Showing posts with label (అ). Show all posts
Showing posts with label (అ). Show all posts

Saturday, December 23, 2023

ధన్వంతరి వారసులం




చిత్రం :  అరుణ కిరణం (1986)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : వేటూరి

నేపథ్య గానం : జానకి 


పల్లవి :


ధన్వంతరి వారసులం... ధరణిలోన దేవతలం

వ్యాధులతో బాధపడే ఆర్తుల క్షేమం కోసం  

కృషి చేసే కర్మయోగులం

మనకెందుకు మనసులేని నినాదాల రణరంగం

జీవులనే పావులతో ఆడుకునే చదరంగం


ధన్వంతరి వారసులం... ధరణిలోన దేవతలం



చరణం 1 : 


పసిపాపల కోల్పోయిన తల్లుల ఆక్రందనలో 

తాళిబొట్టు తెగిపొయిన తరుణుల ఆవేదనలో 

శ్మశానమై పోతుంటే ఈ వైద్యాలయం 

ఎక్కడుంది కారుణ్యం... ఎందుకింత యమధర్మం

ఈ దీనుల సమాధులా... విజయానికి పునాదులు

ఎందుకిలా ప్రాణంతో వ్యాపారం... ఎన్నాళ్ళీ వైద్యంతో వాణిజ్యం


ధన్వంతరి వారసులం... ధరణిలోన దేవతలం


చరణం 2 : 


పట్టం పొందిన నాడు చేసిన మన వాగ్దానం

మరచిపోతే జరిగేది సాముహిక బలిదానం

నైటింగేల్ ఫ్లొరెన్స్ లకే అపచారం

జ్యోతివంటిదీ వైద్యం... జ్వాల అయితే అది విలయం

రక్షకులే భక్షకులై సాధించె విజయాలు

ఎందుకీ బలికోరే బ్రతుకులు... రక్తంతో మైలపడ్డ మెతుకులు 

రక్తంతో మైలపడ్డ మెతుకులు



హృదయంలో అరుణం





చిత్రం :  అరుణ కిరణం (1986)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : జాలాది

నేపథ్య గానం : శ్రీనివాస్ చక్రవర్తి, సుశీల 


పల్లవి :


అరుణా... అరుణా... అరుణా...


హృదయంలో అరుణం... అరుణం

ఉదయంలో అరుణం... అరుణం

ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం

అనురాగమై విరిసె అరుణారుణం 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 



హృదయంలో అరుణం... అరుణం

ఉదయంలో అరుణం... అరుణం


 

చరణం 1 : 


దిశలే పరవశమై వికసించినందొక వర్ణం 

దివిలో రవికిరణం తన కోరిక తీర్చిన ప్రణయం

కలలై కలవరించే... నీలో కోరికా

నిజమై ఋజువు కాగా నాలో వేడుక 

మనసే మధుర గీతం పాడదా

వయసే వలపు నాట్యం ఆడదా 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


హృదయంలో అరుణం... అరుణం

ఉదయంలో అరుణం... అరుణం


చరణం 2 : 


యుగమే చెరి సగమై విరబూచినదీ మందారం

తనువై తన మనువై రవళించినదీ సిందూరం 

అందం ప్రణయ గంధం... నీ పై చల్లగా

సాగే ప్రేమరాగం... నా లో మెల్లగా

అరుణం అమర నాట్యం ఆడదా

కిరణం కరుణ గీతం పాడదా 

ఆ... ఆ.. ఆ. ... ఆ... ఆ.. 


హృదయంలో అరుణం... అరుణం

ఉదయంలో అరుణం... అరుణం

ఎన్నెన్ని జన్మాలదో ఈ ఋణం

అనురాగమై విరిసె అరుణారుణం 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. 



హృదయంలో అరుణం... అరుణం

ఉదయంలో అరుణం... అరుణం

Friday, December 25, 2020

మ్రోగింపవే హృదయ వీణ




చిత్రం :  అన్న తమ్ముడు (1958)
సంగీతం :   అశ్వత్థామ
గీతరచయిత :  ఆచార్య బి.వి.ఎన్ 
నేపథ్య గానం :  జిక్కి 


పల్లవి : 


మ్రోగింపవే హృదయ వీణ... 
పలికింపవే మధుర ప్రేమ...
మ్రోగింపవే హృదయ వీణ

మృదుల మనోహర నాదముతో...
మృదుల మనోహర నాదముతో...
జీవితఫలమే  ప్రేమయనీ... 
అది 
కామితములలో మిన్నయని

మ్రోగింపవే హృదయవీణా... 


చరణం 1 :


సతిపతులను విరజాజిపువ్వులో
ప్రేమతావివై... 
పరిమళించుగా

  
సతిపతులను విరజాజిపువ్వులో
ప్రేమతావియై 
పరిమళించుగా


హృదయభారమును తీర్చి దంపతుల
మనసులొకటిగా మార్చును ప్రేమా... 

