Thursday, October 15, 2020

శివశివశంకర కైలాసవాసా

 చిత్రం :  అగ్ని సంస్కారం (1980)

సంగీతం :  ఎం. జనార్ధన్

గీతరచయిత :   

నేపథ్య గానం :  జానకి


పల్లవి :


శివశివశంకర కైలాసవాసా ఓ దేవదేవా

త్రిలోకాలు దీపించే పరంజ్యోతివే నీవు

త్రిలోకాలు దీపించే పరంజ్యోతివే నీవు

శివశివశంకర కైలాసవాసాచరణం 1 :నిటాలాక్ష నీలకంఠ మొరాలించగా నీవు

నిరంతరం మాలోనే విరాజిల్లుతున్నావు

ఆదరించి మా సేవ అందుకోమ్ము దేవదేవ

పరాత్పరా.. సదాశివా..  పాహిమాం పాహిపాహి


శివశివశంకర కైలాసవాసా... చరణం 2 :


కులం మతం సాగించే విభేదాలు మాకేలా

జగతిలోని మానవులంత సమానులే నీచెంత

ఈయధార్ద మెరిగిననాడు జీవితాన లేదు చింతhttps://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9949

Thursday, October 8, 2020

జుం తనన... నెచ్చెలి నడకే

 
చిత్రం : వివాహ భోజనంబు (1989)

సంగీతం : బాలు 

గీతరచయిత : వెన్నెలకంటి

నేపథ్య గానం : బాలు 


పల్లవి :


జుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం  

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనంరెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు

ఒదిగి ఒదిగి గుసగుసమని

జుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనం


చరణం 1 :చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా 

చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా 

ఓపలేని ఓ మౌనగీతం రాగం తీయగా 

నందనాల నవపారిజాతం ఇలకే జారగా 

ఊహలు గీచిన బొమ్మకు ఊపిరి వచ్చిన

వెచ్చని కలలు విరిసి కలిసెను జతజుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనంచరణం 2 :నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక

నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక

ఆలపించే అనురాగ వీణ పలికే గీతిక

వేగిపోయే విరహాలలోన కొసరే కోరిక

అంచులు కలిసిన సంజెలు చిందిన కుంకుమ వన్నెలు 

పెదవి కొసల చిలికెను చెలిజుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనం

రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు

ఒదిగి ఒదిగి గుసగుసమనిhttps://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11551

Monday, September 28, 2020

బాలోచ్చిష్టంఅది లలితా పరమేశ్వరి సభ, అక్కడ సరస్వతీదేవి వీణ వాయిస్తోంది. ఆ వీణానాదానికి సంతసించి లలితాదేవి "శభాష్ " అని అంది.  తన వీణా నాదాని కన్నా ఆవిడ పలుకులే తీయగా ఉన్నాయని సరస్వతీదేవి వీణ ఆపేసి పైన పరదా వేసేసింది. పరదా వేసినా ఇంకా తంత్రులు మ్రోగడం చూసి కోపమొచ్చిన సరస్వతీ దేవి ఆ కఛ్ఛపిలో ఆ తీగని భూలోకంలో జన్మించమని అంది. అలా మనుష్యరూపంలో భూలోకానికి వచ్చావు. నడుస్తొన్న సరిగమల సమాహారం అయ్యావు. సరస్వతి చేతిలో ప్రావీణ్యం పొందావేమో కూనిరాగం తీసినా కల్యాణిరాగమే అయ్యింది. 

ఆకాశం నుండి మాకోసం వచ్చావు.. పాటల మిఠాయి పొట్లాలందించావు, నీ పలుకే త్యాగరాజ కీర్తననన్నావు, కథ చెబుతాను ఊ కొడతావా ఉలిక్కిపడతావా? అని లాలించావు, సంగీత సాహిత్యాలు నీకు సమలంకారాలన్నావు. శివస్తుతి ఆలాపించి భక్తిరసంతో ఆ కైలాసనాథుణ్ణీ మెప్పించావు, నీ పాట లేని కార్తీక మాసం లేదంటే అతిశయోక్తి కాదేమో! 

అందానికి అందం ఈ పుత్తడి బొమ్మ అని సిరిమల్లెని విరుజల్లుగా రమ్మని ఆహ్వానించావా? చూడు.. ఇక అబ్బాయిల మదిలో దివిలో విరిసిన పారిజాతాలవైపు మొగ్గ చూపాయి. కాపురం.. అదే కొత్త కాపురంలో పెదవిలోని మధువులను వ్రతము పూని జతకు చేరినప్పుడు  కాటుకలంటుకున్న కౌగిలింత గురించి ఏమీ చెప్పను ఎలా చెప్పను అంటూ చెప్పకనే చెప్పి వేసవి రేయిలో మదిలో మల్లెలు చల్లావు. పెళ్ళంటె ముద్దూ ముచ్చట్లు మురిసే లోగుట్లు  చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు అని ముసిపోయారు, చామంతి పువ్వంటి చెల్లెలు కావాలా? బుజ్జిబాబు కావాలా? అని కోరికలు గెలలు వేయించావు. సంసారం ఒక చదరంగం అంటూ విసిగిన వాడి చేత భర్తగ మారకు బాచ్లరూ అని సూచనలిచ్చావు.  ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక, అందరు నీవారు  చివరికి మిగిలేదెవరూ లేరు అని వైరాగ్యాన్ని కలిగించి జీవిత సత్యాలని కళ్ళకు కట్టావు. నవ్వుతూ వెళ్ళిపో నువ్వుగా మిగిలిపో, నవ్వుతూ బతకాలి  అని బుద్ధులు చెప్పావు. మాకు ఆనందమొచ్చినా నీ పాటే, కష్టమొచ్చినా, ఏడుపొచ్చినా ఓదార్పు కావాలన్నా నీ పాటే,  ప్రేమ సఫలమయినా నీ పాటే, విఫలమైనా నీ పాటే! నీ పాటతో మమ్మల్ని కట్టిపారేశావు.  


