Showing posts with label తోట రాముడు (1975). Show all posts
Showing posts with label తోట రాముడు (1975). Show all posts

Monday, December 8, 2014

జాల్మైలే.. హవ్వరి జవ్వారి

చిత్రం :  తోట రాముడు (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


జాల్మైలే..  హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి
సంకురాత్రొచ్చింది చలితోడు తెచ్చింది.. సంబరాలు చేద్దాము రా రా  


జాల్మైలే..  హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి



చరణం 1 :



తప్పట్లు తాళాలు మోగించండీ.. తద్దిమిత తందనాలు తొక్కండీ
తప్పట్లు తాళాలు మోగించండీ.. తద్దిమిత తందనాలు తొక్కండీ
రాగాలు తియ్యండి రాంభజన చెయ్యండి..  రామయ్య తండ్రికీ మొక్కండిరా


        
జాల్మైలే..  హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి



చరణం 2 :



రంగుహోళీ రంగుహోళీ రంగునీళ్ళూ.. బుంగల్తో తెండిరా బుజ్జిగాళ్ళూ
రంగుహోళీ రంగుహోళీ రంగునీళ్ళూ.. బుంగల్తో తెండిరా బుజ్జిగాళ్ళూ
పైన చల్లండి బుగ్గ గిల్లండి.. వరసైన అమ్మాయి వచ్చిందిరా
పైన చల్లండి బుగ్గ గిల్లండి..  వరసైన అమ్మాయి వచ్చిందిరా 



జాల్మైలే.. హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి



చరణం 3 :


ఏడాది కొకసారి వస్తాము.. ఇల్లిల్లు వదలకుండ తిరుగుతాము
ఏడాది కొకసారి వస్తాము.. ఇల్లిల్లు వదలకుండ తిరుగుతాము
ఇచ్చినంత పుచ్చుకుని.. భోగి మంటలేసుకొని.. ఎగిరి గంతులేసుకుంటూ పోదాము    


జాల్మైలే..  హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి


సంకురాత్రొచ్చింది చలితోడు తెచ్చింది.. సంబరాలు చేద్దాము రా రా
జాల్మైలే.. హవ్వరి జవ్వారి హవ్వ..  జంజనకడి జంజనకడి
హవ్వరి జవ్వారి హవ్వ.. జంజనకడి జంజనకడి




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4537

Wednesday, July 24, 2013

ఓ బంగరు రంగుల చిలకా

చిత్రం :  తోట రాముడు (1975)
సంగీతం :  సత్యం
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఓ.. బంగరు రంగుల చిలకా.. పలకవే..
ఓ.. అల్లరి చూపుల రాజా..  ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ


ఓ..  అల్లరి చూపుల రాజా.. పలకవా.. 
ఓ..  బంగరు రంగుల చిలకా ఏమనీ ....
నా మీద ప్రేమే ఉందనీ.... నా పైన అలకే లేదనీ


ఓ.. ఓ.. ఓహో..హో..హో.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 




చరణం 1 :


పంజరాన్ని దాటుకునీ.. బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో
మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..నిరుపేదను వలచావెందుకే
నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ..


ఓ బంగరు రంగుల చిలకా పలకవే..
ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ..
నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ


చరణం 2 :


సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..పువ్వులోని నవ్వే నాదిలే
కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..అందించే భాగ్యం నాదిలే
ఈ కొండల్లో..ఈ కోనల్లో.. మనకెదురే లేదులే....



ఓ..  అల్లరి చూపుల రాజా.. పలకవా.. 
ఓ..  బంగరు రంగుల చిలకా ఏమనీ ....
నా మీద ప్రేమే ఉందనీ.... నా పైన అలకే లేదనీ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4517