Showing posts with label (ప). Show all posts
Showing posts with label (ప). Show all posts

Thursday, September 30, 2021

ముసిముసి నవ్వుల రుసరుసలు




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : శ్రీశ్రీ  

నేపథ్య గానం :   సుశీల 




పల్లవి :


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు


నడివయసులో శృంగారం... నడివయసులో శృంగారం

ఆ వెలుగు నీడలే సరసాలు

ఆ వెలుగు నీడలే సరసాలు  


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరు చిరు అలకలే సరదాలు



చరణం 1 :


పూవు దారం... తీపి కారం... ఇంతే సంసారం

పూవు దారం... తీపి కారం... ఇంతే సంసారం

ఆలూమగలూ రాజీ పడితే ఎంతో సింగారం  

ఆ బతుకే బంగారం


ముసిముసి నవ్వుల రుసరుసలు

చిరుచిరు అలకలే సరదాలు



చరణం 2 :


సన్నజాజులూ... సంపెంగలు

అవి పెంచును మమతలు రెండింతలు

సన్నజాజులూ... సంపెంగలు

అవి పెంచును మమతలు రెండింతలు


సన్నజాజులది చల్లదనం

సంపెంగ పూలది వెచ్చదనం

సంపెంగ పూలది వెచ్చదనం

కోపం తాపం... రాజీపడితే ఎంతో సింగారం

ఆ బతుకే బంగారం


ముసిముసి నవ్వుల.. రుసరుసలు  

చిరుచిరు అలకలే సరదాలు

మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహు..మ్మ్ మ్మ్ మ్మ్ హుహుహూ



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12821

వయసే వెల్లువగా

 



చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : శ్రీశ్రీ

నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


వయసే వెల్లువగా..ఆ... ఆ

వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ 

పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా


వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ 

మనసు నేడే కలత తీరి... ఊగిందిలే ఉయ్యాలగా


చరణం 1 :


చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ

చెలరేగేను సుడిగాలులూ... విడిపోయేను మనదారులూ


వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు

వలపు చిందించి జడివానలూ... చిగురు వేయాలి మన ఆశలు.. 

చెలిమి నిండి కలలు పండి... చేరాలిలే చేరువగా


వయసే వెల్లువగా..ఆ... ఆ

వలపే వెన్నెలగా..ఆ... ఆ 

పులకరించి పరిమళించి...ఊగేనులే ఉయ్యాలగా



చరణం 2 :


మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా

మది కల్యాణ శుభవేదికా... ఇది వాసంత సుమవాటికా


హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే

హృదయ భావాలు సిరిమల్లెలై... మధుర గీతాలు పలికించెలే

గులాబీలే గుభాళించె... మురిపించెలే దీవెనలై



వయసే వెల్లువగా... ఆ.. ఆ

వలపే వెన్నెలగా... ఆ.. ఆ 

పులకరించి పరిమళించి... ఊగేనులే ఉయ్యాలగా



పరువపు వలపుల సంగీతం




చిత్రం :  పెళ్ళీడు పిల్లలు (1982)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్ 

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ 

నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి :


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం


పరుగులు తీసే....అనురాగం

దానికి లేదే... ఆటంకం

పరుగులు తీసే... అనురాగం

దానికి లేదే... .ఆటంకం.. 


పరువపు వలపుల..సంగీతం

ఉరకలు వేసే..జలపాతం


చరణం 1 :


లైలా..ఆ... ఆ.. ఆ..

లైలా..ఆ... ఆ... ఆ 

మజునూ... ఊ.. ఊ.. ఊ..

మజునూ... ఊ.. ఊ.. ఊ 

లైలా మజును దేవదాసులా కాలం చెల్లిపోయిందీ

జులీ..బాబీ..లవ్... నిలిచేకాలం వచ్చింది 

నువ్వూ నేనూ ఒకటై... వెలిగే కాలం వచ్చింది


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం 



చరణం 2 :



పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ

పువ్వు తావి వేరైవుండవు... వెన్నెల చంద్రుని విడిపోదూ

పెద్దలు ప్రేమకు అడ్డంపడితే... పిన్నలు పాఠం చెపుతారు 

మనసులేకమై నిలుచువారలకు చేతికందగలదాకాశం  

గడుపుమాని ముందడుగు  వేయమని... యువతరానికిది సందేశం


పరువపు వలపుల సంగీతం

ఉరకలు వేసే జలపాతం

పరుగులు తీసే...అనురాగం

దానికి లేదే...ఆటంకం

పరుగులు తీసే...అనురాగం

దానికి లేదే...ఆటంకం.. 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12820



Tuesday, September 1, 2020

మల్లియల్లో మా పల్లెసీమల్లో




చిత్రం : పంచభూతాలు (1979)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


మల్లియల్లో మా పల్లెసీమల్లో   
ఎన్నియల్లో మా పాడిపంటల్లో   
బంగారు పైరుల్లోనా సింగారం చిందేసింది


ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది 


మల్లియల్లో.... 


