Showing posts with label సిపాయి చిన్నయ్య (1969). Show all posts
Showing posts with label సిపాయి చిన్నయ్య (1969). Show all posts
Wednesday, December 7, 2016
ఒరే మావా ఏసుకోర సుక్క
చిత్రం : సిపాయి చిన్నయ్య (1969)
ఒరే మావా.. ఆ... ఆ.. హా.... ఒరే మావా.. ఆ.. ఆ..
ఈ రేతిరి చెయరా జల్సా.. హోయ్.. ఎక్కాలి చక్కని నిషా
హొయ్ పోకిరి సూపులు నీవి.. హోయ్ పొగరు వగరు నాది
ఒరే మావా ఏసుకోర సుక్క... తెచ్చి పోసేను సక్కని సుక్క
అహ.. పిల్లే కదరా కులాసా... అది కల్లును మించిన నిషా
ఒరే మావా.. ఆ... ఆ.. ఒరే మావా.. ఆ.. ఆ..
Thursday, September 25, 2014
ఆ నావ దాటిపోయింది
చిత్రం : సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : దేవులపల్లి
నేపథ్య గానం : సుశీల, ఘంటసాల
పల్లవి :
ఓ హో ... హో
ఆ నావ దాటిపోయింది.. ఆ ఒడ్డే చేరీ పొయింది
అట్లాగే మళ్ళీ పోయెనా ... నాన్నిడిచి వెళ్ళీపోయేనా
నాన్నిడిచి వెళ్ళీపోయేనా...
ఓ హో... హో
ఆ నావ దాటిపోయింది.. ఆ ఒడ్డే చేరీ పొయింది
అట్లాగే మళ్ళీ పోయెనా ... నాన్నిడిచి వెళ్ళీపోయేనా
నాన్నిడిచి వెళ్ళీపోయేనా...
ఓ హో... హో... ఓ.....
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను
రానైనా రాలేను నిదురపోనైనా పోలేను
నిశిరాతిరి అయినా నీ పిలుపే .. నా ప్రియా
అదే పూలగాలి... ఆ నాటిదే జాబిలి
ఏదీ ఎదుట మసిలీ.. ఏదీ లేదు నా చెలి
ఏదీ లేదు నా చెలి
అహహా.. ఆ... ఆ...
నా నావ పగిలేపోయింది.. నా రేవు వేరై పోయింది
నా ఇల్లు మారీపోయింది.. నాకన్నే మాత్రం మిగిలింది...
నా కన్నే నాలో మిగిలింది
చరణం 1 :
ఓ హో .. ఓ
నా కోసం పిలిచావో.. అపుడెంత కలవరించావో..
నా కోసం పిలిచావో.. అపుడెంత కలవరించావో..
ఆ రూపే సోకేను.. అదే గుండె కాల్చేను
ఇదే హోరు గాలి .. ఇదే పొంగు కడలి ..ఇదే మసక జాబిలి
ఏడీ లేడు .. నా మావ .... ఏడీ లేడు....
ఆహా హా .. నానావే పగిలిపోయింది... నా రేవు వేరై పోయింది
అట్లాగే మళ్ళీ పోయేనా... నన్నిడిచి వెళ్ళేపోయేనా
నన్నిడిచి వెళ్ళే పోయేనా..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1666
పడవ వచ్చిందే పిల్లా
చిత్రం : సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి :
ఓ...ఓ...ఓ...ఓ...
పడవ వచ్చిందే.. పిల్లా పిల్లా..హే..
పడవ వచ్చిందే పిల్లా... పండుగ వచ్చిందే
పండుగ వచ్చిందోయ్ మావా.. పండూ వెన్నెల వచ్చిందోయ్..
పండూ వెన్నెల పడుచుదనంతో పందెం వేసింది..
పడవ వచ్చిందే.. పిల్లా..
చరణం 1 :
నీలి సంద్రం పొంగి పొంగి నింగిని రమ్మందీ...ఈ..హోయ్..
నీలాకాశం వంగీ వంగీ నాకో ముద్దందీ..ఈ..
నీలిసంద్రం పొంగి పొంగి నింగిని రమ్మంది
నీలాకాశం వంగీ వంగీ నాకో ముద్దంది..
చిలిపి గాలీ గోల చేసిందీ..ఈ..
చిన్నదానికి సిగ్గూ కమ్మింది
బుగ్గా కందిందీ.. ఈ... బుగ్గా కందింది..
పడవ వచ్చిందే.. పిల్లా..
చరణం 2 :
చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళు..
ఆ..ఆ..ఆ..ఆహా..
చిన్నతనంలో కట్టామిక్కడ ఎన్నో పిచ్చుక గూళ్ళు...
పరువంలో అది ఫలించె పిల్లా వెచ్చని కౌగిళ్ళు.. ఈ వెచ్చని కౌగిళ్ళు..
అదృష్ట దేవత తెరిచెను కళ్ళు.. అందరికిద్దాం భాగాలు
అదృష్ట దేవత తెరిచెను కళ్ళు.. అందరికిద్దాం భాగాలు
ఈ కలిమి నిచ్చినా దేవుని కాళ్ళకు రోజూ పెడదాం దండాలు..
అహ.. రోజూ పెడదాం దండాలు
పచ్చగ వుందామూ..ఊ.. ముద్దూముచ్చట గుందాము
పచ్చగ వుందామూ..ఊ.. ముద్దూముచ్చట గుందాము
పడవ వచ్చిందే.. పిల్లా..
అహ..హ..ఒహొ..హో...
అహా..హ..ఒహొ..హో..అహ..హా..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1665
నా జన్మభూమి
చిత్రం : సిపాయి చిన్నయ్య (1969)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : ఘంటసాల
పల్లవి :
నా జన్మభూమి..భూమి..భూమి
నా జన్మభూమి..భూమి..భూమి
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
చరణం 1 :
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
ఆ హా హా హా ఆ ఆ ఆహా హా హా
నడిచేదారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చనీ పంటలు...వెచ్చనీ జంటలుచల్లనీ జీవితం...ఇదే నవభారతంహాయ్ హాయ్ నా సామి రంగా...హోయ్ హోయ్ నా సామి రంగా
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
చరణం 2 :
బ్రతకాలందరూ దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
ఆ హా హా హా ఆ ఆ ఆహా హా హా
బ్రతకాలందరూ దేశం కోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
స్వార్థమూ వంచనా లేనిదే పుణ్యము
త్యాగమూ రాగము మిళితమే ధన్యము
హాయ్ హాయ్ నా సామి రంగా...
హోయ్ హోయ్ నా సామి రంగా
నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా
Subscribe to:
Posts (Atom)