మ్రోగింపవే హృదయవీణా.. 


చరణం 2 :

ఎవరెవరో మది ఎరుగకున్ననూ
ఎదలో కదులును తీయనిబాధా..
 
ఎవరెవరో మది ఎరుగకున్ననూ
ఎదలో కదులును తీయనిబాధా

ప్రేమ ఎరుగదా తనవారెవరో
ప్రేమను బోలిన పెన్నిధిగలదా

మ్రోగింపవే హృదయవీణా.. 


చరణం 3 :

అనుబలమున పరిపాలన జేసెడి
మనుజరాక్షసుల మతములు మాపి  
అనుబలమున పరిపాలనజేసెడి
మనుజరాక్షసుల మతములు మా
పి

విశ్వమానవుల కల్యాణానికి
నాందీగీతమై అలరును ప్రేమా...
 

మ్రోగింపవే హృదయ వీణ... 
పలికింపవే మధుర ప్రేమ...
మ్రోగింపవే హృదయ వీణ 


Thursday, October 15, 2020

శివశివశంకర కైలాసవాసా

 



చిత్రం :  అగ్ని సంస్కారం (1980)

సంగీతం :  ఎం. జనార్ధన్

గీతరచయిత :   

నేపథ్య గానం :  జానకి


పల్లవి :


శివశివశంకర కైలాసవాసా ఓ దేవదేవా

త్రిలోకాలు దీపించే పరంజ్యోతివే నీవు

త్రిలోకాలు దీపించే పరంజ్యోతివే నీవు

శివశివశంకర కైలాసవాసా



చరణం 1 :



నిటాలాక్ష నీలకంఠ మొరాలించగా నీవు

నిరంతరం మాలోనే విరాజిల్లుతున్నావు

ఆదరించి మా సేవ అందుకొమ్ము దేవదేవ

పరాత్పరా... సదాశివా...  పాహిమాం పాహిపాహి


శివశివశంకర కైలాసవాసా... 



చరణం 2 :


కులం మతం సాగించే విభేదాలు మాకేలా

జగతిలోని మానవులంత సమానులే నీచెంత

ఈయథార్థమెరిగిననాడు జీవితాన లేదు చింత



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9949





Sunday, August 23, 2020

అన్నా... విన్నా... పాపమే

చిత్రం : అపరాధి (1982)
సంగీతం : జె. వి. రాఘవులు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, శైలజ   



పల్లవి :


అనసూయా... లల లల హా హా.. హుహు హూ హా హా..
లాలా లలలా లలలా హ హ...


అన్నా... విన్నా... పాపమే...
అనసూయా అసూయెందుకే... ఇదిగో


అవ్వా... అంతా మోసమే...
మగబుద్ధి అన్నారందుకే...
సందెకాడ కోపం... చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ రాజీకి రానంటే పాపం... హా


చరణం 1 :


పెద్దలమీద పెదొట్టు బుగ్గలమీద ముదొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?


పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం
వన్నెల విసన కర్రలతోన వ్యవహారం

పెద్దలమీద పెదొట్టు బుగ్గలమీద ముదొట్టు

నీ బొట్టు మీదొట్టు... చాలా?

పేరుకు భార్య రత్నం... మెళ్ళో మంగళసూత్రం 

వన్నెల విసన కర్రలతోనా వ్యవహారం 


నోట్లో వేలు కొరకని వాణ్ని
నిన్నే తప్ప ఎరగని వాణ్ని
నీ భామా కలాపాలు చూశాలే 

అవ్వా అంత మోసమే
మగ బుద్ధి అన్నారందుకే


సందెకాడ కోపం చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం... ఆ అ అ
రాజీకి రానంటే పాపం... హా


చరణం 2 :


మమతలన్ని మనువు చేసి భర్తనైనానే

మమతలన్ని మనువు చేసి భర్తనైనానే


నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే
నిన్ను నమ్మి మనసు నమ్మి ఆలినైనానే


అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం
అనుమానం పెనుభూతం... చాలించు భాగోతం


అన్నా విన్నా పాపమే
అనసూయా...  అసూయెందుకే

సందెకాడ కోపం చందమామ శాపం
రాత్రిళ్లకే కాళ్ళబేరం..
రాజీకి రానంటే... పాపం...