 నువ్వు ఆలపించిన పాటలన్నీ పంచామృతంలా మేము ఆస్వాదించాము. నా కంఠంలో నవరసాలే కాకుండా అదేదో కొత్త రసం మాకు అన్నిటికన్నా ఎక్కువ ఇషటపడేటట్టు అందించావు. బహుశా అది బాలూ అమృత రసమేమో! ఆ రసం తాగే మేమంతా పరవశులమై నీ వశమైపోయాము. నవరసాలే ఉన్నాయన్న వారికి నీ కంఠంతో అమృతరసమందించిన దశకంఠుడవు.. ఊహూ కాదు శతకంఠుడవు... అబ్బేబ్బే అదీ కాదు... సహస్ర కంఠుడవు నువ్వు. కఛ్ఛపి అంశానివి కదా.. అనంత రాగాల వీణాఝరివి. సినిమా పాటలన్నింటినీ ఎంగిలి చేసేశావు. ఇప్పుడు మేమంతా ఆనందిస్తున్న ఆ పాటలన్నీ   బాలోచ్చిష్టాలే కదా!     


నువ్వు కోరుకున్నట్టుగానే శ్రీచరణ మందారం మీద మధుపముగా వాలి మధుధారలు గ్రోలుతూ  ఉఛ్వాసం కవనం.... నిశ్వాసం గానంగా కడతేరావు.   వస్తా ఎళ్ళొస్తా...  అన్న పెద్దమనిషివి ఇది తిరుగులేని పయనం తిరిగి రాని పయనం అంటూ వెళ్ళిపోయావు.  

  నీ గొంతులో పల్లవించిన పాటలన్నీ నా పాటకే శెలవు నా మాటకే శెలవు  నువ్వెళ్ళిపోతే పదిలంగా అల్లుకొన్న బ్లాగ్ చలి వేణువయ్యింది. బ్లాగ్ రాయాలని లేదు, కానీ నీకు నేనిచ్చిన మాట అదే ఐదు వేల పాటలందిస్తాను అని అన్నాను కదా అది గుర్తొచ్చింది (ఇప్పటికి 3172 పాటలయ్యాయి).  మళ్ళొస్తానని మరలిరాని లోకానికి నువ్వెళ్ళిపోయి మాట నిలుపుకోలేదు, కానీ రేపు నిన్ను కలిసినప్పుడు "నువ్వూ మాట నిలుపుకోలేదు కదా " అని నన్నంటావు. కాబట్టి నువ్వు పాడిన పాటలతోటే నీకు నీరాజనాలర్పిస్తాను. 

కోటికి ఒక్కరే పుడతారు పుణ్యమూర్తులు వారి కొరకే వస్తారు సూర్యచంద్రులు. నువ్వు కారణజన్ముడివి. సినీసంగీతానికి కొత్త నడవడి నేర్పడానికి వచ్చావు పండితులకే కాదు పామరులకి కూడా ఆరాధ్యుడవయ్యావు..  పాటల తోటని మాకు వదిలి  కఛ్ఛపిలో కలిసి మళ్ళీ సరస్వతి చేతిలోకి చేరావు.  నువ్వు అందించిన పాటలెన్నో.. నీకు మాత్రం ఏవీ ఇవ్వలేనిదాన్ని.. రెండు కన్నీటి చుక్కలు తప్ప! 🙏🙏🙏

Thursday, September 24, 2020

దినకరా... జయకరా
చిత్రం : సతీ అనసూయ (1971)

సంగీతం : ఆదినారాయణరావు 

గీతరచయిత : సినారె  

నేపథ్య గానం : సుశీల 


పల్లవి :దినకరా... జయకరా 

పావనరూపా... జీవనదాతా 

దినకరా... జయకరా 

పావనరూపా... జీవనదాతా  


దినకరా... జయకరా చరణం 1 : ప్రథమకిరణం సోకిననాడే

ప్రాణవల్లభుని పొందితి గాదా

మంగళకరములు నీ కిరణమ్ములు

మాంగల్యమునే హరియించునా 


దినకరా... జయకరా 

పావనరూపా... జీవనదాతా  


దినకరా... జయకరా చరణం 1 :


