Showing posts with label వేటగాడు (1979). Show all posts
Showing posts with label వేటగాడు (1979). Show all posts

Sunday, November 26, 2017

పుట్టింటోళ్ళు తరిమేసారు

చిత్రం : వేటగాడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


పుట్టింటోళ్ళు తరిమేసారు... కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో ... పుట్టింటోళ్ళు తరిమేసారు...  కట్టుకున్నోడు వదిలేసాడు


పట్టుమని పదారేళ్ళురా నా సామి...  కట్టుకుంటే మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా నా సామి...  కట్టుకుంటే మూడే ముళ్ళురా


అయ్యోపాపం పాపయమ్మ... టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ...  టింగురంగా బంగారమ్మ


పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి...  కట్టు కధలు చెప్పమాకులే
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి...  కట్టు కధలు చెప్పమాకులే


పుట్టింటోళ్ళు తరిమేసారు... అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు...  టింగురంగా బంగారమ్మ


చరణం 1 :


హా గడపదాటిననాడె కడప చేరాను
తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను... వడ్డించుకుంటాను

అమ్మతోడు ఆదివారం నాడు...  అన్నమైనా అంటుకోను నేను...ఓయబ్బో..
అమ్మతోడు ఆదివారం నాడు...  అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి...  ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి... ముద్దుకైనా ముట్టుకోను... ముద్దుకైనా ముట్టుకోను


పుట్టింటోళ్ళు తరిమేసారు...  అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు...  టింగురంగా బంగారమ్మ


చరణం 2 :


గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే...  అ.... నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను


అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం... అహహ
అమ్మతల్లి ఆషాఢమాసం...  అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు...  నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు...  నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ


పుట్టింటోళ్ళు తరిమేసారు.. హ.... కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ...  టింగురంగా బంగారమ్మ 




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=775

ఓసోసి పిల్ల కోడి పెట్టా

చిత్రం : వేటగాడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :



ఒసోస్ ఓర్ని...  కూతకొచ్చింది పిట్ట
ఓసోసి పిల్ల కోడి పెట్టా...  నా వయ్యారి పావురాయి పిట్ట
ఓసోసి పిల్ల కోడి పెట్టా...  నా వయ్యారి పావురాయి పిట్ట
నువ్వు సందకాడ సన్నజాజులెట్టా...  నేను సందు చూసి నీకు కన్నుగొట్ట
నువ్వు సందెకాడ సన్నజాజులెట్టా...  నేను సందు చూసి నీకు కన్నుగొట్ట


ఒసోస్ ఓర్ని...  పొగరు మీదుంది గిత్త
ఓరోరి పుట్ట తేని పట్టా... నా కన్నె ఈడు నీకు తోడు పెట్టా
ఓరోరి పుట్ట తేని పట్టా...  నా కన్నె ఈడు నీకు తోడు పెట్టా
నేను సందెకాడ సన్నజాజులెట్టా...  నువ్వు సందు చూసి నాకు కన్నుగొట్ట
నేను సందెకాడ సన్నజాజులెట్టా...  నువ్వు సందు చూసి నాకు కన్నుగొట్ట


చరణం 1 :


అయ్యో నీ సోకు చీకటింటా దీపమెట్టా... నా ఊపు ఊరు దాటి ఉట్టిగొట్టా
వయసుల్లో వసపిట్టా నసపెట్టా... మనసుల్లో వలపిట్టా జతకట్టా


తైతక్కలాడాల నువ్విట్టా నేనిట్టా...
ఆహ కైపెక్కి పోవాల...  ఆ చెట్టు ఈ పుట్ట


హోయ్ నీకు ముద్దు మీద ముద్దు నేను పెట్టా
అది చుసినోళ్ళు కన్ను కుట్ట...
అయ్యబాబోయ్ ఇదేంటి



నేను సందెకాడ సన్నజాజులెట్టా...  నువ్వు సందు చూసి  నాకు కన్నుగొట్ట
ఓసోసి పిల్ల కోడి పెట్టా...  నా వయ్యారి పావురాయి పిట్ట
నేను సందెకాడ సన్నజాజులెట్టా...  నువ్వు సందు చూసి  నాకు కన్నుగొట్ట


