Showing posts with label (త). Show all posts
Showing posts with label (త). Show all posts

Tuesday, February 8, 2022

పోలీస్ ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు





చిత్రం : తొలికోడి కూసింది (1981)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

గీతరచయిత : ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం : బాలు 

 

పల్లవి :


పోలీస్ వెంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు


పోలీస్ ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు

పచ్చీస్ వయసేనాడో నీకు  బక్షీసిచ్చాడు

నిన్నే గస్తీ కాచాడు


డ్యుటిలో ఉండి బ్యుటి చూసి... సెల్యుట్ చేశాడు

మఫ్టీలో వచ్చి  మనస్సులోనే... లాకప్ చేశాడు

మన కేసు ఈరోజు...  నువు ఫైసల్ చేయాలి 


పోలీస్ ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు


చరణం 1 :


లవ్ చేసేందుకు లైసెన్స్ ఉంది... నేనో సింగిలు గాణ్ణి

నివు సిగ్నలు ఇస్తే లగ్నం పెడతా... ఆపై డబుల్స్ గాడీ

బ్రేకు వద్దనీ లైటు వద్దనీ... రూల్స్ నేనే మార్చేయనా


పోలీస్ ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు 


చరణం 2 :


నీ ఊసులతో నీ ఊహలతో... ఓవర్ లోడై మనసుంది

నీపై నేను నిలిపిన ప్రేమ... వన్‌వే ట్రాఫిక్కు కాదంది

ఛార్జి చేసినా ఫైను వేసినా... వేరే రూటుకి పోనన్నది


పోలీస్   ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు 


చరణం 3 :


టోపీ రంగు కోకను కట్టి... లాఠీలాంటి జడవేసి

జీపల్లే నీవు మాపటికొస్తే... సైడిస్తానూ గదికేసి

కౌగిలింతా కష్టడీలో... ఖైదుచేసీ విజిలేయనా 


పోలీస్ ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు

పచ్చీస్ వయసేనాడో నీకు  బక్షీస్ ఇచ్చాడు

నిన్నే గస్తీ కాచాడు

డ్యూటిలో ఉండి బ్యూటి చూసి...  సెల్యూట్   చేశాడు

 మఫ్టీలో వచ్చి మనస్సులోనే... లాకప్ చేశాడు

మన కేసు ఈరోజు... నువు ఫైసల్ చేయాలి   


పోలీస్ ఎంకటస్వామి నీకు పూజారయ్యాడు

ప్రేమ పూజారయ్యాడు 





Thursday, July 2, 2020

చెంగు చెంగున దూకింది వయసు

చిత్రం : తులసి (1974)
సంగీతం : ఘంటసాల
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : సుశీల



పల్లవి :


ఆ.. అహహా.. ఆ.. హహహా
ఆ.. హా... ఆ... హా.. ఆ


చెంగు చెంగున దూకింది వయసు
ఖంగు ఖంగున పాడింది మనసు
చెంగు చెంగున దూకింది వయసు
ఖంగు ఖంగున పాడింది మనసు
కొండకోనలోనా... కోనలోనా
కొండకోనలోనా కోనలోనా
మోగింది పిలుపు... మారు మోగింది తలపు 


చెంగు చెంగున దూకింది వయసు
ఖంగు ఖంగున పాడింది మనసు
లలల.. లలల్లా.. లల.. లల..
లలల.. లలల్లా.. లల.. లల..



చరణం 1 :


పావురాలకు పరువాలకు పంజరం లేదు
పిల్లగాలికి మల్లెపూలకు బిడియమే లేదు
పావురాలకు పరువాలకు పంజరం లేదు
పిల్లగాలికి మల్లెపూలకు బిడియమే లేదు


పాడుతున్న కోయిలమ్మకు పారుతున్న నీటిపాయకు...
పాడుతున్న కోయిలమ్మకు పారుతున్న నీటిపాయకు...
పడుచు గుండెకు పగ్గం లేదు.. లేనే లేదు



చెంగు చెంగున దూకింది వయసు
ఖంగు ఖంగున పాడింది మనసు
కొండకోనలోనా... కోనలోనా
కొండకోనలోనా కోనలోనా
మోగింది పిలుపు... మారు మోగింది తలపు 

లలల.. లలల్లా.. లల.. లల..
లలల.. లలల్లా.. లల.. లల...



Tuesday, July 9, 2019

మధురం.. మధురం

చిత్రం : తిరుగులేని మనిషి (1982)
సంగీతం : ఆత్రేయ
గీతరచయిత : కె.వి.మహదేవన్
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


మధురం.. మధురం.. హృదయం మధురం...  ప్రణయం మధురం..
మధురం.. మధురం.. వదనం మధురం...  అధరం మధురం
మధురం.. మధురం.. హృదయం మధురం...  ప్రణయం మధురం..
మధురం.. మధురం.. వదనం మధురం...  అధరం మధురం


మధురం నవయువ జీవన రాగం... మధురం
మధురం శుభ శోభన సంయోగం... మధురం
ఆ..  ఆ..  ఆ..
మధురం నవయువ జీవన రాగం... మధురం
మధురం శుభ శోభన సంయోగం... మధురం  


మధురం.. మధురం.. హృదయం మధురం...  ప్రణయం మధురం..
మధురం.. మధురం.. వదనం మధురం...  అధరం మధురం... ప్రణయం మధురం



చరణం 1 :


పెదవులు నీవి.. పదములు నావి... పదములు పలికే చతురులు నీవి
కన్నులు నీవి... కలలే నావి... కలలో జరిగే కథలే నీవి


హొయ్యళ్లు నీవి... లయలే నావి... లయలో ఆడే నెమళ్ళు నీవి
హొయ్యళ్లు నావి.. లయలే నీవి... లయలో ఆడే నెమళ్ళు నీవి
పొద్దులు నీవి.. హద్దులు నావి...  పొద్దుల హద్దుల ముద్దులు మనవి


