Showing posts with label (ఇ). Show all posts
Showing posts with label (ఇ). Show all posts

Tuesday, October 27, 2020

ఇదా ప్రపంచం

 



చిత్రం :  ఇదా ప్రపంచం (1987)

సంగీతం :  జాలాది

గీతరచయిత :  చక్రవర్తి  

నేపథ్య గానం :  బాలు 



పల్లవి :


ఇదా ప్రపంచం... ఇదేనా ప్రపంచం

ఇదా సమిష్టి సమాజం


మరో తరానికి...  మహోజ్వలానికి

మహాత్ములడిగిన మరో ప్రపంచం


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం


చరణం 1 :


చీకటి చింపిన విస్తరిలో

ఆకలి మెతుకుల అవమానం

ఆశల కోసం దేశాన్నైనా

అమ్ముకు బ్రతికే అభిమానం


ఇది జీవితమాడే చదరంగం

చీకటి వెలుగుల సుడిగుండం

తీరము చేరని నావలతో

తెరమరుగాడే పావులతో


ప్రతి నిమిషం ఒక ప్రళయ రోదన

ప్రతి ఉదయం ఒక ప్రసవ వేదన


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం


మరో తరానికి...  మహోజ్వలానికి

మహాత్ములడిగిన మరో ప్రపంచం


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం


చరణం 2 :



రాతిరి కురిసే వెన్నెల్లో

చేతులు కడిగే హంతకులు

శవాలపైనే సవారి చేసే

అమానుషానికి ప్రతీకలు


ఆ సమ్మెలు కట్టిన సమాధి

అది స్వార్ధపరులకే పునాది

కపట స్వతంత్రం కౌగిట్లో

కటిక దరిద్రం పేగుల్లో


ప్రజాభ్యుదయమే ప్రణాళికల్లో

ప్రపంచ యుద్ధం ప్రతీక్షణంలో

ఇదా ఇదా ప్రపంచం


మరో తరానికి....  మహోజ్వలానికి

మహాత్ములడిగిన మరో ప్రపంచం


ఇదా ఇదా ప్రపంచం

ఇదా ఇదా ప్రపంచం



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7608

Tuesday, July 28, 2020

పువ్వులో గువ్వలో

చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :  సుశీల  



పల్లవి :


అమ్మా...
పువ్వులో గువ్వలో వాగులో తీగలో
అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చూసుకోవమ్మ 


పువ్వులో గువ్వలో వాగులో తీగలో
అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చూసుకోవమ్మ 


చరణం 1 :


కొమ్మ కొమ్మ పై కుసుమంలో కమ్మని తేనెవు నీవే.. నీవే
జాలి గుండెతో జలజలజలపారే సెలయేరువు నీవే
నింగిలో నేలలో రంగురంగుల హరివిల్లులో 

అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చూసుకోవమ్మ ... అమ్మా



చరణం 2 :


సీతకోకచిలుకలతో చేరి వసంతాలాడేను
బంగారు వన్నెల జింకలతో చెంగుచెంగున ఎగిరెను
కొండలో కొనలో తోటలో బాటలో 


అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చూసుకోవమ్మ 


చరణం 3 :


నీ చల్లని నీడే నా ఇల్లు
ఈ మూగ జీవులే నా వాళ్ళు
అంతు లేని నీ అందాల లోకం
అంతు లేని నీ అందాల లోకం అంతా నాదే నమ్మ
మనసులో మమతలో కనులలో నా కలలలో


అంతట నీవేనమ్మా... అన్నిట నీవేనమ్మ
నీ ఒడిలో నన్ను దాచుకోవమ్మ
నీ పాపగా నన్ను చూసుకోవమ్మ... అమ్మా



Tuesday, July 7, 2020

తొలి తొలి బిడియాల

చిత్రం :  ఇందిర (1995)
సంగీతం :  ఏ.ఆర్.రహ్మాన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు, చిత్ర
   


పల్లవి : 


తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా
తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై... పరవశాన పసి పరువానా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై... పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా


చరణం 1 :


చిన్న దాని వయసే చెంత చెర పిలిచే
తాకితే తడబడుతూ జారేందుకా
నిలవని అలలా నిలువున అల్లితే
మృదువైన పూలప్రాయం ఝల్లుమనదా


ఆశల తీరాన మోజులు తీర్చేనా
హద్దుమరి తెంచేస్తే యవ్వనం ఆగేనా


తొలి తొలి బిడియాన పూవే సొగసుగ నలిగేలా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై...
నరముల వీణమీటే తరుణమిదే
తొలి తొలి బిడియాన పూవే సొగసుగ నలిగేలా



చరణం 2 :


మధువులు కురిసే పెదవుల కొరకే... ఇరవై వసంతాలు వేచి వున్నా
మదిలోని అమృతం పంచడానికేగా... పదహారు వసంతాలు నోచుకున్నా
ఇకపైన మన జంట కలనైన వీడరాదే... మరికొంటె కల వెంట కన్ని యెద తేలరాదె 