చరణం 2 :


హాయ్ మల్లెపూల పిల్లగాలి మంట పెట్టా... హా జంట వలపు జుంటే తేనే వంటపట్టా
ఆ మాట వింటే మనసులోన గంట కొట్టా... గుటకలోని పులకరింత కొంగు పట్టా


వేడెక్కి పోవాల నువ్విట్టా నేనిట్టా
డీడిక్కీ లాడాల ఇట్టా ఇట్టిట్టా
హో నేను ముద్దు మీద ముద్దు నీకు పెట్టా
అది చూసినోళ్ళు కన్ను కుట్ట
మళ్ళీ ఇదేంటి


నేను సందెకాడ సన్నజాజులెట్టా...  నువ్వు సందు చూసి  నాకు కన్నుగొట్ట
ఓసోసి పిల్ల కోడి పెట్టా...  నా వయ్యారి పావురాయి పిట్ట
నేను సందెకాడ సన్నజాజులెట్టా...  నువ్వు సందు చూసి  నాకు కన్నుగొట్ట
నువ్వు సందెకాడ సన్నజాజులెట్టా...  నేను సందు చూసి  నీకు కన్నుగొట్ట






Tuesday, September 22, 2015

పుట్టింటోళ్ళు తరిమేసారు







చిత్రం : వేటగాడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల  




పల్లవి :


పుట్టింటోళ్ళు తరిమేసారు... చు చు చు చు
కట్టుకున్నోడు వదిలేసాడు... చు చు చు చు
అయ్యో..పుట్టింటోళ్ళు తరిమేసారు
కట్టుకున్నోడు.. వదిలేసాడు
పట్టుమని పదారేళ్ళురా.. నా సామి
కట్టుకుంటే.. మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా..నా సామి
కట్టుకుంటే.. మూడే ముళ్ళురా


అయ్యో పాపం పాపయమ్మ..టింగురంగా బంగారమ్మ
అయ్యో పాపం పాపయమ్మ..టింగురంగా బంగారమ్మ
పట్టు చూస్తే పాతికేళ్ళులే.. ఓ రాణి.. కట్టు కథలు చెప్పమాకులే.. ఆ..
పట్టు చూస్తే పాతికేళ్ళులే.. ఓ రాణి.. కట్టు కథలు చెప్పమాకులే..ఏ...ఏ...ఏ

పుట్టింటోళ్ళు తరిమేసారు..అయ్యో పాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు..టింగురంగా బంగారమ్మ



చరణం 1 :



హా..గడపదాటిననాడె.కడప చేరాను.. చు చు చు చు
తలకపోసిన్నాడే..తలుపు తీసాను.. చు చు చు చు
వలపులన్ని కలిపి.. వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి.. వడ్డించుకుంటాను.. వడ్డించుకుంటాను


అమ్మతోడు ఆదివారం నాడు.. అన్నమైనా అంటుకోను నేను
ఓయబ్బో..అమ్మతోడు ఆదివారం నాడు.. అన్నమైనా అంటుకోను నేను

అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను
ముద్దుకైనా ముట్టుకోను


పుట్టింటోళ్ళు తరిమేసారు..అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు..టింగురంగా బంగారమ్మ



చరణం 2 :


గజ్జెలున్నన్నాళ్ళు..ఘల్లుమంటుంటాను.. చు చు చు చు
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను.. చు చు చు చు
తోడు దొరికిన్నాడు.. గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే.. అ.. నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే..మొగుడనుకుంటాను


అమ్మతల్లి ఆషాఢమాసం... అందులోను ముందుంది మూఢం
అహహ..అమ్మతల్లి ఆషాఢమాసం... అందులోను ముందుంది మూఢం

అమ్మబాబోయ్ కాలేను నీ తోడు... నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీ తోడు... నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ..నాంచారమ్మ


పుట్టింటోళ్ళు తరిమేసారు... చు చు చు చు
కట్టుకున్నోడు వదిలేసాడు... చు చు చు చు
అయ్యోపాపం పాపయమ్మ...టింగురంగా బంగారమ్మ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=775

Wednesday, September 10, 2014

బంగారు బాతు గుడ్డు

చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
 



పల్లవి :


బంగారు బాతు గుడ్డు...బందారు తొక్కుడు లడ్డు..
బంగారు బాతు గుడ్డు...బందారు తొక్కుడు లడ్డు..