లోకములన్నీ వెలిగించు దేవా 

నా కనువెలుగే తొలగించేవా 

కరుణాసింధూ... కమలబంధూ  

ఉదయించకుమా ఓ సూర్యదేవా 


చండకిరణ బ్రహ్మాండ కటోహోద్దండ తమో హరణా

సకల చరాచర నిఖిల జగజ్జన చైతన్యోద్దరణా

ద్వాదశాదిత్య రూపా.. రోదసీ కుహర దీపా 

ద్వాదశాదిత్య రూపా.. రోదసీ కుహర దీపా 

ఉదయించకుమా... ఉదయించకుమా... ఉదయించకుమాWednesday, September 23, 2020

హిమగిరి మందిరా... గిరిజా సుందరా

చిత్రం : సతీ అనసూయ (1971)

సంగీతం : ఆదినారాయణరావు 

గీతరచయిత : సముద్రాల (సీ) 

నేపథ్య గానం : సుశీల 


పల్లవి :హే ప్రభో.........

గరళమ్ము మ్రింగి లోకములనే కాపాడి

ధరణిపై దయబూని సురగంగ విడనాడి

ప్రమథుల కొలువులో పరవశించేవా 

తాండవార్భటిలోన తనువు మరచేవా  


హిమగిరి మందిరా... గిరిజా సుందరా 

హిమగిరి మందిరా... గిరిజా సుందరా  

కరుణా సాగరా మొరవిన రారా 

హిమగిరి మందిరా.....


చరణం 1 :


భుజంగ భూషణా... అనంగ భీషణా 

భుజంగ భూషణా... అనంగ భీషణా 

కరాళ జ్వాల లెగసెరా  

కావగ రారా... ప్రభో శంకరా 

హిమగిరి మందిరా... గిరిజా సుందరా

కరుణా సాగరా మొరవిన రారా హిమగిరి మందిరా... గిరిజా సుందరా  

కరుణా సాగరా మొరవిన రారా 

హిమగిరి మందిరా.....


చరణం 2 :పతి సేవనమే జీవనమై నిలిచిన నేను

పలు నిందలతో గుండెపగిలి కుందితి నేడు

పతి సేవనమే జీవనమై నిలిచిన నేను

పలు నిందలతో గుండెపగిలి కుందితి నేడు


జాటాచ్చటాధర... జగద్భయంకరా 

జాటాచ్చటాధర... జగద్భయంకరా 

దురంత మాపివేయగా 

పరుగున రారా ప్రభో ఈశ్వరా 
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8364

ఆలయమేలా... అర్చనలేలా
చిత్రం : సతీ అనసూయ (1971)

సంగీతం : ఆదినారాయణరావు 

గీతరచయిత : సినారె 

నేపథ్య గానం : సుశీల
పల్లవి :ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా 

పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా చరణం 1 :


ఏ కొండ కొమ్ముపైనో... ఏ రాతి బొమ్మలోనో

దైవమ్ము దాగెనంటూ తపియించనేలా

ఏ కొండ కొమ్ముపైనో... ఏ రాతి బొమ్మలోనో

దైవమ్ము దాగెనంటూ తపియించనేలా


ఆ దైవము నిజముగ ఉంటే... 

అడుగడుగున తానై ఉంటే

గుడులేలా యాత్రలేలా 


పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా చరణం 2 :


పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం

మదిలోన వెలిగే అందం గమనించునా 

పైపైని మెరుగుల కోసం భ్రమ చెందు గుడ్డిలోకం

మదిలోన వెలిగే అందం గమనించునా ఈ లోకులతో పనియేమి... పలుగాకులు ఏమంటేమీ 

నా స్వామి తోడురాగా  


పతిదేవుని పదసన్నిధి మించినది వేరే కలదా 

అదే సతి పెన్నిధి కాదా

అదే పరమార్థము కాదా


ఆలయమేలా... అర్చనలేలా... ఆరాధనలేలా 

ఆరాధనలేలా... ఆరాధనలేలా 
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8365

కలహంస నడకదానా

 
చిత్రం  :  సమాధికడుతున్నాం చందాలివ్వండి (1980)

సంగీతం  :  జె. వి. రాఘవులు

గీతరచయిత  :  మైలవరపు గోపి

నేపథ్య గానం  : బాలు
పల్లవి :


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..చరణం 1 :చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు

జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు

చెలి మేని కదలికలా అవి భరతనాట్యాలు

జవరాలి భంగిమలా అరుదైన శిల్పాలు


కలలు తలపోసి కళలు కలబోసి

ఎవరు మలచేరు ఈ రూపం


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..


చరణం 2 :శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో

కొలువైన వేళలలో  ఎన్నెన్ని భావనలో

శ్రీదేవి కోవెలలో ఈ దేవి నా జతలో

కొలువైన వేళలలో  ఎన్నెన్ని భావనలోచేయి జత కలిపి గొంతు శృతి కలిపి

ఏకమవుదాము ఈనాడు


కలహంస నడకదానా 

కమలాల కనులదానా

నీ కనులు నీలి కురులు నను నిలువనీకున్నవే


కలహంస నడకదానా... ఆ.. ఆ.. ఆ..
https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7505