Showing posts with label (గ). Show all posts
Showing posts with label (గ). Show all posts

Friday, January 8, 2021

గలగలమని నవ్వకే






చిత్రం :  గాలి వాన (1979)
సంగీతం :   పెండ్యాల
గీతరచయిత :  కొంపెల్ల శివరాం
నేపథ్య గానం :  బాలు, సుశీల 


పల్లవి : 


హ..హ.. హ..
గలగలమని నవ్వకే... సొగసు కరిగిపోతుంది
గలగలమని నవ్వకే... సొగసు కరిగిపోతుంది
చిలిపి కళ్ళు మూయకే... చీకటి పడిపోతుంది
నీ చిలిపి కళ్ళు మూయకే... చీకటి పడిపోతుంది

గుండె తలుపు తట్టకు... కోర్కె రేగిపోతుంది
గుండె తలుపు తట్టకు... కోర్కె రేగిపోతుంది
కొంగు బట్టి లాగకు... వలపు వొలికిపోతుంది
నా కొంగు బట్టి లాగకు... వలపు వొలికిపోతుంది

ఆ.. హహ.. ఆఅ.. హహ.. ఆ... ఆ.. హహహ


చరణం 1 :
 

నదిలా నువు నడచినంత మేరా... అ... ఆ.. ఆ..
భూదేవి ఆకు పచ్చ చీరా
నదిలా నువు నడచినంత మేరా... అ... ఆ.. ఆ..
భూదేవి ఆకు పచ్చ చీరా

చీరల్లే నను నిలువు చుట్టుకోకు.. దండాలు ఓ మేనబావ నీకు

ఏం సిగ్గా.. ఉమ్మ్.. హహహ...


గలగలమని నవ్వకే.. సొగసు కరిగిపోతుంది
చిలిపి కళ్ళు మూయకే.. చీకటి పడిపోతుంది


చరణం 2 :


తొలి వెన్నెల మాలలల్లుకున్నా... నీ చల్లని నీడ కోరుకున్నా
తొలి వెన్నెల మాలలల్లుకున్నా... నీ చల్లని నీడ కోరుకున్నా

చలిగాలితో కబురులంపుతున్నా... నీ రూపే మదిని నిలుపుకున్నా
చలిగాలితో కబురులంపుతున్నా... నీ రూపే మదిని నిలుపుకున్నా

అలాగా... హహహా

గలగలమని నవ్వకే.. సొగసు కరిగిపోతుంది
చిలిపి కళ్ళు మూయకే.. చీకటి పడిపోతుంది


గుండె తలుపు తట్టకు.. కోర్కె రేగిపోతుంది
నా కొంగు బట్టి లాగకు... వలపు వొలికిపోతుంది



Monday, August 10, 2020

పడమటింటిలో దీపం పెట్టి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి : 


ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ
ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ..
పడమటింటిలో దీపం పెట్టి...
పాపికొండల  పావడగట్టి...
కడలి చిందుల గజ్జలు కట్టి...
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది



వేయి పడవల వెన్నెల పట్టి...
అలల నురుగుల ముగ్గులు పెట్టి...
కాపురానికి కౌగిలి పట్టి...
గోదారి ఏమన్నది... ప్రేమ పూదారి మనదన్నది
గోదారి ఏమన్నది... ప్రేమ పూదారి మనదన్నది


చరణం 1 :


ముక్కుపుడక మెరుపులే ముద్దుగుమ్మ పిలుపులై రవ్వంత రమ్మన్నవి
ఏటి గాలి తరగలే పైటలాగి వలపులా నీ జంట కమ్మన్నవి
ముక్కుపుడక మెరుపులే ముద్దుగుమ్మ పిలుపులై రవ్వంత రమ్మన్నవి
ఏటి గాలి తరగలే పైటలాగి వలపులా నీ జంట కమ్మన్నవి 


నీలాటి రేవులో చేపలన్నీ... నీలాల నీ కంటి పాపలైతే
నీలాటి రేవులో చేపలన్నీ... నీలాల నీ కంటి పాపలైతే


తెల్లబోయి చూసింది ఆ గౌతమి
మల్లెపూలు జల్లింది మందాకిని
మలిసంధ్య ఇచ్చేటి తాంబూలం పుచ్చుకొని...


గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది
గోదారి ఏమన్నది... ఇంక మా దారి ప్రేమన్నది



చరణం 2 :


లేత కొబ్బరాకులా పూత పాల వెన్నెలా ఈవేళ ఏమన్నది
ఎండకన్ను సోకితే వెన్నెలన్న పిల్లకి ముదిరింది ప్రేమన్నది
లేత కొబ్బరాకులా పూత పాల వెన్నెలా ఈవేళ ఏమన్నది
ఎండకన్ను సోకితే వెన్నెలన్న పిల్లకి ముదిరింది ప్రేమన్నది


కడవెత్తుకొస్తున్న నన్ను జూసి... గొడవెక్కువౌతున్న నిన్ను జూసి
కడవెత్తుకొస్తున్న నన్ను జూసి... గొడవెక్కువౌతున్న నిన్ను జూసి
కొమ్మల్లో నవ్వింది ఓ కోయిలా.. మత్తెక్కి ఝుమ్మంది ఓ తుమ్మెద


పెదవుల్ని కలిపేటి పేరంటానికి వచ్చి
గోదారి ఏమన్నది... ఇంక ఏమన్న విననన్నది
గోదారి ఏమన్నది... ఇంక అహహ.. ఉం.. ఉం... ఉ..




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7630

Saturday, August 8, 2020

ఎప్పట్లా గోదావరి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : సుశీల



పల్లవి : 


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...
ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది
పర్ణశాల ఒరిగింది... పారాణి కరిగింది
కరగనీ.. ఒరగనీ.. పాపికొండ మిగిలింది
ఈ పాపికొండ మిగిలింది


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...



చరణం 1 :


వెనుకకు తిరగని కథలో... ముందుకు పోతే కడలి
కడలి తాను కలిసిందంటే... ఉండదు తల్లి గోదావరి
అంటరాని బాలికా అరుంధతి తారక..
అంటరాని బాలికా అరుంధతి తారక..
ఏ వశిష్టుడొస్తాడో నన్ను చేరగా...


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...



చరణం 2 :


కలిసిన మనసులా గుడిలో...  గాలికి ఆరని దీపం
అలల మీద ఆడే పడవై... ఊగిసలాడే ఈ ప్రాణం
కన్నీరే ఏరుగా.. నడి ఏరే రేవుగా
కన్నీరే ఏరుగా.. నడి ఏరే రేవుగా
ఎన్నాళ్ళీ ఆశలూ.. గుండె కోతలు...


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...
ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తోంది
పర్ణశాల ఒరిగింది... పారాణి కరిగింది
కరగనీ.. ఒరగనీ.. పాపికొండ మిగిలింది
ఈ పాపికొండ మిగిలింది


ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తోంది...



Friday, August 7, 2020

చిరంజీవి గోదావరి

చిత్రం : గోదావరి పొంగింది (1985)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు  




పల్లవి : 


చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ...
కల్యాణిగా తాను కడలిలో కలిసింది 


మా ఇల్లు అత్తిల్లుగా...  చల్లగా వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా...  చల్లగా వర్ధిల్లు గోదావరి



చరణం 1 :



నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి
నాసికా త్రియంబకాన గోముఖాన పుట్టి
మహారాష్ట్ర లావణీల  మంజీరం కట్టి


సీతమ్మ సిగలోనా మందారం చుట్టి...
శబరి తల్లి ఫలహారం రామయ్యకు పెట్టి
భవభూతి  శ్లోకమై... శ్రీనాథుడి సీసమై


మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి
మా ఇంటి మాలక్ష్మివై తల్లివై... వర్ధిల్లు గోదావరి



చరణం 2 :


చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి
చాళుక్యుల వైభవాలు జగమంతా చాటి
నన్నయ్యకు తెలుగు కవిత ఉగ్గుపాలు పట్టి


కోనసీమ పచ్చదనం కోకలుగా చుట్టి
సప్త ఋషులు సాగనంప సాగరాన మెట్టి
రామదాసు కీర్తనై.. పంచవటి గానమై

మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి
మా పాలి ఇలవేల్పువై వెల్లువై... వర్ధిల్లు గోదావరి



చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది
సౌభాగ్యవతి తాను తెలుగునాట మెట్టింది
దక్షిణాది గంగగా దయతో ఉప్పొంగుతూ
కల్యాణిగా తాను కడలిలో కలిసింది 

మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి
మా ఇల్లు అత్తిల్లుగా చల్లగా... వర్ధిల్లు గోదావరి



Tuesday, July 16, 2019

చిరుగాలి... చెప్పవే గొరవంకకి

చిత్రం : గ్రహణం విడిచింది (1980)
సంగీతం :  
రమేశ్ నాయుడు    

గీతరచయిత : మైలవరపు గోపి

నేపథ్య గానం :  బాలు, శైలజ



పల్లవి :



చిరుగాలి..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..
చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ
చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 1 :


ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
ఆ చిరునవ్వులే వరి మడిలోనా వంక సన్నాలు
కలకంటి చూపులో చిందే...  వలపులే శీత కాటుకలు

నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ చల్లని రెప్పల నీడలోనే రాజభోగాలు
నీ కమ్మని కౌగిలి నాదైతే రోజులు నిమిషాలు



చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



చరణం 2 :



నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నువు కదలాడితే.. నా ఎదలోన ఎన్ని కోరికలు..
నీ నిండు మనుగడే.. నాకు పసుపు కుంకుమలు..


నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నువు లాలించే వేళలో...  నే పాపనవుతాను..
నీ చలవుంటే ఒకనాటికి నేను.. తల్లినవుతాను..


చిరుగాలి... చెప్పవే గొరవంకకి..
చేరువలో చిలకమ్మ.. వచ్చి కూర్చుందనీ..


చిరుగాలి చెప్పవే చిలకమ్మకి..
పిలవకనే ఒడిలోకి  వచ్చి వాలాలనీ



Sunday, January 13, 2019

వెన్నెల్లో కనుగీటే తారకా

చిత్రం : గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం : ఎస్.పి. కోదండపాణి
గీతరచయిత : కృష్ణమూర్తి
నేపథ్య గానం :  జానకి


పల్లవి :


ఓ... ఓ... ఓ.. ఓ.. ఓ.. ఓ..
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆఆ.. ఆ..
ఓ..  ఓ..  ఓ..  ఓ..  ఓ
వెన్నెల్లో కనుగీటే తారకా
వినవే కన్నెమనసు... కరిగించే కోరికా
ఎదలో బాధా... ప్రేమే చేదా
ఎదలో బాధా... ప్రేమే చేదా
ఇది తీరే దారే లేదా..
ఆ...ఆ...ఆ.. ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ.. ఓ.. ఓ


వెన్నెల్లో కనుగీటే తారకా
వినవే కన్నెమనసు కదిలించే కోరికా



చరణం 1 :


మొగ్గవంటి చిన్నదాన్ని మనసిచ్చానే
మొగ్గవంటి చిన్నదాన్ని  మనసిచ్చానే
సిగ్గుతో నా నోరువిప్పి... చెప్పగలేనే
సొగసరి మొనగాడే... గడుసరి వాడే
సొగసరి మొనగాడే... గడుసరి వాడే
గుబులు గుండెల్లో... నింపాడే..ఏ... ఏ
ఓ... ఓ...  ఓయ్


వెన్నెల్లో కనుగీటే తారకా
వినవే కన్నెమనసు కదిలించే కోరికా



చరణం 2 :



ఒక్కసారి ఓరకంట నను చూశాడే..
చక్కిలిగింతలు రేపి మదిదోచాడే..
చుక్కఱేడేనే... చక్కని వాడే
చుక్కఱేడేనే... చక్కని వాడే
మక్కువతో చూడ రాడే..ఏ.. ఏ..
ఓ... ఓ...  ఓయ్ 



వెన్నెల్లో కనుగీటే తారకా
వినవే కన్నెమనసు... కరిగించే కోరికా
ఎదలో బాధా... ప్రేమే చేదా
ఎదలో బాధా... ప్రేమే చేదా
ఇది తీరే దారే లేదా..
ఆ...ఆ...ఆ.. ఓ..ఓ.. ఓ..ఓ.. ఓ.. ఓ.. ఓ


వెన్నెల్లో కనుగీటే తారకా
వినవే కన్నెమనసు కదిలించే కోరికా


Tuesday, January 8, 2019

పూవులు పూయును

చిత్రం : గురువును మించిన శిష్యుడు (1963)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : కృష్ణమూర్తి
నేపథ్య గానం :  జానకి


పల్లవి :

ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
పూవులు పూయును పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు


ప్రాణములున్నవి అందరికీ... ప్రణయము తెలిసేదెందరికి ..
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు



చరణం 1 :


అరుదైన వరం మన జీవితమూ... ఆనందానికి అది అంకితమూ
అరుదైన వరం మన జీవితమూ... ఆనందానికి అది అంకితమూ
అరచేతిన ఉన్నది...  స్వర్గమురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అరచేతిన ఉన్నది స్వర్గమురా... అది ఎరుగని వారిదే నరకమురా


పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు




చరణం 2 :



చేజారినదీ నిన్నటిదినమూ... జనియించనిదే రేపటి దినమూ
చేజారినదీ నిన్నటిదినమూ... జనియించనిదే రేపటి దినమూ
అవి అందనివీ... మనకెందుకురా
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అవి అందనివీ మనకెందుకురా... ఈ దినమే మనదనుకొందామురా


పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు
ప్రాణములున్నవి అందరికీ... ప్రణయము తెలిసేదెందరికి ..
పూవులు పూయును..పదివేలు... భగవానుని మెడలో ఎద వ్రాలు




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7066

Monday, July 9, 2018

ఒంటరినైపోయాను

చిత్రం : గులేబకావళి కథ (1962)
సంగీతం : జోసఫ్ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల 


పల్లవి : 



ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... 