మధురం మధురం.. హృదయం మధురం...  ప్రణయం మధురం..
మధురం మధురం.. వదనం మధురం...  అధరం మధురం...హృదయం మధురం



చరణం 2 :



కొమ్మలు మనవి... చిగుళ్ళు మనవి... కోకిల గొంతున  కోర్కెలు మనవి
ఎండలు మనవి... మబ్బులు మనవి... కొండలకోనల వాగులు మనవి


మల్లెలు మనవి... మంచులు మనవి... వెచ్చని శరత్తు మత్తులు మనవి
మల్లెలు మనవి... మంచులు మనవి... వెచ్చని శరత్తు మత్తులు మనవి
మూడవనెలకే మురిపాలొలికే ముద్దరాలు చేయును మనవి


మధురం.. మధురం.. హృదయం మధురం...  ప్రణయం మధురం..
మధురం.. మధురం.. వదనం మధురం...  అధరం మధురం


ఆ.. మధురం నవయువ జీవన రాగం... మధురం
మధురం శుభ శోభన సంయోగం... మధురం 



మధురం.. మధురం.. హృదయం మధురం...  ప్రణయం మధురం..
మధురం.. మధురం.. వదనం మధురం...  అధరం మధురం
హృదయం మధురం... ప్రణయం మధురం
వదనం మధురం... అధరం మధురం...




Friday, October 12, 2018

బ్రహ్మం తాత చెప్పింది

చిత్రం : తల్లా? పెళ్ళామా? (1970)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : కొసరాజు
నేపథ్య గానం : సుశీల



పల్లవి :


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది
 



చరణం 1 :



నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం
తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ
నీవాణ్ణే నువ్వు మెచ్చుకోవడం
తెలుగుదనమేమి కాదు నీ తెలివి బైట పడబోదూ
నీవాణ్ణే నువ్వు తిట్టకపోతే తెలుగువాడివే కాదు..


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది 




ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం
దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు
ఓట్ల కోసమై ఊళ్ళు తిరగడం
దేశం కోసం కాదు అది ప్రజాసేవకై కాదు
హాయ్...  ఛాన్స్ తగిలితే మంత్రినవుదునని ప్లాను లేకపోలేదు



బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది



చరణం 2 :




పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు
మన ప్రజలబాగుకు కాదు
పదవులకోసం ప్రాకులాడడం ప్రెస్టేజీకి కాదు
మన ప్రజలబాగుకు కాదు
పూలదండలిక పడబోవేమోనని చింతలేకపోలేదు


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది


పంచాయతి ప్రసిడెంటు కావడం
గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్ధే పోదూ
పంచాయతి ప్రసిడెంటు కావడం
గ్రామం బాగుకు కాదు ఆ ప్రక్కకు బుద్ధే పోదూ
ఆ.. హా..  ఉమ్మడి సొమ్ము భోంచేద్దామని ఊహ లేకపోలేదు


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది




చరణం 3 :



బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు
చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు
బ్రతికున్నప్పుడు నెత్తిననిప్పులు
చల్లడమంటే మోజూ అది సహజంరా ఈ రోజు
చచ్చిన పిమ్మట శిలావిగ్రహం స్థాపించడమే రివాజు


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది



పేకముక్కలు చేతపట్టితే
చీదరించుకొనిరానాడు...  ఛీఛీ..  అన్నారానాడూ
పేకముక్కలు చేతపట్టితే
చీదరించుకొనిరానాడు..  ఛీఛీ...  అన్నారానాడూ
క్లబ్బుల్లో పేకాటగాళ్ళకే గౌరవమున్నది ఈనాడూ


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది


చరణం 4 :





బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే
భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ
బిడ్డలు ఎక్కువ కన్నతల్లినే
భాగ్యవతన్నారానాడూ సౌభాగ్యవతన్నారానాడూ
బిడ్డలు లేని గొడ్రాలికే గౌరవమన్నారీనాడు


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది


ప్రజాక్షేమమే పరమార్థమ్మని
ప్రభువులు పలికారానాడూ...  పరిపాలించారానాడూ
ప్రజాక్షేమమే పరమార్థమ్మని
ప్రభువులు పలికారానాడూ...  పరిపాలించారానాడూ
రకరకాల పన్నులను తగిలించి నీతిని చంపారీనాడూ


బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యమిది
తుచ తప్పక ఇప్పుడు జరిగే నవీన కాలజ్ఞానమిది





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6541

Thursday, November 2, 2017

అల్లరి చేసే..వయసుండాలి

చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : 
నేపధ్య గానం : సుశీల, జె.వి. రాఘవులు



పల్లవి :



అల్లరి చేసే వయసుండాలి... ఆశలు రేపే మనసుండాలి 
అల్లరి చేసే వయసుండాలి... ఆశలు రేపే మనసుండాలి
ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి? 
నేనేం చెయ్యాలి?... నేనేం చెయ్యాలి? 


అల్లరి చేసే వయసుండాలి... ఆశలు రేపే మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి? 
నేనేం చెయ్యాలి?



చరణం 1 :


పిల్లగాలి వీస్తుంటే...  పైట ఎగిరి పడుతుంటే  
పచ్చికొబ్బరంటి పిల్ల... పైనపైన పడుతుంటే 
పిల్లగాలి వీస్తుంటే... పైట ఎగిరి పడుతుంటే 
పచ్చికొబ్బరంటి పిల్ల... పైనపైన పడుతుంటే


పలక్కుంటె ఉలక్కుంటె... ఏం చెయ్యాలి
పనికిరాడని ఒదిలెయ్యాలీ... 
పనికొచ్చే దెప్పుడనో... ఆ....



అల్లరి చేసే వయసుండాలి... ఆశలు రేపే మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి? 
నేనేం చెయ్యాలి?