సయ్యనవే.... నా సరసకు రావే....
సయ్యనవే.... నా సరసకు రావే....
చక్కెర తునుక కిక్కురమనక.. పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ..
నా లడ్డు..ఊ..ఊ... గాడిద గుడ్డు..


ఆ..బంగారు బాతు గుడ్డు...బందారు తొక్కుడు లడ్డు..



చరణం 1 :



తీగ నడుములో...  రాగమున్నది..
పాల సొగసులో.... మీగడున్నదీ....
వయసు వరదలా... పొంగుతున్నదీ..
మనసు మరదల అంటూ వున్నది..


తుంటరి గుంట..హ్హా..హ్హా..హ్హా వంటరిగుంటే..హ..
తుంటరి గుంట వంటరిగుంటే.. వంటికిమంచిది కాదీ పొద్దు... లడ్డు..నా లడ్డు..
గాడిద గుడ్డు..ముహ్హూ..ఊ


అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..అమ్మాయి వాటం తెలియకున్నదీ..
అబ్బాయి వళ్ళు ఎలా వున్నది..అమ్మాయి వాటం తెలియకున్నదీ..
చేయి తగిలినా చెంప పగిలినా తడిమి చూసుకొని పడతావయ్యో రోడ్డు.. ఓరి జిడ్డూ..
గాడిద గుడ్డు..ఉహ్హూ..!!


ఆ..బంగారు బాతు గుడ్డు.. షటాప్.
బందారు తొక్కుడు లడ్డు.. ఛా పో..



చరణం 2 :


కస్సు మన్నదీ....  గడసు చిన్నదీ..
కిస్సు..కిస్సనీ అడుగుతున్నదీ..
పగటి చుక్కలా......వెలుగుతున్నదీ..ఈ
పడుచు దిక్కునా ఎదుటే వున్నదీ..


లకుముకి పిట్ట..త్ప్రూ..హూ..తికమకపెడితే..ఆహా..
లకుముకి పిట్ట..తికమకపెడితే....
చెకుముకి దెబ్బ తినిపిస్తానే లడ్డు..నా లడ్డూ..
గాడిద గుడ్డు..! ముహ్హూ...


హల్లో మిస్టర్..అడవిరాముడు..!! హో..హో..హో..హో..
అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు..!! పోయీ..పోయ్ పపబ్బాయి..
హల్లో మిస్టర్ అడవిరాముడు....అల్లరి పెట్టే డ్రైవర్‌రాముడు
తాత తుపాకి పాత గిరాకీ..పిల్ల చలాకీ చూపిస్తాలే..చూడు..ఓరి జిడ్డూ
గాడిద గుడ్డు..! ముహ్హూ


బంగారు బాతు గుడ్డు..!! షటాప్.
బందారు తొక్కుడు లడ్డు..!! ఛా పో..
సయ్యనవే..!! ముహ్హూ..
నా సరసకు రావే..!! వ్వే..వ్వే..వ్వే..
సయ్యనవే.....నా సరసకు రావే..ఏ..
చక్కెర తునుక కిక్కురమనక పక్కకు వస్తే చేరుస్తానే ఒడ్డూ..డూ..డూ..డూ
గాడిద గుడ్డు....ముహ్హూ..ఊ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=766

జాబిలితో చెప్పనా

చిత్రం :  వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
 



పల్లవి :


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..
జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా


చరణం 1 :



తుమ్మెదలంటని తేనెలకై .. తుంటరి పెదవికి దాహాలు
చుక్కలు చూడని చీకటిలో .. సిగ్గులు కలవని విరహాలు
చూపులలో చలి చురచురలూ ..
ఆకలి తీరని విరవిరలూ ...
అన్ని ఆవిరి పెడుతుంటే ... నన్నే అల్లరి పెడుతున్నావని
చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా 


జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా


చరణం 2 :


గొంతులు దాచిన గుండెలలో .. కోయిల పాడని గీతాలు
సూర్యుడు చూడని గంగలలో .. అలలై పొంగిన అందాలు


కౌగిట కాముని పున్నములు ..
వెన్నెల వీణల సరిగమలు ..
పేరంటానికి రమ్మంటే ... పెళ్ళికి పెద్దవు నీవేలెమ్మని
చెప్పనా .. ఆ .. చెప్పనా .. ఆ .. చెప్పనా



జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా ..
జామురాతిరి కలలలోన నీవు రేపిన అలజడి చెప్పనా.. రాజా


జాబిలితో చెప్పనా..జాబిలితో చెప్పనా..
జామురాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా... రోజా


రోజా.. రాజా... రోజా.. రాజా

రోజా.. రాజా... రోజా.. రాజా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=768

కొండమీన సందమామా

చిత్రం :  వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల  



పల్లవి :


కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ..
కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..
కొయిలాలో..ఓ..ఓ..ఓ..ఓ..ఓ..హో..ఓ..


కొండమీన సందమామా.. కొనలోన కోయభామ..
కొండమీన సందమామా.. కొనలోన కోయభామ..


పకపకలాడింది ..నా పట్టు తప్పింది
పకపకలాడింది ..నా పట్టు తప్పింది
దీని ముక్కుకు తాడెయ్యా..బలె సక్కిలిగిలిదీనందం..
సుక్కులు..మొక్కయ్యా..ఈ సక్కని చుక్కే నా సొంతం..


కొండమీన సందమామా... కొనలోన కోయ మామ..
కొండమీన సందమామా... కొనలోన కోయ మామ..


తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు..
తొంగి చూశాడూ..నా కొంగు లాగాడు..
ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం..
సుక్కలు పక్కేయ్యా..ఈ పక్కిట సిక్కే నా సొంతం.. 


కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయ మామ..ఆ..ఆ




చరణం 1 :



ఎండల్లో వానలాగే యెంట వస్తాను..కొండల్లో కోన లాగే జంటగుంటాను..
ఆ మూడు ముల్లేసి.. ఈ ముద్దు చెల్లిస్తా..
ఆ మూడు ముల్లేసి.. ఈ ముద్దు చెల్లిస్తా..


ఐదు ప్రాణాల అందం... ఆరతీస్తాను..
ఏడూ జన్మాల బంధం... హారమేస్తానూ..
ఐదు ప్రాణాల అందం... ఆరతీస్తాను..
ఏడూ జన్మాల బంధం.. హారమేస్తానూ..


ఈ ముద్దు చెల్లిస్తే..ఆ హద్దు చెరిపేస్తా..
ఈ ముద్దు చెల్లిస్తే..ఆ హద్దు చెరిపేస్తా..


దీని ముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం..
సుక్కులు..మొక్కయ్యా..ఈ సక్కని చుక్కే నా సొంతం..


కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయమామ..
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయభామ..


చరణం 2 :


ఏరంటి నిన్ను చూసి ఎల్లువవుతాను..
వరదల్లె పొంగుతుంటే వంతెనేస్తాను
ఎన్నెట్లో గోదారి.. కౌగిట్లో పొంగిస్తా..
ఎన్నెట్లో గోదారి.. కౌగిట్లో పొంగిస్తా..


ఆకాశమయితే నువ్వు... చుక్కనవుతాను..
అందాల జాబిలయితే... పక్కనుంటాను..
ఆకాశమయితే నువ్వు... చుక్కనవుతాను..
అందాల జాబిలయితే ...పక్కనుంటాను..


మల్లెల్లో ఇల్లేసీ..మనసంతా ఇచ్చేస్తా..
మల్లెల్లో ఇల్లేసీ..మనసంతా ఇచ్చేస్తా..


దీని ముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం..
సుక్కులు..మొక్కయ్యా..ఈ సక్కని చుక్కే నా సొంతం..


కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయభామ..
పకపకలాడింది .. నా పట్టు తప్పింది
తొంగి చూశాడూ.. నా కొంగు లాగాడు..