తొలి తొలి బిడియాన పూవే సొగసుగ నలిగేలా
మరిమరి ముదిరే స్పర్శలు మొదలై... పరవశాన పసి పరువానా
తొలి తొలి బిడియాల పూవా తొరపడి పరుగేలా

బల్లకట్టూ బుల్లబ్బాయీ

చిత్రం :  ఇందిర (1995)
సంగీతం :  ఏ.ఆర్.రహ్మాన్
గీతరచయిత :  సిరివెన్నెల
నేపథ్య గానం :  బాలు  


పల్లవి : 


పచ్చబొట్టూ.. ఉగ్గపట్టూ
వల్లకట్టూ.. తీసికట్టూ
చెమ్మా చెక్కా.. ఆడుకుంటూ
గట్టువెంట.. నడచుకుంటా
జానపదం.. పాడుకుంటూ
చుట్టూ.. చేమ
చెట్టు.. పుట్టా
ఆమని... ఏమని జల్... 


ఏ బల్లకట్టూ బుల్లబ్బాయీ... మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు... సౌఖ్యమా
హే చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా... సౌఖ్యమా


పల్లెపిట్టలు చూడగా... మనసు పుట్టెను పిల్లడా
పల్లెపిట్టలు చూడగా... మనసు పుట్టెను పిల్లడా
పట్టణాల స్టైలు కన్నా... పల్లెటూరు సొగసు సుమా
పల్లెకూడు రుచి మరిగీ మరిచిపోలేరు సుమా
పట్టుపావడాకి గుండె ఝల్లుమంది
రెండు జళ్ళ అందం కంటి ముందు ఉంది


బల్లకట్టూ బుల్లబ్బాయీ... మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
హే చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా... సౌఖ్యమా


చరణం 1 :


గండు పిల్లి కోమలవల్లి ఏమైందీ... ఏమైందీ
రెండు పిల్లి పిల్లల్ని కనీ చుంచల్లే చిక్కిందీ
పొగరుబోతు టీచరు కనకా
అయ్యో.. మరుపు రాదే బెత్తం చురకా
పప్పు రుబ్బు పంతులు పిల్లా పై చదువు గట్టెక్కిందా
ముచ్చటగా మూడు మార్కుల్లో ఫెయిలైందీ... ఫెయిలైందీ
పిల్లికళ్ళ రత్నమాలా లేచిపోయి ఎక్కడుందీ
పూర్తిగా మునిగిపోయి తిరిగి వచ్చింది


ఏ బల్లకట్టూ బుల్లబ్బాయీ... మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
ఓయ్ చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా... సౌఖ్యమా


చరణం 2 :


శివుడి గుళ్ళో వేపమానూ ఎట్టుందీ... ఎట్టుందీ
జాతుల రగడంలో రెండైందీ రెండైందీ
పెద్ద వీధి రామయ్య వెంటా... చిన్న వీధి చిట్టెమ్మా వెళ్ళీ
జొన్న చేల మంచె నీడా... జోడు చేరు సంగతేందీ
పాతబడి పోయిందయ్యా ఆ వార్తా ఏనాడో
వాళ్ళ సోది నాకెందుకూ నా గువ్వ కబురు చెప్పూ
ఏపుకొచ్చి ఎపుడెపుడని ఎదురుచూస్తోందీ

 

ఏ బల్లకట్టూ బుల్లబ్బాయీ... మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
హ చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా... సౌఖ్యమా
పల్లెపిట్టలు చూడగా... మనసు పుట్టెను పిల్లడా
పల్లెపిట్టలు చూడగా... మనసు పుట్టెను పిల్లడా 


పట్టణాల స్టైలు కన్నా... పల్లెటూరు సొగసు సుమా
పల్లెకూడు రుచి మరిగీ మరిచిపోలేరు సుమా
పట్టుపావడాకి గుండె ఝల్లుమంది
రెండు జళ్ళ అందం కంటి ముందు ఉంది


బల్లకట్టూ బుల్లబ్బాయీ... మెల్లకళ్ళ బుల్లబ్బాయీ
ఊరిలోని పడుచు పిల్లలు సౌఖ్యమా
ఓయె...  చిల్లర కొట్టూ సత్తయ్య పిల్లా
అప్పులు ఇచ్చే అంకమ్మా పిల్లా
చెవిటి మేళం మాణిక్యం పిల్లా...  సౌఖ్యమా

Sunday, July 5, 2020

ఎందుకు నవ్వావంటే

చిత్రం :  ఇదా లోకం (1973)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం :  బాలు 


పల్లవి :


ఎందుకు నవ్వావంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు
ఎందుకు నవ్వావంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు
యేడవలేకా నవ్వావా.. నీ గోడు నవ్వులో దాచావా
యేడవలేకా నవ్వావా.. నీ గోడు నవ్వులో దాచావా
ఎందుకు నవ్వావంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు
మనసా... నా మనసా


చరణం 1 :


