Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Thursday, February 27, 2014

నను పాలింపగ నడచి వచ్చితివా

చిత్రం :  బుద్ధిమంతుడు (1969)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల

పల్లవి:

వేయి వేణువులు మ్రోగేవేళా... ఆ... ఆ...
హాయి వెల్లువై పొంగేవేళా...
రాస కేళిలో తేలే వేళా...
రాధమ్మను లాలించే వేళ....

నను పాలింపగ నడచి వచ్చితివా..
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా...
మొరలాలింపగ తరలి వచ్చితివా... గోపాలా

నను పాలింపగ నడచి వచ్చితివా.. ఆ హా హా...

చరణం 1:

అర చెదరిన తిలకముతో.. అల్లదిగో రాధమ్మా..
అర జారిన పైయ్యెదతో.. అదిగదిగో గోపెమ్మా..
ఎరుపెక్కిన కన్నులతో.. ఇదిగిదిగో సత్యభామా..
పొద పొదలో.. యెద యెదలో.. నీ కొరకై వెదకుచుండగా

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...

చరణం 2:

కంసుని చెరసాలలో.. ఖైదీవై పుట్టావు
కాంతల కౌగిళ్ళలో.. ఖైదీవై పెరిగావు
కరకురాతి గుళ్ళలో.. ఖైదీవై నిలిచావు
ఈ భక్తుని గుండెలో.. ఖైదీగా.. ఉండాలనీ

నను పాలింపగ నడచి వచ్చితివా
మొరలాలింపగ తరలి వచ్చితివా గోపాలా
నను పాలింపగ నడచి వచ్చితివా .. ఆ హా హా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1164

Wednesday, February 26, 2014

వెయ్యి వెయ్యి వంతెన

చిత్రం :  పులిబిడ్డ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం  :  బాలు, సుశీల

పల్లవి:

వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది
మనసుంటె వచ్చి వాలు నా పక్కన

వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
పలకరింత కలిసింది పులకరింత తెలిసింది
మనసుంటె వచ్చి వాలు నా పక్కన

చలి చలి చలి చలి చలి..
చలి చలి చలి చలి చలి...


చరణం 1:

వెచ్చ వెచ్చగుండమని నిచ్చెనన్నది..
వయసు వయసు అందుకే కలుపుతున్నది
వెచ్చ వెచ్చగుండమని నిచ్చెనన్నది..
వయసు వయసు అందుకే కలుపుతున్నది

కాదంటె ఊరుకోదు పగలైన ఎండరాదు
పద పద పద  పదమంటది జోడు చలి
రెప రెప రెప రెప  మంటది చూడు గిలి

హా.. చలి..
హా.. చలి..

ఎక్కు ఎక్కు నిచ్చెన వాలు వాలు పక్కన
అందమైన వలపుంది.. అందుకంటె పిలుపుంది
రానంటె వూరుకోను నేను చచ్చినా

ఎక్కు ఎక్కు నిచ్చెన వాలు వాలు పక్కన
పలకరింత కలిసింది పులకరింత తెలిసింది
చలివున్న చెలివుంటె భలే వెచ్చన

చరణం 2:

వచ్చె వచ్చె నల్ల మబ్బు పిల్లగాలికి
వచ్చి తెచ్చె వలపు జబ్బు పిల్లగాడికి
వచ్చె వచ్చె నల్ల మబ్బు పిల్లగాలికి
వచ్చి తెచ్చె వలపు జబ్బు పిల్లగాడికి

గొడుగైనా ఆపలేదు గొడవైనా ఆగిపోదు
ఉహు ఉహు ఉహు ఉహు మంటది పాడు చలి
తహ తహ తహ తహ మంటది పడుచు గిలి 

హా.. చలి..
హా..అహా.. చలి..

వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
పలకరింత కలిసింది పులకరింత తెలిసింది
మనసుంటె వచ్చి వాలు నా పక్కన

వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
వెయ్యి వెయ్యి వంతెన వాలు వాలు పక్కన
అందమైన వలపుంది అందుకుంటె పిలుపుంది
మనసుంటె వచ్చి వాలు నా పక్కన

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4227



Monday, February 10, 2014

వగలరాణివి నీవె

చిత్రం: బందిపోటు (1963)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

ఓహోహో...ఓ... ఓ...
ఓహోహో... ఓ... ఓ...
ఓహోహోహో... ఓ... ఓ...

వగలరాణివి నీవే సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే

వగల రాణివి నీవె సొగసు కాడను నేనె
ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగి రావే
వగల రాణివి నీవే..