చరణం 1 :


మావిళ్ల తోటల్లో కోయళ్లే కూయంగా   
చిన్నారి గుండెల్లో కోరికలే పూయంగా   
మందారపువ్వల్లె అందాలే ఆడంగా
అందాలే ఆడంగా... అందాలే ఆడంగా


గోపాలకిష్టమ్మ గోవుల్లో పాడంగా   
గోపెమ్మా కన్నుల్లో ఎన్నెల్లే కాయంగా   
రాధమ్మ నవ్వుల్లో రతనాలే రాలంగా
రతనాలే రాలంగా... రతనాలే రాలంగా
రేపల్లెలో గోపాలుడు... మాపల్లెలో బలరాముడు


ప్రేమ త్యాగం కలిపి... దానం ధర్మం తెలిసి
ఆ దేముళ్లో రాముళ్లో నాగళ్లే పట్టంగా
నూరేళ్లు పండాలిరా... మాలోగిళ్లునిండాలిరా 



మల్లియల్లో మా పల్లెసీమల్లో   
ఎన్నియల్లో మా పాడిపంటల్లో   
బంగారు పైరుల్లోనా సింగారం చిందేసింది
ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది 



చరణం 2 :



సుక్కల్లో నెలవంక  తనవంకే చూస్తుంటే   
గోరొంక దూరంగా గూడెక్కి రమ్మంటే   
నీరెండ గుండెల్లో చలి కాచి పొమ్మంటే
చలి కాచి పొమ్మంటే... చలి కాచి పొమ్మంటే


మేడెక్కి గూడెక్కి రమ్మంటే వస్తుందా   
నోరిడిచి అడగందే అమ్మైనాపెడుతుందా   
చిలకమ్మ మనసెరిగి ముద్దిస్తే వద్దందా
ముద్దిస్తే వద్దందా... ముద్దిస్తే వద్దందా


పాలగువ్వలో మెరిసేదెల్లా
రాసెయ్యనా గుండె కోసియ్యనా
వయసు వలపు కలిపి... మనసుమమత తెలిపి
అందాల బంధాలు చిందేసి ఆడంగా
ఈడుజోడు కలవాలమ్మా... నీకు తోడునీడ కావాలమ్మా


మల్లియల్లో మా పల్లెసీమల్లో... మా పల్లెసీమల్లో   
ఎన్నియల్లో మా పాడిపంటల్లో... మా పాడిపంటల్లో   
బంగారు పైరుల్లోనా సింగారం చిందేసింది


ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో
ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్లో


మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది
మా ఊరి మాలక్ష్మి చిందేసి నవ్వింది



Monday, July 27, 2020

కంచె చేను మేయునాడు

చిత్రం : పునాదిరాళ్ళు (1979)
సంగీతం :  ప్రేమ్‌జీ
గీతరచయిత : వీటూరి
నేపథ్య గానం :  జానకి 


పల్లవి : 


కంచె చేను మేయునాడు కాచువాడు ఎవడురా
కడతేర్చువాడు ఎవడురా



చరణం 1 :


దీనులైన పేదజనుల దిగులు తీరేదెన్నడు
బానిసత్వపు బ్రతుకులన్ని మాసిపోయెదెన్నడు
కనులనిండా నీరునింపి
కనులనిండా నీరునింపి... కాటివరకు సాగునా
ఆనాటివరకు ఇలాగునా


కంచె చేను మేయునాడు కాచువాడు ఎవడురా
కడతేర్చువాడు ఎవడురా


చరణం 2 :


నిజము తెలిసిన నీతిమంతులు నిలువరా మనకండగా
నీతి లేని నేతలందరి నీలిముసుగులు తీయరా
నిలువగలిగి... మేలుకొలిపి...
నిలువగలిగి... మేలుకొలిపి...
నిలుపుకోరా నీతిని... కలుపుకోరా జాతిని


కంచె చేను మేయునాడు కాచువాడు ఎవడురా
కడతేర్చువాడు ఎవడురా




భారత దేశపు భావి పౌరులం

చిత్రం : పునాదిరాళ్ళు (1979)
సంగీతం :  ప్రేమ్‌జీ
గీతరచయిత : జాలాది
నేపథ్య గానం :  బాలు



పల్లవి : 


భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాధ్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం



చరణం 1 :


కార్మిక కర్షక శ్రామిక జీవులు
మనదేశానికి వెన్నుపూసలు
వారి రక్షణే దేశ రక్షణ
వారి పరిశ్రమే మన జీవనము
వారి పరిశ్రమే మన జీవనము


