Showing posts with label తాతా మనవడు (1973). Show all posts
Showing posts with label తాతా మనవడు (1973). Show all posts

Thursday, December 4, 2014

సోమ.. మంగళ.. బుధ

చిత్రం :  తాతా మనవడు (1973)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సుంకర సత్యనారాయణ
నేపధ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి, బాలు

పల్లవి :

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది   

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
   
చరణం 1 :

పెంచేదెట్లా గంపెడుమంద..
పెట్టలేక మనపని గోవింద.. పెట్టలేక మనపని గోవింద
కలిగిన చాలును వొకరూ ఇద్దరూ..
కాకుంటె ఇంకొక్కరు.. కాకుంటె ఇంకొక్కరూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
 
చరణం 2 : 

కాదు.. కాదు.. కాదు.... వొకరూ.. ఇద్దరూ.. ముగ్గురు.. కనవలసిందే ఎందరైనా
బుద్దుడో.. జవహరో..  గాంధీజీ.. కాకూడదా ఇందెవడైనా
ఔతారౌతారౌతారు.. బొచ్చెలిచ్చి బజారుకుతరిమితె
ఔతారౌతారౌతారు.. బిచ్చగాళ్ళ సంఘానికి నాయకు
లౌతారౌతారౌతారు..  తిండికి గుడ్డకు కరువై.. కడుపుమండి విషంతిని చస్తారూ

సోమ.. మంగళ.. బుధ.. గురు.. శుక్ర.. శని.. ఆది
వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది.. వీడికి పేరేది పుట్టే వాడికి చోటేది
 
చరణం 3 : 

ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
ఎగిరే పక్షికి ఎవడాధారం.. పెరిగేమొక్కకు ఎవడిచ్చును సారం
దారి చూపు నందరికీ వాడే.. దారి చూపు నందరికీ వాడే
నారుపోసినవాడూ.. నీరివ్వకపోడూ

ఎవరికివారే ఇట్లనుకుంటే..  ఏమైపోవును మనదేశం
ఎప్పుడు తీరును దారిద్ర్యం..  ఇంకెప్పుడు కల్గును సౌభాగ్యం
కనాలందుకే మిత సంతానం.. కావాలిది అందరికి ఆదర్శం

అయ్యా..  అయ్యా.. ఎందుకు గొయ్య.. నాకొక పీడర మీతాతయ్య
చావగొట్టి పాతెయ్యడానికి యీ గొయ్య

బాబూ..  బాబూ..  నీకెందుకురా ఆ గొయ్య
నీ అయ్యకు చేసే ఈ మర్యాద.. రేపు నీకు.. చెయ్యాలి కదయ్యా
తాతకు వారసుడు మనవడేగా.. ఎప్పటికైనా తాత మనవడు ఒకటేగా . . ఒకటేగా?

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7808

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

చిత్రం :  తాతా మనవడు (1973)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల
 
పల్లవి :

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ
ఈ ఇంటికే.. ఈ  ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజూ
ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

చరణం 1 :

చిన్నబాబు ఎదిగితె...  కన్నావరి కానందం..
నెలవంక పెరిగితె...  నింగికే ఒక అందం
చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు..
చుక్కలు వేయెందుకు ఒక్క చంద్రుడే చాలు
తనవంశం వెలిగించె తనయుడొకడె పదివేలు 

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ
ఈ ఇంటికే.. ఈ  ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజూ
ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

చరణం 2 : 

కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. ఆ కలలు కంటనీరు పెడితె తుడవాలీ
కన్నవారి కలలు తెలుసుకోవాలీ.. ఆ కలలు కంటనీరు పెడితె తుడవాలీ
తనకుతాను సుఖపడితే తప్పుగాకున్నా.. తనవారిని సుఖపెడితే ధన్యత ఓ నాన్నా
  
ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

చరణం 3 : 

తండ్రి మాటకై కానకు తరలిపోయె రాఘవుడూ.. అందుకే ఆ మానవుడు ఐనాడు దేవుడూ తల్లి చెరను విడిపించగ తలపడె ఆ గరుడుడూ.. అందుకె ఆ పక్షీంద్రుడు అంతటి మహానీయుడూ

ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి.. ఓ బాబూ నువ్వూ ఆ బాటనడవాలి
భువిలోన నీ పేరు ధృవతారగా వెలగాలీ.. ధృవతారగా వెలగాలీ   

ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ
ఈ ఇంటికే.. ఈ  ఇంటికే కొత్త వెలుగు వచ్చినరోజూ
ఈ నాడే బాబూ నీ పుట్టినరోజూ

అనుబంధం ఆత్మీయత

చిత్రం :  తాతా మనవడు (1973)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  రామకృష్ణ 

పల్లవి :

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం.. వింతనాటకం అనుబంధం
 
చరణం 1 :

ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?
కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
ఎవరు తల్లి ఎవరు కొడుకు..  ఎందుకు ఆ తెగని ముడి?

కొనవూపిరిలో ఎందుకు అణగారని అలజడి
కరిగే కొవ్వొత్తిపై.. కనికరం ఎవ్వడికీ.. ఎవ్వడికీ
అది కాలుతున్నా వెలుగులే - కావాలి అందరికీ. . అందరికీ       

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం 2 : 

కొడుకంటూ నీకూ వొకడున్నాడూ - వాడు గుండెను ఏనాడో అమ్ముకున్నాడూ
నిన్ను కడసారైనా చూడరాలేదూ - వల్లకాటికైనా వస్తాడను ఆశలేదూ
ఎవరమ్మా వినేది నీ ఆత్మఘోషనూ - ఏతల్లీ కనగూడదు ఇలాంటి కొడుకునూ 

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం. . వింతనాటకం అనుబంధం

చరణం 3  : 

కానివారి ముచ్చటకై.. కలవరించు మూఢునికీ
కన్నవారి కడుపుకోత.. ఎన్నడైనా తెలిసేనా
తారాజువ్వల వెలుగుల తలతిరిగిన వున్మాదికీ
చితిమంటల చిటపటలు వినిపించేనా?  . . చితిమంటల చిటపటలు వినిపించేనా?  

అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం
ఆత్మతృప్తికై మనుషులు ఆడుకొనే నాటకం..  వింతనాటకం అనుబంధం

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7207