చరణం 1:

పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఒహోహో ఓ..
ఒహోహో ఓ..ఓ..

చరణం 2:

ఓహోహొ ఓఓఓ
ఓహోహొ ఓఓఓ

దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
దోర వయసు చినదాన కోర చూపుల నెరజాణ
బెదరుటెందుకు కదలు ముందుకు ప్రియుడనేగాన
వగల రాణివి నీవే ..

చరణం 3:

కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
కోపమంత పైపైనే చూపులన్నీ నాపైనే
వరుని కౌగిట ఒరిగినంతట కరిగి పోదువులె

వగలరాణివి నీవే.. సొగసు కాడను నేనే
ఈడు కుదిరెను జోడు కుదిరెను.. తోడుగా రావే...

వగల రాణివి నీవే .. ఓహోహో ఓ...
ఓహోహో ఓ...
ఓహోహో ఓఓఓ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=63


విన్నానులే ప్రియా

చిత్రం :  బందిపోటు దొంగలు (1968)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా...
విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...

చరణం 1:

ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..ఏ..ఏ..
ఎదను దాచిన మౌనవీణ కదలి మ్రోగెనులే..
ఆ మధుర రాగాలలో నీవే ఒదిగి ఉన్నావులే...ఒదిగి ఉన్నావులే..

విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...
విన్నానులే ప్రియా...

చరణం 2:

వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము..
వికసించి వెలిగే నీ అందము...ఒక వేయి రేకుల అరవిందము
కలకల నవ్వే నీ కళ్ళు.. కాముడు దాగిన పొదరిళ్ళు
ఆ నీల నయనాలలో నీవే నిండి ఉన్నావులే... నిండి ఉన్నావులే..

విన్నానులే ప్రియా.. కనుగొన్నానులే ప్రియా..
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ..
విన్నానులే ప్రియా...

చరణం 3:

చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
ఆ..ఆ...ఆ..ఆ...ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
చిరుగాలి వీచెను వింజామర..గగనాలు వేసెను విరి ఊయల
పల్లకి పంపెను తారకలు పందిరి వేసెను చంద్రికలు
ఆ పసిడి పందిళ్ళలో మనకి పరిణయమౌనులే... పరిణయమౌనులే...

విన్నానులే ప్రియా... కనుగొన్నానులే ప్రియా...
మిసిమి వయసు గుసగుసలన్నీ కొసరి విన్నానులే...ఏ..ఏ...ఏ...
విన్నానులే ప్రియా... ఆ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1720

Friday, February 7, 2014

వెన్నెల పందిరిలోన

చిత్రం : బంగారు పాప (1954)
సంగీతం : అద్దెపల్లి
గీతరచయిత : దేవులపల్లి
నేపధ్య గానం : ఏ. ఎం. రాజ, సుశీల


పల్లవి:

ఈ వెన్నెల మల్లి విరిపందిరిలోన...
చిరునవ్వుల హారతి శేఖరుకీనా ఆ ఆ ఆ ...

వెన్నెల పందిరిలోన చిరునవ్వుల హారతులీన
పండు వెన్నెల... మనసు నిండా వెన్నెల..
కొండపైన కోనపైన కురిసే వెన్నెల... విరిసే వెన్నెల...

చరణం 1:

ఆ.. ఆ... ఆ... ఆ... ఆ... ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మబ్బుల దారి.. ఓ బాటసారి... నీ వొంటరి పయణం కాదా...
నీ జంటగ నీ సఖి లేదా ...
నీ వొంటరి పయణం కాదా ...నీ జంటగ నీ సఖి లేదా

నాకై వేచె నవ్వులు పూచె నా చెలి కన్నుల కాచే వెన్నెల...
పైన వెన్నెల మనసులోన వెన్నెల...
పైన లోన చందమామ పరచే వెన్నెల... పాలవెన్నెల ...

చరణం 2:

ఓ.. ఓ.. ఓ.. ఓ... ఓ ...ఓ... ఓ ..ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
చల్లని రేయి మెలమెల్లని గాలి...
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే
అలనల్లన మమతలు మూగే తియతీయని తలపులు రేగే

తీయని వలపులు తెచ్చేదెవరు... నాకై పరుగున వచ్చేదెవరొ..
పండు వెన్నెల... మనసు నిండా వెన్నెల...
కొండపైన.. కోనపైన... కురిసే వెన్నెల... విరిసే వెన్నెల

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

Wednesday, January 22, 2014

విన్నవించుకోనా చిన్న కోరిక

చిత్రం :  బంగారు గాజులు (1968)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

విన్నవించుకోనా చిన్న కోరిక
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక

విన్నవించుకోనా చిన్న కోరిక...

