Showing posts with label చందన (1974). Show all posts
Showing posts with label చందన (1974). Show all posts
Tuesday, July 21, 2015
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో
చిత్రం : చందన (1974)
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో.. రామూలమ్మా
బంగారు చెక్కిళ్ళ రంగైన చినవాడు
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో.. రామూలమ్మా
వాని మునిపళ్ళు మెరిసేను ముత్యాలలాగా
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో.. రామూలమ్మా
ఆ నవ్వుతోనే నా మనసు ఎగిసిందీ
సిరిమల్లె సెట్టుకింద రామూలమ్మో.. రామూలమ్మా
పొన్నపూల ఉయ్యాలా
చిత్రం : చందన (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : జానకి
పల్లవి :
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా
ఆ.. ఊపుతో ఆకాశమే..ఆ.. ఊపుతో ఆకాశమే
అరికాలికే అందాలా.. అందాలా.. అందాలా
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా
చరణం 1 :
చిలకాలు చిలకాలు చిలకని అంటారే..
చిలకాలు చిలకాలు చిలకని అంటారే..
కానీ.. ఊ.. కానీ.. చిలకల కేమున్నాయి పలుకులే.. ఉత్తుత్తి పలుకులే
కోయిలలు కోయిలలు కోయిలలనీ అంటారే..
కోయిలలు కోయిలలు కోయిలలనీ అంటారే..
కానీ.. ఊ.. కానీ.. కోయిలలకు ఎమున్నాయి పాటలే.. గాలి పాటలే
ఆ..... ఆ పలుకులనే మించిన కలికితనం..
ఆ పాటలనే మించిన కమ్మదనం
కలిగివున్న కన్నె.. ఈ వనానికే వన్నె
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా
చరణం 2 :
హంసలూ హంసలూ హంసలనీ అంటారే..
హంసలూ హంసలూ హంసలనీ అంటారే..
కానీ.. ఊ.. కానీ.. హంసలకేమున్నాయి నడకలే.. బుడి బుడి నడకలే
నెమళ్ళూ నెమళ్ళూ నెమళ్ళని అంటారే..
నెమళ్ళూ నెమళ్ళూ నెమళ్ళని అంటారే..
కానీ.. ఊ.. కానీ.. ఆ నెమళ్ళ కేమున్నాయి కులుకులే.. పై పైని తళుకులే
ఆ.. ఆ నడకలనే మించిన ఒయ్యారం..
ఆ.. ఆ కులుకులనే మించిన సింగారం
కలిగివున్న కన్నె.. ఈ వన్నెలకే వన్నె
పొన్నపూల ఉయ్యాలా.. కన్నెవయసే ఊగాలా
Labels:
(చ),
Ranganath,
చందన (1974),
జానకి,
రమేశ్ నాయుడు,
సినారె
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
చిత్రం : చందన (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : రమేశ్ నాయుడు
పల్లవి :
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా
నీ రాత రంపపుకోత ఆయెనా
చరణం 1 :
నీవారూ నావారూ.. నెత్తిన నిప్పులు పోసారే.. నెత్తిన నిప్పులు పోసారే
కత్తులు గుండెల్లో గుచ్చారే.. నెత్తుటిలో ముంచెత్తారే... నెత్తుటిలో ముంచెత్తారే
ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా.. మురిపాల బొమ్మా.. ఓ ముద్దు గుమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా.. నీ రాత రంపపుకోత ఆయెనా
చరణం 2 :
మాలచ్చిమి లేని ఊరూ.. దిక్కుమాలిన వల్లకాడు.. దిక్కుమాలిన వల్లకాడు
పాడుదేవుడు ఏడున్నాడో.. పాప మెందుకు మింగిపోడో.. పాప మెందుకు మింగిపోడో
ముత్యాల బొమ్మా.. రతనాల బొమ్మా.. మురిపాల బొమ్మా.. ఓ ముద్దు గుమ్మా
ఓ రామ చక్కని బంగారు బొమ్మా.. నీ రాత రంపపుకోత ఆయెనా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5505