చరణం 2 : 



పట్టెమంచం వేసుకున్న... పట్టుపరుపు పరుచుకున్న 
కనులకింత కునుకురాక...  మనసుకసలుకుదురులేక
పట్టెమంచం వేసుకున్న... పట్టుపరుపు పరుచుకున్న
కనులకింత కునుకురాక...  మనసుకసలుకుదురులేక


రాతిరంతా గడుస్తుంటె..ఏం చెయ్యాలి
పగలంతా పనిచెయ్యాలి... అదేమిటో నువ్వే చెప్పాలి... ఆ.. ఆ 



ఆఆఆ..అల్లరి చేసే వయసుండాలి... ఆశలు రేపే మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి? 
నేనేం చెయ్యాలి?



చరణం 3 :



మంచి చీర కట్టుకొని... మల్లెపూలు పెట్టుకొని 
అద్దంలో చూచుకుంటే... ఇంత అందమెందుకని
మంచి చీర కట్టుకొని... మల్లెపూలు పెట్టుకొని 
అద్దంలో చూచుకుంటే... ఇంత అందమెందుకని
గుండెనిండా గుబులైతె... ఏంచెయ్యాలి?



పెద్దవాళ్ళతో చెప్పి..పెళ్ళిచెయ్యాలి
అయ్యో..ఈ మొద్దు స్వరూపానికి ఎలా చెప్పాలి?




అల్లరి చేసే వయసుండాలి... ఆశలు రేపే మనసుండాలి 
ఏదీ లేని బావా నీతో ఏం చెయ్యాలి? 
నేనేం చెయ్యాలి?
నేనేం చెయ్యాలి..నేనేం చెయ్యాలి?  






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=2451

చకచకలాడే... నడుము చూడు

చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల, ఘంటసాల 




పల్లవి :


చకచకలాడే... నడుము చూడు
నడుమును ఊపే... నడకా చూడు


నడకను చూస్తూ వెనకబడే... ఈ పడుచువాడిలో పొగరూ చూడు


కోల కన్నుల కుర్రదానా... నీ కోపంలోనే కోరికవుంది
కోరిక దాచిన కుర్రవాడా... నీ కొంటెదనంలో గమ్మత్తుంది
కోల కన్నుల కుర్రదానా... నీ కోపంలోనే కోరికవుంది
కోరిక దాచిన కుర్రవాడా... నీ కొంటెదనంలో గమ్మత్తుంది 




చరణం 1 :



కరినాగంటి... జడచూడు... అది కాటేస్తేనే మగవాడు
సుడిగాలంటి..మగవాడు... నన్ను చుట్టెయ్యాలి ఒకనాడు
కరినాగంటి... జడచూడు... అది కాటేస్తేనే మగవాడు
సుడిగాలంటి..మగవాడు... నన్ను చుట్టెయ్యాలి ఒకనాడు
అది నిజమవుతుందన్నాను...  నీ గడుసుతనాన్ని మెచ్చాను 


కోలకన్నుల కుర్రదానా... నీ కోపంలోనే కోరికవుంది..ఆహా
కోరికదాచిన కుర్రవాడా... నీ కొంటెదనంలో గమ్మత్తుంది 





చరణం 2 :



చెప్పలేక ఎన్నాళ్ళో దాచుకున్నాను...
నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు ఊరుకున్నాను
చెప్పలేక ఎన్నాళ్ళో దాచుకున్నాను
నువ్వొప్పుకోవని కొన్నాళ్ళు ఊరుకున్నాను


చెప్పలేనివి చెప్పేటందుకె... కన్నులున్నాయి
చెప్పలేనివి చెప్పేటందుకె... కన్నులున్నాయి


అవి ఒప్పుకుంటె మనసులు... రెండూ ఒకటవుతాయి
అవి ఒప్పుకుంటె మనసులు... రెండూ ఒకటవుతాయి



అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ
అహహా..అహహా..ఓహో ఓఓఓ..ఓహో ఓఓఓ 


కోలకన్నుల కుర్రదానా...  నీ కోపంలోనే కోరికవుంది
కోరిక దాచిన కుర్రవాడా...  నీ కొంటెదనంలో గమ్మత్తుంది 



చరణం 3 :




పిల్లను చూసిన అబ్బాయి... నీ పెళ్ళికి నేనూ వస్తాను
పెళ్ళికి వచ్చే అమ్మాయి... నా పక్కన పీటే ఇస్తాను
పిల్లను చూచిన అబ్బాయి... నీ పెళ్ళికి నేనూ వస్తాను
పెళ్ళికి వచ్చే అమ్మాయి... నా పక్కన పీటే ఇస్తాను 


నా మనసున పీటను వేశాను...  నీ మమతకు తాళికట్టాను


చకచకలాడే... నడుముచూడు
నడుమును ఊపే... నడకా చూడు
నడకను చూస్తూ వెనకబడే... ఈ పడుచువాడిలో పొగరూ చూడు


కోల కన్నుల కుర్రదానా... నీ కోపంలోనే కోరికవుంది
కోరిక దాచిన కుర్రవాడా... నీ కొంటెదనంలో గమ్మత్తుంది 


కోల కన్నుల కుర్రదానా... నీ కోపంలోనే కోరికవుంది
కోరిక దాచిన కుర్రవాడా... నీ కొంటెదనంలో గమ్మత్తుంది 






జాజిరి జాజిరి జాజిరి బావా

చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల




పల్లవి :



జాజిరి జాజిరి జాజిరి బావా... గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు... ఈ రోజైనా తెలుసుకుంటావా
జాజిరి జాజిరి జాజిరి బావా... గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు... ఈ రోజైనా తెలుసుకుంటావా
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా... గాజుల గలగల వింటావా




చరణం 1 :



నిగనిగలాడే నీలికళ్ళలో... నీడెవ్వరిదో చూస్తావా

గుబగుబలాడే గుండెలోపల... గుబులెవ్వరిపై చెపుతావా

నిగనిగలాడే నీలికళ్ళలో... నీడెవ్వరిదో చూస్తావా

గుబగుబలాడే గుండెలోపల... గుబులెవ్వరిపై చెపుతావా


రేపని మాపని ఆశలు పెడతావా...
రేపని మాపని ఆశలు పెడతావా
నీదేనని ఒప్పుకుంటావా... నేనంతటి వాడిని కానంటావా 