లల..లల..లలలా..
ల లా లా ల ల లా 



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13005

Wednesday, July 15, 2020

గుత్తీవంకాయ కూరా

చిత్రం :  అతని కంటే ఘనుడు (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  బాలు   


పల్లవి : 



ధనా ధన్...
గుత్తీవంకాయ కూరా... గుర్తుందా కుర్రదానా
గుత్తీవంకాయ కూరా... నీకు గుర్తుందా కుర్రదానా
ఆ కూరతోనే దోర వలపే కూసింత నంజుకోనా
అవునా... కొంగట్టుకుండిపోనా
అవునా... కొంగట్టుకుండిపోనా


గుత్తీవంకాయ కూరా... నీకు గుర్తుందా కుర్రదానా
హోయ్


చరణం 1 :


మాటవినవే మరదలమ్మా... పైట జారే పదిలమమ్మా
ఎంత నున్నని సిగ్గులమ్మా... ఎరుపు వెన్నెల నిగ్గులమ్మా
చూపులేమో మెరుపులాయే... తీపితీపి చురకలాయే
చూపులేమో మెరుపులాయే... తీపితీపి చురకలాయే
కుదిరింది గుణకారం... ముదిరింది వ్యవహారం



ధనా ధన్...
గుత్తీవంకాయ కూరా... నీకు గుర్తుందా కుర్రదానా
ఆ కూరతోనే దోర వలపే కూసింత నంజుకోనా
అవునా... కొంగట్టుకుండిపోనా



చరణం 2 :


ఏమి చల్లని నవ్వులమ్మా... ఎన్ని మల్లెల జల్లులమ్మా
ఏమి చల్లని నవ్వులమ్మా... ఎన్ని మల్లెల జల్లులమ్మా
ఇంత అందం దేనికమ్మా... ఎవరి దోసిట కానుకమ్మా
చేయి చేయి కలుపుకుంటూ... రేయి రేయి కలుసుకుంటూ
హేయ్... చేయి చేయి కలుపుకుంటూ... రేయి రేయి కలుసుకుంటూ
ఏకంగా ఉందామా... ఎగిరెగిరి పోదామా


ధనా ధన్... అహ..
గుత్తీవంకాయ కూరా... నీకు గుర్తుందా కుర్రదానా
ఆ కూరతోనే దోర వలపే కూసింత నంజుకోనా
అవునా... కొంగట్టుకుండిపోనా 




Tuesday, July 14, 2020

చెలి హృదయంలో

చిత్రం :  అతని కంటే ఘనుడు (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు, సుశీల  


పల్లవి : 



చెలి హృదయంలో తొలి ప్రణయంలో విరిసిన అందాలు
తొలకరి కోర్కెలు తొందర చేసిన వలపుల బంధాలు
ఆగనా... ఇంకా ఆగనా... నీ కౌగిట దాగనా


చెలి హృదయంలో తొలి ప్రణయంలో విరిసిన అందాలు
తొలకరి కోర్కెలు తొందర చేసిన వలపుల బంధాలు
ఆగనా... ఇంకా ఆగనా... ఆ ఒడిలో ఊగనా
 


చరణం 1 :


సిరి కన్నా విలువైన మగసిరిని చూశాను
సిరిమల్లెనై పూచి ఒడిలోనే ఉంటాను
రాగాల అనురాగమై గీతాల సంగీతమై


విరబూసిన అందంలో విహరించే తుమ్మెదలా
అధరాల మధురిమలో నే తడిసి పోకుండా
ఆగనా... ఇంకా ఆగనా... ఆ ఒడిలోే ఊగనా  




చరణం 2 : 



ఒక యమునలా నువ్వు మెలి తిరిగిపోతావు
పడిలేచు పరువాల చెలరేగిపోతావు
ఏ కడలి కెరటానివో ఏ బ్రహ్మ రూపానివో


ఆ నీలి కన్నుల్లో నీ చూపు వెన్నెల్లో
నూరేళ్ల కౌగిళ్లు నా సొంతమవుతుంటే
ఆగనా... ఇంకా ఆగనా... నీ కౌగిట దాగనా


చెలి హృదయంలో తొలి ప్రణయంలో... విరిసిన అందాలు
తొలకరి కోర్కెలు తొందర చేసిన... వలపుల బంధాలు 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3669

చెప్పింది చేస్తా

చిత్రం :  అతని కంటే ఘనుడు (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు 


పల్లవి : 

హహాహ.. ఓ.. ఓ.. ఓ...
హే.. హే.. ఏ... ఓ.. ఓ.. ఓ..
చెప్పింది చేస్తా చేసేది చెబుతా... చేశాకే మీసాలు మెలి వేస్తా
మనపేరు వింటే మన దెబ్బ తింటే... గూండాలు గోవిందరా
అత్తిలి పిల్లోడా అల్లరి బుల్లోడా
అత్తిలి పిల్లోడా అల్లరి బుల్లోడా
అత్తిలి పిల్లోడా అల్లరి బుల్లోడా



చెప్పింది చేస్తా చేసేది చెబుతా... చేశాకే మీసాలు మెలి వేస్తా
మనపేరు వింటే మన దెబ్బ తింటే... గూండాలు గోవిందరా  



