Showing posts with label (ఓ). Show all posts
Showing posts with label (ఓ). Show all posts

Friday, August 31, 2018

మాటే రాని చిన్నదాని

 చిత్రం : ఓ పాప లాలి (1991)

సంగీతం : ఇళయరాజా 

గీతరచయిత : రాజశ్రీ  

నేపథ్య గానం :  బాలు 

పల్లవి :

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా

రేగే మూగ తలపే వలపు పంట రా 

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా

రేగే మూగ తలపే వలపు పంట రా

చరణం 1 :

వెన్నెలల్లె పూలు విరిసి తేనేలు చిలికెను

చెంత చేరి ఆదమరచి ప్రేమలు కొసరెను

చందనాల జల్లు కురిసె చూపులు కలిసెను

చందమామ పట్ట పగలె నింగిని పొడిచెను

కన్నె పిల్ల కలలే నాకిక లోకం

సన్నజాజి కళలే మోహన రాగం

చిలకల పలుకులు అలకల ఉలుకులు

నా చెలి సొగసులు నన్నే మరిపించే 

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

చరణం 2 :

ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు

ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు

హరివిల్లులోని రంగులు నా చెలి సొగసులు

వేకువల మేలుకొలుపె నా చెలి పిలుపులు

సందె వేళ పలికే నా లో పల్లవి

సంతసాల సిరులే నావే అన్నవి

ముసి ముసి తలపులు తరగని వలుపులు

నా చెలి సొగసులు అన్నీ ఇక నావే

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా

రేగే మూగ తలపే వలపు పంట రా

మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు

అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు

https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12426

Wednesday, October 28, 2015

చింత చిగురు పులుపనీ

చిత్రం :  ఓ సీత కథ (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సముద్రాల
నేపథ్య గానం :  బాలు

పల్లవి : 

చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల    
చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల
  
చరణం 1 :

గట్టు మీద కొంగను చూసి చెట్టు మీద డేగను చూసి
చుట్టమని అనుకుంది చేప పిల్ల పాపం చేప పిల్ల
గట్టు మీద కొంగను చూసి చెట్టు  మీద డేగను చూసి
చుట్టమని అనుకుంది చేప పిల్ల.. పాపం చేప పిల్ల
చెంగు చెంగున చెరువు దాటి చెంత నిలిచి
చేయి చాచి చెలిమి చేయ పిలిచింది..  చేప పిల్ల
అభం శుభం తెలియని పిచ్చిపిల్లా          

చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల 
  
చింత చిగురు పులుపనీ.. చీకటంటే నలుపనీ చెప్పందే తెలియనీ చిన్నపిల్ల
అది చెఱువులో పెరుగుతున్న చేప పిల్ల.. అభం శుభం తెలియని పిచ్చిపిల్ల 
 
చరణం 2 :

ఎరవేసిన పిల్లవాడు ఎవరనుకుందో.. ఎగిరి వచ్చి పడ్డది ఆతని ఒడిలో
తుళ్ళి తుళ్ళి ఆడే.. చిలిపి చేప పిల్ల..  తాళి లేని తల్లాయె అమ్మచెల్ల
నాన్న లేని పాపతో నవ్వేలోకంలో.. ఎన్నాళ్ళు వేగేను చేప తల్లి
అభం శుభం తెలియని పిచ్చితల్లి..  పిచ్చితల్లి   

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4861

Wednesday, November 12, 2014

పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు

చిత్రం :  ఓ సీత కథ (1974)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు, సుశీల
 
పల్లవి :

పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు
పుత్తడి బొమ్మ మా పెళ్ళిపడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళిపడుచు
ఆ బొమ్మకున్న ఆభరణం.. అందాలకందని మంచి గుణం
అందాలకందని మంచి గుణం

మహరాజు కాడు మా పెళ్ళికొడుకు.. మనసైనవాడు మా పెళ్ళి కొడుకు
మహరాజు కాడు మా పెళ్ళికొడుకు.. మనసైనవాడు మా పెళ్ళి కొడుకు
మావాడికున్న వింత గుణం.. తన మాట తప్పని మంచితనం 

పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు

చరణం 1 :

గళమున లేవు ఏ ముత్యాల సరాలు... ఉన్నవిలే హరినామ  స్వరాలు
కరమున లేవు బంగారు కడియాలు.. ఉన్నవిలే శివపూజా కుసుమాలు
మదిలో లేవు సంపదల మీద ఆశలు..
మదిలో లేవు సంపదల మీద ఆశలు.. ఉన్నవిలే పతి సేవా కాంక్షలు..
ఆ బొమ్మకున్న ఆభరణం.. అందాలకందని మంచి గుణం.. అందాలకందని మంచి గుణం

పుత్తడి బొమ్మ మా పెళ్ళి పడుచు.. పున్నమి రెమ్మ మా పెళ్ళి పడుచు
మహరాజు కాడు మా పెళ్ళికొడుకు.. మనసైనవాడు మా పెళ్ళి కొడుకు

చరణం 2 :

పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం.. వచ్చే చైత్రమాసం
పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం.. మరి మరీ సంతోషం

పెళ్ళిళ్ళకు మధుమాసం చైత్రమాసం.. వచ్చే చైత్రమాసం
పెళ్ళికొడుకు ఊ అంటే మాకు సంతోషం.. మరి మరీ సంతోషం

రాచిలకల రప్పించు మావిడి తోరణాలు కట్టించు..
కోయిలలను పిలిపించు.. మంగళవాద్యాలను తెప్పించు
ఆకాశమంత పందిరి వేసి.. భూలోకమంత పీఠ వేసి
పెళ్ళికొడుకును పెళ్ళిపడుచును పీటల మీద కూర్చోబెట్టి
శ్రీదేవి భూదేవి శ్రీవాణి శ్రీగౌరి అందరు చల్లగ అక్షతలు చల్లగ
కల్యాణం జరిపించాలి..  ఆ వైభోగం తిలకించాలి   

Monday, August 27, 2012

మల్లె కన్న తెల్లన

చిత్రం : ఓ సీత కథ (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల

పల్లవి :

మల్లె కన్న తెల్లన....వెన్నెలంత చల్లన...
ఏది... ఏది.. ఏది..
మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..
వెన్నెలంత చల్లన మా సీత సొగసు...

తేనె కన్న తీయన...తెలుగంత కమ్మన...
ఏది... ఏది.. ఏది..
తేనె కన్న తీయన మా బావ మనసు..
తెలుగంత కమ్మన మా బావ మనసు...

చరణం 1 :

నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి...... ఏమని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని..
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని...

నీతోనే ఒక మాట ...నీతోనే ఒక మాట...చెప్పాలి.... ఏమనినీ తోడే లేకుంటే ఈ సీతే లేదని...

మల్లె కన్న తెల్లన మా సీత సొగసు..
తేనె కన్న తీయన మా బావ మనసు..

చరణం 2 :

మనసుంది ఎందుకని... మమతకు గుడిగా మారాలని..
వలపుంది ఎందుకని ...ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..
మనసుంది ఎందుకని... మమతకు గుడిగా మారాలని..
వలపుంది ఎందుకని ...ఆ గుడిలో దివ్వెగా నిలవాలని..

మనువుంది ఎందుకని.. ఆ దివ్వెకు వెలుగై పోవాలని
బ్రతుకుంది ఎందుకని... ఆ వెలుగే నీవుగా చూడాలని...
ఆ వెలుగే నీవుగా చూడాలని

మల్లె కన్న తెల్లన...ఊహు..ఊ...
తేనె కన్న తీయన...ఊ..ఊ..ఊ..