Showing posts with label కన్నకొడుకు (1973). Show all posts
Showing posts with label కన్నకొడుకు (1973). Show all posts

Thursday, December 14, 2017

కళ్ళతో కాటేసి

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల, ఘంటసాల





పల్లవి :



కళ్ళతో కాటేసి... ఒళ్ళు ఝల్లుమనిపించి
రమ్మంటే రానంటావెట్టాగే... పిల్లా ఎట్టాగే... పిల్లా ఎట్టాగే 


బుగ్గమీద సిటికేసి... సిగ్గులోన ముంచేసి
నన్నెట్ట రమ్మంటవ్ పిల్లగాడా... భలే పిల్లగాడా... కొంటె పిల్లగాడా 




చరణం 1 :




తోటలోనా మాటువేసీ... వెంటబడితే బాగుందా
పంటసేనూ గట్టుమీద... పైనబడితే బాగుందా
సెంగావి చీరతో... బంగారు రైకలో
మోజులెన్నో ఊరిస్తే... బాగుందా



ఈ..కళ్ళతో కాటేసి... ఒళ్ళు ఝల్లుమనిపించి
రమ్మంటే రానంటావెట్టాగే... పిల్లా ఎట్టాగే... పిల్లా ఎట్టాగే





చరణం 2 :



మొదటిసారీ చూడగానే... మత్తుమందూ చల్లావే

మాయజేసీ మనసు దోచీ... తప్పు నాదే అంటావే

బెదురెందుకు నీకనీ... ఎదురుగ నుంచోమనీ

పెదవిమీద... నా పెదవిమీద... అమ్మమ్మో... బాగుందా   



బుగ్గమీద సిటికేసి... సిగ్గులోన ముంచేసి 

నన్నెట్ట రమ్మంటవ్ పిల్లగాడా... భలే పిల్లగాడా... కొంటె పిల్లగాడా 



చరణం 3 :



సైగ చేసి సైకిలెక్కి... సరసమాడితే బాగుందా
పైటసెంగూ నీడలోన... నన్ను దాస్తే బాగుందా
కందిరీగ నడుముతో... కన్నెలేడి నడకతో
కైపులోన ముంచెస్తే... బాగుందా



ఈ..కళ్ళతో కాటేసి... ఒళ్ళు ఝల్లుమనిపించి
రమ్మంటే రానంటావెట్టాగే... పిల్లా ఎట్టాగే... పిల్లా ఎట్టాగే 



చరణం 4 :



పెంచుకున్నా ఆశలన్నీ... పంచుకుంటానన్నావే
ఊసులాడీ..బాసలాడీ... వొళ్ళుమరచీ పోయావే
జాబిల్లి వెలుగులోతారల్ల తళుకులో... ఏవేవో కొరికలు కోరావే       



బుగ్గమీద సిటికేసి... సిగ్గులోన ముంచేసి
నన్నెట్ట రమ్మంటవ్ పిల్లగాడా... భలే పిల్లగాడా... కొంటె పిల్లగాడా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1741

అందమైన పిల్లగాడూ

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  కొసరాజు
నేపధ్య గానం :  సుశీల, శరావతి





పల్లవి : 



అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ
మ్మ్ ...  హూ ...  మ్మ్ హూ..
అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ


నెత్తిమీద గోరువంక... నిలిచిందే చూడడూ
అయ్యో రామా... పిలిచిందే చూడడూ
అయ్యో రామా... పిలిచిందే చూడడూ    

   
అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ  





చరణం 1 :



బూరెల బుగ్గల బుడగడే... ఏమన్నా ఇటు తిరగడే
బూరెల బుగ్గల బుడగడే... ఏమన్నా ఇటు తిరగడే


బెల్లం కొట్టిన రాయిలాగా...
బెల్లం కొట్టిన రాయిలాగా... బిర్రబిగుసుకొని వున్నాడే
అయ్యో రామా... బుర్ర గోక్కుంటున్నాడే 
అయ్యో రామా...  బుర్ర గోక్కుంటున్నాడే


అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ 



చరణం 2 :



ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా... బిత్తర చూపులు చూస్తాడమ్మా
ప్రేమ జబ్బులో పడ్డాడమ్మా... బిత్తర చూపులు చూస్తాడమ్మా


