చిత్రం: గజిని (2005)
సంగీతం: హరీస్ జయరాజ్
గీతరచయిత: వెన్నెలకంటి
నేపధ్య గానం: హరీష్ రఘవేంద్ర, బొంబే జయశ్రీ
పల్లవి:
హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది..
నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
అందమైన అబద్దం.. ఆడుకున్న వయసే..
నాలో విరహం పెంచుతున్నదీ..
చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది..
నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..
నాలో విరహం పెంచుతున్నదీ..
చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా... తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
చరణం 1:
కుందనం మెరుపు కన్నా... బంధనం వయసుకున్నా ..
చెలి అందం నేడే అందుకున్నా...
గుండెలో కొసరుతున్నా... కోరికే తెలుపుకున్నా...
చూపే వేసీ బ్రతికిస్తావనుకున్నా...ఆ..
కంటిపాపలా.. పూవులనే నీ కనులలో కన్నా..
నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా.... నీ కళ్ళే వాడిపోని పూవులమ్మా...
హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నది..
నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..
నాలో విరహం పెంచుతున్నదీ..
చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా ...తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
చరణం 2:
మనసులో నిన్ను కన్నా... మనసుతో పొల్చుకున్న...
తలపుల పిలుపులు విన్నా..
సెగలలో కాలుతున్నా .. చలికి నే వణుకుతున్నా..
నీడే లేని జాడే తెలుసుకున్నా...ఆ..
మంచు చల్లనా.. ఎండ చల్లనా.. తాపంలోనా మంచు చల్లనా ..
కన్నా..నీ కోపంలోనా ఎండ చల్లనా... కన్నా.. నీ కోపంలోనా ఎండ చల్లనా..
హృదయం ఎక్కడున్నదీ... హృదయం ఎక్కడున్నదీ..
నీ చుట్టూనే తిరుగుతున్నదీ...
అందమైన అబద్ధం.. ఆడుకున్న వయసే..
నాలో విరహం పెంచుతున్నదీ..
చూపులకై వెతికా.. చూపుల్లోనే బ్రతికా ...
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.. తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా.. తొలిసారీ .. కళ్ళు తెరిచీ స్వప్నమే కన్నా...
Showing posts with label గజిని (2005). Show all posts
Showing posts with label గజిని (2005). Show all posts
Sunday, December 9, 2012
ఒక మారు కలిసిన అందం
| చిత్రం: గజిని (2005) సంగీతం: హరీస్ జయరాజ్ గీతరచయిత: వేటూరి నేపధ్య గానం: కార్తీక్ పల్లవి: ఒక మారు కలిసిన అందం అల లాగ ఎగిసిన కాలం ఒక మారు కలిసిన అందం అల లాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టూకుంది నిన్నే అది నన్ను పిలిచినంది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే చూసానే చూసానే చరణం 1: పాత పదనిస దేనికది నస నడకలు బ్రతుకున మార్చినదే సాయంకాల వేళ దొరుకు చిరుతిండి వాసనలు వాడుక చేసిందే కుచ్చీ కూన చల్లగా నీ సా నను తాకే కొండ మల్లికా నీ సా సరిజోడు నేనేగా .. అనుమానం ఇంకేలా అ. ఒక మారు కలిసిన అందం అల లాగ ఎగిసిన కాలం కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే చరణం 2: పేరు అడిగితే తేనె పలుకుల జల్లుల్లో ముద్దగా తడిసానే పాలమడుగున మనసు అడుగున కలిసిన కనులను వలచానే మంచున కడిగిన ముత్యమా నీ మెరిసే నగవే చందమా హో.. కనులార చూడాలే తడి ఆరిపోవాలే ల ర లాల లర లల లాల ఓ ల ర లాల లర లల లాల కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే కంటికెదురుగ కనపడగానే అంతే తడబడినానే తన అల్లే కధలే పొడుపు వెదజల్లే కళలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టూకుంది నిన్నే అది నన్ను పిలిచినంది తరుణం నులివెచ్చగ తాకిన కిరణం కన్ను తెరిచిన కలువను చూసానే చూసానే చూసానే |
Subscribe to:
Posts (Atom)