విజ్ఞానానికి ఉపాధ్యాయులు

ప్రజా సేవకై యన్ జి ఓ లు
ఐకమత్యతకు నాయకత్వము
వారి పరీశ్రమె దేశ పురోగతి
వారి పరీశ్రమె దేశ పురోగతి


స్వార్ధపరులకు సాయపడుటకై
సమ్మెలు సవాళ్లు చేయం చేయం
ప్రతిపని కోసం ప్రభుత్వమనక
ప్రజాశక్తిని కలుపుట న్యాయం
ప్రజాశక్తిని కలుపుట న్యాయం


సోమరితనముకు సమాధి కట్టి
సహకారంతో సాధన చేసి
స్వాతంత్రాన్ని నిలబెడదాం
సమ సమాజమే సాధిద్దాం
సమ సమాజమే సాధిద్దాం


భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాధ్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం



చరణం 2 :  



మనం మనం ఒక తల్లి బిడ్డలం
అనం అనం నేను నాదని
పదం పదం కలుపుదాం
ప్రగతిపధంలో పయనిద్దాం
ప్రగతిపధంలో పయనిద్దాం


తరం తరం కలవాలని
నిరంతరం నిలవాలని
వేద్దాం పదండి వెలుగు బాటకు
కదలని చెదరని పునాది రాళ్ళు
కదలని చెదరని పునాది రాళ్ళు


భారత దేశపు భావి పౌరులం
భవితవ్యాన్ని భాగస్వాములం
బాధ్యతనెరిగి బ్రతికే వాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం
భావితరానికి పునదిరాళ్ళం


వందేమాతరం... వందేమాతరం
వందేమాతరం... వందేమాతరం




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8713

Thursday, July 23, 2020

ముద్దుల జానకి పెళ్ళికి

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : 
భువనచంద్ర

నేపథ్య గానం :  చిత్ర 


పల్లవి : 


ఓఓఓఓ..ఓఓ..ఓఓఓఓ....
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే


మురిపాల తేలించ మునిమాపులో
దివినుండి రేరాజు దిగివచ్చులే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....


ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే



చరణం 1 :


తొలకరిలా వలపంతా కురిసెనులే
తీయని ఊహలు చిగురు తొడిగెను


నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగజేసి
నింగిని తాకే పందిరి వేసి
పచ్చని పల్లెను పీటగజేసి
బంగారు రంగులు వేయించరారే
మురిపాల పెళ్ళి జరిపించరారే


వధువు సొగసంత మెరిసే
వలపు మదిలోన విరిసే
చిలిపి కోరికలు కురిసే
పడుచు పరువాలు బిగిసే
కనివిని ఎరుగని కమ్మని భావన కధలుగ కనిపించే
ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ ఆ ఆ....


ముద్దుల జానకి పెళ్ళికి మబ్బుల పల్లకి తేవలెనే
ఆశల రెక్కల హంసలు పల్లకి మోసుకుపోవలెనే



చరణం 2 :



తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
తూరుపు ఎరుపై మనసులు పాడే
గోదావరిలా మమతలు పొంగే
రాయంచలన్నీ రాగాలు తీసే
చిలకమ్మలెన్నో చిత్రాలు చేసే


కదలి రావమ్మ నేడే
కలలు పండేటి వేళా
వేచియున్నాడు వరుడే
సందె సరసాల తేలా
సరసపు వయసున
ఒంపుల సొంపుల సరిగమ వినిపించే


ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ...





ఇదేలే తరతరాల చరితం

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : ఏసుదాస్,  సుజాత


పల్లవి : 


ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం 


పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం



చరణం 1 :


ఒడిలో పెరిగిన చిన్నారినే ఎరగా చేసినదా ద్వేషము
కథ మారదా...  ఈ బలి ఆగదా 


మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే
మనిషే పశువుగా మారితే కసిగా శిశువుని కుమ్మితే
అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా 


ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా
ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం


చరణం 2 :


విరిసి విరియని పూదోటలో రగిలే మంటలు చల్లరవా
అర్పేదెలా... ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
నీరే నిప్పుగ మారితే వెలుగే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా 



ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా... ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా... ఆశలే రాలిపోయేనా  


ఇదేలే తరతరాల చరితం... జ్వలించే జీవితాల కథనం


నీ నవ్వే చాలు పూబంతి

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : బాలు, చిత్ర 



పల్లవి : 


నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక
ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక 


విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా 

కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశా

మరో నవ్వు రువ్వరాదటే.... 

నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 


చరణం 1 :



మల్లెపూల మంచమేసి హుషారించనా
జమాయించి జాజి మొగ్గ నిషా చూడనా
తెల్ల చీర టెక్కులేవో చలాయించనా
విర్రవీగు కుర్రవాణ్ణి నిఘాయించనా 


అతివకు ఆత్రము తగదటగా...
తుంటరి చేతులు విడువవుగా మనసు పడే పడుచు ఒడి...


ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 



చరణం 2 :


కోర మీసమున్న వాడి కసే చూడనా
దోర దోర జామపళ్ళ రుచే చూపనా
కొంగు చాటు హంగులన్నీ పటాయించనా
రెచ్చి రేగు కుర్రదాన్ని ఘుమాయించనా


పరువము పరుపుల పరమటగా
వయసున సరసము సులువటగా....  తదిగిణతోం మొదలెడదాం...



ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి
ప్రేమించా నిన్ను వాసంతి మాలతి 

విలాసాల దారి కాశా సరాగాల గాలమేశా కులాసాల పూలు కోశా వయ్యారాల మాల వేశామరో నవ్వు రువ్వరాదటే....  



ఓ... ఓ.. ఓ... ఓ..
నీ నవ్వే చాలు పూబంతి చామంతి 
ఆ మాటే చాలు నెలవంకా రా ఇక

ప్రియతమా... ప్రియతమా

చిత్రం : పెద్దరికం (1992)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత : భువనచంద్ర
నేపథ్య గానం : బాలు, చిత్ర 



పల్లవి : 


ప్రియతమా...  ప్రియతమా
తరగని పరువమా... తరలిరా... తరలిరా

కన్నె గోదారిలా... కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేరరావే


ప్రియతమా... ప్రియతమా
తరగని విరహమా... తరలిరా... కదలిరా


మాఘమాసానివై... మల్లె పూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా 

ప్రియతమా...  ప్రియతమా
తరగని పరువమా... తరలిరా... తరలిరా 




చరణం  1 :



నీ ఆశలన్నీ నా శ్వాశలైనా... ఎంత మోహమో
నీ ఊసులన్నీ నా బాసలైనా... ఎంత మౌనమో 


ఎవరేమి అన్నా ఎదురీదనా....
సుడిగాలినైనా ఒడి చేరనా….


నీడల్లే నీ వెంట నేనుంటా
నా ప్రేమ సామ్రాజ్యమా 


ప్రియతమా... ప్రియతమా
తరగని విరహమా... తరలిరా... కదలిరా



చరణం 2 :


పెదవుల్ని తడితే పుడుతుంది తేనే... తీయతీయగా
కౌగిట్లో పడితే పుడుతుంది వానా... కమ్మకమ్మగా 


వెన్నెల్లో మంచం వేసేయనా...  ఏకాంత సేవా చేసేయనా

వెచ్చంగా చలి కాచుకోవాలా...  నీ గుండె లోగిళ్ళలో 



ప్రియతమా...  ప్రియతమా
తరగని పరువమా... తరలిరా... తరలిరా

కన్నె గోదారిలా... కొంటె కావేరిలా
నిండు కౌగిళ్ళలో చేరరావే


ప్రియతమా... ప్రియతమా
తరగని విరహమా... తరలిరా... కదలిరా







Friday, June 5, 2020

ఏరువాకమ్మా మాకెదురు రావమ్మా

చిత్రం :  ప్రజానాయకుడు (1972)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


ఏరువాకమ్మా ... మాకెదురు రావమ్మా
ఎదురొచ్చి ఎడతెగని సిరులిచ్చిపోవమ్మా
ఏరువాకమ్మా...  మాకెదురు రావమ్మా
ఎదురొచ్చి ఎడతెగని సిరులిచ్చిపోవమ్మా


ఏరువాకమ్మా...  మాకెదురు రావమ్మా.. ఆ.. ఆ.. 



చరణం 1 :


దున్నాలి దుక్కులు నిండాలి డొక్కలు...
మొక్కండి వస్తాయి మృగశిరా వానాలు... మృగశిరా వానాలు


దున్నాలి దుక్కులు నిండాలి డొక్కలు...
మొక్కండి వస్తాయి మృగశిరా వానాలు...
ఒక్క గింజ కోటిగా పండుతాయి పంటలు... పండుతాయి పంటలు


ఏరువాకమ్మా...  మాకెదురు రావమ్మా
ఎదురొచ్చి ఎడతెగని సిరులిచ్చిపోవమ్మా
ఏరువాకమ్మా ... మాకెదురు రావమ్మా.. ఆ... ఆ..