ఏ యమ్మగన్న పిల్లోడోగాని...
ఏ యమ్మగన్న పిల్లోడోగాని..
ఎంత జెప్పినా వినడమ్మా
అయ్యో రామా... ఏమైపోతాడోయమ్మా     
అయ్యో రామా... ఏమైపోతాడోయమ్మా 


అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ 



చరణం 3 :



కలిగిన పిల్లను కాదంటాడే...పేదపిల్లపై మోజంటాడే
కలిగిన పిల్లను కాదంటాడే...పేదపిల్లపై మోజంటాడే


డబ్బున్నవాళ్ళకు ప్రేమ వుండదా?
డబ్బున్నవాళ్ళకు ప్రేమ వుండదా... లేనివాళ్ళకే వుంటుందా   


అయ్యో రామా పిచ్చి... ఇంతగా ముదిరిందా
అయ్యో రామా పిచ్చి... ఇంతగా ముదిరిందా    


అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ
అందమైన పిల్లగాడూ... అందకుండా పోతున్నాడూ
నెత్తిమీద గోరువంక... నిలిచిందే చూడడూ
అయ్యో రామా... పిలిచిందే చూడడూ
అయ్యో రామా... పిలిచిందే చూడడూ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1207

దేవుడిచ్చిన వరముగా

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల





పల్లవి : 



దేవుడిచ్చిన వరముగా... కోటి నోముల ఫలముగా
ఇంటిలోని దివ్వెగా... కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా నవ్వరా...  చిన్ని కృష్ణా నవ్వరా 


దేవుడిచ్చిన వరముగా... కోటి నోముల ఫలముగా





చరణం 1 :



నన్ను దోచిన దేవుడే... ఈ నాటిలో కరుణించెలే
కన్న కలలే నిజములై... నీ రూపమున కనిపించలే
బొసి నవ్వులు ఒలకబోసి... లోకమే  మరపించరా 

దేవుడిచ్చిన వరముగా... నా కోటి నోముల ఫలముగా   



చరణం 2 :



మామ ఆస్తిని మాకు చేర్చే... మంచి పాపా నవ్వవే
ఆదిలక్ష్మివి నీవేలే... మా ఆశలన్నీ తీర్చవే
గోపి బావను చేసుకోని...
గోపి బావను చేసుకోని...  కోటికే పడగెత్తవే  

   

దేవుడిచ్చిన వరముగా... నా కోటి నోముల ఫలముగా
ఇంటిలోని దివ్వెగా... కంటిలోని వెలుగుగా
చిన్ని నాన్నా నవ్వరా..చిన్ని గోపి నవ్వరా 





ఎన్నడైనా అనుకున్నానా

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  సుశీల





పల్లవి : 



ఎన్నడైనా అనుకున్నానా... ఎప్పుడైనా కలగన్నానా
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా...
 



చరణం 1 :



నీ చిరునవ్వుల నీడలలోన...మేడకడతాననీ
అల్లరిచేసే నీ చూపులతో... ఆడుకుంటాననీ   
ఎవరికి అందని నీకౌగిలిలో... వాలిపోతాననీ
నీ రూపమునే నా కన్నులలో... దాచుకుంటాననీ..

   

ఎన్నడైనా అనుకున్నానా... ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా..ఆ   



చరణం 2 :



వలపులు చిందే నా గుండెలలో నిండివుంటావనీ
పెదవుల దాగిన గుసగుసలన్నీ తెలుసుకుంటావనీ
నా గుడిలోపల దైవము నీవై వెలుగుతుంటావనీ
విరిసే సొగసుల విరజాజులతో పూజ చేసేననీ..ఈ..  ఈ 



ఎన్నడైనా అనుకున్నానా..ఎప్పుడైనా కలగన్నానా?
ఇంత చల్లని మనసు నీకుందనీ
ఆ మనసులో నాకెంతో చోటుందనీ
ఎన్నడైనా అనుకున్నానా?  







