Showing posts with label (క). Show all posts
Showing posts with label (క). Show all posts

Monday, November 15, 2021

సుధామధురము కళాలలితమీ సమయము

 



చిత్రం : కృష్ణప్రేమ (1961)

సంగీతం : పెండ్యాల  

గీతరచయిత :  శ్రీశ్రీ 

నేపథ్య గానం :  పి. బి. శ్రీనివాస్, సుశీల  


పల్లవి :


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము

సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము

రాగ తాళ సమ్మేళన వేళ...

రాగ తాళ సమ్మేళన వేళ... 

 

సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము

 

చరణం 1 :


పాడెనే మలయానిలం...  ఆహా ఆడెనే ప్రమదావనం

ఆ ఆ ఆ ఆ

పాడెనే మలయానిలం... ఆహా ఆడెనే ప్రమదావనం

పాటలతో సయ్యాటలతో ఈ జగమే మనోహరము

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము


చరణం 2 :


రాగముల... సరాగముతో

నా మది ఏలెను నీ మురళి

అందముల... పసందులతో చిందులు వేసెను నీ సరళి


నీ కులుకే లయానిలయం

నీ పలుకే సంగీతమయం

ప్రమద గానాల ప్రణయ నాట్యాల

ప్రకృతి పులకించెనే..హ హ హ హా


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము


చరణం 3 :



పదముల వాలితిని హృదయమే వేడితిని

పదముల వాలితిని హృదయమే వేడితిని

పరువపు నా వయసు మెరిసే నా సొగసు

చెలిమి పైన నివాళిగా చేకొనుమా వనమాలీ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

నా హృదయ విహారిణివే నాట్యకళా విలాసినివే

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ

ఆ ఆ ఆ ఆ ఆ


సుధామధురము కళాలలితమీ సమయము

ఆహా...  మధురము..


Wednesday, September 9, 2020

చిక్కని చీకట్లో





చిత్రం : కృష్ణ గారడి (1986)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం:  ఎం. రమేశ్, సుశీల 


పల్లవి :


చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా
అరే..చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా.. పాపా
అబ్బ నా గుండె తాళాల... నీ కంటి మేళాల మోతేపుడుతుంటే



చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా...
అబ్బ.. చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ.. నా ప్రేమ తాళాల నీ పెళ్ళి మేళాల మోతేపుడుతుంటే 



చరణం 1 :


గుడి మీదా గువ్వా వాలే... వడిలోనా వయసూ వాలే
ముడి వెయ్యి కొంగూ బంగారం
ఆకాశ గంగా వంగే.. గోదారి గంగా పొంగే
కలిపెయ్యి నేలా ఆకాశం


మల్లెల తాంబూలం మాపటి వేళల్లో
పచ్చల పేరంటం పగలే పొదరింట్లో
సన్నాయి ఆపంగానే ఉయ్యాలే ఇంట్లో


ఎత్తుకో.. హత్తుకో..
అబ్బ నీ లేత నాజూకు వేస్తుంటే మారాకు వెర్రెత్తిపోతున్నా


చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ నా గుండె తాళాల నీ కంటి మేళాల మోతేపుడుతుంటే



చరణం 2 :


మెరుపొచ్చి మేఘాలాడే... ఉరుమొచ్చి నెమలీ ఆడే
ఆడెయ్యి నాతో కోలాటం
చిగురేసి కొమ్మ నవ్వే... మొగ్గేసి రెమ్మా నవ్వే
నవ్వాలి నువ్వే నాకోసం


ఎర్రని పొద్దుల్లో... వెచ్చని సీమంతం
వచ్చిన వయసుల్లో... నిత్యం సాయంత్రం
పారాణి దిద్దంగానే పండే వయ్యారం


గిల్లుకో... అల్లుకో
అబ్బ.. క్రీగంటి నీ చూపు గిచ్చంగ నా సోకు కిర్రెక్కిపోతున్నా



అరే..చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చక్కిలిగింతల్లో చెక్కిలి ముద్దాడుకోనా.. పాపా
అబ్బ నా గుండె తాళాల నీ కంటి మేళాల మోతేపుడుతుంటే 


చిక్కని చీకట్లో చక్కని ఎన్నెట్లో
చుక్కల నీడల్లో చెక్కిలి పండందుకోవా... బావ
అబ్బ.. నా ప్రేమ తాళాల నీ పెళ్ళి మేళాల మోతేపుడుతుంటే 





Saturday, September 5, 2020

మూడుముళ్లు పడిన నాడే




చిత్రం : కన్నవారిల్లు (1978)
సంగీతం : ఆదినారాయణరావు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం: బాలు, సుశీల, రామకృష్ణ 


పల్లవి :


మూడుముళ్లు పడిన నాడే
ముగ్గురమైనాములే... నలుగురమవుదాములే
ఏడు అడుగులు నడిచిన నాడే                   
ఇద్దరమయ్యాములే... ఒకటై ఉందాములే


చరణం 1 :


సంసారమంటే సంగీతమే...ఆ... ఆ... ఆ.. ఆ..
సంసారమంటే సంగీతమే... అనురాగమనురాగ రసగీతమే
మొదట మోహమై...  మధుర స్నేహమై
మొదట మోహమై మధురస్నేహమై
కడకు మోహనై పల్లవించు ప్రేమ


మూడుముళ్లు పడిన నాడే
ముగ్గురమైనాములే... నలుగురమవుదాములే 



చరణం 2 :