చరణం 1 :



నాపై ఆశలు నిలుపుకున్న... నా తల్లి ఋణము చెల్లించనైతిని
నాపై ఆశలు నిలుపుకున్న... నా తల్లి ఋణము చెల్లించనైతిని
ఎవరికీ గాక...  ఏ దరిగానక
ఎవరికీ గాక...  ఏ దరిగానక 
చివికి చివికి నే మ్రోడైపోతిని


ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... 



చరణం 2 :



నన్నే దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని
నన్నే దైవమని నమ్ముకున్న నా ఇల్లాలిని ఎడబాసితిని
బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... ఈ
బ్రతుకే బరువుగా తిరిగి తిరిగి... ఈ బండలలో ఒక బండనైతిని


ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... 



చరణం 3 :



వలచిన కన్యను వంచనజేసి... నలుగురిలో తలవంపులుజేసి
వలచిన కన్యను వంచనజేసి... నలుగురిలో తలవంపులుజేసి
గుండె ఆవిరైపోవుచుండ... 
ఈ గుండె ఆవిరైపోవుచుండ
ఈ మొండి బ్రతుకు నేనీడ్చుచుంటిని



ఒంటరినైపోయాను... ఇక ఇంటికి ఏమనిపోనూ
ఒంటరినైపోయాను... నే  ఒంటరినైపోయాను...  




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=55

Sunday, July 8, 2018

నీ కనుదోయిని నిద్దురనై

చిత్రం : గుడిగంటలు (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : నార్ల చిరంజీవి
నేపధ్య గానం : జానకి
 


పల్లవి :


నీ కనుదోయిని నిద్దురనై...
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై


యడబాయని నీడగా తోడవుతా... నీ కలలకు నేనే జోడవుతా ...
నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై



చరణం 1 :


నీ కలలన్నీ నావోయి...  నా యవ్వన రాగం నీదోయి
వలపుల గుడిలో గంటలు మ్రోగే
జంటగరమ్మని పిలిచాయి... ఇరువునీ పిలిచాయి


నీ కనుదోయిని నిద్దురనై... మనసున పూచే శాంతినై



చరణం 2 :



కాటుక కళ్లే కానుకగా...  నా బుగ్గలసిగ్గే హారతిగా
హృదయము నీకె అంకితమోసగే
నీ బిగికౌగిలి చేరెదను... ఒరిగెదను... కరిగెదను...


నీ కనుదోయిని నిధ్ధురనై...  మనసున పూచే శాంతినై
యెడబాయని నీడగ తోడవుతా...  నీ కలలకు నేనే జోడవుతా
ఆహాహాహాహ ఆహాహ హాహాహహ ఆ ఆహాహహా .... 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=71



దూరాన నీలిమేఘాలు

చిత్రం : గుడిగంటలు (1965)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల


పల్లవి :


దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు


దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్...  ఒహొహొ హొయ్... ఓఓ...ఓ...ఓ...ఓ



చరణం 1 :



నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
నల్లని జడలో సింగారించగ నవ్వుల పువ్వులు కోసితిని
నచ్చిన ఊహల నాదస్వరానికి నా జడ నాట్యము చేసినది


దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్... ఒహొహొ హొయ్... ఓఓ... ఓ...ఓ...ఓ



చరణం 2 :




తేనెలు తాగుతు గాలుల తేలుతు... తుమ్మెద ఝుమ్మని ఆడినది
తేనెలు తాగుతు గాలుల తేలుతు...  తుమ్మెద ఝుమ్మని ఆడినది
తుమ్మెద తీరున కమ్మని నా మది తుళ్ళుతు గెంతులు వేసినది


దూరాన నీలిమేఘాలు... నాలోన కొత్త భావాలు
పూచేను కోటి మురిపాలు... తొంగి చూసేను కన్నె సరదాలు
ఒహొహొ హొయ్...  ఒహొహొ హొయ్... ఓఓ...ఓ...ఓ...ఓ 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=98

Thursday, July 5, 2018

చూడకు... మరీ అంతగా చూడకు

చిత్రం : గోపాలుడు భూపాలుడు (1967)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి : 