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1332

లోకం.. శోకం

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల





పల్లవి : 



లోకం..మ్మ్ మ్మ్ మ్మ్.. శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లోకం..మ్మ్ మ్మ్ మ్మ్..శోకం..మ్మ్ మ్మ్ మ్మ్..మనకొద్దు
లలలాలా..ఆ... ఆ... ఆ 


మైకం... మ్మ్ మ్మ్ మ్మ్..తదేకం..మ్మ్ మ్మ్ మ్మ్..
మైకం తదేకం... వదలొద్దు..లాలాలాలాలలా


అను అను అను..హరేరామ్..అను
అను అను అను..హరేకృష్ణ అను

హరేరామ్..లాలాలాలా..హరేరామ్..లాలాలాలాలా     
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
 



చరణం 1 :



నీతి నియమం బూడిద... ఏహే
పాత సమాజం వీడర... ఏహే
నీతి నీయమం బూడిద... ఏహే
పాత సమాజం వీడర... అహో



ఇల్లూ వాకిలీ... తల్లీ తండ్రీ... ఎవరూ లేరు
ఏవరూ రారు... నీతో నేవే
నీలో నీవే... బతకాలి బతకాలి బతకాలి 



హరేరామ్..లాలాలాలా..హరేరామ్..లాలాలాలాలా     
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
రామ్ రామ్ హరేరామ్..కృష్ణ కృష్ణ ఘనశ్యామ్ 
 



చరణం 2 :



అయ్యో రామా... అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత మారాడో 
అయ్యో రామా... అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత... మారాడో
మీ భజన చేస్తూ... ఎంతకు దిగజారాడో 


 
అయ్యో రామా... అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత... మారాడో
మీ భజన చేస్తూ... ఎంతకు దిగజారాడో    


ఆడాళ్ళకు మగవాళ్ళకు... తేడా తెలియదు
అయ్య పంపే డబ్బులకే... అర్దం తెలియదు
కలసి మెలసి విందు..అహా..కైపులోన చిందు
కలసి మెలసి విందు..అహా..కైపులోన చిందు


ఈ పోకడ దగా దగా..బతుకంతా వృధా వృధా 
అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో    



చరణం 3 :



సౌఖ్యాలకు దొడ్డిదారి... వెతికేవాళ్ళు
బ్లాకుల్లోన లక్షలెన్నో... నూకేవాళ్ళు
పాటు పడనివాళ్ళు... సాపాటు రాయుళ్ళు
ఏ పాటు పడనివాళ్ళు... సాపాటు రాయుళ్ళు
అందరికీ మీ పేరే అతి తేరగ దొరికిందా

 

అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో    



చరణం 4 :



కష్టాల్లో పేదాళ్ళకు... మీరు అవసరం
కలవాళ్ళ దోపిడీకి... మీరు ఆయుధం
ఆపదలో ముడుపు... ఆపైన పరగడుపు
ఆపదలో ముడుపు... ఆపైన పరగడుపు
అనాదిగా ఇదే ఇదే..రివాజుగ సాగాలా ?     

 

అయ్యో రామా..అయ్యో కృష్ణా
చూశారా నరుడెంత..మారాడో
మీ భజన చేస్తూ..ఎంతకు దిగజారాడో






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1333

ఉన్నది నాకొక ఇల్లు

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల





పల్లవి : 



ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల... ఆ తల్లే చల్లని దేవతా


ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల... ఆ తల్లే చల్లని దేవతా


ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి



చరణం 1 :



చిన్నబాబుగారున్నారు... వెన్నపూసతో  పెరిగారు
చిన్నబాబుగారున్నారు... వెన్నపూసతో  పెరిగారు
సరదాబాబుల సహవాసంలో... దారితప్పి పోతున్నారు
చేజారి పోతున్నారు


ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి 



చరణం 2 :



పెద్దయ్యగారి పేరు చెప్పితే... పెద్దపులే భయపడుతుంది
ఛెళ్ళున కొరడా ఝళిపిస్తేనే... ఇల్లు దద్దరిల్లి పోతుంది
మా ఒళ్ళు హూనమైపోతుంది


ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి
ఆ ఇల్లే బంగరు కోవెల... ఆ తల్లే చల్లని దేవతా
ఉన్నది నాకొక ఇల్లు... ఉన్నది నాకొక తల్లి



చరణం 3 :



పాపమ్మలాంటి అత్తమ్మగారు... ప్రతి ఇంటిలోన వుంటారు
ఆయమ్మగారు మహమ్మారి తీరు... ఆయమ్మగారు మహమ్మారి తీరు
అన్నీ స్వాహా చేస్తారు... గుటకాయస్వాహా చేస్తారు


 



చరణం 4 :



అమ్మ అనే రెండక్షరాలలో... కోటి దేవతల వెలుగుంది
అమృత మనేది వుందంటే... అది అమ్మ మనసులోనే వుంది
మా అమ్మ మనసులోనే వుంది... 