చీకటిలో బిగికౌగిలిలో చిమచిమలాడింది
మనసు జివ్వున లాగింది
వెన్నెలలో చెలి వన్నెలలో... నవనవలాడింది
వయసు నవ్వులు రేగింది


నిలువు దోపిడి చెేయాలంటే  జాబిలి చూడని కౌగిలి అందం
అహహ.. అహహ.. హ...
కనులగారడి చెేయాలంటేకౌగిలిలో కవ్వింతలు అందం
అహహ.. అహహ.. హ... లలల...
దాచే అందం దోచే చందం పూచే బంధం మన సొంతం



చరణం 3 :


గుసగుసల తేలి ఘుమఘమల సోలి సందిటను వాలి
ఈనాడు నా ఈడునీతోడు కోరిందిలే
గుసగుసల తేలి


అనురాగమంత చెలరేగినంత ఆలాపనైపోయి
రేయి హాయి ఝుమ్మందిలే
నినుచేరినంత నాకున్నదంత నీసొంతమై
పూలుపూచి దాచి రమ్మందిలే
చిలిపి కళలే వలపు వలలే పలకరించె
ఈనాడు నా ఈడు నీతోడు కోరిందిలే... గుసగుసలతేలి



చరణం 4 :


రాతకొద్ది దొరికాడు రాజకీయనాయకుడు
చేతకానిలేనివాడు చేసుకున్న నామొగుడు
రాతకొద్ది దొరికాడు
సామాజిక సమస్యలకు సతమతమయ్యి
ఛస్తుంటే సరసాలనికి కోరికేది


అయ్యొరామ... దొరగారికి తీరికేది
అయ్యొరామ... దొరగారికి తీరికేది
చెమటోడ్చే కడుపేడ్చే శ్రమజీవులు
పస్తుంటే వలపన్నది ఒక నేరం


అయితే బావ మనమిక సుఖపడనేరం
అయితే బావ మనమిక సుఖపడనేరం
ప్రజాసేవకంకితం సదా నాదుజీవితం
అయినా ప్రయారిటీ నీదే పదా పడుకుందాం... పదా పడుకుందాం





Tuesday, September 1, 2020

విరిసిన ఆనంద దీపావళి




చిత్రం : కన్నవారిల్లు (1978)
సంగీతం : ఆదినారాయణరావు
నేపథ్య గానం :  సుశీల



పల్లవి :


విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 



చరణం 1 :


కన్నులలోన వెన్నెల వాన
కౌగిలిలోన గారాల కూన
మా పాటకు పల్లవి మీరు
మా తోటకు మల్లెలు మీరు
మా కంటికి దివ్వెలు మీరు
మా పండగనవ్వులు మీరు
చీకటివాకిట ముగ్గుల ముంగిట దీపాలే మీరు 



విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 



చరణం 2 :



తామరపువ్వు తమ్ముడి నవ్వు
కానుక మాకు కావాలి ఇవ్వు
పండుగ వచ్చేయేడు మాతోడుగ వాడుంటాడు
పూవత్తులు వెలిగిస్తాడు పున్నమలే పండిస్తాడు
చుక్కల పందిట అక్కల సందిట జాబిల్లే వాడు


విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 



చరణం 3 :


పిల్లల నోట చల్లని మాట
పండగ పూట రతనాల మూట
ఈ పాపల కోరికలన్ని మా పాలిటి దీవెనలైతే
ఆ నింగిని తారకలన్ని మాయింటికి దీపాలైతే
రేపులు మాపులు దేవుని చూపులు చల్లనివే మనకు



విరిసిన ఆనంద దీపావళి
మెరిసిన అనురాగ దీపాలివి
వెతలకు దూరాలు... వెలుగుల తీరాలు
మమతలు మా యింటి దీపావళి 





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8054

Wednesday, January 8, 2020

ఏ రాగభావాలతో

చిత్రం : కొత్త దంపతులు (1984)
సంగీతం :  చక్రవర్తి   
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల 




పల్లవి :



ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
అనురాగభావాల కలయికలో... తన పూల పొదరింటి అల్లికలో
పసివాళ్ళ రాగాల.. నూరేళ్ళ యోగాలు.. చేసేది సంసారమే


ఏ రాగభావాలతో... సంగీతముదయించునో




చరణం 1 :



ఈ ప్రేమ తాంబూలమిచ్చిందిలే... మా ఇంటికి తోరణమై తోచిందిలే
అది సూర్య దీపాల వెలుగాయెలే... ఈ కంటికి వేకువలే చూపిందిలే
ఎదలోనే హరివిల్లు వెలుగుల పుట్టిల్లు... ప్రేమానురాగాలకే విరిజల్లు
కుసుమించు కాలాలలో...
ఆ నాటి కలలన్నీ...  ఈనాడు కరిగించు కౌగిళ్ళ సంసారమే


ఏ తీపి స్వప్నాలతో...  సంసారముదయించునో...
తొలి పూజగా పూసే మల్లికలు... మలి పూజగా కొత్త కోరికలు
శ్రుతి మించు రాగాలు జత చేసి పాడాలి సంసార సంగీతమే


ఏ తీపి స్వప్నాలతో...  సంసారముదయించునో... 



చరణం 2 :



పెళ్ళిళ్ళు నూరేళ్ళ ఫలితాలనీ  ప్రేమించినవారికివే  పాఠాలనీ
ఆ ప్రేమే కరువైన లోగిళ్ళలో...  కన్నీరే కౌగిలిలో పొంగేనని... హా


పగలంతా పూజలకి...  రేయంతా మోజులకి...  