చరణం 2 :


బుట్టల్లో బువ్వతో.. దుత్తల్లో చల్లతో
వస్తుంది చిలకల్లే వయ్యారి మొలక
తినిపిస్తుంది ముద్దలు...  ముద్దుముద్దుగా


బుట్టల్లో బువ్వతో.. దుత్తల్లో చల్లతో
వస్తుంది చిలకల్లే వయ్యారి మొలక
తినిపిస్తుంది ముద్దలు...  ముద్దుముద్దుగా


హాయ్... ముద్దుముద్దుగా... ముద్దుముద్దుగా


చరణం 3 :


వేడి నీళ్ళు కాచున్నాను.. వేడి అన్నం వండిన్నాను
ఇంటి వాకిట నిల్చున్నాను... మావా...
ఇన్నెదురు చూపులు చూస్తున్నాను... మావా
తానమాడి అన్నం తినిరా.. తమలపాకులు అందిస్తాను
తానమాడి అన్నం తినిరా.. తమలపాకులు అందిస్తాను
నీ నోటి ఎరుపు చూసి నాపై ఎంత వలపో తెలుసుకుంటాను


ఏరువాకమ్మా.. వేరెవరో కాదమ్మా...
ఇంటిలోనా కంటిలోనా వెలిగే ఇల్లాలేనమ్మా
ఏరువాకమ్మా.. వేరెవరో కాదమ్మా...




Sunday, May 31, 2020

ఎవరీ నవరాగమాలిక

చిత్రం : పుత్తడి బొమ్మ (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపథ్య గానం : బాలు, సుశీల 




పల్లవి : 


ఎవరీ నవరాగమాలిక...
ఎవరీ నవరాగమాలిక...
నా అంతరంగ నవరంగ వల్లిక
ఎవరీ నవరాగమాలిక... 


ఈ మాలిక వాసకసజ్జిక
ఈ వల్లిక స్వాధీనపతిక


ఎవరీ నవరాగమాలిక...


చరణం 1 :


నీ నీలనయనాల బిడియాలు... నిలిపేను మీనాలగాలు
నీ నీలనయనాల బిడియాలు... నిలిపేను మీనాలగాలు
చుక్కల రథానికే కొలువు... నీ చెక్కిల్ల పారాడు చిరునవ్వు
ఆ పాదాలపారాణి అల్లికలు... పరిచేను నాగమల్లికలు
పరిచేను నాగమల్లికలు


ఎవరీ నవరాగమాలిక...
నా అంతరంగ నవరంగ వల్లిక
ఎవరీ నవరాగమాలిక... 


చరణం 2 :


బిడియాల మందార హారాలు... నీ హృదయానికే ఉపహారాలు
బిడియాల మందార హారాలు...
చెలి చెక్కిలి హాసాల సేద్యాలు.. నీ ముద్దుకే నైవేద్యాలు
నా పారాణిపాదాల గమనాలు... నీ పూజకై చేరు కమలాలు
నీ పూజకై చేరు కమలాలు


ఎవరీ నవరాగమాలిక...
నా అంతరంగ నవరంగ వల్లిక
ఎవరీ నవరాగమాలిక... 



ఈ మాలిక అనురాగ మాలిక
ఈ వల్లిక ఆనందవల్లిక


ఎవరీ నవరాగమాలిక... 

Saturday, May 30, 2020

సూరీడు పంపేను

చిత్రం : పుత్తడి బొమ్మ (1983)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపథ్య గానం :  బాలు 




పల్లవి : 


సూరీడు పంపేను చిగురాకు పల్లకి
సందురూడు దింపేను కలవపూల పందిరి
ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు...
ఈ పందిరిలో నీ రాముడౌతాడు... శ్రీరాముడౌతాడు


చరణం 1 :


మము గన్న తల్లి శ్రీదేవి నీదయ్యా
కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు... కనకాభిషేకాలు
పదిలంగ చూడు...
ఈ పచ్చతోరణం నట్టింట నిలబడితే
నిత్యకల్యాణం...  నిత్యకల్యాణం


సూరీడు పంపేను చిగురాకు పల్లకి
సందురూడు దింపేను కలవపూల పందిరి


చరణం 2 :


పాలకడలి సామీ... నీ నుదుటి సిందూరం
ఈ పుత్తడిబొమ్మే...
ఈ పుత్తడిబొమ్మే... నీ కొంగుబంగారం
పై యేటికి మీ ఒడిలో గుమ్మెడు పారాడాలా
ఈ గుండెపొంగి...
ఈ గుండెపొంగి... పండగై జోలపాడాలా... జోలపాడాలా


సూరీడు పంపేను చిగురాకు పల్లకి
సందురూడు దింపేను కలవపూల పందిరి
ఆ పల్లకిలో ఓ దేవుడొస్తాడు...
ఈ పందిరిలో నీ రాముడౌతాడు... శ్రీరాముడౌతాడు

Thursday, May 7, 2020

ముత్యాల ఏటిలో

చిత్రం : పగడాల పడవ (1979)
సంగీతం : ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత : దాశరథి
నేపథ్య గానం : సుశీల 



పల్లవి : 


ముత్యాల ఏటిలో పగడాల పడవా
ముత్యాల ఏటిలో పగడాల పడవా
పగడాల పడవలో బంగారు పిల్లా...