సీతను కోరెను నీచుడు...
హహహ సీతను కోరెను నీచుడు... హహహా
సీతను కోరెను నీచుడు... సాయపడెను మారీచుడు
తారుమారుగా కథ మారిందా...  కారు చీకటి కమ్మేస్తుందని


చెప్పకపోతివే మనసా... ఎంత ముప్పు తెస్తివే మనసా
చెప్పకపోతివే మనసా... ఎంత ముప్పు తెస్తివే మనసా



చరణం 2 :


ఆడది దేవత రూపం... ఆమె ఉసురే తీరని శాపం
అమ్మ తల్లి.. దాసోహం.. అమ్మా.. దాసోహం
ఆడది దేవత రూపం... ఆమె ఉసురే తీరని శాపం
చెంప ఎప్పుడో ఛెళ్ళుమన్నదో.. ఓ.. ఓ..
చెంప ఎప్పుడో ఛెళ్ళుమన్నదో... కొంప అప్పుడే గుల్లౌతుందని


తెలపకపోతివే మనసా... ఇల్లు నిలుపకపోతివే మనసా
మనసా... నా మనసా


చరణం 3 :


గడ్డిని కతికే మనుషులు... కారా చివరకు పశువులు
చెరపకురా నువు చెడేవు అన్నా... పరమరహస్యం మరువరాదని
పెద్దలు చెప్పిరే మనసా... ఆ సుద్ధులు మరిచావ్ మనసా
పెద్దలు చెప్పిరే మనసా... ఆ సుద్ధులు మరిచావ్ మనసా


ఎందుకు నవ్వావంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు
యాడవలేకా నవ్వావా.. నీ గోడు నవ్వులో దాచావా
యాడవలేకా నవ్వావా.. నీ గోడు నవ్వులో దాచావా
ఎందుకు నవ్వావంటే నువ్వు ఏమని చెప్పేవు లోకులకు
మనసా... నా మనసా




https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7810

Tuesday, June 30, 2020

వచ్చే వచ్చే వాన జల్లు

చిత్రం : ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
సంగీతం : జె.వి. రాఘవులు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : బాలు, సుశీల  


పల్లవి : 


వచ్చే వచ్చే వాన జల్లు... జాల్మదియేలో
గుచ్చే గుచ్చే రేగు ముల్లు... జాల్మదియేలో
జాల్మదియేలో ... జాల్మదియేలో ... జాల్మదియేలో
పాడండి... 


వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
రెమ్మా మాటున చిలకమ్మా... జాల్మదియేలో
కమ్మా కమ్మగ పలుకమ్మా... జాల్మదియేలో 


వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో 


చరణం 1 :


చక్కానమ్మ తానె పక్కాకు రాగానే
మొక్కాజొన్న చేను ఏం చేసే... నిక్కాపొడుచుకొని తేరి చూసే
గున్నాగున్నమ్మ వచ్చి నున్న పున్నమ్మ మెచ్చి
నిన్నే చెరుకొని ఏం చేసే... ఉన్నా ఉన్నదుండి నమిలేసే


కంటి రెప్ప చిటికేసే... కాకిపిల్లా గుటకేసే
కంటి రెప్ప చిటికేసే... కాకిపిల్లా గుటకేసే
కంటి రెప్ప చిటికేసే... కాకిపిల్లా గుటకేసే
ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్.. ఉమ్మ్మ్


వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
 


చరణం 2 :


కన్నేమో కల్వపిల్ల.. చూపేమో చాపపిల్లా
చిన్నారి నడకే హంసపిల్లా.. కోనంగి మనసే కోతిపిల్లా
చెట్టూ చాటెందుకింక.. సిగ్గు మాటెందుకింక
చెట్టాపట్టాలు వేసుకోరాదా...  చెంగూన కట్టేసుకోరాదా
జోడు కుదిరెను ఇద్దరికీ... తాళమున్నది మద్దెలకి
జోడు కుదిరెను ఇద్దరికీ... తాళమున్నది మద్దెలకి



వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో
రెమ్మా మాటున చిలకమ్మా... జాల్మదియేలో
కమ్మా కమ్మగ పలుకమ్మా... జాల్మదియేలో 


వచ్చే వచ్చే వయసు బొమ్మా... జాల్మదియేలో
విచ్చే విచ్చే మనసు రెమ్మా... జాల్మదియేలో 





https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=9309

Monday, July 9, 2018

ఎవరికి ఎవరు కాపలా

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్



పల్లవి :



కాపలా..ఆ ఆ ఆ
కాపలా..ఆ ఆ ఆ


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ
బంధాలన్నీ... నీకేలా
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా
ఈ బంధాలన్నీ... నీకేలా?
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా





చరణం 1 :



తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళ
తనువును వదిలి తరలే వేళ
మన మంచే..ఏ... ఏ.. మనకు కాపలా..ఆఆఆ   


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా



చరణం 2 :



కంటికి రెప్పే కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలగిన వేళ
పెట్టినదేరా..ఆ... ఆ... గట్టి కాపలా