మావారు పంచారు ఇన్నాళ్ళకి
పరువాల పందిళ్ళలో... 

అనురాగ గీతాలు అమృతాభిషేకాలు...
కోరాలి సంసారమై... 


ఏ రాగభావాలతో... సంగీతముదయించునో
అనురాగభావాల కలయికలో... తన పూల పొదరింటి అల్లికలో
పసివాళ్ళ రాగాల...  నూరేళ్ళ యోగాలు చేసేది సంసారమే


ఏ తీపి స్వప్నాలతో సంసారముదయించునో... 









https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6064

Tuesday, January 8, 2019

మందర మాట విని

చిత్రం : కలసి వుంటే కలదు సుఖం (1961)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల


పల్లవి :



మందర  మాట విని...  మౌడ్యమున కైకేయి రామలక్ష్మణులను అడవికి పంపే కదా
శకుని మాయలు నమ్మి జూదమున ఓడించి... కౌరవులు పాండవుల కష్ట పెట్టిరిగా
పరుల బోధలు  లొంగి పండు వంటి సంసారాన్ని... భాగాలుగా చీల్చి పంచుచుండిరి కదా


కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం
చెడు బోధలు  విన్నారంటే... ఎవరికైన తప్పదు కష్టం


కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం
చెడు బోధలు  విన్నారంటే... ఎవరికైన తప్పదు కష్టం


రణం 1 :



చిట్టి చీమలన్నీ మూగి...  పెద్దపుట్ట పెట్టునురా
చిట్టి చీమలన్నీ మూగి...  పెద్దపుట్ట పెట్టునురా
శిల్పులంతా కట్టుగా వుండే...  తాజ్ మహలు కట్టిరిరా


జనులెందరో త్యాగము చేసి స్వరాజ్యము తెచ్చిరిరా
తగవులతో తన్నుక చస్తే పతనము ప్రాప్తించునురా 


కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం



చరణం 2 :



పది కట్టెలు ఒక్కటిగా వుంటే పట్టి విరువ లేరురా
పది కట్టెలు ఒక్కటిగా వుంటే పట్టి విరువ లేరురా
ఒక కట్టెగా ఉంటేనే వికలము చేసేరురా


కర్ణుడొకడు చేరక పోతే భారతమే పూజ్యము రా
యాదవులే ఒక్కటిగా ఉంటే నాశనమై ఉండరు రా


కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం
కలిసి వుంటే కలదు సుఖం... వేరు పడితే తీరని దుఖం




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=620

మేలిమి బంగరు మెలిక

చిత్రం : కలసి వుంటే కలదు సుఖం (1961)
సంగీతం : మాస్టర్ వేణు
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం :  సుశీల


పల్లవి :



మేలిమి బంగరు మెలిక తిరిగినా...  విలువ తరిగేనా
మీ దేహములో చిరులోపములున్నా...  ప్రేమ కరువగునా 


మేలిమి బంగరు మెలిక తిరిగినా...  విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా...  ప్రేమ కరువగునా 



చరణం 1 :



సింహము కాళ్లు చిక్కుపడిననూ...  శౌర్యము కొరవడునా
సింహము కాళ్లు చిక్కుపడిననూ...  శౌర్యము కొరవడునా
చేతలు మాటలు ఒకటే అయితే...  త్యాగము కరువగునా
త్యాగము కరువగునా


మేలిమి బంగరు మెలిక తిరిగినా...  విలువ తరిగేనా
మీ దేహములో చిరులోపములున్నా...  ప్రేమ కరువగునా


చరణం 2 :


కాళ్ళే లేని కమ్మని చంద్రుడు... నిరతము పయనించునే
కాళ్ళే లేని కమ్మని చంద్రుడు... నిరతము పయనించునే
కరములు చాపే కలువను చేరి...  ముదము కలిగించునే
ముదము కలిగించునే 


మేలిమి బంగరు మెలిక తిరిగినా...  విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా...  ప్రేమ కరువగునా



చరణం 3 :


పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ
పతి పదసేవా భాగ్యము నేనే సతతము నోచితినీ
మీ చల్లని మదిలో సౌఖ్యములొసగే...  స్వర్గము చూచితిని
స్వర్గము చూచితిని 


మేలిమి బంగరు మెలిక తిరిగినా...  విలువ తరిగేనా
మీ దేహములో చిరు లోపములున్నా...  ప్రేమ కరువగునా




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=142

Thursday, January 3, 2019

ఎంతో మొనగాడివనుకున్నా

చిత్రం :  కన్నతల్లి  (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  సుశీల  



పల్లవి :


అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా డైవరూ... నా డైవరూ
ఇంత పిరికాడివా నువ్వు డైవరూ
ఓహో..డైవరూ..ఆహా..డైవరూ



అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా డైవరూ... నా డైవరూ
ఇంత పిరికాడివా నువ్వు డైవరూ
ఓహో..డైవరూ..ఆహా..డైవరూ





చరణం 1 :


అటు చక్రం తిప్పుతుంటె... కృష్ణుడే అనుకున్నా
ఇటు హారనూ కొడుతుంటె... అర్జునుడే అనుకున్నా
అటు చక్రం తిప్పుతుంటె... కృష్ణుడే అనుకున్నా
ఇటు హారనూ కొడుతుంటె... అర్జునుడే అనుకున్నా 