చరణం 1 :



మంచికి ఎప్పుడూ ముందుంటా మనకి చెడ్డకి పడదంట
మంచికి ఎప్పుడూ ముందుంటా మనకి చెడ్డకి పడదంట
పేదోళ్లనైతే నేనాదుకుంటా... లేనోళ్ల చుట్టాన్ని రా...  నేను నిజమైన నేస్తాన్నిరా 


అత్తిలి పిల్లోడా అల్లరి బుల్లోడా
అత్తిలి పిల్లోడా అల్లరి బుల్లోడా
అత్తిలి పిల్లోడా అల్లరి బుల్లోడా


చెప్పింది చేస్తా చేసేది చెబుతా... చేశాకే మీసాలు మెలి వేస్తా
మనపేరు వింటే మన దెబ్బ తింటే... గూండాలు గోవిందరా 



చరణం 2 : 



చక్కని చుక్కలు ఎదురైతే ఉక్కిరి బిక్కిరి కాబోను
చక్కని చుక్కలు ఎదురైతే ఉక్కిరి బిక్కిరి కాబోను
అందాల రెమ్మ అపరంజి కొమ్మ చేశాడు నాకోసమే... ఆ బ్రహ్మ దాచాడు నాకోసమే...



చెప్పింది చేస్తా చేసేది చెబుతా... చేశాకే మీసాలు మెలి వేస్తా
మనపేరు వింటే మన దెబ్బ తింటే... గూండాలు గోవిందరా 

Monday, June 29, 2020

ఎదలో జీవన రాగాల వీణా

చిత్రం : అల్లరి వయసు (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :
నేపథ్య గానం :  బాలు, శోభా శేఖర్ 



పల్లవి :


ఎదలో జీవన రాగాల వీణా
ఎదుటే  ఆమని అందాల జాణా
ఇది కన్ను కన్ను కలసిన కళ్యాణి రాగం
నిన్ను నన్ను కలిపిన అనురాగ యోగం
మది కోవెలగా...  నిను దేవతగా
నిలుపుకున్న నా వలపు వసంతం 


ఎదలో జీవన రాగాల వీణా
ఎదుటే ఆమని అందాల జాణా



చరణం 1 :



కన్నీటి విడుపు నీ కన్నెతనానికి... వీడుకొలుపులని తెలుసు
ఆ జిలుగు పైటలో వొదుగు సొగసు... నా ముద్దు ముడుపుకని తెలుసు
అరుణోదయాల కిరణకాంతి నే దిద్దు తిలకమని తెలుసు
అరుణోదయాల కిరణకాంతి నే దిద్దు తిలకమని తెలుసు
ఇంత తెలిసి జంట కలిసి.. ఎందుకే వగపు నేనున్నది నీ కొరకు 


ఎదలో జీవనరాగాల వీణా... ఎదుటే ఆమని అందాల జాణా



చరణం 2 :



ప్రేమ పలుకుల రామ చిలుకలే పెళ్లి మంత్రమే చదువగా
కొమ్మకొమ్మలో కోయిలమ్మలే సన్నాయి పాటలే పాడగా
తనువులు కలిసిన శుభతరుణాలే మనువైపోయిన ముహూర్తాలుగా
తనువులు కలిసిన శుభతరుణాలె మనువైపోయినముహూర్తాలుగా
ఏడుజన్మల తోడు నేనై వుండనా నేనే నూరేళ్లు నీలోనే


ఎదలో జీవన రాగాల వీణా
ఎదుటే  ఆమని అందాల జాణా
ఇది కన్ను కన్ను కలసిన కళ్యాణి రాగం
నిన్ను నన్ను కలిపిన అనురాగ యోగం
మది కోవెలగా నిను దేవతగా
నిలుపుకున్న నా వలపు వసంతం 


ఎదలో జీవన రాగాల వీణా
ఎదుటే ఆమని అందాల జాణా 





వయసా ఇది మాటే వినని

చిత్రం : అల్లరి వయసు (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : 
నేపథ్య గానం :  బాలు, వసంత  




పల్లవి : 


వయసా ఇది మాటే వినని మనసా
బల్ టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరి  పెట్టే సొగసా
నీ అందం ఆరనిమంట...  నా ముద్దుల గుమ్మ
నేనెట్టా ఆగేదంటా



వయసా ఇది మాటే వినని మనసా
బల్  టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరిపెట్టే సొగసా
కైపెక్కిపోతే ఎట్టా... నా మల్లెల మామా
పైపైకి వస్తే తంటా 



చరణం 1 :