జాజిరి జాజిరి జాజిరి బావా... గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు...  ఈ రోజైనా తెలుసుకుంటావా
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా...  గాజుల గలగల వింటావా..ఆ




చరణం 2 :



నిలవక ఎగిరే  పైటకొంగును నీతో ముడేసుకుంటావా
పరుగులు తీసే పడుచును నీతో అడుగులేడు నడిపిస్తావా
నిలవక ఎగిరే  పైటకొంగును నీతో ముడేసుకుంటావా
పరుగులు తీసే పడుచును నీతో అడుగులేడు నడిపిస్తావా


కంచము మంచము ఒక్కటి చేస్తావా..
కంచము మంచము ఒక్కటి చేస్తావా
నా వాడిగ వుండిపోతావా... నీకంతటి రాత లేదంటావా 


జాజిరి జాజిరి జాజిరి బావా... గాజుల గలగల వింటావా
గలగలలాడే గాజుల మోజులు... ఈ రోజైనా తెలుసుకుంటావా
హోయ్..జాజిరి జాజిరి జాజిరి బావా... గాజుల గలగల వింటావా..ఆ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2206

పాడమన్నావు... పాడుతున్నాను

చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల




పల్లవి :


పాడమన్నావు... పాడుతున్నాను
పాడమన్నావు... పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను
పాడమన్నావు... పాడుతున్నాను




చరణం 1 :



మనసును మార్చి పాడలేక... నా మాటలే పాటగ మార్చాను
మనసును మార్చి పాడలేక... నా మాటలే పాటగ మార్చాను


మాటల తోటి కదలని..మనసు
మాటల తోటి కదలని..మనసు
పాటకు కదలి... పలికేనేమో..ఓఓ


ఏమో పాడమన్నావు...  పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట పాడుతున్నాను



చరణం 2 :



చినుకులకు చిగురించును మోడు... పదునైతే మొలకెత్తును బీడు
చినుకులకు చిగురించును మోడు... పదునైతే మొలకెత్తును బీడు


నువ్వేమో పదును అదును తెలియదన్నావు
నువ్వేమో పదును అదును తెలియదన్నావు
నేనేమో  పరుల సొమ్ము కాలేకున్నాను


పాడమన్నావు..పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట..పాడుతున్నాను



చరణం 3 :



పాతపాటే పాడుతున్నానా...  లేత వలపే నీదన్నా
పాతపాటే పాడుతున్నానా...  లేత వలపే నీదన్నా
మూసిన తలుపు యికనైనా...
మూసిన తలుపు యికనైనా...  తీసిచూడు నేనున్నానేమో...  ఏమో..



పాడమన్నావు....  పాడుతున్నాను
నా మనసుకు తెలిసిందొకటే పాట..పాడుతున్నాను
పాడమన్నావు....  పాడుతున్నాను






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2008

Friday, January 27, 2017

కనపడని చెయ్యేదో

చిత్రం : తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత :
నేపధ్య గానం : కె.బి.కె. మోహన్ రాజు 




పల్లవి :



కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం


కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం



చరణం 1 :


నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
నాది నావాళ్ళనే తాళ్ళతో కడుతుంది
ఆ తాళ్ళు లాగి నీ చేత తైతక్కలు ఆడిస్తుంది


కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం



చరణం 2 :


కనపడని చెయ్యేదో నడుపుతోంది నాటకం
ఆ నాటకాన నువ్వూ నేనూ ఆటబొమ్మలం... కీలుబొమ్మలం


కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం


కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం



చరణం 3 :



తలచింది జరిగిందంటే...  నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు
తలచింది జరిగిందంటే...  నీ తెలివేనంటావు
బెడిసిందా తలరాతంటూ విధిపై నెడతావు


మనము మనవాళ్ళనీ మాటల్లో అంటావు
నేనూ నేనన్న అహంతో తెంచుకుని పోతావు


కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం



చరణం 4 :


కర్మను నమ్మిన వాళ్ళెవరు కలిమిని స్థిరమనుకోరు.. కళ్ళు మూసుకోరు
మనసు తెలిసినవాళ్ళెవరు మమత చంపుకోరు.. మనిషినొదులుకోరు
ఉన్నదాని విలువెరుగనివారు పోగొట్టుకుని విలపిస్తారు


కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం




చరణం 5 :



మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది
మనిషిలాగ జీవించేది నీ చేతల్లోనే ఉంది
మంచి చెడు ఏదైనా నీ చేతుల్లోనే ఉంది


కావాలని నిప్పు తాకితే చెయ్యి కాలక మానదు
కాలినందుకు కర్మ అంటే గాయమేమో మానదు 



కనపడని చెయ్యికాదు నడిపేది నాటకం
కనపడుతూ నువ్వూ నేనే ఆడుతాము బూటకం






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2007

Monday, August 8, 2016

నీకున్నది నేననీ






చిత్రం :  తాశీల్దారు గారి అమ్మాయి (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల





పల్లవి :




నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ
మనమింక కోరేది వేరేదీ లేదనీ
కలిసిపోయాము..ఈనాడు
కలసి వుంటాము..ఏనాడు


నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ
మనమింక కోరేది వేరేదీ లేదనీ
కలిసిపోయాము..ఈనాడు
ఆ..కలసి వుంటాము..ఏనాడు



చరణం 1 : 



కొండల నంటి..కోనలు వున్నాయి
ఆ..ఆ..కోనల కండగ కొండలు వున్నాయి
ఎండ వానలు ఎన్నో చూచాయి
అ... హ.... హ..
ఇలాగే నిన్నూ నన్నూ..వుండమన్నాయి..ఆఆఆఅ



కలిసిపోయాము ఈనాడు..కలసి వుంటాము ఏనాడు


చరణం 2 :



