Showing posts with label గబ్బర్ సింగ్ (2012). Show all posts
Showing posts with label గబ్బర్ సింగ్ (2012). Show all posts

Sunday, December 9, 2012

గన్నులాంటి

చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: దేవిశ్రీ ప్రసాద్
నేపధ్య గానం: పవన్ కళ్యాణ్ , వడేపల్లి శ్రీనివాస్

పల్లవి:

ఏ పిల్లా అట్లా నవ్వేసేసి పారిపోమాకే బాబు
మీరేంట్రా నన్ను చూస్తన్నారు
ఎవడి డప్పు వాడు కొట్టండహెయ్… అది...

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…
ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…

ఏ సుందరి సుందరి సుందరి
మనసుని చేసినావె ఇస్తిరీ…
స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ మిక్స్ చేసి
లిప్పులో పెట్టినావె ఫ్రెంచ్ జ్యూసు ఫాక్టరి…

పిల్లా నువ్వు లేని జీవితం
నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం
అహ పిల్లా నువ్వు లేని జీవితం
ఆవకాయ బద్దలేని మందు కంటె దారుణం…

ఏ గన్నులాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…
ఏ గన్నులాంతి కన్నులున్న జున్ను లాంటి పిల్లా
ఏ నవ్వు తోటి నన్ను పేల్చి పారిపోతే యెల్లా?…

చరణం 1:

పంచదార పెట్టి రుద్దినట్టు.. మంచి తేనె తెచ్చి అద్దినట్టు..
ద్రాక్ష పండు తీసి పిండినట్టు.. ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టు…

వెయ్యి ముగ్గు సుక్కలెట్టినట్టు.. విన్నాంలే...
పొయ్యి మీద పాలు పొంగినట్టు.. విన్నాంలే...
పూట కొక్క పండగొచ్చినట్టు.. ఏదేదో అవుతోందే నీ మీద ఒట్టు

సంపకే సంపకే సంపకే నిప్పులాంటి నవ్వులోకి దింపకే
ఏ సింపకే సింపకే సింపకే నల్లని రాత్రినీ సింపకే రంగుతో నింపకే

పిల్లా నువ్వు లేని జీవితం
బ్రేకు లేని బైక్ నే రయ్యిమంటు తోలడం
హే పిల్లా నువ్వు లేని జీవితం
ట్రాకు లేని ట్రైను మీద కుయ్యుమంటు యెల్లడం…

చరణం 2:

ఒక్క జానడంత కప్పు కోసం.. పెద్ద వరల్డు కప్పు జరుగుతాది
నీ నవ్వులున్న లిప్పు కోసం... చిన్న వరల్డు వారు జరిగినా తప్పు లేదే

కొన్ని వేల కోట్ల అప్పు కోసం.. కాపు కాసి ఉన్నదంట దేశం
ఒక్క నవ్వునంట ఇవ్వు పాపం.. దాన్ని అమ్ముకుంటే అప్పు బాధ తప్పుతాదే…

కొట్టినా కొట్టినా కొట్టినా గుండెలోన దాగి ఉన్న డప్పుని
రాసిన రాసిన రాసినా నవ్వు పై ఎవ్వరూ రాయని మస్తు మస్తు పాటని

పిల్లా నువ్వు లేని జీవితం..
తాడు లేని బొంగరాన్ని గిర్రుమంటు తిప్పడం
హేయ్ పిల్లా నువ్వు లేని జీవితం
నూనె లోంచి వాన లోకి జారిపడ్డ అప్పడం…

యే పిల్లా…

కెవ్వ్.. కేకా

చిత్రం: గబ్బర్ సింగ్ (2012) 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ 
గీతరచయిత: సాహితి 
నేపధ్య గానం: మమత శర్మ, ఖుషి మురళి 

పల్లవి: 

కెవ్వ్.... 