ఊఁ... చూడకూ
చూడకు చూడకూ
చూడకు చూడకూ
చూడకు చూడకు... మరీ అంతగా చూడకు ....
మనసుతో చెరలాడకు...  మనసుతో చెరలాడకు



చరణం 1 :



విరుల పానుపున పరచిన మల్లెలు...  ఒదిగి ఒదిగి చూస్తున్నాయి
విరుల పానుపున పరచిన మల్లెలు...  ఒదిగి ఒదిగి చూస్తున్నాయి
ఆకాశాన విరిసిన తారలు...  అదే పనిగ చూస్తున్నాయి
ఆకాశాన విరిసిన తారలు...  అదే పనిగ చూస్తున్నాయి
ఇన్ని చూడగా లేనిది... ఊఁ...  నేను చూడనేమైనది
ఊఁ...... ఊఁ......
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ......
హాయ్... ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.


చూడని చూడనీ... చూడనీ చూడనీ
చూసిన అందమె... తిరిగి తిరిగి నను చూడనీ
తేనె మనసు తెరతీయనీ... తేనె మనసు తెర తీయనీ 



చరణం 2 :



అసలే ఏవో మిసిమి కోరికలు... కొసరి కొసరి నను కవ్వించె
అసలే ఏవో మిసిమి కోరికలు... కొసరి కొసరి నను కవ్వించె
ఆపై నాలో గడుసు వెన్నెలలు... హాయిహాయిగా రగిలించె
ఇంక నన్ను కదిలించకు... ఎదలో చూపులు దించకు


ఊఁ... ఊఁ......
ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ... ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.ఊఁ.


చూడకూ చూడకు... చూడకూ చూడకు
చూడకు చూడకు... మరీ అంతగా చూడకు ....
మనసుతో చెరలాడకు... మనసుతో చెరలాడకు



చూడని చూడనీ...ఆఁ.....  చూడనీ చూడనీ... ఆఁ.....
చూసిన అందమె తిరిగి తిరిగి నను చూడనీ
తేనె మనసు తెరతీయనీ... తేనె మనసు తెరతీయనీ... ఆఁ..... 





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=690

Tuesday, July 3, 2018

నీ ఇల్లు బంగారంగాను

చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి




పల్లవి :


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను
జోరు మీద ఉన్నావు జోడు కడతావా...
మోజుమీద సన్నజాజి పూలు పెడతావా


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను
పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా...
మురిపాల మీగడంతా తోడిపెడతావా


Gold man .. అహా Gold man




చరణం 1 :



బంగారు కొండమీద...  శృంగార కోటలోన...
చిలకుంది తెమ్మంటావా... చిలకుంది తెమ్మంటావా
రతనాల రాతిరేళా పగడాల పక్క చూపి... పలికింది రమ్మంటావా


ఏడేడు వారాల నగలిస్తే రమ్మంటా... హారాలకే అగ్రహారాలు రాసిస్తా
అందాల గని ఉంది నువ్వు చూసుకో... నీకందాక పని ఉంటే నన్ను చూసుకో


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను



చరణం 2 :



వజ్రాలవాడలోన...  వైఢూర్యమంటి నన్ను...
వాటేయ వద్దంటావా.. వాటేయ వద్దంటావా
ముత్యాల మేడలోనా... మాణిక్యమంటి నన్ను.. ముద్దాడ వస్తుంటావా


వరహాల పందిట్లో విరహాలు నీకేల... రతనాల ముంగిట్లో రాగాలు తీయాల
మేలైన సరుకుంది మేలమాడుకో... ఓ గీటురాయి మీద దాన్ని గీసి చూసుకో


నీ ఇల్లు బంగారంగాను... నా ఒళ్ళు సింగారంగాను
జోరు మీద ఉన్నావు జోడు కడతావా... మురిపాల మీగడంతా తోడిపెడతావా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=845

ఇదో రకం దాహం

చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, జానకి




పల్లవి :


ఇదో రకం దాహం... అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా.. హా
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..హా..హా..ఆ


ఇదో రకం దాహం... అదో రకం తాపం
కటకటాలలో..ఓ.. చలిరాత్రి..హా..హా..
ఇది కనివిని ఎరుగని తొలిరాత్రి..హా..హా..హా..



చరణం 1 :


అర్రెర్రే..ఏ.. కరెంట్ పోయిందే..
ఆ..అమ్మో..నాకు భయమేస్తుంది..
హ..హ..హ.. ఏం భయంలేదు నాదగ్గరగా రా
ఎక్కడ..?.. ఇక్కడే..
హు...ఎక్కడ...? ఇటూ..ఇటూ..అ..అ..అదీ..సుజా..ఆ
ఊహ..సుజా... మై డార్లింగ్..మూ....సుజా..ఆ



మసకలోనే మనసుతీరా అల్లుకుంటున్నా..ఆ
ఇరుకులోనే వలపుతీరా ఇల్లు కడుతున్నా..ఆ
ఏదో తెలియని దప్పిక... తీరీతీరని కోరిక..