ఆ పిల్ల పాడింది అందాల పాట
ఆ పాట పలికింది అందరి నోటా


ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా



చరణం 1 :


పొంగింది వయసు దూకింది మనసు... ఏదో కోరిక ఉంది
ఈ లేత సొగసు దోచేటి రాజు కావాలంటూ ఉంది
పొంగింది వయసు దూకింది మనసు... ఏదో కోరిక ఉంది
ఈ లేత సొగసు దోచేటి రాజు కావాలంటూ ఉంది


ఈ ఒంటిదాన్ని ఏ కొంటెగాడో కవ్వించాలని ఉంది
సుడిగాలిలాగా సెలయేటిలాగా పరిగెట్టాలని ఉంది


ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా 



చరణం 2 :


ఈ తోట నాది... ఈ బాట నాది... ఈ లోకం నాదేలే
ఈ పూలు నావి... ఆ పళ్ళు నావి... ఈ అందం నాదేలే
ఈ తోట నాది... ఈ బాట నాది... ఈ లోకం నాదేలే
పూలన్నీ నావి... పళ్ళన్నీ నావి... అందాలు నావేలే


రివ్వున ఎగిరే ఆ గువ్వతోటి పోటీ చేసేను
కౌగిలిలోనా ఉయ్యాలలూగి కరిగించేసేను... నే కరిగించేసేను


ముత్యాల ఏటిలో పగడాల పడవా
పగడాల పడవలో బంగారు పిల్లా...
ముత్యాల ఏటిలో పగడాల పడవా... పగడాల పడవా




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7371

Saturday, April 4, 2020

నిన్నొక చిన్నది

చిత్రం : పారిజాతం (1980)
సంగీతం : కె.వి. మహదేవన్
నేపథ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని
నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని


నిన్నొక చిన్నాడు నాతో అన్నాడు.. పున్నమి తన ఎదుటున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని
నిన్నొక చిన్నాడు నాతో అన్నాడు.. పున్నమి తన ఎదుటున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని



చరణం 1 :


రా రా రా.. రమ్మని పిలిచే కన్నులలో... ఆ సిగ్గులు ఎందుకని
ఈ ఈ ఈ.. ఇమ్మని అడిగే పెదవులలో... ఆ బెదురులు ఎందుకని


కన్నెతనానికి సిగ్గులు ఋజువులని...  లేతదనానికి బెదురులు గురుతులని
ఇవి రెండూ మగువకు తరగని సొగసులని...


నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలే సన్నని సూదులని


చరణం 2 :


రా రా రా... రమ్మని పిలిచే వచ్చేలోగా అలకలు ఎందుకని
ఈ ఈ ఈ.. ఇమని అడిగి ఇచ్చేలోగా తొందరలెందుకని


కొసరడిగేందుకు అలకలు కిటుకులని...
తొందరలేందే అసలుకు మోసమని
ఈ అసలు.. కొసరు... అనురాగానికి అందమని


నిన్నొక చిన్నది నాతో అన్నది... పున్నమి రాబోతున్నదని
ఆ వెన్నెలా సన్నని సూదులని... ఆ వెన్నెలే సన్నని సూదులని





 https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5427

Thursday, June 13, 2019

ఏటి దాపుల... తోట లోపల

చిత్రం : ప్రేమకానుక (1969)
సంగీతం : టి. చలపతి రావు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం :  సుశీల


పల్లవి :


ఏటి దాపుల...  తోట లోపల....
ఏటి దాపుల... తోట లోపల
తేటతేనియలొలుకు పలుకుల... ఎవరినే పిలిచేవు కోయిల..
ఎవరినే... ఎవరినే...



చరణం 1 :


ప్రియుని అడుగుల సవ్వడులు... ఏ పిల్లగాలి తెలిపెనే
చెలుని పలుకుల రుచులు... ఏ తొలి చిగురు నీతో తెలిపెనే
తెలుపవే ఒకసారి కోయిల...  తెలుపవే 


ఏటి దాపుల... తోట లోపల
తేటతేనియలొలుకు పలుకుల... ఎవరినే పిలిచేవు కోయిల..
ఎవరినే... ఎవరినే...



