Showing posts with label . Show all posts
Showing posts with label . Show all posts

Thursday, February 27, 2014

నా జీవన బృందావనిలో

చిత్రం :  బుర్రిపాలెం బుల్లోడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో

కనిపించె నీలో కళ్యాణ తిలకం
వినిపించె నాలో కళ్యాణి రాగం
ఏనాటిదో ఈ రాగము.. ఏ జన్మదో ఈ బంధము
ఏనాటిదో ఈ రాగము.. ఏ జన్మదో ఈ బంధము

చరణం 1:

నీవు నన్ను తాకిన చోట.. పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాట... వేణు గానమైపోతుంటే
నీవు నన్ను తాకిన చోట.. పులకరింత పువ్వవుతుంటే
మేను మేను సోకిన పాటా వేణు గానమైపోతుంటే

మనసులో మధుర వయసులో యమున కలిసి జంటగా సాగనీ
మన జవ్వనాల నవ నందనాల మధు మాస మధువులే పొంగనీ

ముద్దు ముద్దులడిగిన వేళా... నెమలి ఆట ఆడనీ
ముద్దు ముద్దులడిగిన వేళా... నెమలి ఆట ఆడనీ
ఇదే రాసలీలా... ఇదే రాగడోలా
ఇదే రాసలీలా... ఇదే రాగడోలా

నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో
నా జీవన బృందావనిలో ఆమని ఉదయంలో
నిను చూసిన తొలి ఆశలు విరబూసిన సమయంలో

నా ప్రాణమంతా.. నీ వేణువాయె
పులకింతలన్నీ.. నీ పూజలాయె
ఏ యోగమో ఈ రాగమో... ఏ జన్మదో ఈ బంధమో
ఏ యోగమో ఈ రాగమో... ఏ జన్మదో ఈ బంధమో

చరణం 2:

ఇంద్రధనస్సు పల్లకీలో.. చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ.. మెరుపు కొంగు ముడిపెడుతుంటే
ఇంద్రధనస్సు పల్లకీలో.. చంద్రుడల్లె నువ్వొస్తుంటే
నల్లమబ్బు కాళ్ళు కడిగీ.. మెరుపు కొంగు ముడిపెడుతుంటే

రాగలహరి అనురాగనగరి రస రాజధాని నను చేరనీ
శృంగార రాజ్య సౌందర్య రాణి పదరేణువై చెలరేగనీ

నింగి నేల కలిసిన చోట.. నిన్ను నేను పొందనీ
నింగి నేల కలిసిన చోట.. నిన్ను నేను పొందనీ
అదే రాసలీలా... అదే రాగడోలా
అదే రాసలీలా... అదే రాగడోలా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3685

Monday, February 24, 2014

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా

చిత్రం: బడి పంతులు (1972)
సంగీతం:  కె.వి. మహదేవన్
గీతరచయిత:  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం:  ఘంటసాల, సుశీల

పల్లవి:

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 
    
చరణం 1:

పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు
నీ పైట కొంగు చాటున దోబూచులాడెను 

పసితనాన ఆడుకొన్న తొక్కుడు బిళ్ళలు
నీ పరువానికి నేర్పినవి దుడుకు కోర్కెలు 
    
చరణం 2:

పాల బుగ్గలు పూచె లేత కెంపులు
వాలు చూపులందుతోటె వయసు జోరులు

చిరుత నవ్వులు ఒలికె చిలిపితనాలు
చిన్ననాటి చెలిమి తీసె వలపు దారులు 
    
నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 

చరణం 3:

ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 
ఇన్నాళ్ళు కళ్ళు కళ్ళు కలిపి చూస్తివి
ఇపుడేల రెప్పలలా రెపరెపన్నవి 

ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 
ఇన్నాళ్ళు నీ కళ్ళు ఊరుకున్నవి
ఇపుడేవేవో...
ఇపుడేవేవో మూగబాస లాడుతున్నవి 

నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా
నీకు ఇంతలోనె నన్ను చూస్తే అంత సిగ్గా

నిన్న మొన్న రెక్కలొచిన గండు తుమ్మెద
నీకు అంతలోనె నన్ను చూస్తే ఇంత తొందరా 

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4600

మీ నగుమోము నా కనులారా

చిత్రం : బడి పంతులు (1972)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల

పల్లవి:

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం 1:

ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో
ఉపచారాలే చేసితినో.. ఎరగక అపచరాలే చేసితినో
ఒడుదుడుకులలో తోడై ఉంటిని .. మీ అడుగున అడుగై నడిచితిని
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం 2:

రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు
రెక్కలు వచ్చి పిల్లలు వెళ్ళారు...రెక్కలు అలిసి మీరున్నారు
పండుటాకులము మిగిలితిమి..
పండుటాకులము మిగిలితిమి..ఇంకెన్ని పండుగలు చూడనుంటిమి
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

చరణం 3:

ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ఏ నోములు నే నోచితినో .. ఈ దేవుని పతిగా పొందితిని
ప్రతి జన్మ మీ సన్నిధిలోనా... ప్రమిదగ వెలిగే వరమడిగితిని

మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు
ఈ సూత్రముతో ఈ కుంకుమతో నను కడతేరి పోనిండు
మీ నగుమోము నా కనులారా కడదాకా కననిండు

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=233

Thursday, February 13, 2014

నీ నీలి నయనాల

చిత్రం : మానస వీణ (1983)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

నీ నీలి నయనాల.. రవళించు రాగాల.. జడిలోన నే పాడనా..
ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ...
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా
ఆ...ఆ.. ఆ.. ఆ
నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
ఆ...ఆ.. ఆ.. ఆ.. ఆ..
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సానిని
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సాసస

చరణం 1:

శిలల కరిగించు కలలు చిగురించు నీ రూపు నే తీర్చనా
తలపులూహించు వలపులూరించు అందాలు నే చూడనా
మనసు వికసించు మమత వరియించు నీ చెలిమి నే కోరనా
మనల మరిపించు ఒకటే అనిపించు అద్వైతమే నేను కానా
ఆనంద సౌధాన అందాల జాబిల్లిగా నిన్ను వెలిగించనా
అనురాగ శిల్పాన అతిలోక కల్పనగా నిను నేను ఊహించనా

నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా

చరణం 2:

వెలుగులను నించు సిరుల కురిపించు నీ నవ్వులై నవ్వనా
వయసు మురిపించు బ్రతుకే ఫలియించు నీ ప్రేమలో పండనా
అడుగు జత చేర్చి నడక కలబోసి నీ నీడనై నడవనా
ఎడద పరిచేసి గుడిగా మలిచేసి నీరాజనాలివ్వనా
నా జన్మజన్మాల నా పూర్వ పుణ్యాల నా దేవిగా నిన్ను భావించనా
ఈ నొసటి కుంకుమ.. ఈ పసుపు సంపద.. నీ వరముగా పొంది వర్ధిల్లనా

నీ నీలి నయనాల రవళించు రాగాల జడిలోన నే పాడనా
ఆ...ఆ..ఆ..ఆ..
నీ మధుర హృదయాన నినదించు నాదాల జతిలోన నేనాడనా
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సానిని
తక తధీంతోం తక తధీంతోం సస సగస్సాసస

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5093

Friday, February 7, 2014

నేనీదరిని నువ్వా దరినీ

చిత్రం :  బంగారు బొమ్మలు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

చరణం 1:

కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
కనకదుర్గ కనుసన్నలలో గలగల పారే తన ఒడిలో
మన పడవలు రెండూ పయనించాలని
బ్రతుకులు నిండుగ పండించాలని
కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ 

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

చరణం 2:

నీ కురుల నలుపులో... నీ కనుల మెరుపులో...
అలలై... కలలై... అలలై కలలై తానే వెలిసింది
నీ లేత మనసులో... నీ దోర వయసులో...
వరదై... వలపై... వరదై వలపై తానే ఉరికిందీ

చిరుగాలుల తుంపరగా... చిరునవ్వుల సంపదగా
చిరుగాలుల తుంపరగా... చిరునవ్వుల సంపదగా
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

చరణం 3:

పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పంట పొలాల్లో పచ్చదనంగా పైరగాలిలో చల్లదనంగా
పల్లెపదంలో తీయదనంగా
చిరంజీవులై జీవించాలని
కలిపింది ఇద్దరినీ... కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...
మనమంటే తనకెంతో ముద్దని
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ... ఈ... ఈ...

నేనీదరిని నువ్వా దరినీ
కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1765

Tuesday, January 28, 2014

నాగమల్లి కోనలోన

చిత్రం :  బంగారు తిమ్మరాజు (1964)
సంగీతం : కోదండపాణి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : జమునారాణి

పల్లవి:

నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన

ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....
ఎరవేసి... గురి చూసి... పట్టాలి మామా... పట్టాలి మామా...

చరణం 1:

చూపుల్లో కైపుంది.. మావా... సొగసైన రూపుంది.. మావా
చూపుల్లో కైపుంది ... సొగసైన రూపుంది

వయ్యారం ఒలికిస్తుంది... వన్నెలు చిన్నెలు నేర్చింది
ఓ ఉడుకుమీద ఉరికావంటే జడుసుకుంటది
దాన్ని ఒడుపుచూసి మచ్చిక చేస్తే వదలనంటది... మావోయ్...

నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....

చరణం 2:

నడకల్లో హొయలుంది... మావా... నాట్యంలో నేర్పుంది... మావా
నడకల్లో హొయలుంది ... నాట్యంలో నేర్పుంది ....

మలిసందె చీకట్లోన.. నీటికి ఏటికి వస్తుంది
ఓ జాడ చూసి కాశావంటే దారికొస్తది
దాని జాలి చూపు నమ్మావంటే.. దగా చేస్తది... మావోయ్

నాగమల్లి కోనలోన... నక్కింది లేడికూన
ఎరవేసి..హ...గురి చూసి...హ... పట్టాలి మామా....
ఎరవేసి... గురి చూసి... పట్టాలి మామా... పట్టాలి మామా...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7035

Thursday, December 12, 2013

నా కళ్ళు చెబుతున్నాయి

చిత్రం :  ప్రేమాభిషేకం (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : దాసరి
నేపధ్య గానం : బాలు, సుశీల

పల్లవి:

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

చరణం 1:

నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ
నింగి నేలా తెలపాలి నీకు నాకు ప్రేమనీ
ఊరువాడా చెప్పాలి నీకు నాకు పెళ్ళనీ

ప్రేమకే పెళ్ళనీ.. ఈ పెళ్ళే ప్రేమనీ
ప్రేమా పెళ్ళి జంటనీ... 
నూరేళ్ళ పంటనీ... నూరేళ్ళ పంటనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని

చరణం 2:

గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని
గుండెను గుండే చేరాలీ మనసుకు మనసే తోడనీ
పెదవిని పెదవి తాకాలీ తీపికి తీపే చెలిమని

తోడంటే నేననీ... చెలిమంటే నువ్వనీ..
నువ్వు నేను జంటనీ... 
నూరేళ్ళ పంటనీ... నూరేళ్ళ పంటనీ...

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని
కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోందీ

నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ
నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావనీ

నా కళ్ళు చెబుతున్నాయి నిను ప్రేమించానని
నా పెదవులు చెబుతున్నాయి నిను ప్రేమించానని 

Tuesday, November 5, 2013

నిన్నే నిన్నే తలచుకుని

చిత్రం  :  పెళ్ళి చూపులు (1983)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం  : బాలు, సుశీల

పల్లవి:

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని ..

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

చరణం : 1

కిట్టయ్యంటే నువ్వేనని పిల్లనగ్రోవి నేనేనని
పెదవుల పైనే వుండాలని పదములు ఎన్నో పాడాలని
కిట్టయ్యంటే నువ్వేనని... పిల్లనగ్రోవి పైనే వుండాలని
పదములు ఎన్నో పాడాలని

బృందావనం తగదనీ అందరితో తగువనీ...
బృందావనం తగదనీ అందరితో తగువనీ
యమున దాటి వెళ్ళాలని వేచివున్న వెర్రిదాన్ని...

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

చరణం : 2

సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని
సీతమ్మంటే నువ్వేనని రాముడు నేనై వుండాలని
రావణుడెవ్వడు రారాదని రామాయణం కారాదని

పగలు పగలు అనుకుని.. రాత్రి రాత్రి కలగని
పగలు పగలు అనుకుని.. రాత్రి రాత్రి కలగని
కలే నిజం అవుతుందని కాచుకున్న పిచ్చివాణ్ణీ ..

నిన్నే నిన్నే తలచుకుని నిద్దుర పొద్దులు మేలుకుని
ఎన్నోనాళ్ళు ఎన్నో ఏళ్ళు వున్నా నువ్వే వస్తావనీ
వస్తే ప్రాణం వస్తుందనీ... నువ్వొస్తే ప్రాణం వస్తుందనీ

ఆహాహాహా... హాహాహహా...ఆహాహాహా... హాహాహహా

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5083