ఏటవాలు సూపులకే ఎన్నొలొస్తది
కోనసాటు ఎలుతురికే కోడి కూస్తది
ఏటవాలు చూపులకె ఎన్నెలొస్తది
కోనచాటు ఎలుతురికే కోడి కూస్తది
తెల్లచీర కట్టుకోని మల్లెపూలు పెట్టుకోని
తెల్లచీర కట్టుకోని మల్లెపూలుపెట్టుకోని
మెల్లగా నాకెదురొస్తే...
మెల్లగా నాకెదురొస్తే...  మబ్బే పట్టేస్తది... మసకే కమ్మేస్తది


వయసు గాలి తిరిగింది వలపు వాన కురిసింది
ఉండుండి  పిల్లగాడి గుండెలోనా ఉరిమింది
ఎక్కడి వాడమ్మ పగలే చుక్కలు ఱేడమ్మా 
ఎక్కడి వాడమ్మ పగలే చుక్కలు ఱేడమ్మా 


వయసా ఇది మాటే వినని మనసా
బల్  టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరి పెట్టే సొగసా
కైపెక్కిపోతే ఎట్టా... నా మల్లెల మామా
పైపైకి వస్తే తంటా 


చరణం 2 :



ఎదురు రొమ్ము చూస్తుంటే నిదరవస్తది
నిదరలోన కల వచ్చి ముద్దు చేస్తది
ఎదురు రొమ్ము చూస్తుంటే నిదరవస్తది
నిదరలోన కల వచ్చి ముద్దు చేస్తది
పొద్దుటేళ అద్దమెట్టి ముద్ధులన్నీ సద్దుకుంటే
పొద్దుటేళ అద్దమెట్టి ముద్ధులన్నీ సద్దుకుంటే
వెనక నుంచి కలకాస్తా...
వెనక నుంచి కలకాస్తా నిజమై వచ్చేస్తది...  నీరై వాటేస్తది


పిచ్చికాస్త ముదరాలి పెళ్ళికి లగ్నం కుదరాలి
ఓ పిల్లనాకు దొరకాలి ఈపిల్ల పాపం అలగాలి
వన్నెల బుల్లెమ్మ వగలు చాలును పోవమ్మా
వన్నెల బుల్లెమ్మ  వగలు చాలును పోవమ్మా 


వయసా ఇది మాటే వినని మనసా
బల్  టెంపరి టెంపరి దినుసా
నన్నల్లరిపెట్టే సొగసా
అరెరెరే... నీ అందం ఆరనిమంటా
నాముద్దులగుమ్మా... నేనెట్థా ఆగేదంటా
కైపెక్కిపోతే ఎట్టా...
నా మల్లెల మామా...  పైపైకి వస్తే తంటా




పాపం ఈ చిన్నవాడి కొక లోపం

చిత్రం : అల్లరి వయసు (1979)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత :
నేపథ్య గానం :  శోభా శేఖర్, ఆనంద్  



పల్లవి :



పాపం ఈ చిన్నవాడికొక లోపం
పగలైనా రేయైనా ఆ కోరిక ఒకటే పాపం


పాపం ఈ చిన్నదానికికొక లోపం
పగలైనా రేయైనా నా కోరిక తీర్చదు పాపం... పాపం



చరణం 1 :



కలలోకి రమ్మన్నానా...  తనుగానే వస్తుంది
కలలోకి రమ్మన్నానా...  తనుగానే వస్తుంది
అది ఎందుకో ఏమిటో నే కోరలేదు
కౌగిలికి రా....
కౌగిలిరా రమ్మని అడిగినా రాదు 


పాపం ఈ చిన్నవాడికొక లోపం
పగలైనా రేయైనా ఆ కోరిక ఒకటే పాపం... పాపం



చరణం 2 :


కౌగిలికి రానంటానా...  సమయమిది కాదన్నాను
కౌగిలికి రానంటానా...  సమయమిది కాదన్నాను
ఇంకెందుకీ తొందరా న్యాయమేనా
నీ దాననే...
నీదాననే... ఇప్పుడు ఎపుడైనా గానీ 


పాపం ఈ చిన్నదానికొక లోపం
పగలైనా రేయైనా నా కోరిక తీర్చదు పాపం... పాపం


చరణం 3 :


మత్తుగా ఉండిపోనీ పెనవేసి పెదవి పెదవి
మనువాడనీ ముందుగా అప్పుడవునంటాను
మనసాగదు.... ఊ.. ఊ...
మనసాగదు నిముసము...  నిను చేరకపోతే
లాల లాలలలాలాల... లాల లాలలలాలాల






Tuesday, May 26, 2020

అమ్మాయి... ఓ అమ్మాయి

చిత్రం : హంతకులు వస్తున్నారు జాగ్రత్త (1966)
సంగీతం : విజయ కృష్ణమూర్తి
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : ఘంటసాల



పల్లవి :


అమ్మాయి... ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి
నీ చేయి నా చేయి నాజూకుగా పెనవేయాలి