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా



చరణం 3 :



చిన్నతనాన తల్లి కాపలా
వయసున వలచిన వారు కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ
కన్నీరేరా... ఆ... ఆ... నీకు కాపలా
కన్నీరేరా... నీకు కాపలా


ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా
ఈ బంధాలన్నీ... నీకేలా?
ఎవరికి ఎవరు కాపలా..ఆ ఆ ఆ... బంధాలన్నీ..నీకేలా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18317

నీవే నీవే కావలసినది

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : పి. బి. శ్రీనివాస్, సుశీల 



పల్లవి :



ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో
ఓహో ఓహో ఓహో ఓఓఓ ఓహో


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది



చరణం 1 :



నీ వలపు నీడలో నా తలపె ఆగెనే
నీ ఎదట నా హృదయం మూగపోయి నిలిచెనే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
నీ వలపు నీడలో నా తలపె ఆగెనే
నీ ఎదట నా హృదయం మూగపోయి నిలిచెనే
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ 

వేచి వేచి వేదనలో వేడాయే వెన్నెలే
వేచి వేచి వేదనలో వేడాయే వెన్నెలే
చూసి చూసి సోయగాలు...  సోలిపోయే కన్నులే
సోలిపోయే కన్నులే 


ఓఓ... ఓఓఓఓ..
నీవే నీవే ... నిన్నే నిన్నే
నీవే నీవే ... కావలసినది
నిన్నే నిన్నే... ... నే వలచినది..
ఆ హా హా... ఓ హో హో ఆ హా అహా 



చరణం 2 :



నీ కోసమే జీవనం... నీ రూపమె భావనం
నీవు లేని నిముషాన ఈ జగమే కాననం
ఆ ... ఆ... ఆ...  ఆ
నీ కోసమే జీవనం... నీ రూపమె భావనం
నీవు లేని నిముషాన  ఈ జగమే కాననం
ఓ...  ఓ...  ఓ... ఓ ... 


నీ కనులా జాడలో... నా కలలు పండెనే
నీ కనులా జాడలో... నా కలలు పండెనే
నీవు లేక నేనిక... తావిలేని పూవులే
తావిలేని పూవులే
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ 


నీవే... నీవే
నిన్నే... నిన్నే
నీవే నీవే... కావలసినది
నిన్నే నిన్నే... నే వలచినది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=627

ఒకే రాగం ఒకే తాళం

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలే (1961)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల


పల్లవి :



ఒకే రాగం...  ఒకే తాళం...
ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా





చరణం 1 :



కనుల ఒక రూపే కదలాడే చూడూ
మనసునొక మాటే మరిపించె నేడూ
ఆ... ఆ... ఆ... ఆ... ఆ
కనుల ఒక రూపే కదలాడే చూడూ
మనసునొక మాటే మరిపించె నేడూ


విరియు విరిబాలలో... దరియు చిరుగాలిలో
మరియు మదిలోతులో... ఒకే అనురాగమే
విరియు విరిబాలలో... దరియు చిరుగాలిలో
మరియు మదిలోతులో...  ఒకే అనురాగమే


ఒకే రాగం...  ఒకే తాళం... ఒకే గీతం పాడేనమ్మా 



చరణం 2 :



నాడు నెలరాజు వలె వచ్చినాడు
నేడు నారాజే నను పంపినాడు
ఆ...  ఆ... ఆ...  ఆ
నాడు నెలరాజు వలె వచ్చినాడు
నేడు నారాజే నను పంపినాడు


తలపు పులకించెనే... వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే... ఇదే ఆనందమే
తలపు పులకించెనే... వలపు బులిపించెనే
కలలు ఫలియించెనే... ఇదే ఆనందమే



ఒకే రాగం...  ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా
ఒకే రాగం...  ఒకే తాళం..ఒకే గీతం పాడేనమ్మా






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=18312

Sunday, April 2, 2017

ఆదివారం అర్థాంగికీ

చిత్రం :  ఇల్లాలు ప్రియురాలు (1984)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు


పల్లవి : 



ఆదివారం అర్థాంగికీ... సాయంకాలం సరసానికీ
బాబూ నీకో దండం... తల్లీ చెప్పకు అడ్డం
వారం దాకా అడగను మళ్ళీ వరమియ్యవా


ఆదివారం శ్రీవారికీ... సాయంకాలం సినిమాలకీ
బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం
వారం దాకా దూరంగుండే వరమివ్వనా


ఆదివారం అర్థాంగికీ.. సాయంకాలం సినిమాలకీ



చరణం 1 :



రాత్రీ పగలు పిల్లకు అలకే తీర్చానుగా
రత్నాలంటి పిల్లల తల్లిని చేశారుగా
సందేళ చలిపుట్టి సరదాగా రమ్మంటే
వందేళ్ళ జతకట్టి వంచారూ నా మెడనే
ఆ పెళ్ళి రోజులన్నీ మోజు తీరా ఒక్కసారీ రానీవమ్మా
వేళా పాళా లేదూ... ఈ వెర్రికి మందే లేదూ
ఈ కాపురమెట్టా చేయాలమ్మా కౌగిళ్ళలో