ఎన్నెన్ని వసంతాల సొగసు తెచ్చినావో
ఎన్నెన్ని సెలయేళ్ళ చలువై వెలిసావో
ఎన్నిసార్లు నీ యెదలో నన్ను దాచినావో
ఎన్ని జన్మలను బంధం మోసుకొచ్చినావో


కలిసిపోయాము ఈనాడు..కలసి వుంటాము ఏనాడు



చరణం 3 :



మనసే మనకు తెలిసిన కోవెలగా..ఆఆఆ
మమతే మనము కొలిచే దైవముగా..ఆఆఆ
జీవితమే ఒక దీపారాధనగా..ఆహాహాహ
చెలిమే నువ్వూ నేనూ..కోరే వరముగా..ఆఆఆ

కలిసిపోయాము ఈనాడు..కలసి వుంటాము ఏనాడు


నీకున్నది నేననీ..నాకున్నది నీవనీ
మనమింక కోరేది..వేరేదీ లేదనీ
కలిసిపోయాము ఈనాడు..కలసి వుంటాము ఏనాడు
ఆహాహాహా..ఆహాహాహా..ఆహాహాహా..ఆహాహాహా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2358

Wednesday, June 1, 2016

నాటుకొట్టుడు వీరకొట్టుడు




చిత్రం :  త్రినేత్రుడు  (1988)
సంగీతం :  రాజ్-కోటి
గీతరచయిత :
నేపధ్య గానం :  బాలు, జానకి




పల్లవి :


నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే


నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే


ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి..  గాలి బలి యమో యమో


నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే


నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే




చరణం 1 :



ముట్టడించి కొట్టాలా బుగ్గల్లో నా ముద్దు
మట్టగించి తొక్కాలా మంచాలే ఈ పొద్దు
కోకపల్లి రాజ్యంలో కోటగుమ్మమేడుందో
ఆనతీసి పట్టేదాకా ఆరాటాలమ్మో



చుట్టుముట్టి పట్టాలా కౌగిట్లో నా సోకు
కట్టుతప్పి పోవాలా చీరమ్మే కాసేపు
రైకపల్లి రాజ్యంలో ముళ్ళుపడ్డ ముంగిట్లో
చిక్కులిప్ప తీసే దాకా మోమాటాలమ్మో


శృంగారానికి సింగంలాంటి చిన్నోడొస్తుంటే
సిగ్గు ఎగ్గు పుట్టిళ్ళల్లో నుగ్గైపోతుంటే
తాకిడి వేళా చెలి తట్టుకోవాలా
కస్సుబుస్సు పూజలతో కాముడికి నమో నమో




నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే


నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే




చరణం 2  :



చప్పరింత కొట్టాలా మైకంలో ఓమాటు
అప్పగింతలియ్యాలా మెత్తంగా ఈనాడు
పైటపల్లి తాలూకా పాలకొల్లు సంతల్లో
పండుకోసుకెళ్ళేదాకా పంతాలేనమ్మో


దండయాత్ర చెయ్యాలా దండల్తో ఓనాడు
ఎండ వెన్నెలవ్వాలా ఏనాడో ఓనాడు
పూలపల్లి తాలూకా పూతరేకు సందుల్లో
తేనెబొట్టు పెట్టిన్నాడే పేరంటాలమ్మో


వయ్యారానికి ఉయ్యాలొచ్చే ఊహే చూస్తుంటే
ఉట్టి పట్టి చట్టే కొట్టే ఊపే వస్తుంటే
గుద్దులాటల్లో తొలి ముద్దులాటల్లో
మొగ్గే విచ్చే మోజులతో ప్రేమలకే...  ఘుమో ఘుమో





నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే


నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే


ఈడు దుప్పట్లో మన జోడు చప్పట్లు
పొద్దు చీకట్లో మన ముద్దు ముచ్చట్లు
కౌగిలిలో సిగ్గు బలి..  గాలి బలి యమో యమో


నాటుకొట్టుడు వీరకొట్టుడు దంచికొట్టుడు
దద్దరిల్లే కొంటెపిల్లడు పండు గిచ్చాడే


నాటుకొట్టుడు వీరకొట్టుడు కన్నుకొట్టుడు
రెచ్చగొట్టే చంటి పిల్లడు పాలకొచ్చాడే





Wednesday, April 13, 2016

దాచుకోకు వలపు వాలు కన్నులా

చిత్రం : తల్లీ కొడుకుల అనుబంధం (1982)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


దాచుకోకు వలపు వాలు కన్నులా
దరహసించు దశమినాటి వెన్నెలా
మాపటింటి జాడలో... మల్లెపూల నీడలో
కరగాలి వన్నెలన్ని వెన్నలా



దోచుకోకు చిలిపి వాడి కన్నులా
పరిమళించు నవమి లేత వన్నెలా
నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో
అడగాలి ముద్దులన్ని నన్నిలా...


దాచుకోకు వలపు వాలు కన్నులా
పరిమళించు నవమి లేత వన్నెలా



చరణం 1 :


పున్నమంటి చిన్నదాని కౌగిట..
పూటకొక్క పులకరింత పుట్టదా


సన్నజాజి వన్నెకాడి సందిట
సందెగాలి సలపరింత పెట్టదా

పొంగుతున్న వయసులు... బెంగపడ్డ మనసులు
పెరగాలి పెళ్ళి ముందు ప్రేమలా



దోచుకోకు చిలిపి వాడి కన్నులాదరహసించు దశమినాటి వెన్నెలా




చరణం 2 :


చినుకులాంటి చిన్నవాడి చూపులే...
వలపు తెలుపు మాట లేని పిలుపులు


మేని వంటి కన్నెపిల్ల మేనిలో...
తొంగి చూసే నింగిలోని మెరుపులు


పడుచు పడ్డ విరుపులు వయసు ఆట విడుపులు
కలవాలి ప్రేమ ఇంక పెళ్ళిగా... ఆ.. ఆ


దాచుకోకు వలపు వాలు కన్నులా
దరహసించు దశమినాటి వెన్నెలా


నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో
అడగాలి ముద్దులన్ని నన్నిలా...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4206

Sunday, April 3, 2016

ఆనాడు ఈనాడు ఏనాడు




చిత్రం : తాయారమ్మ-బంగారయ్య (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :
నేపధ్య గానం : జి. ఆనంద్, సుశీల








పల్లవి :


ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు
ఆడించాడు ఆడకపోతే పీడించాడు
అడుగుల మడుగులు ఒత్తించాడు మగవాడే.. మన పగవాడు


ఆనాడు ఈనాడు ఏనాడుఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు




చరణం 1 :




ఒకడు అమ్ముకుపోయాడు... ఒకడు అడవికి పంపాడు
ఒకడేమో జూదంలో పందెం కాసాడు
తల్లిని చేసి ఒకడేమో తపస్వి అన్నాడు
తండ్రి భయపడి ఒకడేమో తాగి చచ్చినాడు
ఏ మగవాడు ఏ మగువని మనసున్నదిగా చూసాడు

మగవాడే...  మన పగవాడు
మగవాడే...  మన పగవాడు
ఆనాడు ఈనాడు ఏనాడు
ఆడదాన్ని ఆట బొమ్మగా చేశాడు మగవాడు



NO... ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు
ప్రేమించాడు దేవత నీవని పూజించాడు
పరువు బ్రతుకు నీవన్నాడు మగవాడే బలి పశువయ్యాడు
 ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాని కీలు బొమ్మే అయ్యాడు


చరణం 2 :


నెత్తిన కూర్చుంది ఒకతి
నెత్తిన తన్నింది ఒకతి
ఒకతేమో శపథం చేసి యుద్ధం చేసింది
నాయకురాలై ఒకతేమో నెత్తురు పారించింది
తండ్రికి భయపడి ఒకతేమో ధనాన్ని పెళ్ళాడింది
ఏ మగువైనా మగవాడ్ని మనిషిగా చూసిందా?
మగవాడే బలి పశువయ్యాడు
మగవాడే బలి పశువయ్యాడు



ఆనాడు ఈనాడు ఏనాడు ఆడదాన్ని ఆట బొమ్మగా చేసాడు మగవాడు


చరణం 3 :


సగమే ఇచ్చి మగువను మొత్తం దోచేస్తాడు మగవాడు
సగము ఇచ్చాకే సన్యాసి మిగులుతాడు ఈ మగవాడు
యుగయుగాల మీ బానిసే ఆడది
యుగాయుగాలే మా శాపమే ఈ ఆడది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4845

Tuesday, March 22, 2016

నిన్న నీవు నాకెంతో దూరం



చిత్రం: తలంబ్రాలు (1986)
సంగీతం: సత్యం
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: సుశీల, బాలు 



పల్లవి :


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...



నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో...  




చరణం 1 : 


నీలాల నింగి వంగి నేల చెవిలో ఇలా అంది
నీలాల నింగీ వంగీ నేల చెవిలో ఇలా అందీ


నీవున్నదాకా నేనున్నదాకా ఉంటుంది ప్రేమన్నదీ..
ఆ ప్రేమ నాలో ఉంది నీ పొందునే కోరుకుంది
ఆ ప్రేమ నాలో ఉందీ నీ పొందునే కోరుకుందీ


ఈ జన్మకైనా ఏ జన్మకైనా సరిలేరు మనకన్నదీ..
పరువాల పందిట్లో సరదాల సందిట్లో పండాలి వలపన్నదీ హొయ్
సరిలేని సద్దుల్లో విడిపొని ముద్దుల్లో మునగాలి మనమన్నదీ..


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా.. తేనెలో తీపిలా.. తోడుగా నాతో ఉండిపో... హొ  



చరణం 2 :



గోదారి కెరటంలోనా..  గోరంత సొగసే ఉంది
హొయ్.. గోదారి కెరటంలోనా.. గోరంత సొగసే ఉందీ


నీరెండలాంటి నీ చూపులోన కొండంత సొగసున్నదీ


కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
కార్తీక పున్నమిలోనా కాసింత హాయే ఉందీ
ఏ వేళనైనా నీ నీడలోనా ఎనలేని హాయున్నదీ


కడసంధ్య వాకిట్లో కాపున్న చీకట్లో కరగాలి వయసన్నదీ హొయ్
చిరునవ్వు చిందుల్లో మురిపాల విందుల్లో సాగాలి మనమన్నదీ హొయ్


నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
కంటిలో పాపలా తేనెలో తీపిలా తోడుగా నాతో ఉండిపో...



నిన్న నీవు నాకెంతో దూరం ... దూరం.. దూరం.. దూరం
నీవె నాకు ఈనాడు ప్రాణం ... ప్రాణం.. ప్రాణం.. ప్రాణం
  





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13104

Saturday, October 3, 2015

పన్నెండేళ్ళకు పుష్కరాలు





చిత్రం: త్రిశూలం (1982)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల


పల్లవి:


తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు.. ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో.. పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు.. ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో.. పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం
తం తననం తం తననం 



చరణం 1 :



ముద్దుగా పుట్టాను పొదలలో పువ్వులాగా
దిద్దితే ఎదిగాను పలకలో రాతలాగా
అల్లరిగా జల్లులుగా కదిలావు ఏరులాగా
ఒంపులుగా సొంపులుగా కులికావు ఈడురాగా

ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. తోడైనవాడితో కలిసిపోగా హా..
ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. తోడైనవాడితో కలిసిపోగా
గలగలలుగ కిలకిలలుగ.. తొలికలలుగ వడి సెలలుగ
గలగలలుగ కిలకిలలుగ.. తొలికలలుగ వడి సెలలుగ
ఉరికాను నిన్ను చేరగా


తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు



చరణం 2 :