అమ్మాయి.. ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి
నీ చేయి నా చేయి నాజూకుగా పెనవేయాలి 



చరణం 1 :



బెళుకు చూపుల నీ నయనాలు..తళుకుమంటే అదే పదివేలు
బెళుకు చూపుల నీ నయనాలు..తళుకుమంటే అదే పదివేలు
నిన్నుగనీ రివ్వుమనీ... నింగికి పొంగెను పరువాలు 


అమ్మాయి... ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి
నీ చేయి నా చేయి నాజూకుగా పెనవేయాలి


చరణం 2 :



చిలిపి నవ్వులు దాగవులే లే... వలపు పొంగులు ఆగవులే.. లే
చిలిపి నవ్వులు దాగవులే లే... వలపు పొంగులు ఆగవులే.. లే
కదలకు బెదరకు... కమ్మని కాలం మనదేలే  


అమ్మాయి ఓ అమ్మాయి నువ్వు గమ్మత్తుగా ఇటు రావాలి
నీ చేయి నా చేయి నాజూకుగా పెనవేయాలి



Friday, May 22, 2020

అందాల కోటలోన

చిత్రం : అందరూ హీరోలే (1998)
సంగీతం : శ్రీ
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు



పల్లవి :


అందాల కోటలోన టింగురంగ రంగసాని
రంగుపొంగుహంగు చూడరోయ్
ఓయబ్బ లిప్పు కేకు కొరకరోయ్
శృంగారపేటలోన లింగులిటుకు దొంగసాని
ఖంగుతిన్న కథలు చూడరోయ్
ఓయబ్బ లాలిపప్పలడగరోయ్


మంధార గంధమిచ్చి మంచమేసి పంచిపెట్టు నీ ఊపులే
సందేల ఈల వేసి గోల చేసి జ్యోతలివ్వు నీ షేపులే
ఝనకుఝనకు లబకుజబకు తకిటతధీమి దరువు మనదిలే


అందాల కోటలోన టింగురంగ రంగసాని
రంగుపొంగుహంగు చూడరోయ్
ఓయబ్బ లిప్పు కేకు కొరకరోయ్


చరణం 1 :


గుట్టురట్టు గుమ్మలేడికి... కిలాడికి
చెలాకి చెంప మీద ముద్దు గుత్తి ముట్టడించి పోదునా
ఒడ్డుపొడుగు కోమళాంగికి లవంగికి...
బడాయి బుంగ మూతి బెంగ తీర్చి ఎంగిలెట్టి కొట్టనా
పిడికిలడిగినా పిడక నడుములో... జమలహాటు జముకు మీదనా
అదుపు తగిలిన కుదుపు నడకలో... డబులు హీటు గుబులు పెంచనా
మండపేట తోపు కాడ మాపటేల ఊపు వచ్చి...
మంచెమీద దుప్పటేసి మల్లెమొగ్గ దీపమెట్టి 

గిలిగింతల తోటలో

చిత్రం : అమెరికా అబ్బాయి (1987)
సంగీతం : ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల



పల్లవి :


గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని
గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని



చరణం 1 :


ఒక్క క్షణం చూడకుంటే ఊహకెంత తొందర
ఒక్క క్షణం చూడకుంటే ఊహకెంత తొందర
నో ఒడిలో చేరగానే నింగి నిలిచే ముందరా


నిండువలపు బాసలన్నీ నిలిపేదే జీవితం
నిండువలపు బాసలన్నీ నిలిపేదే జీవితం
అందుకే నా మనసు.. నీకే అంకితం


గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని


చరణం 2 :


చిగురు మేను తాకగానే పెదవికింత దాహమా
చిగురు మేను తాకగానే పెదవికింత దాహమా
ఈ చెంపను మీటగానే ఆ చెంపకు తాపమా


చిలిపి చూపు గుండెపైన చేసింది సంతకం
చిలిపి చూపు గుండెపైన చేసింది సంతకం
అందుకే అణువణువు నీకే అంకితం


గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని


గిలిగింతల తోటలో పులకింతలు పూయని
పులకింతల నావలో తొలిప్రేమలు సాగని



Wednesday, May 20, 2020

నీపైన నాకెంతో

చిత్రం  :  అభిమానవతి (1975)
సంగీతం  : చక్రవర్తి
గీతరచయిత  : దాశరథి
నేపథ్య గానం :  బాలు 




పల్లవి :


నీపైన నాకెంతో అనురాగముందని...
నీపైన నాకెంతో అనురాగముందని...
నిను వీడి క్షణమైన నేనుండలేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది 



చరణం 1 :


నీలినింగిలో కోటి తారలు మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురమవలెనా
నీలినింగిలో కోటి తారలు మాలలల్లి తేనా
అందమైన ఆ చందమామ నీ కురుల తురమవలెనా
అణువణువున నీవే వ్యాపించినావని...
అణువణువున నీవే వ్యాపించినావని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది 