కాలికింద బిసనొక్కి... కారాపినప్పుడు
కాలికింద బిసనొక్కి... కారాపినప్పుడు
పిక్కబలం జూచి నిన్ను... భీముడే అనుకున్నా 


అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా డైవరూ... నా డైవరూ
ఇంత పిరికాడివా నువ్వు డైవరూ
ఓహో..డైవరూ..ఆహా..డైవరూ




చరణం 2 :


చక్కనీ చుక్క నీ పక్కనొచ్చి కూచుంటే
చక్కనీ చుక్క నీ పక్కనొచ్చి కూచుంటే 

ఉక్కిరిబిక్కిరి అయి నీవు వురకలెత్తుతావేల
ఉక్కిరిబిక్కిరి అయి నీవు వురకలెత్తుతావేల
కోతలన్ని కోసావే... కొండమీది కోతి తెస్తనన్నావే
డేగకోడి నన్నావే...
 సై అంటే..సై సై సై అంటే కోసకోడివైనావే    


అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా డైవరూ... నా డైవరూ
ఇంత పిరికాడివా నువ్వు డైవరూ
ఓహో..డైవరూ..ఆహా..డైవరూ



చరణం 3 :


ఎదుటున్న అద్దాన్ని ... అటూ ఇటూ తిప్పావు
వెనుకున్న నేను... నీ దొంగచూపు చూచాను
ఎదుటున్న అద్దాన్ని.... అటూ ఇటూ తిప్పావు


వెనుకున్న నేను... నీ దొంగచూపు చూచాను
చిగురుమేయు చిలకమ్మ... చెట్టుకేమి సొంతమా
చిగురుమేయు చిలకమ్మ... చెట్టుకేమి సొంతమా
గోరింక తోడొస్తే... కోటలేమి అడ్డమా




అబ్బో..అబ్బో..ఎంతో మొనగాడివనుకున్నా డైవరూ... నా డైవరూ
ఇంత పిరికాడివా నువ్వు డైవరూ
ఓహో..డైవరూ..ఆహా..డైవరూ


Wednesday, January 2, 2019

నువ్వు కావాలి

చిత్రం :  కన్నతల్లి  (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల  



పల్లవి :


నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి


నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి 


చరణం 1 :


అద్దమందు నాకు నేనే... ముద్దువచ్చే వేళలో
ఆపలేని పొంగులేవో... హద్దుమీరే వయసులో  


హద్దుమీరే పొంగులాపి... ముద్దు చేసేటందుకు
ముద్దు వొచ్చే నీకు నేనే... అద్దమయ్యేటందుకు
  


నువ్వు కావాలి..నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ..నే నవ్వుతు ఉండాలి
 


చరణం 2 :


దుడుకు చేసే దోరవయసు... ఉరకలెత్తే వేళలో
పడుచువానికి పండువెన్నెల... పగైపోయే జాములో
నిమిషనిమిషం వులికిపడుతూ నిదుర చెదరే రేయిలో
నిన్నకలలే కన్నెమనసు నెమరువేసే హాయిలో
     

 

నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి 


చరణం 3 :


వల్లమాలిన వలపులన్నీ... ఒళ్లు విరిచేటందుకు
ఆశలన్నీ అలసిపోయి... ఆవులించేటందుకు
ఒకరి కొకరు వోడిపొయి... ఒక్కటయ్యేటందుకు
పగలురేయి ఒకటిచేసి... పరవశించేటందుకు    


నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి 


నువ్వు కావాలి... నీ నవ్వుకావాలీ
నీతోటి ఉండాలీ... నే నవ్వుతు ఉండాలి 

నిన్నరాత్రి నిన్నుచూస్తి

చిత్రం :  కన్నతల్లి  (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల 



పల్లవి :


నిన్నరాత్రి నిన్నుచూస్తి...  కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా

 
నిన్నరాత్రి నిన్నుచూస్తి... కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా   




చరణం 1 :


నిద్దురలోనా..... ఉలిక్కిపడితే
నిద్దురలోనా ఉలిక్కిపడితే...  బెదురేదోలే అనుకున్నా
నిద్దురలోనా ఉలిక్కిపడితే...  బెదురేదోలే అనుకున్నా
చక్కిలిగింతలు పెడితేను...  చలిగాలెమో అనుకున్నా
చక్కిలిగింతలు పెడితేను...  చలిగాలెమో అనుకున్నా 


కళ్ళు తెరిచి చూశానే...  నాఎదుటే నువ్వూ ఉన్నావే
కళ్ళు తెరిచి చూశానే...  నాఎదుటే నువ్వూ ఉన్నావే
నమ్మలేక నీ ఒళ్ళంతా...  తడిమి తడిమి చూశానే   


నిన్నరాత్రి నిన్నుచూస్తి... కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా 



చరణం 2 :


చేతికి వెచ్చగ తగిలావు... లోపల వేడిని రేపావు
మెల్లగా చెక్కిలి చిదిమాను...  మెలికలే తిరిగిపోయావు
చేతికి వెచ్చగ తగిలావు...  లోపల వేడిని రేపావు
మెల్లగా చెక్కిలి చిదిమాను...  మెలికలే తిరిగిపోయావు


మెలికలుచూసి చెమటలుపోసి...  పసివానై పడి పోయాను
మెలికలుచూసి చెమటలుపోసి...  పసివానై పడి పోయాను
లేచి చూస్తే నీ ఒడిలో...  లేవలేక పడుకున్నాను   



  

