Showing posts with label మౌనరాగం (1986). Show all posts
Showing posts with label మౌనరాగం (1986). Show all posts

Saturday, December 29, 2018

ఓహో మేఘమొచ్చెను

చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపథ్య గానం : జానకి 




పల్లవి :


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే... పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే... వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం... ముచ్చటలే విరిసేను


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను




చరణం 1 : 



నాలో ఊగేను సోయగం... రేగే ఊరేగే ఆశలే
నన్నే ఉడికించేనే బృందావనం
వయసు బంధాలు మీరెనే


ఈ పన్నీటిలో...  గారాలే చిందవా
ఓ అందాల గనికి పూమాలే వెయ్యరా
ఈ అమ్మాయికి పెళ్ళి ఓ నాటకం
ఈ ఒయ్యారమంతా...  వలపించే జ్ఞాపకం
పులకరించి...  పలకరించెనే


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను




చరణం 2 : 



కలలో ఈ నాటి జీవితం... ఆమని రాగాల బంధనం
వెండి మేఘాలలో ఊరేగుదాం... మధుర సంగీతం పాడుదాం


లే చిగురాకులై ఈనాడు మారుదాం
రా వినువీధిలోన నవ్వుల్లో పాకుదాం
ఈ పరువాలలోన శంఖాలై ఊగుదాం
రయ్...  సెలయేరులై ఉరికురికి పొంగుదాం
ఇంత వింత వగలు పంచగా


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను
చినుకే పూల గాలులే... పలికె పసిడి గాథలే
పువ్వులపై అందాలే...  వరహాలను పరిచేను
జల్లులు కురిసే సమయం ముచ్చటలే విరిసేను


ఓహో మేఘమొచ్చెను... ఏదో లాలి పాడెను
ఆహా.. ఆ... పప... పప్ప... ప్పా.... ఆహా




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12450

చిన్ని చిన్ని కోయిలల్లే

చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపథ్య గానం : జానకి 




పల్లవి :


లాలలాల లాలలాల లాలలాల లాలలాల
లలలాల లలలాల లలలాల లలలాల
లలలాల లలలాల లాలా లాలాలాలా


చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..  నేనే


చిన్ని చిన్ని కోయిలల్లే కోరి కోరి కూసెనమ్మా




చరణం 1 : 



మల్లెల బాటలోన...  పాటలే కోరుకుందీ
మన్మథుని పాటలోన...  గాధలే పాడుకుంది
ఊహలే జీవితం...  చిందెనే మాటలే
సాగెనే ఆశలే...  రేగెనే ఊసులే


మనసు ఊగి... మ్... మ్.. మ్.. మ్
మరులు రేగి... మ్.మ్.మ్.మ్
మనసు ఊగి... మ్.మ్.మ్.మ్
మరులు రేగి... మ్.మ్.మ్.మ్
అందరాని సన్నిధి నేనే.. నేనే.. నేనే


చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసేనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..నేనే
చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా




చరణం 2 : 



వెచ్చని సందె వేళ... బాసలే ఆడేనులే
పచ్చని కన్నెవయసు...  గంగలా పొంగేనులే
కమ్మని తేనెలే... గుండెలో తేలెనే
చీకటే వచ్చినా... ఊహలే ఊరేనే


జీవితాంతం... మ్.మ్.మ్.మ్
స్నేహరాగం... మ్.మ్.మ్.మ్
జీవితాంతం..మ్.మ్.మ్.మ్
స్నేహరాగం... మ్.మ్.మ్.మ్
పరువ రాగ కీర్తనం పాడె... పాడె... పాడె


చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
ఊరించే ఆనందం... లోలోన ఆరంభం
పులకించే సిరిమొగ్గ... నేనే..నేనే


చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా
చిన్ని చిన్ని కోయిలల్లే...  కోరి కోరి కూసెనమ్మా





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12452

Tuesday, September 27, 2016

మల్లె పూల చల్లగాలి





చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు




పల్లవి :



ఆ ఆ ఆహా
ఆ ఆ ఆఆఆఆ


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ
కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక...
ఏలా... ఇదేలా
ఆవేదనే... ఈనాటికి...మిగిలింది నాకు..
మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ



చరణం 1 :



వేదికై పోయే మనకథంతా... నాటకం అయేను మనుగడంతా...
శోధనై పోయే హృదయమంతా...బాటలే మారెనే పయనమంతా...
పండించవే వసంతం...పంచవేళా సుగంధం... నాగుండె గుడిలో నిలవాలి...రా


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక... ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి.... మిగిలింది నాకు..


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ




చరణం 2 :





మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక...ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి....మిగిలింది నాకు..


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


తామరాలకైనా నీటి లాగా...భర్తయు భార్యాయు కలవరంట...
తోడుగా చేరి బతికేందుకు...సూత్రమూ మంత్రమూ ఎందుకంట...
సొంతం అనేది లేక...ప్రేమ బంధాలు లేక మోడంటి జీవితమింకెలా...హ


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ


కోరుకున్న గోరింకను చేరదేలా రామచిలుక...ఏలా ఇదేలా
ఆవేదనే ఈనాటికి....మిగిలింది నాకు..


మల్లె పూల చల్లగాలి...మంటరెపె సందె వేళలో...
ఏలా.. ఈ వేళ....







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12451

చెలీ రావా వరాలీవా





చిత్రం : మౌనరాగం (1986)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు




పల్లవి :


ఆ....ఆ....ఆ....ఆ....
చెలీ రావా వరాలీవా...
నిన్నే కోరే ఓ జాబిల్లీ
నీ జతకై వేచేనూ
నిలువెల్లా నీవే...
చెలీ రావా వరాలీవా... 



చరణం 1 :


ఈవేదన తాళలేనే మామా చందమామా
వెన్నెల్లనే పూలు రువ్వీ చూడూ ఊసులాడూ
చెప్పాలనీ నీతో ఏదో చిన్నమాటా
చెయ్యాలనీ స్నేహం నీతో పూటపూటా
ఊ అంటే నీ నోటా బ్రతుకే వెన్నెల తోటా


చెలీ రావా వరాలీవా...



చరణం 2 :




వయ్యారాలా నీలినింగీ పాడే కధలు పాడే
ఉయ్యాలగా చల్లగాలీ ఆడే చిందులాడే
సుగంధాల ప్రేమా అందించగా రాదా
సుతారాల మాటా చిందించగా రాదా
ఆకాశం పగ అయితే మేఘం కదలాడేనా


చెలీ రావా వరాలీవా...
నిన్నే కోరే ఓ జాబిల్లీ
నీ జతకై వేచేనూ
నిలువెల్లా నీవే...



చెలీ రావా వరాలీవా...
నిన్నే కోరే ఓ జాబిల్లీ





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12453