మల్లెలమ్మ పరదాలు మూయమన్నదీ
ధూపమేమో మత్తుగా తిరుగుతున్నదీ... దీపమేమో విరగబడి నవ్వుతున్నదీ..
నీ రాక కొరకు తలుపు.. నీ పిలుపు కొరకు పానుపు
పిలిచి...పిలిచి.. వేచి..వేచి ఎదురుచూస్తున్నవీ..ఈ...ఈ...ఈ...


ప్రేయసీ రావే... ఊర్వశి రావే
ప్రేయసీ రావే... ఊర్వశి రావే..


చరణం 2:


వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నదీ...ఆ..ఆ..ఆ..
ఆ..ఆ వెన్నలంతా అడవి పాలు కానున్నదీ... మల్లెమనసు నీరుకారి వాడుతున్నది
అనురాగం గాలీలో దీపమైనదీ.. మమకారం మనసునే కాల్చుతున్నదీ


నీ చివరి పిలుపు కొరకు..ఈ చావు రాని బ్రతుకూ
చూసి చూసి వేచి వేచి వేగిపోతున్నదీ..ఆ..ఆ..ఆ


ప్రేయసీ రావే... ఊర్వశి రావే
ప్రేయసీ రావే... ఊర్వశి రావే..