చరణం 2 :


వేయి తెన్నుల... వేయి కన్నుల... ప్రియుడు నాకై వేచెనా ?
చెలుని విరహపు గీతమై... నీ గళములో వినిపించెనా?
తెలుపవే ఒకసారి కోయిల... తెలుపవే 




చరణం 3 :


చిలుక చెలులను వెంటగొని... మా పిలుపు మన్నించేవటే
తియ్యగా మా పెళ్ళిలో... సన్నాయ పలికించేవటే...
తెలుపవే ఒకసారి కోయిల... తెలుపవే 


ఏటిదాపుల... తోటలోపల
తేటతేనియలొలుకు పలుకుల..
ఎవరినే పిలిచేవు కోయిల ఎవరినే... ఎవరినే  










http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7357

Wednesday, June 5, 2019

చేత వెన్నముద్దలుంచి

చిత్రం : పులిజూదం (1984)
సంగీతం : కె.వి.మహదేవన్
గీతరచయిత : మోదుకూరి జాన్సన్
నేపథ్య గానం : బాలు, సుశీల


పల్లవి :


చేత వెన్నముద్దలుంచి.. చెంగల్వ పూవులుంచి..
బంగారు మనసంత నీకు చుట్టి..


చిన్నెల కృష్ణ నిన్ను చేరి కొలుతు..
నా వన్నెల కృష్ణ వేయి పూల కొలుతు..
చిన్నెల కృష్ణ నిన్ను చేరి కొలుతు..
నా వన్నెల కృష్ణ వేయి పూల కొలుతు.. 


చేత వెన్నముద్దలుంచి.. చెంగల్వ పూవులుంచి..
బంగారు మనసంత నీకు చుట్టి.. 


చిన్నెల రాధ నిన్ను చేరుకొందు..
నా వన్నెల రాధ నిన్నేలుకొందు..
చిన్నెల రాధ నిన్ను చేరుకొందు..
నా వన్నెల రాధ నిన్నేలుకొందు..  



చరణం 1 :



తీపి తీపి జ్ఞాపకాలు తలంబ్రాలు పోసి..
మనసులోని ఊసులన్ని మంత్రాలు చేసి..
తీపి తీపి జ్ఞాపకాలు తలంబ్రాలు పోసి..
మనసులోని ఊసులన్ని మంత్రాలు చేసి.. 


చిన్ననాటి తలపులన్ని సన్నాయి చేసి..
చిన్ననాటి తలపులన్ని సన్నాయి చేసి..
నా గుండెనే మరుని గుడిగంటలు చేసి.. 


ఆ... ఆ.. ఆ.. ఆ..
చిన్నెల కృష్ణ నిన్ను చేరి కొలుతు..
నా వన్నెల కృష్ణ వేయి పూల కొలుతు


చేత వెన్నముద్దలుంచి.. చెంగల్వ పూవులుంచి..
బంగారు మనసంత నీకు చుట్టి.. 


చిన్నెల రాధ నిన్ను చేరుకొందు..
నా వన్నెల రాధ నిన్నేలుకొందు..  



చరణం 2 :



లేత లేత చిగురులను లోగిలిగా చేసి..
పూలబాణాలతో పట్టెమంచమేసి..
లేత లేత చిగురులను లోగిలిగా చేసి..
పూలబాణాలతో పందిరంత వేసి..


పరువాల పైరగాలి సుగంధాలు పూసి..
పరువాల పైరగాలి సుగంధాలు పూసి..
పాల వెన్నెలే ప్రణయ దీపాలు చేసి..
పమరి పమరి పమరి పమరి


చిన్నెల రాధా నిన్ను చేరుకుందు.. 


చేత వెన్నముద్దలుంచి.. చెంగల్వ పూవులుంచి..
బంగారు మనసంత నీకు చుట్టి..


చిన్నెల కృష్ణ నిన్ను చేరి కొలుతు..
నా వన్నెల కృష్ణ వేయి పూల కొలుతు.. 


చిన్నెల కృష్ణ నిన్ను చేరి కొలుతు..
నా వన్నెల కృష్ణ వేయి పూల కొలుతు.. 

Monday, December 31, 2018

రుక్కు రుక్కు రుక్కుమిణి

చిత్రం :  పెళ్లి (1997)
సంగీతం :  ఎస్.ఎ.రాజ్ కుమార్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  మనో  



పల్లవి : 


రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రధమును తెమ్మనె...  రబ్బా హోయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా


కిలాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవ్వా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట.. రెడీగ ఉందిర వారెవా..
రుక్కు రుక్కు రుక్కుమిణీ...హో...
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును తెమ్మనె...  రబ్బా హోయ్ రబ్బా


ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మా
బుగ్గమీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా
ముద్దుల గుమ్మా పుత్తడి బొమ్మా
బుగ్గమీద సిగ్గు మొగ్గ విచ్చిందోయమ్మా    



చరణం 1 :


విరిసీ విరియని మొగ్గరా ముద్దే తగలని బుగ్గరా
మెరిసే ఈ సిరి నీదిరా వరమే అనుకో సోదరా


అందమైన కుందనాల కూన
నీ అండ చేరుకున్నది కదరా కన్నా
పొందికైన సుందర వదనా
నీ పొందు కోరుకున్నది పదరా నాన్నా


