Showing posts with label (ల). Show all posts
Showing posts with label (ల). Show all posts

Saturday, August 29, 2020

చిలకమ్మా... హే చిలకమ్మా



చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత : సాహితి
నేపథ్య గానం : ఆనంద్, జానకి   



పల్లవి :



చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా


కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి
కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి


మొనగాడా... హే జతగాడా
మొనగాడా... హే జతగాడా


చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను
చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను 


చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా



చరణం 1 :


కమ్మింది మత్తే... ఝమ్మంది సొగసే సెగలన్ని చిమ్మింది
కమ్మింది మత్తే... ఝమ్మంది సొగసే సెగలన్ని చిమ్మింది
పండగపూటే రమ్మంది... నిండుగా మనసే ఇమ్మంది
పండగపూటే రమ్మంది... నిండుగా మనసే ఇమ్మంది
సిగ్గంతా వగ్గేసి దగ్గరగా రావాలి


చిలకమ్మా... హే చిలకమ్మా
చిలకమ్మా... హే చిలకమ్మా


చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను
కలిపావు చేయి కలిసావు జోడి... ఆడావు నాతో చేరి



చరణం 2 :


కిస్సంటే నువ్వే యస్సంటే వయసే కస్సంటు లేచింది
కిస్సంటే నువ్వే యస్సంటే వయసే కస్సంటు లేచింది
ఒంట్లో ఆవిరి పుట్టింది ఒకటే అల్లరి పెట్టింది
ఒంట్లో ఆవిరి పుట్టింది ఒకటే అల్లరి పెట్టింది
చన్నీటి జలకాల చల్లార్చుకోమంది 


మొనగాడా... హే జతగాడా
చూపావు దమ్ము దోచావు సొమ్ము... ఈ కన్నె వలచింది నిన్ను


చిలకమ్మా... హే చిలకమ్మా
కలిపావు చేయి కలిసావు జోడి ఆడావు నాతో చేరి




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9607

ఈ నవనవలాడే నవ్వులు



చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం : జానకి, రామకృష్ణ 



పల్లవి :



ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే
మనసే దోచావులే
ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూసానులే మనసే దోచావులే 


లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్
లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్



చరణం 1 :


తియ్యని సుఖం... ఇక తెలియదు జగం
తియ్యని సుఖం... ఇక తెలియదు జగం
వయసు పొంగులే ఉన్నాయి...  నన్ను అందుకోమని పిలిచాయి
వయసు పొంగులే ఉన్నాయి...  నన్ను అందుకోమని పిలిచాయి
ఒంటిగా నేను కల గంటుంటే...  కొంటెగా జంట చేరాను 


ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే
మనసే  దోచావులే 


లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్
లవ్ లవ్...  లవ్ ఇన్ సింగపూర్



చరణం 2 :


ప్రేమే కలా... అది రంగుల వలా
ప్రేమే కలా... అది రంగుల వలా
పువ్వులోనే తేనుంటుంది...  ఆ తేనెకోసమే తేటుంది
పువ్వులోనే తేనుంటుంది...  ఆ తేనెకోసమే తేటుంది
పరిచయం మనకు కలిగిన నాడే... ప్రణయమే తలుపు తట్థింది


ఈ నవనవలాడే నవ్వులు చిందే అందాలు ఏమన్నవి
నిన్నే రమ్మన్నవి
ఈ ఉరకలు వేసే పరువాలన్నీ నీలోనే చూశానులే
మనసే దోచావులే 


లవ్ లవ్ లవ్ ఇన్ సింగపూర్
లవ్ లవ్ లవ్ ఇన్ సింగపూర్
లవ్ ఇన్ సింగపూర్... లవ్ ఇన్ సింగపూర్
లవ్ ఇన్ సింగపూర్... లవ్ ఇన్ సింగపూర్



Wednesday, December 19, 2018

ఎదురుగ నువ్వుంటే

చిత్రం : లైలా (1990)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, జానకి



పల్లవి :




ఇదిగో... ఊ..
అదీ.. ఆ
అదే.. ఏదీ..
ఏదంటే..ఆ.. ఆ.. ఆ.. 


ఎదురుగ నువ్వుంటే.. అహా.. ఏదో చెప్పాలని... అని
ఎదురుగ నువ్వుంటే.. అహా..  ఏదో చెప్పాలని... అని
తీరా చెప్పబోతే..ఏ..ఏ..ఏ... చెప్పబోతే... అహ.. నోరెండిపోతుందని


అహహ.. హ... అహహహా

అహహ.. హ... అహహహా


గమపనిసగమప   మపసనిదసగమపదనిస 
అహహహహహహహ... గమపదనిసరిగమపగ
అహహహహ హహ ... పదసనినినిదమపమగరి  



చరణం 1 :



అని అని ఇదేమని...
విని విని ఇదే పని...
అని అని ఇదేమని...
విని విని ఇదే పని...