ఏదో తెలియని దప్పిక..తీరీతీరని కోరిక..
నరనరాలలో..ఓ..ఓ నస..నసగా..
నాలో..నీలో గుస గుసగా..
గుండె గుప్పెడయిపోతుంటే... గుట్టు చప్పుడయిపోతుంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..


ఇదో రకం దాహం... అదో రకం తాపం



చరణం 2 :



ఇదిగో..ఇదిగో...ఏవి..ఏవిటయ్యా
అరగంట నుండి చూస్తున్నా..
ఇది జైలు అనుకున్నారా... మీ ఇల్లు అనుకున్నారా...ఆ?
చూడలేక చస్తున్నాను వెధవది..


హ..హ..
చూడలేక చస్తున్నాడంట హ..హ పాపం..
అయితే ఓ పని చేద్దాం...


మళ్ళీ ఏమిటది..ఏమిటది శబ్ధం..?
దోమలయ్యా బాబు చచ్చిపోతున్నాం..చంపలేక..
హ..హ..హ..హ..హ..హ..హ..


పెదవి తాకి పెదవి దాహం పెరిగిపోతున్నా..
జరగనున్నది జాము రాతిరి జరిగిపోతున్నా...
కన్నుల కరిగే కాటుక... వెన్నెల విందుల కానుక..



కౌగిలింతలో... కసికసిగా...
కరుగుతూ వుంటే... గజిబిజిగా..
ఇద్దరొక్కటయిపోతుంటే... ఒక్కరిద్దరయి ముద్దంటే..
దాహం..తాపం..దాహం..తాపం..దాహం..తాపం..హా..





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=850

రెండక్షరాల ప్రేమ



చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు




పల్లవి :




రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ
రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ




జ్యోతిని జ్వాలగా మార్చె ప్రేమ...
నీతి మరచి ఏమార్చే ప్రేమ
ఇదేనా.. ప్రేమ!!



రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ



చరణం 1 :




నో.. అదంతా ఒక కల ..పీడ కల ..forget it!!



యుగయుగాలుగా ఆడది చేసే దగా పేరు ప్రేమ
మనసు నేరమై మమత పాపమై పడే శిక్ష ప్రేమ


రాజ్యాలెన్నొ కూల్చిన ప్రేమ
రక్త తర్పణం అడిగే ప్రేమ


మనసా మరిచిపో... మనసే మార్చుకో


రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ
రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ



చరణం 2 :


నో... అదంతా కల్పన... నయవంచన


మల్లెల చితిలో వెన్నెల చిచ్చులు రగిలించే ఈ ప్రేమ
చచ్చేదాకా నమాజు చేసి సమాధి కట్టే ప్రేమ
పాశాలెన్నొ పెంచే ప్రేమ... యమపాశంగా మారే ప్రేమ


మనసే చంపుకో... శిలగా మారిపో



రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ
రెండక్షరాల ప్రేమ... రెండు క్షణాల ప్రేమ



జ్యోతిని జ్వాలగా మార్చె ప్రేమ
నీతి మరచి ఏమార్చే ప్రేమ..
ఇదేనా... ప్రేమ..??  






ఇంద్రధనుస్సు చీర కట్టి

చిత్రం :  గజదొంగ (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


ఇంద్రధనుస్సు చీర కట్టి... చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట... సూర్యుడికే కునుకొచ్చిందంట


ఇంద్రధనుస్సు చీర కట్టి... చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట... జాబిలికే నడకొచ్చిందంట



చరణం 1 :



నడిరేయి సమయాన...  ఒడిచేరు తరుణాన
నక్షత్ర చేమంతి జడలల్లనా
నవ్వుల్లో తొలిపువ్వు నే గిల్లనా


ప్రేమ అనే కౌగిలిలో...  పెళ్లి అనే పందిరిలో
ఇచ్చిపుచ్చుకున్న మాట మంత్రమాయెనే
ఇద్దరొక్కటైన పాట మనుగడాయెనే


ఇంద్రధనుస్సు చీర కట్టి...  చంద్రవదన చేరవస్తే
చూపులకే పలుకొచ్చిందంట...  జాబిలికే నడకొచ్చిందంట



చరణం 2 :


ఆరారు ఋతువుల్లో...  అందాల మధువుల్లో
అరుదైన రుచులెన్నో అందించనా
విరితేనెలో తానమాడించానా