నిన్నరాత్రి నిన్నుచూస్తి... కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా 


చరణం 3 :


నిలబడు నిలబడు... నిమిషంసేపు
నిలబడు నిలబడు నిమిషంసేపు... నీలికన్నులచినదానా
నిలబడు నిలబడు నిమిషంసేపు...  నీలికన్నుల చినదానా
నువ్వూ నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిల్లదానా
నువ్వూ నిలవకపోతే నా ప్రాణాలు నిలవనంటవే పిల్లదానా


దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా
దారికి అడ్డం పడుకుంటాను దాటైనా పోరాదా
తోవకు అడ్డం పడుకుంటాను తొక్కైనాపోరాదా... తొక్కైనాపోరాదా


నిన్నరాత్రి నిన్నుచూస్తి కల్లోన పిల్లా
అది నిజమైంది చూసుకోవే తెల్లారేకల్లా
తెల్లారేకల్లా....హోయ్... తెల్లారేకల్లా



తీయ తీయని నవ్వే నువ్వూ

చిత్రం :  కన్నతల్లి  (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  సుశీల 



పల్లవి :



తీయ తీయని నవ్వే...  నువ్వూ
తేనెలూరే పువ్వే ... నువ్వూ
నన్ను కన్న తల్లివి... నువ్వూ
నా పున్నెము పండిన పంటవు...  నువ్వూ   


తీయ తీయని నవ్వే...  నువ్వూ
తేనెలూరే పువ్వే ... నువ్వూ
నన్ను కన్న తల్లివి... నువ్వూ
నా పున్నెము పండిన పంటవు...  నువ్వూ   


తీయ తీయని నవ్వే...  నువ్వూ


చరణం 1 :



దేవతలిచ్చిన దీవెనలన్నీతెచ్చిన చల్లని పాపవు నువ్వూ
దేవతలిచ్చిన దీవెనలన్నీ తెచ్చిన చల్లని పాపవు నువ్వూ
తీరిపోని పూర్వజన్మబంధమేదో...
తీరిపోని పూర్వజన్మబంధమేదో...
తీసుకొచ్చి నింపినావు... నా ఒడిలో    


తీయ తీయని నవ్వే...  నువ్వూ
తేనెలూరే పువ్వే...  నువ్వూ
తీయ తీయని నవ్వే...  నువ్వూ



చరణం 2 :


నింగిలోన తారకలన్నీ... నీ కన్నులలో మెరిసినవీ
నింగిలోన తారకలన్నీ... నీ కన్నులలో మెరిసినవీ
చందమామ... చలువంతా...
చందమామ చలువంతా... నీ నవ్వులలోనే యిమిడినది
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ
ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ ఓఓ   
   


తీయ తీయని నవ్వే...  నువ్వూ
తేనెలూరే పువ్వే...  నువ్వూ
తీయ తీయని నవ్వే...  నువ్వూ



చరణం 3 :



నా యింటి దీపము...  నిలిపినావు
నా కంటి పాపవై...  వెలసినావు
నా యింటి దీపము... నిలిపినావు
నా కంటి పాపవై..వెలసినావు
కన్నతల్లి కలలకు... కమ్మని రూపం
కన్నతల్లి కలలకు... కమ్మని రూపం
యిచ్చిన బంగారు... బొమ్మవు నువ్వూ



తీయ తీయని నవ్వే...  నువ్వూ
తేనెలూరే పువ్వే ... నువ్వూ
నన్ను కన్న తల్లివి... నువ్వూ
నా పున్నెము పండిన పంటవు...  నువ్వూ   


తీయ తీయని నవ్వే...  నువ్వూ




కాలం మారుతుందీ

చిత్రం :  కన్నతల్లి  (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల 


పల్లవి :



కాలం మారుతుందీ...  చేసిన గాయాలు మానుపుతుందీ 
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ
కాలం మారుతుందీ...  చేసిన గాయాలు మానుపుతుందీ 
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ


చరణం 1 :


పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాథను చేస్తుందీ
పచ్చనిమాకును మోడుగమార్చి తీగననాథను చేస్తుందీ
ప్రాపులేసి పసితీగకు తానే పందిరి వేస్తుందీ
ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ   
            

కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    


చరణం 2 :


మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ
మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలౌతుందీ
మనిషినిమాకును ఒకటిగచేసి కొట్టుకుపోతుందీ


కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ


చరణం 3 : 


ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ
ప్రళయాన్నైనా పసిపాపల్లె నవ్వుతుచూస్తుందీ
ఎందరేగినా ఎన్నిజరిగినా ఎరగనట్టులే వుంటుందీ
ఎన్నెన్నో గారడీలు చేస్తుందీ   


కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ    


చరణం 4 :



కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ
కన్నతల్లి కడుపున మమతే కాలానికి లొంగనిదీ
కాలనిదో కన్నతల్లిదో గెలుపన్నదే తెలియనిదీ 
 

కాలం మారుతుందీ చేసిన గాయాలు మానుపుతుందీ 

Tuesday, January 1, 2019

వచ్చిందమ్మా దోర దోర వయసు

చిత్రం :  కన్నతల్లి  (1972)

సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :  సుశీల,   జె.వి. రాఘవులు

పల్లవి :


వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది...
లోపల తికమక పెడుతూ వుంది....
వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూ వుంది.... 