ఇదే ఇదే తగిన పని... ఈ ముద్దు ప్రేమకు తొలి ముడుపని
ఇదే ఇదే తగిన పని... ఈ ముద్దు ప్రేమకు తొలి ముడుపని



ఎదురుగ నువ్వుంటే.. అహా..  ఏదో చెప్పాలని... అని
తీరా చెప్పబోతే..ఏ..ఏ..ఏ... చెప్పబోతే... అహ.. నోరెండిపోతుందని



చరణం 2 :


చూడాలంటే... విసురు
చూడకపొతే... ముసురు


చూడాలంటే... విసురు
చూడకపొతే... ముసురు


కలవాలంటే.. బెరుకు
కలిసిన కొద్ది... చురుకు


కలవాలంటే.. బెరుకు
కలిసిన కొద్ది... చురుకు


ఇదే ఇదే జరగాలని.. ఈ వింత రోజింత పెరగాలని
ఇదే ఇదే జరగాలని.. ఈ వింత రోజింత పెరగాలని


ఎదురుగ నువ్వుంటే.. అహా..  ఏదో చెప్పాలని... అని
తీరా చెప్పబోతే..ఏ..ఏ..ఏ... చెప్పబోతే... అహ.. నోరెండిపోతుందని.. అని.. 



చరణం 3 :



చేతులు తడితే.. మెరుపు
చెంపలు ముడితే... ఎరుపు
చేతులు తడితే.. మెరుపు
చెంపలు ముడితే... ఎరుపు


మోహం పుడితే... బులుపు
స్నేహం పడితే... వలపు
మోహం పుడితే... బులుపు
స్నేహం పడితే... వలపు


ఇదే ఇదే కావాలని.. ఈ తీపితో పండిపోవాలని
ఇదే ఇదే కావాలని.. ఈ తీపితో పండిపోవాలని


ఎదురుగ నువ్వుంటే.. అహా..  ఏదో చెప్పాలని... అని
తీరా చెప్పబోతే..ఏ..ఏ..ఏ... చెప్పబోతే... అహ.. నోరెండిపోతుందని




అహహ.. హ... అహహహా
లలలల...
అహహ.. హ... అహహహా
లలలలల...



http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12809

Friday, November 30, 2018

కదిలే మేఘమా

చిత్రం : లైలా (1990)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు



పల్లవి : 


ఉ హూ హూ... హూహూహూ
ఆహాహా... ఆ... హా... హా .. ఆ.. ఆ
ఏహె ఏహె.. ఒహో హో హో హో
లలల లాలల లా.. హాహాహా హా హా


కదిలే మేఘమా.. కవితా రాగమా
కాళిదాస కమనీయ భావనా
గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా


కదిలే మేఘమా.. కవితా రాగమా
కాళిదాస కమనీయ.. భావనా
గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా



చరణం 1 :


నీ గగనవాణి.. ఎగిసిపోనీ శృతులుగా..
నా నవ్యగీతాలలో... నా నవ్యగీతాలలో


నీ చెలితవేణీ.. కులికి పోనీ జతులుగా...
నా భావనాట్యాలలో... నా భావ నాట్యాలలో


ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా
ఆవిరిలో ఉదయించే జీవన మధుకోశమా


కదిలే మేఘమా.. కవితా రాగమా
కాళిదాస కమనీయ.. భావనా
గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా 




చరణం 2 :



నా కనులలోన.. కలలవానా కురిసినది
నీ కన్నె పరవళ్ళతో...  నీ కన్నె పరవళ్ళతో
నా మనసులోన విరహవీణ పలికినది
నీ నీలి కన్నీళ్ళతో...  నీ నీలి కన్నీళ్ళతో


అణువణువూ నినదించే...  అనురాగ సంకేతమా
అణువణువూ నినదించే...  అనురాగ సంకేతమా


కదిలే మేఘమా.. కవితా రాగమా
కాళిదాస కమనీయ.. భావనా
గాంధర్వ రసయోగమా... గాంధర్వ రసయోగమా




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12425

Monday, August 6, 2018

ఊరకే కన్నీరు నింప

చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సదాశివబ్రహ్మం
నేపథ్య గానం :  లీల, సుశీల 