మొక్కువై ముడుపువై ఉన్నావు ఇన్నినాళ్ళు
మక్కువై మనసువై తీర్చుకో మొక్కుబళ్ళు
మేలుకొని కాచుకొని వెయ్యైనవి రెండు కళ్ళు
చేరుకొని ఆనుకొని నడవాలి కాళ్ళు కాళ్ళు

చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు
చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు
నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు


చెరిసగముగ సరిసమముగ.. చిరుజగముగ చిరునగవుగ
చెరిసగముగ సరిసమముగ.. చిరుజగముగ చిరునగవుగ
చేద్దాము కాపురాలు


తం తననం తం తననం
తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. పదహారేళ్ళకు పరువాలు
ఆనాడు చేసేవి తానాలు.. ఈనాడు వచ్చేవి తాపాలు
తాపాలు ఆరాలి తానాలతో.. పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం
తం తననం తం తననం 






వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం



చిత్రం : త్రిశూలం (1982)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా


వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా
 



చరణం 1 :



చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు

చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు

చేయి చేయి చేసిన బాసకు ఊపిరి నీవైనావు

చెలిమి కలిమి అల్లిన తీగకు పందిరి నీవైనావు



నా ఆశకు రూపం నీవై.. నా ఆశయదీపం నీవై
నా ఆశకు రూపం నీవై.. నా ఆశయదీపం నీవై
నీవు నేను మనమౌదాం.. నీవు నేను మనమౌదాం
మనమే మనకొక మతమౌదాం



వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా 



చరణం 2 :


జీవంపోసే రాగంకోసం వేచిన పల్లవి నేను

భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను

జీవం పోసే రాగం కోసం వేచిన పల్లవి నేను

భావం తెలిసిన గీతం కోసం వెతికిన రాగం నేను


ఈ మమతకు శృతినే నేను.. ఈ నడతకు లయనే నేను
ఈ మమతకు శృతినే నేను.. ఈ నడతకు లయనే నేను
నేను నేనను ఇద్దరము..  నేను నేనను ఇద్దరము
నిన్న రేపటి సంగమము 




వెలుగుకు ఉదయం.. చెలిమికి హృదయం
నొసటికి తిలకం.. కురులకు కుసుమం
జతపడి ఉన్నవి అనాదిగా..  జన్మజన్మల ఋణాలుగా
జతపడి ఉన్నవి అనాదిగా.. జన్మజన్మల ఋణాలుగా 




Saturday, September 12, 2015

నా తోడువై..నా నీడవై

చిత్రం :  తోడు-నీడ (1983)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


నా తోడువై..నా నీడవై
నా లాలన నా పాలన..నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై

నా తోడువై... నా నీడవై
నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై





చరణం 1 : 

       

నీ రూపం కలకాలం..నా ఎదలో  కదలాడే అపురూప అనురాగ దీపం
నీ నవ్వుల సిరి మువ్వల చిరునాదం ప్రతి ఉదయం వినిపించు..భూపాల రాగం
మన లోకం...అందాల లోకం
మన గీతం...ఆనంద గీతం
మన బ్రతుకు తుది లేని సెలయేటి గానం


నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై




చరణం 2 :


నీ చెంపల ఎరుపెక్కే..నును కెంపుల సొంపులలో.. పూచింది మందార కుసుమం
నీ మమతలు విరజల్లే విరి తేనెల మధురిమలు.. విరిసింది నవ పారిజాతం

నీ రాగం...అతిలోక బంధం
నీ స్నేహం...ఎనలేని దాహం
అనుదినము ఒక అనుభవం రసమయ సంసారం


నా తోడువై.. నా నీడవై
నా లాలన నా పాలన.. నా జీవన జీవం నీవై
నా స్వర్గం నీ తోనే.. నా సర్వం నీ లోనే
చూస్తున్న నేనే నీవై




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2819

Monday, August 17, 2015

ఇప్పుడేమంటావూ

చిత్రం :  తల్లి కొడుకులు (1973)
సంగీతం :  జి.కె. వెంకటేశ్
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  బాలు, సుశీల





పల్లవి : 


హా హా హా....
ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
ఇప్పుడే మంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ...మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటావూ..ఊఊఊఊ       






చరణం 1 :



పచ్చగా.. ఆ... ఆ...
పచ్చగా మెరిసె పరువం.. పదే పదే చూశానూ
పచ్చగా మెరిసె పరువం.. పదే పదే చూశానూ
కైపు రేపే నీ అందం.. ఆ కైపు రేపే నీ అందం కళ్ళతో తాగేశానూ
నా చేతి చలవతో.. నీ ప్రాణం నిలిచిందీ
నా చేతి చలవతో.. నీ ప్రాణం నిలిచిందీ
నీ లేత నవ్వుతో నా ప్రాణం పోతుందీ


ఇప్పుడే మంటావూ.. ఎలా వుందంటావూ


ఇప్పుడేమంటాను.. చిక్కువడి పోయాను
పువ్వులా విరబూసీ.. మొగ్గనై పోయానూ
ఇప్పుడేమంటాను..ఊ... ఊ... 




చరణం 2 :



వెచ్చగా..ఆ.. ఆ..
వెచ్చగా నువు.. నిమురుతువుంటే
వేయి వీణలు... మ్రోగెనూ
వెచ్చగా నువు నిమురుతువుంటే
వేయి వీణలు మ్రోగెనూ


కొంటెగా నువు చూస్తుంటే.. కొంటెగా నువు చూస్తుంటే
కోటి ఊహలు మూగేనూ
ఈ పులకరింత...
ఈ పులకరింత.. ఏనాడూ ఎరుగను
ఈ మొదటివింత.. ఏ జన్మకూ మరువను



ఇప్పుడేమంటావూ..ఎలా వుందంటావూ
కత్తిలాంటమ్మాయీ..ఈ..మెత్తబడిపోయావూ
ఇప్పుడే మంటానూ..ఊ...ఊ.. 