ఓయ్..ఈడిముక్కుకు తాడెయ్య..బలె సక్కిలిగిలిదీనందం..

సుక్కలు పక్కేయ్యా..ఈ పక్కిట సిక్కే నా సొంతం..

కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయభామ..
కొండమీన సందమామా..ఆ..ఆ..ఆ
కొనలోన కోయమామ..


కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..కోహ కోహిలీ..కోత మీద లాహిరీ..
కొయిలాలో..ఓ..ఓ




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=767

ఇది పువ్వులు పూయని తోట

చిత్రం : వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  జానకి 



పల్లవి :


ఆ..ఆ.. ఓ..ఓ..ఓ..ఓ..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ


ఇది పువ్వులు పూయని తోట..ఏ ప్రేమకు నోచని కోట..
పగిలిన నాగుండెలలో..పగిలిన నాగుండెలలో..
రగులుతున్న రాగం .. ఈ పాటా..ఆ..ఆ..ఆ..ఆ


ఇది పువ్వులు పూయని తోట.. ఏ ప్రేమకు నోచని కోట..ఆ..ఆ.ఆ 



చరణం 1 :



పువ్వులకే నవ్వులు నేర్పిన ప్రేమతోట.. ఇది ఒక నాడు..
చిగురించన మోడులకు..నిదురించని గుండెలలో..
చితిపేర్చిన వల్లకాడు..ఈ నాడు..


కట్టుకున్న తాళి కోసం.. కన్న బిడ్డ రోజా కోసం..
కట్టుకున్న తాళి కోసం.. కన్న బిడ్డ రోజా కోసం..
ఇక్కడే..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..ఏ..  కదులుతూంది వ్యధతో ఒక ప్రాణం.. 

ఇది పువ్వులు పూయని తోట.. ఏ ప్రేమకు నోచని కోట..

చరణం 2 :


శీలానికి కాలం మూడి.. కాలానికి ఖర్మం కాలీ
న్యాయానికి గాయం తగిలీ.. గాయంలో గేయం రగిలి
నెత్తురిలో దీపం వెలిగే.. వెలుతురుకే శాపం తగిలే


ఇది మాతృహృదయమే మృత్యు నిలయమయి ఎగసిన విలయ తరంగం..ఊ
మది రుద్రవీణ నిర్విద్రగానమున పలికే మరణమృదంగం....


అందుకే..ఏ..ఏ..ఏ..ఏ..
పలుకుతుంది శ్లోకం... నా శోకం....ఊ..ఊ


ఇది పువ్వులు పూయని తోట..ఏ ప్రేమకు నోచని కోట..ఆ..ఆ..ఆ



ఆకు చాటు పిందె తడిసే

చిత్రం :  వేటగాడు (1979)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల
 



పల్లవి :


ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే


ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది


గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే
గూడు చాటు గువ్వ తడిసే .. గుండె మాటు గుట్టు తడిసే


ఆకాశ గంగొచ్చింది.. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చింది .. కొంగుల్ని ముడిపెట్టింది  


చరణం 1 :



ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే .. అహ అహ.. అహా అహ
చిగురాకు పాదాల సిరిమువ్వలౌతుంటే .. అహ అహ .. అహ అహ


ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ..
ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే


నీ మాట విని మబ్బు మెరిసి ..అహ

జడివానలే కురిసి కురిసి ..
వళ్ళు తడిసి ..వెల్లి విరిసి...
వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ .. 

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది



చరణం 2 :


మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే .. అహ అహ .. అహ అహ
ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే .. అహ అహ .. అహా అహ అహ


ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే..
ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే


అహ .. నీ పాట విని మెరుపులొచ్చి... అహ
నీ విరుపులే ముడుపు లిచ్చి
చలిని పెంచి .. చెలిమి పంచి
తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి
అహ అహ ఆహ అహ.. అహ ఆహ ..

ఆకు చాటు పిందె తడిసే .. కోక మాటు పిల్ల తడిసే
ఆకాశ గంగొచ్చింది .. అందాలు ముంచెత్తింది
గోదారి పొంగొచ్చిందీ .. కొంగుల్ని ముడిపెట్టింది