చరణం 1:

నల్లని నీ కురులలో తెల తెల్లని సిరిమల్లెనై
నల్లని నీ కురులలో తెల తెల్లని సిరిమల్లెనై
పరిమళాలు చిలుకుతూ నే పరవశించి పోనా

విన్నవించుకోనా చిన్న కోరిక

చరణం 2:

వెచ్చని నీ కౌగిట పవళించిన నవ వీణనై
వెచ్చని నీ కౌగిట పవళించిన నవ వీణనై
రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా

విన్నవించుకోనా చిన్న కోరిక

చరణం 3:

తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై
అందరాని నీలి నింగి అంచులందుకోనా

విన్నవించుకోనా చిన్న కోరిక...

చరణం 4:

చల్లని నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా
చల్లని నీ చూపులే తెలివెన్నెలై విరబూయగా
కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా

విన్నవించుకోనా చిన్న కోరిక...
ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక

విన్నవించుకోనా చిన్న కోరిక

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1703

Friday, December 13, 2013

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ

చిత్రం : ప్రేమించి చూడు (1965)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల

పల్లవి:

ఓ...ఓ....ఓ...ఓ....ఓ...ఓ....

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ

చరణం 1:

చూపులతోనే మురిపించేవూ ..
చూపులతోనే మురిపించేవూ
ఆటలతోనే మరిపించేవూ..
ఆటలతోనే మరిపించేవూ
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా..
చెలిమీ ఇదేనా మాటలతో సరేనా ...
పొరపాటైతే పలకనులే... పిలవనులే... దొరకనులే.. ఊరించనులే...

వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ...
నా మనసేమో పదమని సరేసరే

చరణం 2:

నా మనసేమో పదమని సరే సరే..
మర్యాదేమో తగదని పదే పదే ..
మూడు ముళ్ళు పడనీ...
ఏడు అడుగులు నడవనీ ...
మూడు ముళ్ళు పడనీ
ఏడు అడుగులు నడవనీ
వాదాలెందుకులే అవుననినా..కాదనినా..ఏమనినా.. నాదానివిలే...

చల్లని జాబిలి నవ్వెను మరీ మరీ
అల్లరి వాడా నీదే ఈ చెలీ..
వెన్నెల రేయి ఎంతో చలీ చలీ
వెచ్చనిదానా రావే నా చెలీ..

అహా...అహా..అహ..ఆ 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1582

Tuesday, November 5, 2013

వాడుక మరచెద వేల




చిత్రం : పెళ్లి కానుక (1960)
సంగీతం : ఏ.ఎం. రాజ
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఏ. ఎం. రాజ, సుశీల


పల్లవి:

వాడుక మరచెద వేల నను వేడుక చేసెద వేల
నిను చూడని దినము నాకోక యుగము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము

చరణం : 1

సంధ్య రంగుల చల్లని గాలుల..
మధుర రాగము మంజుల గానము
సంధ్య రంగుల చల్లని గాలుల..
మధుర రాగము మంజుల గానము
తేనె విందుల తీయని కలలు.. మరచి పోయిన వేళ
ఇక మనకీ మనుగడ యేల
ఈ అందము చూపి డెందము వూపి..
ఆశ రేపెద వేల.. ఆశ రేపెద వేల

ఓ... సంధ్య రంగులు సాగినా..
చల్ల గాలులు ఆగినా
కలసి మెలసిన కన్నులలోన..
మనసు చూడగ లేవా మరులు తోడగ లేవా

వాడుక మరువను నేను నిను వేడుక చెయగ లేను
నిను చూడని క్షణము నాకొక దినము
నీకు తెలుసును నిజము నీకు తెలుసును నిజము
    ఆ....

చరణం :  2

కన్నులా ఇవి కలల వెన్నెలా..
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా
కన్నులా ఇవి కలల వెన్నెలా..
చిన్నె వన్నెల చిలిపి తెన్నులా
మనసు తెలిసి మర్మమేల...
ఇంత తొందర యేలా.. ఇటు పంతాలాడుట మేలా
నాకందరి కన్నా ఆశలు వున్నా...
హద్దు కాదనగలనా.. హద్దు కాదనగలనా

వాడని నవ్వుల తోడ.. నడయాడెడు పువ్వుల జాడ
అనురాగము విరిసి లొకము మరచి..
ఏకమౌదము కలసీ ఏకమౌదము కలసి
ఆ...