ఆ తల్లి చల్లని దీవెన చాలు... ఎందుకు వేయి వరాలు
ఇంకెందుకు వేయి వరాలు





నేను నేనేనా

చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  సుశీల





పల్లవి : 



నేను నేనేనా... నువ్వు నువ్వేనా
నేను నేనేనా... నువ్వు నువ్వేనా


ఎక్కడికో... ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది హృదయం
చిక్కని చక్కని సుఖంలో... 
మునిగిపోతోంది దేహం... హాయ్  


నేను నేనేనా... నువ్వు నువ్వేనా    



చరణం 1 :



ఇదా మనిషి కోరుకొను..మైకం
ఇదా మనసు తీరగల..లోకం 


జిగేలు మంది..జీవితం
పకాలుమంది..యవ్వనం
జిగేలు మంది..జీవితం
పకాలుమంది..యవ్వనం

    
నేను నేనేనా... నువ్వు నువ్వేనా
ఎక్కడికో... ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది... హృదయం
చిక్కని చక్కని సుఖంలో... 
మునిగిపోతోంది దేహం..హా... 

నేను నేనేనా... నువ్వు నువ్వేనా 



చరణం 2 :



ఓహో యీ మత్తు... చాల గమ్మత్తు
ఊహూ ఊహూ... ఇంకేది మనకు వద్దు


నిషాలు గుండె నిండనీ...  ఇలాగె రేయి సాగనీ
నిషాలు గుండె నిండనీ... ఇలాగె రేయి సాగనీ 


నేను నేనేనా... నువ్వు నువ్వేనా
ఎక్కడికో... ఎక్కడికో
రెక్కవిప్పుకొని ఎగిరిపోతొంది... హృదయం
చిక్కని చక్కని... సుఖంలో
మునిగిపోతోంది దేహం...  హా... 





Wednesday, September 2, 2015

తింటే గారెలే తినాలి






చిత్రం :  కన్నకొడుకు (1973)
సంగీతం :  టి. చలపతిరావు
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల





పల్లవి : 


తింటే గారెలే తినాలి.. వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా ఉండాలి
సై యంటే... స్వర్గాలే దిగి రావాలి
తింటే గారెలే తినాలి... వింటే భారతం వినాలి





చరణం 1 :


మొలక మబ్బులు ముసిరితే... ఓహో
చిలిపి గాలులు విసిరెతే... ఓహో
మొలక మబ్బులు ముసిరితే... చిలిపి గాలులు విసిరెతే
పచ్చపచ్చని పచ్చిక బయలే పానుపుగా అమరితే.. అమరితే.. అమరితే
వీడని కౌగిట వేడి వేడిగా... చూడని రుచులే చూడాలి


తింటే గారెలే తినాలి... వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా ఉండాలి
సై యంటే... స్వర్గాలే దిగి రావాలి




చరణం 2 :



వీడని కౌగిట వేడి వేడిగా... చూడని రుచులే చూడాలి .
నీ నల్లని నీ కురులను నే దువ్వీ... ఈ సిరిమల్లెలు నీ జడలో నే తురిమీ
పట్టుచీరే కట్టించి... పైట నేనే సవరించి... సవరించి... సవరించి
నిగనిగలాడే నీ సొగసంతా... నే నొక్కడినే చూడాలి . .  
 

     

తింటే గారెలే తినాలి...  వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా ఉండాలి...
సై యంటే... స్వర్గాలే దిగి రావాలి 


చరణం 3 :



తీయగా నువు కవ్విస్తే.. ఓహో
తీగలా నను పెనవేస్తే..  ఓహో
తీయగా నువు కవ్విస్తే.. తీగలా నను పెన వేస్తే
పూలతోట పులకరించీ -  ఈల పాటలు పాడితే... పాడితే.. పాడితే
పొంగే అంచుల పల్లకిపైన నింగి అంచులను దాటాలి.. 


తింటే గారెలే తినాలి..  వింటే భారతం వినాలి
ఉంటే నీ జంటగా ఉండాలి...  సై యంటే...  స్వర్గాలే దిగిరావాలి