Showing posts with label అంగడి బొమ్మ (1978). Show all posts
Showing posts with label అంగడి బొమ్మ (1978). Show all posts

Saturday, February 28, 2015

జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు

చిత్రం : అంగడి బొమ్మ (1978) 

సంగీతం : సత్యం

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం : జానకి 


పల్లవి :


జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు

సిరిమల్లె పువ్వుళ్ళు సిగముడువ లేదు

కనులారా ఒకరాత్రి కునుకైనలేదు

మనసారా మాటాడ మనిషైన లేడు 

బ్రతుకంతా మరుభూమి కాగా

ఆమె మిగిలింది ఒక గాధగా

ఆమె మిగిలింది ఒక గాధగా


చరణం 1 : 


మగవారి కామానికెరగా... రగిలింది ప్రతి రాత్రి చితిగా

తనువే తమకు చాలన్నారు... హృదయం ఉన్నా వలదన్నారు

వెలయాలంటూ వెలివేశారు... వాడారు చలిమంటగా


జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు

సిరిమల్లె పువ్వుళ్ళు సిగముడువ లేదు

కనులారా ఒకరాత్రి కునుకైనలేదు

మనసారా మాటాడ మనిషైన లేడు 

బ్రతుకంతా మరుభూమి కాగా

ఆమె మిగిలింది ఒక గాధగా

ఆమె మిగిలింది ఒక గాధగా


చరణం 2 : 


కావాలి అనుకుంది సీత... కాల్జారీ అయ్యింది పతిత

అనురాగాలు అనుబంధాలు... అర్థం లేని వ్యర్ధ పదాలై

అందరి సొమ్మై అంగడి బొమ్మై... 

అందరి సొమ్మై అంగడి బొమ్మై... గడిచాయి కనరాత్రులు


జాబిల్లి వెన్నెళ్ళు చవిచూడలేదు

సిరిమల్లె పువ్వుళ్ళు సిగముడువ లేదు

కనులారా ఒకరాత్రి కునుకైనలేదు

మనసారా మాటాడ మనిషైన లేడు 

బ్రతుకంతా మరుభూమి కాగా

ఆమె మిగిలింది ఒక గాధగా

ఆమె మిగిలింది ఒక గాధగా


Sunday, November 10, 2013

అహో..అందాల రాశి

చిత్రం : అంగడి బొమ్మ (1978) 
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 
నేపథ్య గానం : బాలు



పల్లవి :



అహో..అందాల రాశి..
ఓహో....అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..

అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..



చరణం : 1



నీ అంగ అంగం.. మన్మథుని రంగం..
నీ మేని పొంకం..రతీ దేవి బింకం..
నీ అంగ అంగం.. మన్మథుని రంగం..
నీ మేని పొంకం..రతీ దేవి బింకం..


నీ పైని మోహం.. తుదిలేని దాహం..
నువ్వు రేపు తాపం.. వరమైన శాపం..
నీకే శిల్పి ఇచ్చాడో.. ఈ దివ్య  రూపం



అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..



చరణం   2 : 



నీ మందహాసం... మధుమాస పుష్పం..
నీ మధుర గాత్రం...  సంగీత శాస్త్రం..
నీ మందహాసం... మధుమాస పుష్పం..
నీ మధుర గాత్రం... సంగీత శాస్త్రం..




దివిలోని వాడు.. నిన్నంపినాడు..
భువిలోని వాడు.. చవి చూచినాడు..
అతడానాడే ఐనాడు నీ  దాసుడు



అహో..అందాల రాశి..
ఓహో..అలనాటి ఊర్వశి..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..
ఆగలేడు నీ ముందు ఏ ఋషీ..






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8009