చరణం 1 :


నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ
నిమిషంసేపు మనసొకచోట నిలవనంటుందీ
నిన్ననచ్చినది నేడుపాతదై చప్పగవుంటుందీ


అల్లరల్లరిగ తిరగాలంటే సరదాగుంటుందీ
హద్దులన్నా పెద్దలన్న కోపంవస్తుందీ
పైట నిలవదూ...  పక్క కుదరదూ
పగలు తరగదూ...  రాత్రి గడవదూ
ఏదో గుబులుగుబులుగా వుందీ
ఎదలో గుబగుబమంటుందీ


వచ్చిందమ్మా దోర దోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
ఏదో తిక్కతిక్కగా వుంది
లోపల తికమక పెడుతూ వుంది.... 



చరణం 2 :


ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ
ఒంటరిగా నువు వున్నావంటె అలాగే వుంటుందీ
జంట కుదిరితే ఆ తిక్కే ఎంతో తీయనవుతుందీ


కళ్ళుకలిస్తే గుండె ఎందుకో ఝల్లుమంటుందీ
నీ కౌగిలిలోనా కన్నెతనం కరిగేపోతుందీ
నినుమెచ్చాను మనసిచ్చాను
నిలువున దోచి నీకే యిచ్చాను
ఏదో హాయిహాయిగా వుందీ
ఎక్కడికో తేలితేలి పోతుందీ
హాయిహాయిగా... వుందీ
తేలితేలి....పోతుందీ


వచ్చిందమ్మా దోరదోర వయసు
తెచ్చిందమ్మా కొత్తకొత్త సొగసు
పెద్దలులేక హద్దులు తెలియక
చిందరవందర అయింది బ్రతుకు
అమ్మా... అమ్మా... అమ్మా

Sunday, December 30, 2018

బృందావని ఉంది

చిత్రం :  కాంచన గంగ (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు 




పల్లవి : 



బృందావని ఉంది... హా
యమునా నది ఉంది... హా
మధురాపురి ఉంది... కాళింది ఉంది
లేని వాడొక్కడే... శ్రీకృష్ణమూర్తి


కలిలోన శిలయైన... కల్యాణ మూర్తి
కలిలోన శిలయైన... కల్యాణ మూర్తి

హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్



చరణం 1 :


పుట్టగానే పెరిగేటి... మాయబంధనాలకన్నా 

పుడుతూనే తొలిగేటి... చెరసాలలే మిన్న
ఆ కిటుకు తెలిసేరా...  హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూర్తి


కలిలోన శిలయైన..కల్యాణ మూరితి 

కలిలోన శిలయైన..కల్యాణ మూరితి


హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్



చరణం 2 :


వెంటపడి వేధించే... వేలమంది స్త్రీలున్నా
ఇంటనుండి పూజించే... ఇంతి ఉంటె చాలన్నా
ఆ కిటుకు తెలిసేరా ... హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూర్తి
రాధ గుండె దోచినాడు... వేదాంతమూరితి
రాధ గుండె దోచినాడు... వేదాంతమూరితి
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్


చరణం 3 :


గేయాలుగా మారే గీతాలు ఎన్నున్నా...
గాయాలు మాంపేటి గానాలు మిన్నా...
ఆ కిటుకు తెలిసేరా.. హా
ఆ కిటుకు తెలిసేరా... శ్రీకృష్ణమూరితి
వేణువూది లాలించే గీతానువర్తి...
వేణువూది లాలించే గీతానువర్తి...
హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ 



బృందావని ఉంది..యమునా నది ఉందిమధురాపురి ఉంది..కాళింది ఉంది లేని వాడొక్కడే..శ్రీకృష్ణమూర్తి


కలిలోన శిలయైన..కల్యాణ మూరితి కలిలోన శిలయైన..కల్యాణ మూరితి

హొయ్.. హొయ్.. హొయ్ హొయ్.. హొయ్ 

Friday, December 28, 2018

అగ్గిని నేనూ

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, రామకృష్ణ 




పల్లవి :


అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ


అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ



చరణం 1 :


అడవిలో సీత కడుపున..పుట్టిన కవలలం
మేము..లవకుశులం
అయోధ్య రాముని సీతను కలిపే
ఆంజనేయులం..వీరాంజనేయులం


అడవిలో సీత కడుపున పుట్టిన కవలలం
మేము..లవకుశులం
అయోధ్య రాముని..సీతను కలిపే
ఆంజనేయులం... వీరాంజనేయులం


అగ్గిని నేనూ..సుడిగాలిని నేనూ
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము..ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ 




చరణం 2 :


అన్యాయానికి అధర్మానికి శత్రువులం
అనురాగానికి అభిమానానికి సేతువులం
అన్యాయానికి అధర్మానికి శత్రువులం
అనురాగానికి అభిమానానికి సేతువులం


మంచికి బానిసలం... వంచితులకు బంధువులం
మంచికి బానిసలం... వంచితులకు బంధువులం
అగ్నిహోత్రమే భగ భగ మండే... ఫాలనేత్రులం
కఠిన చిత్తులకు... మదోన్మత్తులకు కాళరాత్రులం


అగ్గిని నేనూ..సుడిగాలిని నేనూ
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అన్నదమ్ములం కలిశాము... ఉన్నదమ్ములే చూపిస్తాం
అగ్గిని నేనూ... సుడిగాలిని నేనూ



చరణం 3 :


తల్లి ఋణం తీరుస్తాం... తండ్రి చెఱను విడిపిస్తాం
దెబ్బకు దెయ్యం దించేస్తాం... అబ్బకు బిడ్డల మనిపిస్తాం