ఆదివారం అర్థాంగికీ... సాయంకాలం సరసానికీ
బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం
వారం దాకా దూరంగుండే వరమివ్వనా



చరణం 2 :


చంటోడు అవుతున్నాడూ ఇంటాయనా
వంటా వార్పూ అన్నీ సున్నా నారాయణా
పసివాళ్ళూ చూస్తారూ... పరువంతా తీస్తారూ
పరువంలో పడ్డాకా ఈ దరువే వేస్తారూ
వాళ్ళమ్మా నాన్న ఆడే ఆట వాళ్ళు నేర్చుకుంటారంతేనమ్మా
చీకటి పడితే చింత... వెన్నెల వేళకు వంకా
నే వారందాకా ఆగాలంటే ఎట్టాగమ్మా




ఆదివారం శ్రీవారికీ... సాయంకాలం సినిమాలకీ
బాబూ నీకో దండం వద్దీ తొందరమేళం
వారం దాకా దూరంగుండే వరమివ్వనా



ఆదివారం అర్థాంగికీ... సాయంకాలం సరసానికీ
బాబూ నీకో దండం... తల్లీ చెప్పకు అడ్డం
వారం దాకా అడగను... మళ్ళీ వరమియ్యవా




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2689

Saturday, April 1, 2017

ఓ బాటసారి...ఇది జీవిత రహదారి

చిత్రం :  ఇల్లాలు (1981)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత  :
నేపధ్య గానం  : ఏసుదాసు,  శైలజ 




పల్లవి :



ఓ బాటసారి...ఇది జీవిత రహదారి
ఓ బాటసారి...ఇది జీవిత రహదారి 


ఎంత దూరమో... ఏది అంతమో
ఎవరు ఎరుగని దారి ఇది
ఒకరికె సొంతం కాదు ఇది 


ఓ బాటసారి... ఇది జీవిత రహదారి..



చరణం 1 :



ఎవరు ఎవరికి తోడౌతారో.... ఎప్పుడెందుకు విడిపోతారో
మమతను కాదని వెళతారో... మనసే చాలని ఉంటారు
ఎవ్వరి పయనం ఎందాకో...
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని
అడగదు ఎవ్వరిని... బదులే దొరకదని


చరణం 2 :



కడుపుతీపికి రుజువేముందీ... అంతకు మించిన నిజమేముందీ...
కాయే చెట్టుకు బరువైతే.... చెట్టును భూమి మోస్తుందా..
ఇప్పుడు తప్పులు తెలుసుకొనీ... జరిగేదేమిటనీ..క్షమించదెవ్వరినీ


చరణం 3 :



తెంచుకుంటివి అనుబంధాన్ని... పెంచుకున్నదొక హృదయం దాన్ని..
అమ్మలిద్దరు వుంటారని అనుకోలేని పసివాడ్ని
బలవంతాన తెచ్చుకొని... తల్లివి కాగలవా? ... తనయుడు కాగలడా?


చరణం 4 :



అడ్డ దారిలో వచ్చావమ్మా... అనుకోకుండా కలిసావమ్మ
నెత్తురు పంచి ఇచ్చావూ... నిప్పును నీవే మింగావూ
ఆడదాని ఐశ్వర్యమేమిటో...ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది
ఇప్పుడు తెలిసింది..కథ ముగిసేపొయింది 


ఓ..బాటసారీ..ఇది జీవిత రహదారీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2663

నీరెండ దీపాలు నీ కళ్ళలో

చిత్రం : ఇల్లాలు (1981)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత :వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల




పల్లవి :


లలలలల ... లలలలల .... లలలలల
లలలలల ... లలలలల .... లలలలల 

నీరెండ దీపాలు నీ కళ్ళలో... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో.... లలలలల
ఈ కొండకోనల్ల వాకిళ్ళలో.... లలలలల
నీదాననైనాను కౌగిళ్ళలో.... లలలలల 


నీరెండ దీపాలు నీ కళ్ళలో.... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... లలలలల 




చరణం 1 :



ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
ఈ సంధ్య వెలుగుల్లో నారింజ రంగుల్లో
నీ అందచందాలు మందారమై
నీ రాగభావాలు శృంగారమై


ఈ కొండగాలుల్లో నా గుండె ఊసుల్లో
నీ మాట అనురాగ సంగీతమై
నీ చూపు ప్రణయాల పేరంటమై
పొద్దెరగని ముద్దులలో ముద్దగ తడిసేవేళ



చరణం 2 :



నా ఆశలీనాడు ఆకాశమే చేరి
నా ఆశలీనాడు ఆకాశమే చేరి
మెరిసేను తారల్ల మణిహారమై
విరిసేను జాబిల్లి మనతీరమై


అందాల హరివిల్లు పొదరిల్లుగా మారి
వరిచేను విరిపానుపు మనకోసమై
కరగాలి జతగూడి మనమేకమై
ముద్దులలో నెలబాలుడి నిద్దురపోయిన వేళ