పల్లవి :


ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారడవి విదేమమ్మా 




చరణం 1 : 


శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
శ్రీరాముని మించిన నీ వీర కుమారులము మేము
కోరితే బంగారు కొండ కొని తేగలమమ్మా



ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా 



చరణం 2 : 


తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
తల్లి చింత తీర్పలేని తనయుల బ్రతుకెందుకమ్మా
వల్లకాదు చెప్పకున్న వదలము నీ పాదములా 




ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా మారాడ విదేమమ్మా
ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా 




రామకథను వినరయ్యా

చిత్రం :  లవకుశ (1963)
సంగీతం :  ఘంటసాల
గీతరచయిత :  సముద్రాల రాఘవాచార్య
నేపధ్య గానం :  లీల, సుశీల 





పల్లవి :


రామకథను వినరయ్యా .....
రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా
రామకథను వినరయ్యా .....




అయోధ్యా నగరానికి రాజు దశరధ మహారాజు
ఆ రాజుకు రాణులు మువ్వురు... కౌసల్యా.. సుమిత్రా... కైకేయీ
నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు
రామలక్ష్మణభరతశత్రుఘ్నులు.... ఆ.. ఆ... ఆ.. ఆ... 


రామకథను వినరయ్యా ...
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా



చరణం 1 :


ఘడియ ఏని రఘురాముని విడచి గడుపలేని ఆ భూజాని
కౌశిక యాగము కాచి రమ్మని...
కౌశిక యాగము కాచి రమ్మని... పలికెను నీరదశ్యాముని


రామకథను వినరయ్యా .....




చరణం 2 : 



తాటకి దునిమి జన్నము గాచి... తపసుల దీవన తలదాల్చి
జనకుని యాగము చూచు నెపమ్మున .....
జనకుని యాగము చూచు నెపమ్మున
చనియెను మిధిలకు దాశరధి


రామకథను వినరయ్యా .....



చరణం 3 : 



మదనకోటి సుకుమారుని కనుగొని
మిథిలకు మిథిలయే మురిసినది
ధరణిజ మదిలో మెరసిన మోదము...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ....
ధరణిజ మదిలో మెరసిన మోదము... కన్నుల వెన్నెల విరిసినది 


రామకథను వినరయ్యా .....


చరణం 4 :



హరుని విల్లు రఘునాధుడు చేగొని
ఎక్కిడ ఫెళఫెళ విరిగినది
కళకళలాడే సీతారాముల...
ఆ... ఆ... ఆ... ఆ...
కళకళలాడే సీతారాముల...
ఆ... ఆ... ఆ... ఆ...
కళకళలాడే సీతారాముల...
ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ... ఆ
కళకళలాడే సీతారాముల... కన్నులు కరములు కలిసినవి


రామకథను వినరయ్యా .....
ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8218

శుక్రవారపు పొద్దు

చిత్రం :  లక్ష్మీ కటాక్షం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత :  చిల్లర భావనారాయణరావు
నేపధ్య గానం :  జానకి 


పల్లవి :



శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు

దివ్వెనూదగ వద్దు... బువ్వనెట్టొద్దు

తోబుట్టువుల మనసు కష్టపెట్టద్దు

తొలిసంజ మలిసంజ నిదురపోవద్దు

మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు

మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు


చరణం 1 :


ఇల్లాలు కంటతడి పెట్టని ఇంట
కల్లలాడని ఇంట... గోమాత వెంట
ముంగిళ్ళ ముగ్గుల్లొ... పసుపు గడపల్లో
పూలల్లో... పాలల్లో...
పూలల్లో... పాలల్లో... ధాన్యరాశుల్లో
మా తల్లి మహాలక్ష్మి  స్థిరముగానుండు
మా తల్లి మహాలక్ష్మి  స్థిరముగానుండు



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=28313

Saturday, October 1, 2016

చలికొండలో.. చెలి గుండెలో






చిత్రం : లంకెబిందెలు (1983)
సంగీతం :  రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి : 


చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో...
ఆ సూర్యకిరణాల తడి ఆరని  ఉదయరాగాలలో


చలికొండలో.. ఓ.. ఓ.. నీ గుండెలో...
నా అందచందాల చలి తీరనీ ప్రణయ గీతాలలో  


చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో... 




చరణం 1 :



తొలిసారిగా తెలిసిందిలే వయసు వయ్యారమే
వేడిపుట్టిందో.. నీ నాడి ఏమందో..
పూతే మునిమాపై   చలి సరిగమ పలికిందో



తొలిరేయిలో తెలిసిందిలే మనువులో అందమే
ఈడు వచ్చింది... నీ తోడు నచ్చింది
పూలే విరబోసే తొలి ఘుమఘుమ తగిలింది
పగలు చల్లారిపోవాలని...


