Showing posts with label నిర్ణయం (1991). Show all posts
Showing posts with label నిర్ణయం (1991). Show all posts

Thursday, April 21, 2016

హలో గురూ ప్రేమ కోసమేరోయ్






చిత్రం : నిర్ణయం (1991)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు




పల్లవి  :



హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి


హార్నీ...  హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం




చరణం 1 :



ఉంగరాల జుట్టు వాణ్ణి ... ఒడ్డు పొడుగు ఉన్నవాణ్ణి
చదువుసంధ్య గల్గినోణ్ణి ... చౌకబేరమా
గొప్ప ఇంటి కుర్రవాణ్ణి .. అక్కినేని అంతటోణ్ణి
కోరి నిన్ను కోరుకుంటే పెద్ద నేరమా


నాకన్న నీకున్న తాఖీదు లేంటమ్మా
నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మా
నేనంటే కాదన్న లేడీసే లేరమ్మా
నాకంటే ప్రేమించే మొనగాడు ఎవడమ్మా


I Love You Darling... Because You Are Charming
ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టే
Why Not...



హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి
Yeah Yeah



హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం



చరణం 2 :



కట్టుకుంటే నిన్నె తప్ప కట్టుకోనే కట్టుకోను
ఒట్టుపెట్టుకుంటినమ్మో బెట్టుచేయకే
అల్లిబిల్లి గారడీలు చెల్లవింక చిన్నదానా
అల్లుకోవే నన్ను నీవు మల్లెతీగలా


నీ చేతే పాడిస్తా లవ్ సాంగ్లు డ్యూయెట్లూ
నా చేత్తో తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లూ


ఆహా నా పెళ్ళంటా ఓహో నా పెళ్ళంటా
అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంటా


अच्चा मैने प्यार् किया ... लुच्चा काम् नही किया
అమీతుమీ తేలకుంటే నిను లేవదీస్కుపోతా
Are You Ready?


హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం


ప్రేమించాను దీన్నే ... కాదంటోంది నన్నే
మహా మహా సుందరాంగులే పొందలేనివాణ్ణి


అహహా
హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం
మగాడితో ఆడదానికేలా పౌరుషం








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=10509

Sunday, August 4, 2013

మిలమిల మెరిసెను తారా

చిత్రం: నిర్ణయం (1991)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: గణేష్ పాత్రో
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
 
She loves you... She loves you 
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా 
He loves you... He loves you 
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
 
She... Loves... You... 
వేదించెలే నన్నే నీ నీడలా 
He... Loves... You... 
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా 
She loves you... She loves you 

చరణం 1:

తతత తారతారతరత
తతత తారతారతరత
 
Hey... You.. love him love him love him 

వెచ్చనైన గుండె గిన్నెలో She Loves You 
వెన్నలింక దాచి ఉంచకూ She Loves You 
పొన్న చెట్టు లేని తోటలో He Loves You 
కన్నె వేణువాలపించకూHe Loves You 
ప్రేమ అన్నదే ఓ.. ఓ.. పల్లవైనదీ 
She Loves You... She Loves You 
పెదవి తాకితే ఓ.. ఓ.. పాటలే అవీ 
He Loves You... He Loves You 
ఆమనీ ప్రేమనీ పాడే కోయిలా
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
 
She Loves You... She Loves You 
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా 
He Loves You... Hee Loves You 
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
 She... Loves... You 
వేదించెలే నన్నే నీ నీడలా He... Loves... You 

చరణం 2: 

Hey... You.. love him love him love him 

మౌనమైన మాధవీ లతాHe Loves You 
మావి కొమ్మనల్లుకున్నదీHe Loves You 
ఎల్లువైన రాగమిప్పుడేShe Loves You 
ఏక తాళమందుకున్నదీ She Loves You 
తోచదాయెనే ఓ.. ఓ.. తోడు లేనిదే 
He Loves You... He Loves You 
కౌగిలింతలే ఓ.. ఓ.. కావ్యమాయెలే 
She Loves You... She Loves You 
ఎన్నడూ లేనిదీ ఎందుకో ఇలా
మిలమిల మెరిసెను తారా నీ ప్రేమలా
 
She Loves You... She Loves You 
చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా 
He Loves You... He Loves You 
గాలిలో లాలిలా గానమై ఇలా
లాలించెలే నన్నే ఓ పాపలా
 She... Loves... You 
వేదించెలే నన్నే నీనీడలాHe... Loves... You


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10771

ఎపుడెపుడెపుడని అడిగిన

చిత్రం: నిర్ణయం (1991) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: గణేష్ పాత్రో 
నేపధ్య గానం: బాలు, జానకి 

పల్లవి: 

ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... 
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... 

ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం 
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం 
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం 
వెయ్యేళ్ళ వియ్యాలతో.. 
పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో 
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో 
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం 
సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో 

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం 

చరణం 1: 

తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా 
బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం 
నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం 
కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం 
నా ఉదయమై వెలిగే ప్రియవరం 

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం 
వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం 
పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం 
వెయ్యేళ్ళ వియ్యాలతో.. 

అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో 
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో 

చరణం 2: 

వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా 
సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా 
పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం 
వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడదాం 

రా వెతుకుదాం రగిలే రసజగం 
అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం 
విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం 
సిగ్గూ సింగారం చిందే సిందూరం వయ్యారి నెయ్యాలతో 

అహ.. ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం 
ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం 
అహ.. పద పద పదమని పిలిచిన దివి పద పోదాం పదమ్మో 
ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో