Showing posts with label ఆపద్భాంధవుడు (1992). Show all posts
Showing posts with label ఆపద్భాంధవుడు (1992). Show all posts

Friday, September 2, 2016

పువ్వూ నవ్వే







చిత్రం : ఆపద్భాంధవుడు (1992)

సంగీతం : ఎం.ఎం. కీరవాణి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు, చిత్ర



పల్లవి :


పువ్వూ నవ్వే... గువ్వానవ్వే..
పువ్వూ నవ్వే...  గువ్వానవ్వే
మువ్వనవ్వే ... గవ్వా నవ్వే
రవ్వల బొమ్మ నవ్వదేమే... ఆ..



మానూ నవ్వే ... మబ్బూ నవ్వే
మాటా నవ్వే...  మనసూ నవ్వే
మాలచ్చిమీ...  నవ్వదేమే...
ఆరారారరా...అరారారారార...






చిలుకకు చీరే కడితే...  హైలెస్సో...
మొలకకు చిగురే పుడితే...  హైలెస్సో...
అది ఎవరెవరెవమ్మా.. ఇదిగిదిగోమ్మా..
అది ఎవరెవరెవమ్మా.. ఇదిగిదిగోమ్మా..
పువ్వు గువ్వా సువ్వీ అంటే
మానూ మబ్బూ రివ్వూ మంటే
రవ్వలబొమ్మా నవ్వాలమ్మా
రాచనిమ్మా నవ్వాలమ్మా
అరారరరరరరరా..



హైలెస్సో హైలెస్సో..
హైలెస్సో హైలెస్సో..







చరణం 1  :



కోయిలాలో.. కూయవేమే..
కొండగాలో.. వీచవేమే..
అరారరరరరరా... 




కుహూ కుహూ తప్ప కోయిలమ్మకేం తెలుసు... ఆ..
ఓహోం.. ఓహోం తప్ప కొండగాలికేం తెలుసు... ఆ..
గజ్జకట్టుకోకున్నా ఘల్లుఘల్లుమంటుంది ఏం అడుగు..
నువ్వే అడుగు.. 


ఎవరిదా అడుగు.. నాకేం తెలుసు..
ఎవరిదా అడుగు.. నాకేం తెలుసు..
పోనీ..
గొంతు దాటిరాకున్నా గుండె ఊసు చెబుతుందీ..
ఏ పలుకు.. అమ్మా పలుకు..
నీ పలుకు.. ఊహు నీ పలుకు..
ఊహు నీ...ఈ.. ఈ..  పలుకు.. 



కామాక్షమ్మ కరుణించిందో...  మీనాక్షమ్మ వరమిచ్చిందో
రవ్వలబొమ్మ నవ్విందమ్మా...  రాచనిమ్మ నవ్విందమ్మా
ఆరరరరరరరరరా...



చరణం 2  :



హోయ్..హోయ్..హోయ్..హోయ్.. ఆఆఆఅ...
నవ్వులేమో దివ్వెలాయే... నడకలేమో మువ్వలాయే...
ఆరారారారారారా... 


ఆలమందలు కాసిన వాడేనా.. అ... ఆ..
పాలబిందెలు మోసినవాడేనా.. అ... ఆ..
ఏమి కవితలల్లాడమ్మా.. ఎన్ని కళలు నేర్చాడమ్మా..
ఏమి కవితలల్లాడమ్మా.. ఎన్ని కళలు నేర్చాడమ్మా.. 


కనులముందు నీవుంటే...  కవిత పొంగి పారిందమ్మా..
మాటా నీదే...  పాటా నీదే...  మనసూరించే ఆటా నీదే..
పున్నమిరెమ్మా పుట్టినరోజు...  వెన్నెల చిందూ నాదే నాదే 


ఆరారారారారాఅ...
ఆఆ..ఆఆఆఆఆ..అ.... ఆ..  రారారారారారా.... అ.... ఆ..
ఓహోహో..ఓఓఓఓ...అ.ఆ 








http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9476

Monday, October 27, 2014

చుక్కలారా చూపుల్లారా

చిత్రం :  ఆపద్భాంధవుడు (1992)
సంగీతం :  కీరవాణి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  చిత్ర



పల్లవి :


చుక్కలారా చూపుల్లారా ఎక్కడమ్మా జాబిలీ
మబ్బుల్లారా మంచుల్లారా తప్పుకోండీ దారికీ
వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ?
విన్నవించరా వెండి మింటికీ?
జో జో.. లాలీ...  జో జో... లాలీ 