చలికొండలో.. ఓ.. ఓ.. నీ గుండెలో...




చరణం 2 :



పొగమంచులా చెలి చీరలో... సొగసు వణికిందిలే
పొద్దు వాలింది.. నీ పొందు కోరింది..
రేయే ఒక హాయై నీ బిగువులు అడిగింది



పెదవంచులా చిరుముద్దులో వలపు చిలికిందిలే
కొత్తపొంగుళ్లో నీ కొంగు జారింది
రేయే ఒడిలోనే నీ అలకలు తెలిసింది
రోజులే రాత్రులవ్వాయని...



హోయ్... చలికొండలో.. ఓ.. ఓ.. చెలి గుండెలో...
ఆ సూర్యకిరణాల తడి ఆరని  ఉదయరాగాలలో


లలలా... లలలా... లలలా... లలలా...
లలలాలలలా... లలలాలలలా...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3781



Friday, July 22, 2016

పదహారేళ్ళ వయసు








చిత్రం :  లంకేశ్వరుడు (1989)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత :  దాసరి
నేపధ్య గానం :  బాలు,  జానకి





పల్లవి :




పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు


పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో


పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
 పదహారేళ్ళ వయసు
పడిపడి లేచే మనసు


పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో




చరణం 1 :




రెండు రెండు కళ్ళు.. చూడ చూడ ఒళ్ళు
వేడి వేడి సెగలు.. ప్రేమ కోరు పొగలు
చూడ గుండె ఝల్లు.. లోన వానజల్లు
లేనిపోని దిగులు.. రేయిపగలు రగులు


ఆడ పిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే
కన్నె పిల్ల అగ్గి పుల్ల రాజుకుంటే
ఆడ పిల్ల సబ్బు బిళ్ళ.. కన్నె పిల్ల అగ్గి పుల్ల
రాసుకుంటే.. రాజుకుంటే



పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు 




చరణం 2 :



పిల్లదాని ఊపు .. కుర్రకారు ఆపు
పైన చూడ పొగరు..  లోన చూడ వగరు
పిల్ల కాదు పిడుగు..  గుండె కోసి అడుగు
దాచలేని ఉడుకు..  దోచుకోని సరుకు


అందమైన ఆడపిల్ల పట్టుకుంటే
చూడలేక చందమామ తప్పుకుంటే
అందమైన ఆడపిల్ల..  చూడలేక చందమామ
పట్టుకుంటే తప్పుకుంటే



పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో




పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు
పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు


పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో
కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో


Wednesday, May 18, 2016

ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ




చిత్రం : లవ్ ఇన్ సి౦గపూర్ (1980)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల  




పల్లవి :


ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...  




ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....


ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ.. 




చరణం 1 :



చినికి చినికి గాలి వాన ఐనట్టు
నీ చిలిపి మనసు చేరింది పై మెట్టు


ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
ఇప్పుడేమైనది... ఇంక ముందున్నది
చెప్పమంటావా భామా హరే...




ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చ.... 



ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....




చరణం 2 :



గోడెగిత్త చేని వెంట పడినట్టు...
నా వేడి వయసు ఉరుకుతుంది నీ చుట్టు



కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కోడె పొగరుంటేమీ... వేడి వయసైతేమీ
కట్టి వేస్తాను భామా హరే...



ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...  



ఈ ముద్దు తొలి ముద్దు ఇంకెప్పుడు ఆపద్దు
ఇవ్వాలి ఏ పొద్దు ఇలాగే...
నా పెదవి ముద్దంటే... నీ పెదవి వద్దంటే
ఆ పైనా రామాహరే....


ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..
చ..చ..చచ...చ..చచ...  


ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛ..      
ఛామ్ ఛఛ.. ఛూమ్ ఛఛ.. చుమరి ఛఛ ఛా ..  








Monday, March 28, 2016

గోపీలోల... నీ పాల పడ్డామురా



చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, శైలజ 


పల్లవి :


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల.. అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువేకోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా
అందాక మీ అందాలకు.. ఆ దిక్కులే దిక్కమ్మలూ 


గోపీలోల... నీ పాల పడ్డామురా 




చరణం 1 :



జాలిమాలిన ఈ గాలీ.. తేరిపార చూసే రేపే ఈల
మావిమాటున దాగుంటే.. గువ్వలు చూసి నవ్వే గోల 


తరుణి రో.....కరుణతో మోక్షం చూపే.. కిరణమై నిలిచానే
తనువుతో పుట్టే మాయను.. తెలుపగా పిలిచానే
మోక్షం కన్నా.. మానం మిన్న
నిన్ను నన్ను కన్నులు మూసేనా


గోపీలోల.. నీ పాల పడ్డామురా
భామా భామా.. తీరాన్ని చేరాలమ్మా
చనీళ్లలో ఉన్నామురా.. చిన్నరులం మన్నించరా ..
గోపీలోల.. నీ పాల పడ్డామురా 



చరణం 2 :


వాడిపొనీ సిరులెన్నో.. పూలు పూచేటి కొమ్మ రెమ్మ గుమ్మ
నేను కోరే ఆ తారా..  ఏది మీలోన భామా భామా భామా


తగదు రా.....ఇది మరీ సోద్దెం కాదా.. సొగసరీ గోవిందా
అందరూ నీ వారేగా.. ఒకరితూ ముడి ఉందా..


చూసే కలలూ.. ఎన్నో ఉన్నా.. చూపే హృదయం ఒకటే ఉందమ్మ


గోపీలోల.. నీ పాల పడ్డామురా
లీలాలోల... అల్లాడుతున్నామురా
చనీళ్లలో ఉన్నామురా... చిన్నరులం మన్నించరా ..
అందాక మీ అందాలకు... ఆ దిక్కులే దిక్కమ్మలూ 


భామా భామా... తీరాన్ని చేరాలమ్మా
పరువే కోరి... చెయ్యెత్తి మొక్కాలమ్మా 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11506

పోరాపాటిది.. తడబాటిది



చిత్రం  : లేడీస్ టైలర్ (1986)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత  :  సిరివెన్నెల
నేపధ్య గానం  : బాలు, జానకి


పల్లవి :


పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా
పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా
ఏదోపాపం పసివాణ్ణి.. జాలీ చూపి.. మన్నించండి 


అతితేలివితో మాతిపోయేనా... నీ వేషం నా ముందరా
అతితేలివితో మాతిపోయేనా... నీ వేషం నా ముందరా



చరణం 1 :


కలనుకోరిసే చేప నేనూ.. ఎరను చూసీ మొసపొనూ
వెక్కిలి వేషాలు ముదిరిపోతేను.. అసలు పాఠాలు నేర్పద
యముడిలా వాడు వెంట ఉన్నాడు.. తెలుసునా.. తెలియజేప్పనా 


వొద్దు వొద్దు బాబోయి... తప్పు కాయి తల్లోయి
తప్పు తెలుసుకుంట... గోడ కుర్చీ వేస్తా
మొన్ననే నేను కళ్ళు తెరిచాను... ఇంతలో నన్ను బూచాడికిచెయకు



అతితేలివితో మాతిపోయేనా... ఈ వేషం నా ముందరా
అతితేలివితో మాతిపోయేనా... ఈ వేషం నా ముందరా
పొనీ పాపం అనుకుంటే.. ఓహో చనువే ముదిరిందే.. మర్యాదేనా



పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా
పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా 



చరణం 2 :



విలువ తెలిసే వెతికి చేరా... బతుకు నీతో ముడిని వేశా
దరికి జేరాను వరము వేడాను... కరుణతో దారి చూపవా
మనసులో మాట తెలుసుకోవమ్మ... చెలిమితో కలిమి కురియవా


చిన్నవాడా.. నిన్ను నమ్ముతాను లేవోయి... అల్లరెందుకింక పలకెళ్లితేవోయి
కోతి వేషాలు మానితే చాలు... నిన్ను వెన్నంటే ఉంటాను ఏనాడు 



పోరాపాటిది.. తడబాటిది... గుంజీల్లే తీసేయ్యనా 

అతితేలివితో మాతిపోయేనా... ఈ వేషం నా ముందరా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11508

ఎక్కడ ఎక్కడ ఎక్కడ



చిత్రం  : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు


పల్లవి :


సుందరి..ఎందుకె.. ఇట్టా రావే..ఇట్టా రావే..
తిప్పుకుంటూ..తిప్పుకుంటూ..అట్టా అట్టా.. పోతావేమే
కొత్త రవిక.. సక్కగుందే.. ముచ్చట్టేస్తా.. ముద్దుగుందే
కన్ను కుడితే.. కుట్టి చూడు.. కుట్టినోడు గట్టివాడు
కట్టుకున్న నిన్ను చూస్తే... కన్ను కొత్తనోడు ఎవడు
సోకులంత సుట్టపెట్టి... బంగారంత పొంగుతున్న
ఇంత చిత్తరాల రవిక కుట్టినోడు ఎవ్వాడే
పదమటీధి సందులోన... పాత ఇంటి ముందరున్న టైలరు...  పేరు సుందరం 




ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నను చెరగుల తిరుగుదు మరి


ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక...  చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట... నిన్ను పట్టేదెట్ట..




చరణం 1 :



ఆకారం చూస్తే... సరిపోదంట... ఒకటే గురుతు తెలిసేదేట్ట
ఆకారం చూస్తే... సరిపోదంట... ఒకటే గురుతు తెలిసేదేట్ట
ఈ మందలో... ఏ సుందరో.. తియ్యాలిలే కూపీ
ఈ మందలో... ఏ సుందరో.. తియ్యాలిలే కూపీ
గుట్టు మట్టూ తీసి.. పుట్టు మచ్చను చూసి
టక్కున పట్టేయాలి...  నక్కను తొక్కేయాలి
పొరపడి పరులకు దొరకక 

ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నను చెరగుల తిరుగుదు మరి


ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక...  చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట... నిన్ను పట్టేదెట్ట..



చరణం 2 :


శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా
శ్రీదేవి.. వాణి.. పశుపతి రాణి.. ఎదురై నిలిచే సమయములోనా
ఎల్లాగని గుర్తించను.. శ్రీదేవిని..  ఆ దేవిని
ఎల్లాగని గుర్తించను.. నాదేవి ఏదో
గుర్తును గుట్టుగ దాచి.. అల్లరి పెట్టే వేళ..
ఎవ్వరి నవ్వులు నమ్మను.. గుండెను ఎవ్వరికివ్వను
హరి హరి.. ఇక మరి... పని సరి





ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఎక్కడ
ఎక్కడ దాక్కున్నావే లక్కుని తెచ్చే చుక్క
ఎక్కువ  చిక్కులు పెట్టక.. చిక్కవే చప్పున చక్కగ
టక్కున టక్కరి పెట్ట.. నిన్ను పట్టేదెట్ట..
మచ్చున్న భామ... కనులకు కనరావా
ఉన్నాను రావా.. నను చెరగుల తిరుగుదు మరి






హాయమ్మ హాయమ్మ హాయమ్మా



చిత్రం : లేడీస్ టైలర్ (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత  : సిరివెన్నెల
నేపధ్య గానం  : బాలు, జానకి


పల్లవి :


హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
అందాల బంధాల ఉందామా... ఆనందం అందుకుందామా
బంగారు స్వప్నాలు కందామా... కౌగిళ్ళో పంచుకుందామా


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
సింగారి గంగల్లె పొంగేనూ... ఖంగారై గుండె కుంగేను
శృంగార రంగాన చిక్కేనూ... రంగేళి నీకె దక్కేను



చరణం 1 :



దరహాసమై నీ అధరాల పైనే... ఉండమ్మ ఉండమ్మ ఉండమ్మా
చిరవాసముండే తరళాక్షి నేనే... ఔనమ్మ ఔనమ్మ ఔనమ్మా
నను చూడు... సయ్యమ్మ సయ్యమ్మ
మనువాడు... సయ్యమ్మ సయ్యమ్మ
అలివేణి.. నాదమ్మ నాదమ్మ
కలవాణి... నీవమ్మ నీవమ్మ
నిను కనగానే... ఎదనదిలో
అలజడి ఏదో సుడి తిరిగే
నీవే జతవైతే కల తీరేనీవేళా.... ఓ...


హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా



చరణం 2 :


మదిలోని బాలా ఎదురైన వేళా... హాయమ్మ హాయమ్మ హాయమ్మా
పదహారు వేలా మదిరాక్షులేలా... హాయమ్మ హాయమ్మ హాయమ్మా
మురిపాలు... హాయమ్మ హాయమ్మ
సరదాలు... హోయమ్మ హోయమ్మ
సరసాలు... హాయమ్మ హాయమ్మ
సగపాలు... హోయమ్మ హోయమ్మ
పరువము నిన్నే పిలిచెనురా...
తరుణము నేడే కుదిరెనురా...
ఏడు జన్మాల నీ జోడు నేనేరా....


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
సింగారి గంగల్లె పొంగేనూ... ఖంగారై గుండె కుంగేను
బంగారు స్వప్నాలు కందామా... కౌగిళ్ళో పంచుకుందామా


ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
ఓయమ్మ ఓయమ్మ ఓయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా
హాయమ్మ హాయమ్మ హాయమ్మా





Thursday, February 4, 2016

ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  ఆరుద్ర
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :


ఆ.. ఆ.. ఆ..
ఓ...ఓ.. ఓ..
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది
ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చరణం 1 : 


చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను
చిన్నవాడు ఓర చూపు చూసి నవ్వెను
వెన్నెలాగ లేత మనసు కరిగిపోయెను


చేయి చేయి కలపగానే మెరుపు మెరిసెను
ఆ మెరుపులోన నా మేను జలదరించెను




ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చరణం 2 :


కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి
కనులలోన గులాబీలు పూయుచున్నవి..
మునుపులేని అనుభవాలు ముసురుకున్నవి


మధురమైన మైకమేదో కలుగుచున్నది
ఆ మైక మందు నేనేదో మారిపోతిని




ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది



చరణం 3 :



చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది
చల్ల గాలి అతను ఊసు తెలుపుతున్నది
మల్లెతీగలాగ ఆశ అల్లుకున్నది 


కన్నెవలపు అతని చుట్టు తిరుగుతున్నది
ఆ వన్నెకాణ్ణి విడిచి తాను రానన్నది  



ఇలాగే ఉంటుందా తోలి ప్రేమ అన్నది
అలా అలా అలా మనసు తేలిపోవుచున్నది
ఎలగో.. ఎలాగో.. ఎలాగో.. ఉన్నది




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=145


నా చెంప తాకగానే




చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం : ఘంటసాల,   సుశీల 



సాకీ :



హాయ్.. హాయ్.. హాయ్
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో
నా చెంప తాకగానే... చెలీ.. నీ చేయి కందెనేమో
నా చూపు సోకగానే... అరెరె.. నాజూకు తగ్గెనేమో


నాపైన నీకు కోపమా.. కాదేమి విరహతాపమా
నాపైన నీకు కోపమా విరహతాపమా
పలుకగా రాదా... అలుక మరియాదా
నీ పదునౌ చూపుల అదిరింపులకే బెదరను బెదరను బెదరనులే  



పల్లవి :

దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే


చరణం 1 : 



నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె
నీ కులుకు నడక చూచి.. రాజహంసలకు సిగ్గు కలిగె
నీ తళుకు మోము చూచి.. నింగి జాబిలికి నిగ్గు తరిగె 



అయ్యారే మేని అందము.. బంగారు తీగ చందము
అయ్యారే మేని అందము.. తీగ చందము
మరులుగొలిపేనూ.. మనసు దోచేనూ
ఈ కమ్మని రాతిరి కరిగేదాకా.. కదలను కదలను కదలనులే


దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే 


చరణం 2 :


నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను
నీ నల్లని వాల్జడలో.. విరిసిన మల్లెలు రమ్మనెను
నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు.. ఎదురై పొమ్మనెను 


నువు లేకపోతే ఓ చెలీ.. ఈ లోకమంతా చలి చలి
నువు లేకపోతే ఓ చెలీ.. లోకమే చలి
ఏమి చేసేనే..  ఎటుల సైచేనే
నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా.. విడువను విడువను విడువనులే 


దాచాలంటే దాగదులే.. దాగుడుమూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసేదాకా.. వదలను వదలను వదలనులే





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=65

దాచాలంటే దాగదులే




చిత్రం :  లక్షాధికారి (1963)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :   సుశీల 



పల్లవి :


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను.. వదలను.. వదలనులే



చరణం 1 :


నీ సన్నని మీసంలో విలాసం వన్నెలు చిలికింది
నీ నున్నని బుగ్గలపై పున్నమి వెన్నెల మెరిసింది
నీ ఓర చూపులను గని.. బంగారు తూపులనుకొని
నీ ఓర చూపులను గని..  తూపులనుకొని మురిసిపోతానూ.. పరవసించేనూ
 నీ కన్నులు రమ్మని పిలిచేదాక కదలను..కదలను..కదలనులే


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక వదలను..వదలను..వదలనులే 


చరణం 2 :


పొదలలోన వున్నా పూల గంధాలు దాగలేవు
మట్టిలోన వున్నా.. మణుల అందాలు మాసిపోవు
నీలోని రూపమును గని.. రతనాల దీపమనుకొని
నీలోని రూపమును గని.. దీపమనుకొని
మదిని నిలిపేను.. జగము మరచేనూ
నీ పెదవుల నవ్వులు విరిసే దాక విడువను..విడువను..విడువనులే


దాచాలంటే దాగదులే..దాగుడు మూతలు సాగవులే
వలపుల సంకెల బిగిసే దాక..వదలను..వదలను..వదలనులే




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=66

Wednesday, September 3, 2014

పిల్లలు దేవుడు చల్లనివారే

చిత్రం :  లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
నేపధ్య గానం :  సుశీల 



పల్లవి :



పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...


తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...


పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...



చరణం 1 :


పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
పుట్టినపుడు మనిషి మనసు తెరిచి ఉండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...
ఆ పురిటి కందు మనసులో దైవముండును...


వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే...
వయసు పెరిగి ఈసు పెరిగి.. మదము హెచ్చితే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...
అంత మనిషిలోని దేవుడే మాయమగునులే...


పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...



చరణం 2 :


వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
వెలుగుతున్న సూర్యుణ్ణి.. మబ్బు మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి..  కోపం మూయును...
మనిషి తెలివి అనే సూర్యుణ్ణి.. కోపం మూయును...


గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే...
గాలి వీచి మబ్బు తెరలు తొలిగిపొవులే...
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..
మాట కలుపుకున్న కోపమే చెలిమి అగునులే..


పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...




చరణం 3 :


పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
పెరిగి పెరిగి పిల్లలే పెద్దలవుదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...
ఆ పెద్దలేమో కలహిస్తే చిన్నబోదురు...


మాయమర్మమేమి లేని బాలలందరు...
మాయమర్మమేమి లేని బాలలందరు...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...
ఈ భూమి పైన వెలసిన పుణ్యమూర్తులే...


పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...
తప్పులు మన్నించుటే దేవుని సుగుణం...
ఇది గొప్పవాళ్ళు చెప్పినట్టి చక్కని జ్ఞానం...


పిల్లలు దేవుడు చల్లనివారే..
కల్లకపటమెరుగని కరుణామయులే...



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6503

అందాల ఓ చిలకా

చిత్రం :  లేత మనసులు (1966)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 



పల్లవి :



అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను 


చరణం 1 :


మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని
కురుల మోముపై వాలెనేలనో
విరులు కురులలో నవ్వెనెందుకో
అడుగుతడబడే చిలకకేలనో
పెదవి వణికెను చెలియకెందుకో


అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా



చరణం 2 :


మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి
కురుల మోముపై మరులు గొనెనులే
విరులు కురులలో సిరులు నింపెలే
అడుగుతడబడి సిగ్గు బరువుతో
పెదవి వణికెలే వలపు పిలుపుతో


అందాల చెలికాడా అందుకో నా లేఖ
నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను


అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా



చరణం 3 :


నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి
ప్రణయ పాఠము వయసు నేర్పులే
మధుర మార్గము మనసు చూపులే


నీవు పాడగా నేను ఆడగా
యుగము క్షణముగా గడచిపోవుగా


అందాల ఓ చిలకా అందుకో నా లేఖ
నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా


సామజవరగమనా

చిత్రం :  లాయర్ సుహాసిని (1987)
సంగీతం : బాలు
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, ఎస్. పి. శైలజ



పల్లవి :



ఆ... ఆ... ఆ...
సామజవరగమనా


దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వల
... సామజవరగమనా

కలిమి చెలిమి మరువగలన ...సామజవరగమనా


దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా



చరణం 1 :


అరవిరిసిన చిరునగవుల... సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు... సామజవరగమనా
అరవిరిసిన చిరునగవుల... సామజవరగమనా
ఇల కురిసెను సిరివెలుగులు... సామజవరగమనా
సొగసులమణి నిగనిగమని... సామజవరగమనా
మెరిసిన గని మురిసెనుమది... సామజవరగమనా
వెలసెను వలపుల మధువని... సామజవరగమనా


దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా



చరణం 2 :


మమతల ఉలి మలచిన కల... సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల... సామజవరగమనా
మమతల ఉలి మలచిన కల... సామజవరగమనా
తళుకుమనెను చెలి కులుకుల... సామజవరగమనా
సుగుణములను తరగని గని... సామజవరగమనా
దొరికినదని ఎగసెను మది... సామజవరగమనా
అరుదగు వరమిది తనదని... సామజవరగమనా


హ..హా...

దివిని తిరుగు మెరుపు లలన... సామజవరగమనా
కరుణ కలిగి భువికి దిగెన... సామజవరగమనా
బ్రతుకు వెలిగె తరుణి వలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా
కలిమి చెలిమి మరువగలన... సామజవరగమనా