నీపైన నాకెంతో అనురాగముందని...
నిను వీడి క్షణమైన నేనుండలేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది   


చరణం 2 :


వలపు తెలియనీ మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకొని మమత పంచుకొని  మరలివెళ్ళిపోతున్నావు
వలపు తెలియనీ మనసులోనికి ఎందుకోసమని వచ్చావు
మనసు దోచుకొని మమత పంచుకొని  మరలివెళ్ళిపోతున్నావు
నిన్నే హృదయాన నిలిపాను నేనని...
నిన్నే హృదయాన నిలిపాను నేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది 


నీపైన నాకెంతో అనురాగముందని...
నిను వీడి క్షణమైన నేనుండలేనని...
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది 
ఎలా.. ఎలా.. నీకెలా తెలిపేది   



Monday, April 27, 2020

ప్రణయ పిపాసి

చిత్రం : అగ్ని సమాధి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు, జానకి  



పల్లవి : 


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 


ప్రణయ పిపాసి హృదయ నివాసి



చరణం 1 :


సెలయేటి రాగాల ఎలదేటి గానాల విన్నాను నీ పాటలెన్నో
హరివిల్లు ఎదలోనా విరిజల్లు జడిలోనా కన్నాను నీ వన్నెలెన్నో


స్వప్నాలెన్నో స్వర్గాలెన్నో... భావలెన్నో భోగాలెన్నో
కలుపుకున్న కనులలోనా నిలిపి చూడగా  



ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 


ప్రణయ పిపాసి హృదయ నివాసి



చరణం 2 :


అనురాగ గిరిలోనా ఆనందశిఖరాన శివతాండవం నీవు కాగా
సగమైన దేహాన సరితూగు వేగాన సతి లాస్యమే నీవు కాగా
జాబిలి వంగీ  సిగలో పువ్వై... ఎదలో ఎరుపే పెదవుల ఎరుపై..
మెరిసిపోయి మురిసిపోయి ముద్దులాడగా


ప్రణయ పిపాసి హృదయ నివాసి
పొంగులుగా రంగులుగా ఒంపులుగా సొంపులుగా
మోహంగా దాహంగా ఉరికి ఉరికి ఒడికి చేరరా 


ప్రణయ పిపాసి హృదయ నివాసి



మంచున తడిసిన మల్లికవో




చిత్రం :  అగ్ని సంస్కారం (1980)
సంగీతం :  ఎం. జనార్ధన్
గీతరచయిత : వేటూరి 
నేపథ్య గానం :  బాలు, సుశీల   



పల్లవి :


ఆ.. ఆ.. హహా.. ఆ
ఏహేహే..హేహే.. లాలాలాలాలా


మంచున తడిసిన మల్లికవో... మానసవీణా గీతికవో
మంచున తడిసిన మల్లికవో... మానసవీణా గీతికవో
అందాలన్నీ ఆలాపనగా పలికే రాగమాలికవో


అందని జిలిబిలి తారకవో... జీవనసంధ్యా దీపికవో
అందాలన్నీ ఆలాపనగా పలికే రాగమాలికవో


అందని జిలిబిలి తారకవో... జీవనసంధ్యా దీపికవో



చరణం 1 :


తొలితొలి వలపుల తొలకరి మెరుపులు నిలకడగా నిలిచిపోనీ
నా చెలి పెదవుల జాబిలి ఋతువులు మనుగడగా మలుచుకోనీ
నీ తేనెలొలుకు తీపి పలుకు నాలో పులకింతగా మిగిలిపోనీ


మంచున తడిసిన మల్లికవో... జీవనసంధ్యా దీపికవో


చరణం 2 :


వేసిన అడుగుల వెన్నెల మడుగుల వేసవులే మరచిపోనీ
మాయని మమతల రాయని కవితల వెల్లువలో మునిగిపోనీ
నీ చూపు నిలుపు చుక్క పొడుపు నాలో చలిమంటగా రగిలిపోనీ


మంచున తడిసిన మల్లికవో... జీవనసంధ్యా దీపికవో




Sunday, April 26, 2020

ఆడించదా వయసు పాడించదా

చిత్రం :  అందాల రాశి (1980)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు  



పల్లవి :


ఆడించదా వయసు పాడించదా... చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా... చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా



చరణం 1 :


చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు
చురుకు చురుకు ఆడపిల్ల చూపులు... ఉరకలెయ్యి కోడెగాడి కోర్కెలు


రెండిటికి బంధమేసి ఇద్దరినీ ఒకటి చేసి
ముద్దొచ్చే పండుగలో మురిపించదా...
హాయి కురిపించదా... మేను మరపించదా



ఆడించదా వయసు పాడించదా... చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా... చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా 