పరువమనే పల్లకిలో అందమనే బాలికలా
వాలు కనుల వలుపు గనుల నీలి మెరుపులు
పిలుపులేవో మేలుకోలిపే ఈ ఉషస్సులో


ఇంద్రధనుస్సు చీర కట్టి...  చంద్రవదన చేరవస్తే
చుక్కలకే కులుకొచ్చిందంట...  సూర్యుడికే కునుకొచ్చిందంట





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=846

Wednesday, December 13, 2017

అపురూప రూపసి నీవు

చిత్రం : గురు శిష్యులు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి :  



అపురూప రూపసి నీవు... అతిలోక ప్రేయసి నీవు
కల నీవు... కళ నీవు..
తుది లేని కాంతివి నీవు... ఎద నిండు శాంతివి నీవు...  



అపురూప దైవము నీవు... అతిలోక ప్రేమవు నీవు
గుడి నీవు... ఒడి నీవు...
ఎదలోని సవ్వడి నీవు... ఎనలేని ఒరవడి నీవు...



చరణం 1 :



నిను చూచే చూపులతో... కనులైనవి వెన్నెల కలశాలు
నిను తలచే తలపులతో... మనసైనది మల్లెల వెల్లువలు


నీ కోరికలే నా వేడుకలు... నీ కౌగిళ్ళే వనమాలికలు
నీ నవ్వులే తారకలు... నీ ఊహలే డోలికలు


అపురూప రూపసి నీవు... అతిలోక ప్రేమవు నీవు
కల నీవు... కళ నీవు..
ఎదలోని సవ్వడి నీవు... ఎద నిండు శాంతివి నీవు...  



చరణం 2 :


నే పిలిచిన పిలుపుకు బదులైనావు...
నే తెరచిన ఇంటికి వెలుగైనావు...


నా విడిపూలను ముడి వేసిన దారం నీవు
నా ఎద పలికే వేదాలకు సారం నీవు
ఓంకార నాదం నీవు...



అపురూప రూపసి నీవు... అతిలోక ప్రేమవు నీవు
కల నీవు... కళ నీవు..
ఎదలోని సవ్వడి నీవు... ఎద నిండు శాంతివి నీవు...  



చరణం 3 :


నీతోనే నా హృదిలో... ఉదయించెను వలపుల కిరణాలు
నీ తపసే నా మనసై... తొలగించెను కలతల మేఘాలు


నీ గారాలే... నయగారాలు
నీ లాలనలే...  పరిపాలనలు..
నీ కోసమే పుట్టుకలు... నీతోనే అల్లికలు



అపురూప రూపసి నీవు... అతిలోక ప్రేమవు నీవు
కల నీవు... కళ నీవు..
ఎదలోని సవ్వడి నీవు... ఎద నిండు శాంతివి నీవు...






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1916

Friday, March 31, 2017

పాడితే శిలలైన కరగాలి

చిత్రం : గోరింటాకు (1979)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  సుశీల  



పల్లవి : 


పాడితే శిలలైన కరగాలి
పాడితే శిలలైన కరగాలి... జీవిత గతులైన మారాలి


నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి



చరణం 1 :


నీ పాటతోటి నే పగిలిపోవలే... పాడమన్నది హృదయం
నీ పాటతోటి నే పగిలిపోవలే... పాడమన్నది హృదయం


పెగలిరాక నా పాట జీరగా... పెనుగులాడినది కంఠం
పెగలిరాక నా పాట జీరగా... పెనుగులాడినది కంఠం


గొంతుకు గుండెకు ఎంత దూరం...
గొంతుకు గుండెకు ఎంత దూరం... ఆశనిరాశకు అంతే దూరం
ఆశనిరాశకు అంతే దూరం... 


పాడితే శిలలైన కరగాలి... జీవిత గతులైన మారాలి
నా పాటకు ఆ బలమున్నదో లేదో... పాడిన పిదపే తెలియాలి
పాడితే శిలలైన కరగాలి



చరణం 2 :


తాళి కట్టెడి వేళ కోసమే వేచి చూసినది విరిమాలా
కట్టే వేళకు కట్టని తాళిని కత్తిరించినది విధిలీలా


వేచిన కళ్ళకు కన్నీళ్ళా.... వేయని ముడులకు నూరేళ్ళా
నా పాటకు పల్లవి మారేనా... ఈ పగిలిన గుండె అతికేనా
ఈ చితికిన బ్రతుకిక బ్రతికేనా..... 