ఇదే మా శపధం... ఇదే మా శపధం... ఇదే మా శపథం
ఇదే మా శపధం... ఇదే మా శపధం... ఇదే మా శపథం 





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3184

ఈ జీవితం వసంతం

చిత్రం : కుమారరాజా (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు




పల్లవి :


సీతాకోక చిలుకలు... స్వాతివాన చినుకులు
తడిమిన కొద్దీ తళుకులు... పడు చందాల పలుకులు
సీతాకోక చిలుకలు...స్వాతివాన చినుకులు
తడిమిన కొద్దీ తళుకులు... పడు చందాల పలుకులు


ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం
ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం


ఆరు ఋతువులు... పూల ఋతువులే
అన్ని పెదవుల... ప్రేమ మధువులే


అనుభవించరా..పదే పదే.. పదే పదే... పదే పదే..
ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం 



చరణం 1 :



లలల లాల లలలాల..లలలలాలా లాలా
లైఫ్ అనేది... ఒక ఛాన్స్ రా
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
లైఫ్ అనేది... ఒక ఛాన్స్ రా
లైఫుకు లైఫ్ రొమాన్స్ రా
స్వీటీలందరి బ్యూటీ చూసే డ్యూటీ నీదిరా
అది పడుచోళ్ళ నీతిరా


సీతాకోక చిలుకలు..ఓహో..
స్వాతివాన చినుకులు..అహా
తడిమిన కొద్దీ తళుకులు..ఏహే..పడు చందాల పలుకులు 


ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం 



చరణం 2 :


లలల లాల లలలాల..లలలలాలా లాలా

రామచిలుకనే తెచ్చుకో... ప్రేమపలుకులే నేర్పుకో
వెచ్చగ మచ్చిక చేసుకో... అచ్చిక బుచ్చిక లాడుకో
రామచిలుకనే తెచ్చుకో... ప్రేమపలుకులే నేర్పుకో
వెచ్చగ మచ్చిక చేసుకో..అచ్చిక బుచ్చిక లాడుకో


నీపులకరింతలే పూవులై... ఆ పువ్వులే పడుచు నవ్వులై
నీపులకరింతలే పూవులై... ఆ పువ్వులే పడుచు నవ్వులై
ఆ నవ్వులే పూలబాటలై... సాగిపో... బాటసారీ..
చెప్పుకోవోయ్..నీవు సారీ..


సీతాకోక చిలుకలు..ఓహో..స్వాతివాన చినుకులు..అహా
తడిమిన కొద్దీ తళుకులు... ఏహే..పడుచందాల పలుకులు


ఈ జీవితం వసంతం... యవ్వనం ప్రేమగీతం
యవ్వనం ప్రేమగీతం... యవ్వనం ప్రేమగీతం





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3698

Thursday, December 27, 2018

ఆనందం అర్ణవమైతే

చిత్రం : కన్యాశుల్కం (1955)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : మల్లాది రామకృష్ణశాస్త్రి
నేపథ్య గానం : సుశీల 




పల్లవి : 


ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం



ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం



 చరణం 1 :




నీ కంకణ నిక్వాణంలో..
నా జీవన నిర్వాణంలో...
నీ మదిలో డోలలు తూగీ...
నా హృదిలో జ్వాలలు రేగీ... 


నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే...
నీ తలపున...
నీ తలపున రేకులు పూస్తే... నా వలపున బాకులు దూస్తే...
మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం
మరణానికి ప్రాణం పోస్తాం... స్వర్గానికి నిచ్చెన వేస్తాం



ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... ఆనందం



చరణం  2 :


హసనానికి రాణివి నీవై...
వ్యసనానికి బానిస నేనై...
విషమించిన మదీయ ఖేదం...
కుసుమించిన త్వదీయ మోదం... 


విషవాయువులై ప్రసరిస్తే... విరితేనియలై ప్రవహిస్తే...
విషవాయువులై ప్రసరిస్తే... విరితేనియలై ప్రవహిస్తే...
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం


ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే
ప్రపంచమును పరిహాసిస్తాం... భవిష్యమును పరిపాలిస్తాం


ఆనందం అర్ణవమైతే...  అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం.... 



Monday, December 3, 2018

వలచిన మనసే ఆలయం

చిత్రం : కలెక్టర్ జానకి (1972)
సంగీతం : వి. కుమార్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం :  సుశీల, 



పల్లవి :


వలచిన మనసే ఆలయం... అది ఒకే దేవునికి నిలయం
ఆ దేవుని అలరించు దారులు రెండు
ఒకటి అనురాగం...  ఒకటి ఆరాధనం


నీవన్నది ..
నీవన్నది నీవనుకున్నది... నే నన్నది ఇలలో వున్నది
నీవన్నది నీవనుకున్నది... నే నన్నది ఇలలో వున్నది
నీ మదిలో మెదిలే స్వప్నమది...
నీ మదిలో మెదిలే స్వప్నమది... స్వప్నంకాదు... సత్యమిది
మాయని జీవిత సత్యమిది


నీవన్నది నీవనుకున్నది... 


చరణం 1 :


ఒక హృదయంలో నివసించేది... ఒకే ప్రేమికుడు కాదా
ఒక హృదయంలో నివసించేది... ఒకే ప్రేమికుడు కాదా


ఆ ప్రేమికుని మనసార చూసే...
ఆ ప్రేమికుని మనసార చూసే... కన్నులు రెండు కాదా


శ్రీనివాసుని ఎదపై నిలిచేది
శ్రీనివాసుని ఎదపై నిలిచేది... శ్రీలక్ష్మియే కాదా


అలివేలుమంగ దూరానవున్నా...
అలివేలుమంగ దూరానవున్నా... ఆతని సతియేకాదా.. ఆతని సతియేకాదా


నీవన్నది నీవనుకున్నది... నే నన్నది ఇలలో వున్నది
నీవన్నది నీవనుకున్నది... 