సొంపులందుకో స్వర్గమేలుకో
చిన్నదాన్ని వన్నెలన్నీ కన్నె దానమందుకోని
నవాబువైపోరా నీ నసీబు మారెనురా


ఏయ్.. రుక్కు రుక్కు రుక్కుమిణీ.. హో..
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును... తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా  



చరణం 2 :


కలికీ నీ కల తీరగా...  ఇలకే చంద్రుడు జారెగా
చిలకా నీ జత చేరగా...  ఒడిలో ఇంద్రుడు వాలెగా
అరెరెరె బంగారు జింక... నీకు ఇంతలోనె అంతటి సిగ్గా సిగ్గా
అప్పుడే ఏమైంది గనకా...  ఇక ముందు ఉంది ముచ్చట ఇంకా ఇంకా
కంటి విందుగా జంట కట్టగా...
హోరు హోరు హోరుమంటూ ఊరువాడా
అంత చేరి హుషారు హంగామా అహా ఖుషీగా చేద్దామా


అరెరెరె.. 

రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రధమును తెమ్మనె...  రబ్బా హోయ్ రబ్బా
రుక్కు రుక్కు రుక్కుమిణి రమణి సుగుణ మణి... రబ్బా హోయ్ రబ్బా
చక చక చక చక రథమును తెమ్మనె రబ్బా హోయ్ రబ్బా


కిలాడి కృష్ణుని తరలి రమ్మని తయారుగున్నది వారెవ్వా
అలాంటి ముచ్చట మరల ఇచ్చట.. రెడీగ ఉందిర వారెవా..

యవ్వన వీణ

చిత్రం : పెళ్లి (1997)
సంగీతం :  ఎస్.ఎ.రాజ్ కుమార్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు 



పల్లవి : 


యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో... యవ్వన వీణ పువ్వుల వాన



చరణం 1 :


నువ్వంటు పుట్టినట్టు నా కొరకు
ఆచూకి అందలేదు ఇంతవరకూ
వచ్చిందిగాని ఈడు ఒంటివరకూ
వేధించలేదు నన్ను జంట కొరకు


చూసాక ఒక్కసారి ఇంత వెలుగు
నా వంక రాను అంది కంటి కునుకు


ఈ అల్లరీ ఈ గారడీ నీ లీల అనుకోనా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా

హో... యవ్వన వీణ పువ్వుల వాన



చరణం 2 :



ఏ పూలతీగ కాస్త ఊగుతున్నా... నీ లేత నడుమే అనుకున్నా
ఏ గువ్వ కిలకిల వినబడినా... నీ నవ్వులేనని వెళుతున్నా
మేఘాల మెరుపులు కనపడినా... ఏ వాగు పరుగులు ఎదురైనా
ఆ రంగులో...  ఆ పొంగులో నీ రూపే చూస్తున్నా


నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
హో...హో...హో...హో...
యవ్వన వీణ పువ్వుల వాన
నువ్వెవరే నా ఎదలో చేరిన మైన
నవ్వులతో తుళ్ళిపడే తుంటరి తిల్లానా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా
నీ పేరు ప్రేమ ఔనా... ఇవాళే నిన్ను పోల్చుకున్నా

జాబిలమ్మ నీకు అంత కోపమా

చిత్రం :  పెళ్లి (1997) 

సంగీతం :  ఎస్.ఎ.రాజ్ కుమార్

గీతరచయిత :  సిరివెన్నెల

నేపథ్య గానం :  బాలు 



పల్లవి : 


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 

అల్లాడిపోదా రేయి ఆపుమా


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ .



చరణం 1 :


చిగురు పెదవి పైన చిరునవ్వై చేరాలనుకున్నా

చెలియ మనసులోన సిరిమువ్వై ఆడాలనుకున్నా

ఉన్న మాట చెప్పలేని గుండెలో విన్నపాలు వినపడలేదా

హారతిచ్చి స్వాగతించు కళ్ళలో ప్రేమ కాంతి కనపడలేదా

మరి అంత దూరమా కలలుకన్న తీరమా

 

జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..




చరణం 2 :



మనసు చూడవమ్మ కొలువుందో లేదో నీ బొమ్మా

మనవి ఆలకించి మన్నిస్తే చాలే చిలకమ్మా

ప్రాణమున్న పాలరాతి శిల్పమా ప్రేమ నీడ చేరుకోని పంతమా

తోడు కోరి దగ్గరైతే దోషమా తియ్యనైన స్నేహమంటె ద్వేషమా

ఒక్కసారి నవ్వుమా నమ్ముకున్న నేస్తమా


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా

నీ వెండి వెన్నెల్లే ఎండల్లె మండితె 

అల్లాడిపోదా రేయి ఆపుమా


జాబిలమ్మ నీకు అంత కోపమా 

జాజిపూల మీద జాలి చూపుమా ఓ ఓ ఓ ..