ఇప్పుడేమంటాను.. చిక్కువడి పోయాను






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3610

Thursday, July 2, 2015

అదిగదిగో... యమునా తీరం

 చిత్రం : తెల్ల గులాబీలు (1984)

సంగీతం : శంకర్-గణేష్

గీతరచయిత  : మైలవరపు గోపీ

నేపధ్య గానం  : బాలు, జానకి


పల్లవి:


అదిగదిగో..ఓఓ..ఓ.. యమునా తీరం..

మాసం చైత్రం.. సంధ్యసమయం..

అటు ఇటు.. పొద ఎద..

అంతా..విరహం. విరహం..

మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..

అయినా.. ప్రణయం మధురం..

ప్రియా.. ప్రియా.. జారిపోనీకు తరుణం..


అదిగదిగో.. యమునా తీరం..మాసం చైత్రం.. సంధ్యసమయం..

అటు.. ఇటు.. పొద.. ఎద..

అంతా..విరహం... విరహం..

మరీ మరీ.. వేగిపోతోంది..హృదయం..

అయినా.. ప్రణయం మధురం..

ప్రియా..ప్రియా..జారిపోనీకు తరుణం..


చరణం 1 :


దూరాన ఏ వాడలోనో.. వేణుగానాలు రవళించ సాగే..

ఓ.. ఓ.. ఓ.. గానాలు వినిపించగానే..

యమున తీరాలు పులకించి పోయే..

పూల పొదరిళ్ళు పడకిళ్ళు కాగా..

చిగురు పొత్తిళ్ళు తల్పాలు కాగా..

ఎన్ని కౌగిళ్ల గుబులింతలాయే..


అదిగదిగో.. యమునా తీరం.. మాసం చైత్రం.. సంధ్యసమయం..

అటు.. ఇటు.. పొద.. ఎద..

అంతా.. విరహం.. విరహం..

మరీ మరీ.. వేగిపోతోంది.. హృదయం..

అయినా.. ప్రణయం మధురం..

ప్రియా..ప్రియా..జారిపోనీకు తరుణం..

చరణం 2 :


విధి లేక పూచింది కానీ.. ముళ్ళగోరింట.. వగచింది..ఎదలో..

ఆఆ... ఆ..ఆ...పూచింది ఏ చోటనైనా..

పూవు చేరింది పూమాలనేగా...

ఏ సుడిగాలికో.. ఓడిపోక..

ఏ జడివానకీ.. రాలిపోక..

స్వామి పాదాల చేరింది తుదకు..


అదిగదిగో.. హా... అ..ఆ.ఆఅ.. యమునా తీరం..

మాసం చైత్రం.. సంధ్యసమయం..

అటు ఇటు.. పొద ఎద..

అంతా..విరహం... విరహం..

మరీ మరీ వేగిపోతోంది హృదయం..

హా... ఆఅ..ఆ..అయినా.. ప్రణయం మధురం..

ప్రియా..ప్రియా..జారిపోనీకు తరుణం..




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12026

Tuesday, December 30, 2014

తూర్పూ పడమర ఎదురెదురూ

చిత్రం :  తూర్పు పడమర (1976)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల, కోవెల శాంత



పల్లవి :

తూర్పూ పడమర ఎదురెదురూ..నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ
ఈ ప్రశ్నకి బదులేదీ?.. ఈ సృష్టికి  మొదలేదీ? 


తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ
ఈ ప్రశ్నకి బదులేదీ . . ఈ సృష్టికి మొదలేదీ


చరణం 1 :


తూర్పున ఉదయించే సూర్యుడు.. పడమట నిదురించునూ
పడమట నిదురించే సూర్యుడే.. తూర్పున ఉదయించునూ
ఆ తూర్పు పడమరకేమౌనూ.. ఈ పడమర తూర్పునకేమౌనూ 

ఈ ప్రశ్నకి బదులేదీ?..  ఈ సృష్టికి మొదలేదీ
తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ


ఈ ప్రశ్నకి బదులేదీ.. ఈ సృష్టికి మొదలేదీ


చరణం 2 :


నింగిని సాగే నీలి మేఘం నేల వడిలో వర్షించునూ
నేలను కురిసే ఆ నీరే నింగిలో మేఘమై పయనించునూ
ఆ నింగికి నేల ఏమౌనూ? ఈ నేలకు నింగి ఏమౌనూ 


ఈ ప్రశ్నకి బదులేదీ? ఈ సృష్టికి మొదలేదీ?
తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ
కలియని దిక్కులు కలవవనీ.. తెలిసి ఆరాటం దేనికనీ


ఈ ప్రశ్నకి బదులేదీ.. ఈ సృష్టికి మొదలేదీ


చరణం 3 :


వేయని నాటకరంగం పైనా రాయని నాటకమాడుతున్నానూ
సూత్రధారికి పాత్రధారులకు తేడా తెలియక తిరుగుతున్నామూ
నాటకమే ఒక జీవితమా? జీవితమే ఒక నాటకమా
ఈ ప్రశ్నకు... ఈ ప్రశ్నకు..


జీవితమే ఒక నాటకమైతే... నాటకమే ఒక జీవితమైతే
పాత్రలు ఎక్కడ తిరిగినా.. సూత్రధారి ఎటు తిప్పినా
కథ ముగిసేలోగా కలవకుందునా.. ఆ సూత్రధారి తానే కలపకుండునా


విన్నావా ఇది విన్నావా... సూర్యుడా.. ఉదయ సూర్యుడా...
పడమటి దిక్కున ఉదయించాలని బ్రాంతి ఎందుకో?
సృష్టికే ప్రతి సృష్టి చేయు నీ దృష్టి మానుకో 


నిన్ను ఆశగా చూసే కనులకు..
కన్నీరే మిగిలించకూ...  ఇంకా ఇంకా రగిలించకూ
చంద్రుని చలువలు పంచుకో.. నిన్నటి ఆశలు తెంచుకో



తూర్పూ పడమర ఎదురెదురూ.. నింగీ నేలా ఎదురెదురూ



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=8003