Thursday, March 30, 2017

కౌగిలి... తొలి కౌగిలి

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : మైలవరపు గోపి
నేపధ్య గానం : బాలు,  శైలజ 



పల్లవి :


కౌగిలి...  తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
కౌగిలి....  ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి


ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని..హో
కౌగిలి తొలి  కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా ఇలా నిలిచివుండని


కౌగిలి తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి 


చరణం 1 :



ఎంతందం ఏమందం...  ఈ లేతమేనిలో
ఆశలెన్నో రేపుతోంది గుండెలో..హా
ఈ సొగసు నా మనసు...  నీ చేతికివన్నా
నిన్ను వలచి నన్ను మరచి నిలవనా
ఆ.. పొదలొ పువ్వు....  నీ యెదపై నేను
నింగికి మబ్బు... నాతో నువ్వు



కౌగిలి....  ఇది తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి... సన్నజాజి పందిరి
ఇలా ఇలా...నిలిచివుండని


కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి 



చరణం 2 :


నీ చేయి నా చేయి కలిసి నడవని
నీ అడుగున అడుగు వేసి సాగని..హా
ఎపుడమ్మ తీరేది ఈ వయస్సు  ఆకలి
నా కలలో  నిన్న మొదటి రాతిరి
సమయం రాని... ఒకటై పోని
వలపు నిండని... కలలు పండని


కౌగిలి ఇది...తొలి కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి
ఇది ఎన్నటికి సన్నజాజి పందిరి
ఇలా..ఇలా..నిలిచివుండని


కౌగిలి..తొలి..కౌగిలి
ఇది పడుచువారి అందమైన లోగిలి






డిస్కో..నా రాజా

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జానకి 


పల్లవి :


డిస్..డిస్..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..నా రాజా


డిస్కో నారాజా..ఆహా..ఆహా
హా.. డిస్కో నా రాజా..ఆహా..ఆహా
హా..నా ఈడే సవాల్..నా జోడే సవాల్
ఈ రేయిలో హాయిలా... నిన్నే గతం..ఈ నాడే నిజం
ఆడే పాడే... వయసుల్లో... డిస్కో నా రాజా..ఆహా..ఆహా
హ్హా..ఉస్కో నా రాజా..ఆహా..ఆహా..ఆహా..ఆ 



చరణం 1 :



డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..నా రాజా..ఆహా..ఆహా
హ్హా..డిస్కో..నారాజా..అహా..అహా


హా..మారాలనీ... పాడి వచ్చాననీ
నీ వద్ద రావాలిరా..
వాటేసుకో... చలి కాటేసుకో
కోడై కూసే వయసుల్లో
డిస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఉస్కో నా రాజా..అహా..అహా
ఆహ్హా.... 



చరణం 2 :



డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
ఉస్కో..ఉస్కో..ఉస్కో..నా రాజా
డిస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఉస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఈ జోరులో..తీపి నేరాలనీ
చేసేయ్యరా..కొంటేగా..నా ధ్యాసలో
సయ్యాటాడుకో..ఆనందాల అంచుల్లో


డిస్కో..నా రాజా..అహా..అహా
హ్హా..ఉస్కో..నా రాజా..అహా..అహా
ఆహ్హా..ఆ..
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా
డిస్కో..డిస్కో..డిస్కో..నా రాజా



యవ్వనమే ఎదురై నిలిచింది

చిత్రం : గిరిజా కళ్యాణం (1981)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది



మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
మందారమకరందమై... అందమై... అందమై...


యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై... బంధమై... బంధమై



చరణం 1 :


అందీ అందని రుచితో నీ అందం కవ్విస్తుంటే...
చక్కిలిగింతల చలికే ఆ చుక్కలు దిగి వస్తుంటే


చూసీ చూడని కలలే నీ చూపులు లాగేస్తోంటే
ముద్దులు ముచ్చట పడుతూ నీ ముద్దర వేసేస్తోంటే
చలిమంట కాగాలి చెలి జంటలో... జంటలో.. జంటలో



యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది



చరణం 2 :



కౌగిలి చాలని వలపే ఏకాంతం కోరుతూ ఉంటే
గాలికి తెలియని కబురే చెలి కన్నులు పంపుతు ఉంటే 


మాపటి వేళకు సిగలో విరులే మరులౌతుంటే
వెచ్చని ఆ ఊపిరులే నా వయసుకు గురి పెడుతుంటే
అందాల తొలి పూజ అందాలిలే... అందాలిలే... అందాలిలే



యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది
మమతల మధుమాసంలో.. మల్లెల సావాసంలో
శృంగారసుమగంధమై... బంధమై... బంధమై


యవ్వనమే ఎదురై నిలిచింది... కౌగిలికే పిలిచింది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2660