నీరెండ దీపాలు నీ కళ్ళలో.... లలలలల
నా నీడ చూసాను ఎన్నాళ్ళకో... లలలలల 





Friday, March 31, 2017

టిక్ టిక్ టిక్.... గడియారం

చిత్రం : ఇల్లాలి కోరికలు (1982)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, జానకి 



పల్లవి :

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది

టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది
కొక్కొరొకో  కొక్కొరొకో.... తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి..... మాటొకటుంది మరి
శ్రీవారికి శ్రీమతి...ఇస్తుందో బహుమతి


"అబ్బా మొద్దు నిద్ర మీరును" ... హు


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది



చరణం 1 :



 కొత్త చీర కోప్పడుతుంది...కొంగు కాస్త నలగక పోతే
పట్టెమంచం ములుగుతూ ఉంది...పక్కమీకు పంచకపోతే


"అబ్బా... ఏమిటా గొడవ...అర్ధరాత్రి నిద్రొస్తుంటేను"
"అబ్బా... ఎందుకలా అరుస్తారు" 


అత్తగారు వింటారు...మామగారు లేస్తారు
ఆడపడుచు విన్నదంటే... ఆడిపోసుకుంటుంది
మిమ్మల్నే లెమ్మంటుంటే...అబ్బ లేవండి



టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది
కొక్కొరో కొక్కొరో.... తెల్లారి పోతానంటోంది


మానండి అల్లరి..... మాటొకటుంది మరి...
శ్రీవారికి శ్రీమతి...ఇస్తుందో బహుమతి
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది 



చరణం 2 :


 ఒళ్ళు నాకు బరువుగ ఉంది...కళ్ళు తెరిచి చూడకపోతే
సొగసు రేగి సొదగా ఉంది...మగత నిద్ర మానకపోతే


" ఇదిగో పడుకో.. వివరాలు తెల్లవారి చూద్దాం
అర్ధరాత్రి ఆలాపన నువ్వూనూ "


మనసు విప్పి ఆలడిగింది...అలుసు చెయ్యరాదండి
మనసు విప్పి ఆలడిగింది...అలుసు చెయ్యరాదండి


దిండుకింద పోకచెక్క... దండగేనా చెప్పండి


హు.. అంతేనా ... ఛీ పాడు
మహా నిద్ర మీకే వస్తున్నట్లు


టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది..హు
టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది..


కొక్కొరో కొక్కొరో.... తెల్లారి పోతానంటోంది
మానండి అల్లరి..... మాటొకటుంది మరి
శ్రీవారికి శ్రీమతి...ఇవ్వాలో బహుమతి


టిక్ టిక్ టిక్...  టిక్ టిక్ టిక్.... గడియారం పన్నెండయ్యింది





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2677

జిగినక.. అంబ పలుకు

చిత్రం : ఇద్దరు దొంగలు (1984)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల 



పల్లవి :


జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా



జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక... 




చరణం 1 :


రాక రాక వచ్చినావు రాతిరంతా నీదోనురోయ్... హహ
వచ్చినాక వెళ్ళలేవు రాపిడంతా నాదేనురోయ్... హా


అహాహా... నంగనాచి రంగసాని దొంగసొత్తు దోచెయ్యనా..హా
ఉంగరాల జుట్టు తీసి చెంగుముద్దు కాజేయ్యనా... హా 


ఈ దోపిడి వద్దుర మావా... మరి రాతిరికెట్టా భామా
తీగదాక సాగినాక పోకచెక్కలివ్వమంటే పొద్దుపోదు తెలుసా


జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్
అరే... జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...
జిగినక.. జిగిజిగినక...



చరణం 2 :



చీకటింటికొచ్చినాక చీకుచింత తీర్చెయ్యనా...హా
సిగ్గు వచ్చిపోయినాక చీర నీకు కట్టెయ్యనా... హా


హహహ... సొమ్ములన్ని దోచుకుంటే సొమ్మసిల్లిపోతానురో..అయ్యయ్యో
సోకులన్నీ రాలిపోతే అమ్మతల్లి అంటానురో... 


అనుకోవే కృష్ణారామా... మరి బ్రతికేదెట్టా మావా
కాలమంతా చెల్లిపోతే కాయ కాస్త పండిపోతే... దిక్కులేదు తెలుసా


జిగినక.. జిగిజిగినక...
అంబ పలుకు జగదంబ పలుకు... సొగసమ్మ తళుకు తందానరోయ్


జిగినక.. జిగిజిగినక...
దులుపు దులుపు నీ తళుకు బెళుకు నడిజాము వరకు సిలకా


జిగినక.. జిగిజిగినక...
అరే... జిగినక.. జిగిజిగినక... 