ఏఁ... కొప్పున పూలెట్టుకొని.. బుగ్గన వేలెట్టుకొని.. వీధంట నే వెళుతుంటే.. 
కెవ్వ్.. కేక... నా ఈడంతా... కెవ్వ్.. కేకా 
పాపిడి బిళ్ళెట్టుకొని.. మామిడి పళ్ళెట్టుకొని.. ఊరంతా నే వెళ్తుంటే 
కెవ్వ్.. కేకా.. నా ఊరంటా. కెవ్వ్.. కేకా 

ఎసరులాగా మరుగుతోంది ఒంట్లో కారం 
స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో బేరం 
నా ఈడు కొత్తిమీర.. నా సోకు కోడి కూర 
నువ్ రాక రాక విందుకొస్తే కోక చాటి పైటేస్తా 
కెవ్వ్.. కేకా.. నా సామిరంగా.. కెవ్వ్.. కేకా 
కెవ్వ్.. కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్.. కేకా 
కెవ్వ్.. కేకా.. నా సామిరంగా.. కెవ్వ్.. కేకా 
కెవ్వ్.. కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్.. కేకా 

చరణం 1: 

ఆ ... నా అందం ఓ బ్యాంకు నువ్వు దూరి నా సోకు 
దొంగ లాగ దొచావంటే..ఆఁ దోచేస్తే 
కెవ్వ్ కేకా.. నా సోకు మాడ.. కెవ్వ్ కేకా 
నా బుగ్గలోని మెరుపులతో అగ్గిపుల్ల రాజేసి 
నీ బీడి నే వెలిగిస్తే... ఆఁ వెలిగిస్తే 
కెవ్వ్ కేకా.. నీ దుంపతెగ.. కెవ్వ్ కేకా 
నా టూరింగ్ టాకీసి రిబ్బన్ కట్టు 
కెవ్వ్ కేకా.. నువ్వొచ్చి షో మీద షోలే పెట్టు.. కెవ్వ్ కేకా 
హే చూశాను ట్రైలర్లు ఇక చూస్తే ఫుల్ పిక్చరు 
మీ ఒంటినిండ చిచ్చురేగి పిచ్చెక్కి పెడతారు 

కెవ్వ్ కేకా.. నా సామిరంగ.. కెవ్వ్ కేకా 
కెవ్వ్ కేకా.. దీని తస్సదియ్య.. కెవ్వ్ కేకా 

చరణం 2: 

హే కొత్త సిల్కు గుడ్డల్లే.. గల్ఫుసెంటు బుడ్దల్లె 
ఝలుకులిచ్చు నీ జిలుగులే... 
అబ్బో కెవ్వ్.. కేకా.. ఓ రత్తాలు.. కెవ్వ్.. కేకా 
హేయ్ వేడి వేడి లడ్డల్లే.. డబుల్ కాటు బెడ్డల్లే.. ఫాటు మీద ఒడ్డింపల్లే... 
కెవ్వ్.. కేకా.. ఓ రత్తాలు.. కెవ్వ్.. కేకా 

హేయ్ జోరు మీద గుర్రాలు నీ ఊపులే 
కెవ్వ్ కేకా.. ఊరు వాడ అందరూ నీ సంతులే 
కెవ్వు కేకా.. నే పట్టుకుంటే లాఠీ పడలేరు ఎవరు పోటి 
ఓ గోలి సోడ తాగి నీతో ఘొల్లుమంటు పెట్టిస్తా 
కెవ్వ్..కేకా.. నా సామిరంగ... కేవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కెవ్వ్ కేకా 
కెవ్వ్..కేకా... దీని తస్సదియ్య... కెవ్వు కెవ్వు కెవ్వు కేకా

ఏం చక్కని మందారం

చిత్రం: గబ్బర్ సింగ్ (2012)
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: శంకర్ మహదేవన్ , గోపిక పూర్ణిమ

పల్లవి:

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే.. నీలా ఉంటుందే..
ఓ ఓ ఓ.. ఆనందం అల్లరి చేస్తే.. నాలా ఉంటుందే..
నాలా ఉంటుందే.. నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవుతుందే
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం

చరణం 1:

అల్లేసి.. నను గిల్లేసి.. తెగ నవ్వినావే సుగుణాల రాక్షసీ.. శత్రువంటి ప్రేయసి
పట్టేసి.. కనిపెట్టేసి.. దడ పెంచినావే దయలేని ఊర్వశి.. దేవతంటి రూపసి

గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే.. నిద్దుర పుచ్చేనే..
ఓ ఓ ఓ.. లోకంలో అందాలన్నీ నీలో చేరెనే.. నిద్దుర లేపెనే..
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల

ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం

చరణం 2:

వచ్చేసి.. బతికిచ్చేసి.. మసి చేసినావే రుషి లాంటి నా రుచి.. మార్చినావే అభిరుచి
సిగ్గేసి.. చలిమొగ్గేసి.. ఉసి గొలిపినావె సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగేనే.. ప్రాణం పోసేనే
ఓ ఓ ఓ.. నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే