Showing posts with label రాముని మించిన రాముడు (1975). Show all posts
Showing posts with label రాముని మించిన రాముడు (1975). Show all posts
Thursday, January 29, 2015
Thursday, January 22, 2015
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను
చిత్రం : రాముని మించిన రాముడు (1975)
సంగీతం : టి.చలపతిరావు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : సుశీల
పల్లవి :
ఏదో మైకంలో ఉన్నాను నేను.. హ.. హ.. హహహ
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను.. నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను నేను
ఏదో మైకంలో పాడేను నేను.. నీవూ పాడాలిరా..
ఓ ప్రియా.. హరే.. హరే.. హరే.. హరే
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను... నీవే రావాలిరా
చరణం 1 :
నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా గుండెలో నేడెందుకో విరిసింది పరువాలమాల
నా మేనిలో నేడేలనో రగిలింది కనరాని జ్వాల.. రగిలింది కనరాని జ్వాల
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా
చరణం 2 :
నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
నీ పొందుకై ఈ విందుకై వేచానులే ఇంతకాలం
ఈ రేయిలో ఈ వేళలో తీరాలి ఇన్నాళ్ళ దాహం.. తీరాలి ఇన్నాళ్ళ దాహం
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను.. నీవే రావాలిరా
చరణం 3 :
నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
నీ రూపమే మెరిసిందిలే నీలాల గగనాలలోన
ఆ రూపమే.. నా కోసమే నిలిచింది నా కళ్ళలోన.. నిలిచింది నా కళ్ళలోన
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను నీవే రావాలిరా
ఏదో మైకంలో పాడేను నేను
ఏదో మైకంలో పాడేను నేను.. నీవూ పాడాలిరా..
ఓ ప్రియా.. హరే.. హరే.. హరే.. హరే
ఏవో చుక్కల్లో ఉన్నాను నేను .. నీవే రావాలిరా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=281
Tuesday, November 18, 2014
చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే
చిత్రం : రాముని మించిన రాముడు (1975)
సంగీతం : టి.చలపతిరావు
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..
అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది..
లోకమే పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..
చరణం 1 :
నా నోము పండింది నేడు..
నాకు ఈ నాడు తొరికింది తోడు
నా రాణి అధరాల పిలుపు..
నాకు తెలిపేను తనలోని వలపు.. నిండు వలపు
అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..
చరణం 2 :
ఎన్నెన్ని జన్మాల వరమో..
నేడు నా వాడవైనావు నీవు
నా వెంట నీవున్న వేళ..
కోటి స్వర్గాల వైభోగమేలా??.... భోగమేల?
చిన్నారి నా రాణి చిరునవ్వులే నవ్వితే..
గాలి ఈల వేసింది... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..
చరణం 3 :
ఈ తోట మన పెళ్ళి పీఠ..
పలికే మంత్రాలు గోరింక నోట
నెమలి పురివిప్పి ఆడింది ఆట..
వినగ విందాయే చిలకమ్మ పాట.. పెళ్ళి పాట
అందాల నా రాజు అనురాగమే చిందితే..
గాలి ఈల వేసింది.... పూల వాన కురిసింది
లోకమే... పులకించి మైకంలో ఉయ్యాలే ఊగెలే..
Subscribe to:
Posts (Atom)