చరణం 2 :

బ్రతుకుదారిలో నడిచేవారికి గమ్యం ఒకటే కాదా
బ్రతుకుదారిలో నడిచేవారికి గమ్యం ఒకటే కాదా


పదిలంగా ఆ గమ్యం చేర్చే
పదిలంగా ఆ గమ్యం చేర్చే... పాదాలు రెండు కాదా


కృష్ణుని సేవలో
కృష్ణుని సేవలో... పరవశమొందిన రుక్మిణి నా ఆదర్శం


అతని ధ్యానమున అన్నీ మరచిన
అతని ధ్యానమున అన్నీ మరచిన... రాధయె నా ఆదర్శం
రాధయె నా ఆదర్శం



Friday, November 30, 2018

మంచోడు దొరికాడు

చిత్రం : కాలాంతకులు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 


మంచోడు దొరికాడు మంగళవారం... మారుతుంది జాతకం బుధవారం
మంచోడు దొరికాడు మంగళవారం... మారుతుంది జాతకం బుధవారం



నీలిమబ్బు నిజమంది... అహ... పాలపిట్ట ఋజువుంది
నీలిమబ్బు నిజమంది... పాలపిట్ట ఋజువుంది
ఏటి గాలి వాటేసి ఒట్టేసి ఔనంది..ఈ..ఈ..


మంచోడు దొరికాడు మంగళవారం... మారుతుంది జాతకం బుధవారం
మంచోడు దొరికాడు మంగళవారం... మారుతుంది జాతకం బుధవారం



చరణం 1 :


మీసకట్టు బుస చూసి మోసగాడనుకున్నా
కత్తెరంటి కళ్ళు చూసి జిత్తులోడనుకున్నా
అహా.. మీసకట్టు బుస చూసి మోసగాడనుకున్నా
కత్తెరంటి కళ్ళు చూసి జిత్తులోడనుకున్నా


తీరా చూస్తే...  దగ్గరకొస్తే
తీరా చూస్తే...  దగ్గరకొస్తే
కొత్తపల్లికొబ్బరమ్మా... కొండవీటి బెబ్బులమ్మా


అహా.. మంచోడు దొరికాడు మంగళవారం... మారుతుంది జాతకం బుధవారం




చరణం 2 :



ఉడుకుమోతు వయసుకింత దురుసెందుకో  మరి...
వేసిన ముడి  తీసేసి చేసింది అల్లరి
ఉడుకుమోతు వయసుకింత దురుసెందుకో  మరి...
వేసిన ముడి  తీసేసి చేసింది అల్లరి



ఇంకొకడైతే ఏం మునిగేదో...
ఇంకొకడైతే ఏం మునిగేదో...
ఎత్తుకుపోయేవాడో.... హత్తుకుపోయేవాడో



అహా.. మంచోడు దొరికాడు మంగళవారం... లలలల
మారుతుంది జాతకం బుధవారం...లలలల..


నీలిమబ్బు నిజమంది... అహ... పాలపిట్ట ఋజువుంది
ఏటి గాలి వాటేసి ఒట్టేసి ఔనంది..ఈ..ఈ..
మంచోడు దొరికాడు మంగళవారం... మారుతుంది జాతకం బుధవారం






Thursday, August 2, 2018

ఇంతేనయా తెలుసుకోవయా

చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : దాశరథి
నేపధ్య గానం : ఘంటసాల 



పల్లవి : 



హావ్ హావ్ హావ్ లలలలా
లాల్ల లలలల
హావ్ హావ్ హావ్ లలలలా
లాల్ల లలలల
లా... లా... లా… లలలల


ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
లా లలల లా లలల లా లలల
ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
నీతీ లేదు నిజాయితి లేదు... ధనమే జగమయ్యా


తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ



చరణం 1 :



డాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు
హొ హహహ
డాబులు కొట్టి మోసం చేసి జేబులు నింపేరు
పాపం పుణ్యం పరమార్థాలు పంచకు రానీరు
ఎవరికి వారే యమునా తీరే ఇదే ప్రపంచమయా


ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా


జింగించక జింగించక
జింగించక జింగించక


జింగించక జింగించక
జింగించక జింగించక




చరణం 2 :



పైసా తోటి సీసా చేరి జల్సా చేసింది... వావ్వ....
పైసా తోటి సీసా చేరి జల్సా చేసింది
మనసే లేని సొగసే ఉండి మైమరపించింది
పైన పటారం లోన లొటారం ఇదే ప్రపంచమయా


ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా


తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ
తక్చికి బుంబుం తకచికి బుంబుం
బ బా బి బీ బు బొ బ బ



చరణం 3 :



మంచిని చేసే మనిషిని నేడు వంచన చేసేరు... ఆహా
మంచిని చేసే మనిషిని నేడు వంచన చేసేరు
గొంతులు కోసే వాడికి నేడు గొడుగులు పట్టేరు
దొంగలు దొరలై ఊళ్ళే దోచిరి ఇదే ప్రపంచమయా


ఇంతేనయా తెలుసుకోవయా
ఈ లోకం ఇంతేనయా
యో.. యో.. య్య...  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=168