చరణం 1 :


మలి సంధ్య వేళాయే.. చలి గాలి వేణువాయే నిదురమ్మా ఎటు పోతివే
మునిమాపు వేళాయే.. కనుపాప నిన్ను కోరె కునుకమ్మా ఇటు చేరవే


నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే..
నిదురమ్మా ఎటు పోతివే? కునుకమ్మా ఇటు చేరవే..
గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే
గోధూళి వేళాయే.. గూళ్ళని కనులాయే
గువ్వల రెక్కల పైనా రివ్వు రివ్వున రావే


జోల పాడవా బేల కళ్ళకి.. వెళ్ళనివ్వరా వెన్నెలింటికీ
జో జో లాలీ.. జో జో లాలీ... జో జో లాలీ.. జో జో లాలీ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9043

ఔరా అమ్మక చెల్లా

చిత్రం :  ఆపద్భాంధవుడు (1992)
సంగీతం : కీరవాణి
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, చిత్ర



పల్లవి :


ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా


బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా


ఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికి
ఐనవాడే అందరికీ..  ఐనా అందడు ఎవ్వరికి


బాలుడా?..  గోపాలుడా? ...  లోకాల పాలుడా?
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!


ఔరా అమ్మకచెల్లా! ఆలకించి నమ్మటమెల్లా
అంత వింత గాథల్లో ఆనందలాలా 



చరణం 1 :


ఊ..ఊ..నల్లరాతి కండలతో.. హోయ్.. కరుకైనవాడే
ఊ..ఊ.. వెన్నముద్ద గుండెలతో.. హోయ్.. కరుణించు తోడే
నల్లరాతి కండలతో కరుకైనవాడే ఆ నందలాల
వెన్నముద్ద గుండెలతో కరుణించు తోడే ఆనందలీల


ఆయుధాలు పట్టను అంటూ.. బావ బండి తోలిపెట్టే ఆ నందలాల
జాణ జానపదాలతో జ్ఞాన గీతి పలుకునటే ఆనందలీల


బాలుడా?...  గోపాలుడా?...  లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా!


ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా..


బాపురే బ్రహ్మకు చెల్లా.. వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా
 ...


చరణం 2 :


ఆలమంద కాపరిలా కనిపించలేదా ఆ నందలాల
ఆలమందు కాళుడిలా అనుపించు కాదా ఆనందలీల

వేలితో కొండను ఎత్తే.. కొండంత వేలుపటే ఆ నందలాల
తులసీ దళానికే తేలిపోయి తూగునటే ఆనందలీల


బాలుడా?... గోపాలుడా?... లోకాల పాలుడా?...
తెలిసేది ఎలా ఎలా చాంగుభళా


ఔరా అమ్మక చెల్లా! ఆలకించి నమ్మడమెల్లా
అంత వింతగాథల్లో ఆనందలాలా


బాపురే బ్రహ్మకు చెల్లా వైనమంత వల్లించవెల్లా
రేపల్లె వాడల్లో ఆనంద లీలా


ఆనందలాలా... ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా

ఆనందలాలా... ఆనంద లీలా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9475

ఒడియప్పా.. ఒడియప్పా

చిత్రం : ఆపద్భాంధవుడు (1992)
సంగీతం : కీరవాణి
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు



పల్లవి :


ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా


ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం నువ్వే చెప్పేయిరప్పా
ఒడియప్పా…. ఒడియప్పా… ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా



చరణం 1 :


ఒడియప్పా…. ఒడియప్పా…ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా
ఒకరికి ఒకరప్పా ఒంటిగ లేమప్పా నువ్వే నేనప్పా నేనే నువ్వప్పా
నీకు నాకు ఉన్నాడప్పా ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా ఆ పైవున్నప్పా
ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా



చరణం 2 :


ఓనామాలొప్పా శివాయః తప్పా చెప్పేయ్యప్పా ఓపిగ్గా ఓ చెన్నప్పా
ఆవులు మేపే అల్లరి గోపాలప్పా పల్లవి చెప్పా పై చరణం కూడా నేనే చెప్పా
ఒడియప్పా…. ఒడియప్పా…
ఒడియప్పా ఒడియప్పా ఒడి ఒడియప్పా ఒడి ఒడియప్పా