చరణం 2 :



రమణిలోన ఉంటుందొక రాధా... మమత ఉన్న మనిషే మాధవుడు
రమణిలోన ఉంటుందొక రాధా... మమత ఉన్న మనిషే మాధవుడు


ఈడుజోడు కుదిరితే తోడునీడ కుదిరితే...
వేడుకగా ప్రేమగీతి పలికించదా
తనివి ఒలికించదా... బ్రతుకు పులకించదా


ఆడించదా వయసు పాడించదా... చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా... చూడముచ్చటగా సొగసు ఊరించదా
ఆడించదా వయసు పాడించదా 




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7605

అందాలరాశి... నీ అందచందాలు చూసి

చిత్రం :  అందాల రాశి (1980)
సంగీతం :  రమేశ్ నాయుడు
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, శైలజ 




పల్లవి :


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి...



చరణం 1 :


నీ రూపు హృదయాలయ దీపికా... నీ చూపు ఉదయోదయ తారకా
నీ రూపు హృదయాలయ దీపికా... నీ చూపు ఉదయోదయ తారకా


నీ పలుకుల సడికి ఉలికిపడే ఊర్వశినై ఊగనీ
నీ మేను తగిలి  మెలిక తిరిగి మేనకనై ఆడనీ


ఆ.. నీవే నా జీవన బృందావన రాధికా
నీవే యువతీ జన నవమోహన గీతికా


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి


చరణం 2 :


నీ మాట మంత్రాక్షర మాలికా... నీ మనసే మమతల మరుమల్లికా
నీ మాట మంత్రాక్షర మాలికా... నీ మనసే మమతల మరుమల్లికా


పురివిప్పిన నీ సొగసున మణిపురినే చూడనీ
గురి తప్పని నీ అడుగులు కూచిపూడి ఆడనీ


నీవేలే శ్రీశైల శిఖరాంచల చంద్రికా
నీవే నా నవయవ్వన నందనవన భ్రమరికా


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి


అందాలరాశి... నీ అందచందాలు చూసి
ఎన్నో గ్రంథాలు రాసి... తరించేనులే ప్రేయశి... ప్రేయశి
అందాలరాశి...





Friday, April 24, 2020

దారంట పోయేదానా

చిత్రం :  అందరికీ మొనగాడు (1971)
సంగీతం :  కె. వి. మహదేవన్
గీతరచయిత :  ఆరుద్ర
నేపథ్య గానం :  బాలు



పల్లవి :


దారంట పోయేదానా... నీ వెంట నేను రానా
నా జంట నీవై... నీ పంట నేనై
పొదరింట నిను దోచుకోనా


దారంట పోయేదానా... హో..హో
నీ వెంట నేను రానా... హా.. హా..
నా జంట నీవై... నీ పంట నేనై
పొదరింట నిను దోచుకోనా



చరణం 1 :


పొగరు కళ్ళు నీవి... పోకిరి చూపులు నావి
వగరు వన్నెలు నీవి... వగల విందులు నావి
పొగరు కళ్ళు నీవి... పోకిరి చూపులు నావి
వగరు వన్నెలు నీవి... వగల విందులు నావి  


నిషా కులుకులా.. ఖుషీ తళుకులా
తాజా చెయ్యి నువ్వు.. నీ రాజానౌతనమ్మో



దారంట పోయేదానా... నీ వెంట నేను రానా
నా జంట నీవై... నీ పంట నేనై
పొదరింట నిను దోచుకోనా


చరణం 2 :


ఇసుక తిన్నెల పైనా.. పగటి వెన్నెలలోనా
రంగు గొడుగుల నీడా... ఆడు రాసక్రీడా
ఇసుక తిన్నెల పైనా.. పగటి వెన్నెలలోనా
రంగు గొడుగుల నీడా... ఆడు రాసక్రీడా


ఒకటే ఆటలో... ఒకటే పాటలో...
జలసా చెయ్యి నాతో... జతగా ఉంట నీతో


దారంట పోయేదానా... నీ వెంట నేను రానా



చరణం 3 :



పొంగే వయసు నీది.. నీ పొంగుల రంజు నాది
లొంగని పరువం నీది... లోకువ అయిపోయింది
పొంగే వయసు నీది.. నీ పొంగుల రంజు నాది
లొంగని పరువం నీది... లోకువ అయిపోయింది 


కొసరే వలపులో... ముసిరే మమతలా
బోణీ చెయ్యి నువ్వు... నా రాణివంట నమ్ము


దారంట పోయేదానా... హో..హో
నీ వెంట నేను రానా... హో. హో.. 


నా జంట నీవై... నీ పంట నేనై
పొదరింట నిను దోచుకోనా
పొదరింట నిను దోచుకోనా
పొదరింట నిను దోచుకోనా