నీరు పల్లమెరుగూ
చిత్రం : చందన (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి
పల్లవి :
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
ఆ నిజం నిప్పులాంటిది
ఆ నిప్పులో నడిచిన సీతలాంటిది.. శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
చరణం 1 :
మనిషిని నడిపేది సత్యం.. దేవుణ్ణీ నిలిపేది ధర్మం
మనిషిని నడిపేది సత్యం.. దేవుణ్ణీ నిలిపేది ధర్మం
అందుకే ఉన్నారు సూర్యచంద్రులు
అందుకే వానలు కురిసేదీ.. పంటలు పండేదీ.. ప్రాణాలు నిలిచేదీ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
చరణం 2 :
దుష్టశిక్షణా .. ధర్మరక్షణా
దుష్టశిక్షణా.. ధర్మరక్షణా
యుగయుగాలుగా జరిగే యాగం
అందుకే పెరుగుతుంది చేసుకున్న పుణ్యం
ఇక పాపం బద్దలుకాకమానదూ
పాపి చిరాయువు కానేరడూ
పాపి చిరాయువు కానేరడూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
ఆ నిజం నిప్పులాంటిది
ఆ నిప్పులో నడిచిన సీతలాంటిది.. శ్రీమాతలాంటిది
నీరు పల్లమెరుగూ.. నిజం దేవుడెరుగూ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5502
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
చిత్రం : చందన (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : జానకి
పల్లవి :
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
ఆ.. వెలుగులో అన్ని పాపాలు కరగాలీ
శాపాలు తొలగాలీ.. తాపాలు తొలగాలీ
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
చరణం 1 :
కన్నీళ్ళు మనకొద్దూ.. కన్నీళ్ళు మనకొద్దూ.. కరిగి నీరవుతాను
నా కళ్ళలో.. నా కళ్ళలో వత్తులిడి కాచుకుంటానూ
మనసు కలిసినవారి.. మనసులొకటేనూ
మన చెలిమియే మనకింకా శ్రీరామరక్ష.. శ్రీరామరక్ష
ఈ రేయి శతకోటి దీపాలు వెలగాలీ
చరణం 2 :
రేయినాపమని.. చంద్రుణ్ణి కోరుతానూ
రేయినాపమని.. చంద్రుణ్ణి కోరుతానూ
పొద్దు పొడవద్దని.. పొద్దు పొడవద్దని
సూర్యుణ్ణి కొలుస్తానూ.. సూర్యుణ్ణి కొలుస్తానూ
ముక్కోటి దేవతలూ.. మురిసి వరమిస్తారూ
ముక్కోటి దేవతలూ.. మురిసి వరమిస్తారూ
వైకుంఠమే ఒరిగీ.. దీవించుతుందీ.. మనల దీవించుతుంది
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5503
చిలక పచ్చని కోనలో
చిత్రం : చందన (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : బాలు
పల్లవి :
చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుంది.. ఏ మువ్వలో పిలిచినట్టుంది
చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ
చరణం 1 :
ఆ చిలక జంట ఊసులు.. ఏ వలపుల గుసగుసలో
ఆ చిలక జంట ఊసులు.. ఏ వలపుల గుసగుసలో
ఈ కన్నెగాలి కదలికలు.. ఏ గాజుల గలగలలో.. ఏ గాజుల గలగలలో
చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ
చరణం 2 :
రేరాణి పారాణిలో.. సూరీడు కరిగిపోవునో
రేరాణి పారాణిలో.. సూరీడు కరిగిపోవునో
ఏ రాణి శీలవేణిలో.. నా మనసే ఒదిగిపోవునో.. మనసే ఒదిగిపోవునో
చిలక పచ్చని కోనలో.. ఒలక బోసిన ఎండలో
ఎవ్వరో నడిచినట్టుందీ.. ఏ మువ్వలో పిలిచినట్టుందీ
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5504
Subscribe to:
Posts (Atom)