 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2687

Sunday, January 1, 2017

మల్లెమొగ్గ తెలుపు






చిత్రం : ఇంటిగౌరవం (1970)
సంగీతం :  కోదండపాణి
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, సుశీల




పల్లవి :



రాణి..
చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు
చింతపువ్వు ఎరుపు.. చిలకముక్కు ఎరుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి



మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. నిండు వలపు నిలుపు
రాజా.. ఓ.. రాజా...



చరణం 1 :


అబ్బ.. ఊరించు పెదవులు ఎరుపు.. అవి నాలోన ఆశలు రేపు

అబ్బ.. ఊరించు పెదవులు ఎరుపు.. అవి నాలోన ఆశలు రేపు

ఆగాలి పెళ్ళైన వరకు.. ఆపైన తమదే గెలుపు

వలచే వేళా.. తొలగేవేలా?

వలచే వేళా.. తొలగేవేలా?

ఈ ఎడమోము.. పెడమోము రుచి చూడు పులుపు 



మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి



చరణం 2 :


అబ్బ...  నీ చేయి చిదిమిన చోట... అయ్యో నా బుగ్గ కందేను చూడు
అబ్బ...  నీ చేయి చిదిమిన చోట... అయ్యో నా బుగ్గ కందేను చూడు


నీ నవ్వు వెలిగిన పూటా .. నా మేను పొంగేను చూడు


నీలో నాలో... ఒకటే ఆశా...

నీలో నాలో... ఒకటే ఆశా...


అది పండేను మురిపాలు నిండెను రేపు



మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
మల్లెమొగ్గ తెలుపు.. మంచి మనసు తెలుపు
చేయి చేయి కలుపు.. లేత వలపు తెలుపు..
రాణి.. ఈ.. ఈ.. ఈ.. రాణి

Thursday, October 13, 2016

ఏమిటోననుకుంటి గోంగూరకి

చిత్రం : ఇంటింటి కథ (1974)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : కొసరాజు
నేపధ్య గానం : ఎల్. ఆర్. ఈశ్వరి    



పల్లవి : 



ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి
ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి 


సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి... వాడు సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి
సెప్పుకుంటే... అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి 





చరణం 1 :


సుక్కబొట్టు పెట్టుకొని.. సిగనుపూలు సుట్టుకొని...
పుంగనూరు గట్టుకాడ పుల్లలేరుతుంటేను
సుక్కబొట్టు పెట్టుకొని.. సిగనుపూలు సుట్టుకొని...
పుంగనూరు గట్టుకాడ పుల్లలేరుతుంటేను


ఒంటిగానిగా చూసి ఎంట తగులుకున్నాడే..
చేను చుట్టు తిప్పాడే... చెయ్యి పైన ఏశాడే
చెయ్యి పైన ఏశాడే... ఏశాడే...
అవ్వా... సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 



ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి
సిలిపిదొంగ సచ్చినాడే గోంగూరకి...
సెప్పుకుంటే... అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అవ్వా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 




చరణం 2 :



కడవ సంకనెట్టుకొని... కట్ట మీద వస్తుంటే
మర్రిమాను కాడ వాడు మాటేసి ఉన్నాడు
కడవ సంకనెట్టుకొని... కట్ట మీద వస్తుంటే
మర్రిమాను కాడ వాడు మాటేసి ఉన్నాడు


మాయలెన్నో చేశాడే... మనసు విరగదీశాడే
మోజు తీర్చమన్నాడే... ముద్దులీయమన్నాడే
ముద్దులీయమన్నాడే... ఇయ్యమన్నాడే...
అవ్వా... సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 



ఏమిటోననుకుంటి గోంగూరకి... నే ఎగురుకుంటు ఎళ్తినే గోంగూరకి
సిలిపి దొంగ సచ్చినాడే గోంగూరకి...
అబ్బా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి...
అవ్వా.. సెప్పుకుంటే సిగ్గు చేటు గోంగురకి... 








Monday, August 1, 2016

తకధిమితక ధిమితకధిమి




చిత్రం: ఇది కథ కాదు (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, రమోల 


పల్లవి :  



కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్ 

మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం


ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం 


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  రపమ్‌పమ్





చరణం 1 :




ఈ లోకమొక ఆట స్థలము...  ఈ ఆట ఆడేది క్షణము
ఈ లోకమొక ఆట స్థలము...  ఈ ఆట ఆడేది క్షణము
ఆడించువాడెవ్వడైనా...  ఆడాలి ఈ కీలుబొమ్మ
ఆడించువాడెవ్వడైనా...  ఆడాలి ఈ కీలుబొమ్మ


ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం
ఇది తెలిసీ తుది తెలిసీ ఇంకెందుకు గర్వం
తన ఆటే గెలవాలని ప్రతి బొమ్మకు స్వార్థం


తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం 



కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్




చరణం 2 :



వెళ్తారు వెళ్ళేటివాళ్ళు...  చెప్పేసెయ్ తుది వీడుకోలు
ఉంటారు ఋణమున్నవాళ్ళు...  వింటారు నీ గుండె రొదలు
కన్నీళ్ళ సెలయేళ్ళు కాకూడదు కళ్ళు
కలలన్నీ వెలుగొచ్చిన మెలుకువలో చెల్లు 



కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  రపమ్‌పమ్




చరణం 3 : 




ఏనాడు గెలిచింది వలపు...  తానోడుటే దాని గెలుపు
ఏనాడు గెలిచింది వలపు...  తానోడుటే దాని గెలుపు
గాయాన్ని మాన్పేది మరుపు...  ప్రాణాన్ని నిలిపేది రేపు
గాయాన్ని మాన్పేది మరుపు...  ప్రాణాన్ని నిలిపేది రేపు


ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు
ప్రతి మాపూ ఒక రేపై తెరవాలి తలుపు
ఏ రేపో ఒక మెరుపై తెస్తుందొక మలుపు




తకధిమితక ధిమితకధిమి తకధిమితక ధిం ధిం
జత జతకొక కత ఉన్నది చరితైతే జం జం
ఒక ఇంటికి ముఖద్వారం ఒకటుంటే అందం
ఒక మనసుకి ఒక మనసని అనుకుంటే స్వర్గం





కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్


కుకుమల్లెటిక  కుకుమల్లెటిక కుకుమల్లెటిక చమ్‌చమ్
మేరిపపిమిట  మేరిపపిమిట మేరిపపిమిట  పమ్‌పమ్





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5611

Wednesday, March 23, 2016

ఇంద్రధనసు ఇల్లాలై



చిత్రం :  ఇంద్రధనస్సు (1988)
సంగీతం :   రాజ్-కోటి
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం :  బాలు 



పల్లవి :


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ.. నా లోకమైనదీ


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ నా లోకమైనదీ


చరణం 1 :


ఊహవైన నీవే... ఊపిరైన నీవే
చైత్రమందు వీచే పూలతావి నీవే
ఊహవైన నీవే... ఊపిరైన నీవే
చైత్రమందు వీచే పూలతావి నీవై


ఎదలో నిండగా .. బ్రతుకే పండగా


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ నా లోకమైనదీ



చరణం 2 :


పూలరంగులన్నీ పోగు చేసి నిన్ను
సృష్టికర్త నాకు కానుకిచ్చెను
పూలరంగులన్నీ పోగు చేసి నిన్ను
సృష్టికర్త నాకు కానుకిచ్చెను


తపసే నాదిగా .. వరమే నీవుగా


ఇంద్రధనసు ఇల్లాలై ఇంటివెలుగు అయ్యిందీ
ఏడడుగుల బంధంతో ఏకమైనదీ నా లోకమైనదీ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=13113

Friday, November 6, 2015

నా హృదయపు కోవెలలో







చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :   బాలు   



పల్లవి :


నా హృదయపు కోవెలలో....  ఆ... ఆ
నా బంగారు లోగిలిలో....  ఆ...  ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...  ఆ ఆ
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే
ఆ...ఆ... హా...

నా హృదయపు కోవెలలో... 


చరణం 1 :


ఆహా.. ఆ..
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
మధువులు కురిసే గానముతో... మమతలు నాలో పెంచితివే
సొగసును మించిన సుగుణముతో...
సొగసును మించిన సుగుణముతో... నా మనసును నిలువునా దోచితివే

నా హృదయపు కోవెలలో...  



చరణం 2 :




అహహ...ఆహాహా...ఆహాహా..ఆ..
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
శాంతికి నిలయం నీ హృదయం... నా ప్రేమకు ఆలయమైనదిలే
లక్ష్మి సరస్వతి నీవేలే...
లక్ష్మి సరస్వతి నీవేలే... నా బ్రతుకున కాపురముందువులే

నా హృదయపు కోవెలలో...  



చరణం 3 :


ఆహా..ఆ..ఆ...
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
ఇంటికి నీవే అన్నపూర్ణగా... ప్రతిరోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిథులతో...
వచ్చే పోయే అతిథులతో... మన వాకిలి కళకళలాడునులే

నా హృదయపు కోవెలలో... నా బంగారు లోగిలిలో...
ఆనందం నిండెనులే...  అనురాగం పండెనులే

నా హృదయపు కోవెలలో... 



ఈ చల్లని లోగిలిలో





చిత్రం  :  ఇద్దరు అమ్మాయిలు (1970)
సంగీతం  : కె.వి. మహదేవన్
గీతరచయిత  :  దాశరథి
నేపథ్య గానం  :   సుశీల 



పల్లవి :


ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి


ఈ చల్లని లోగిలిలో...  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి ... అనురాగం పండాలి
ఈ చల్లని లోగిలిలో... 


చరణం 1 :




పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పిల్లల పాపల అల్లరితో...  ఈ ఇల్లంతా విలసిల్లాలి
పసుపు కుంకుమ కొల్లలుగా...
పసుపు కుంకుమ కొల్లలుగా... ఈ పచ్చని ముంగిట కురవాలి 

ఈ చల్లని లోగిలిలో .... 



చరణం 2 :


శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
శుభముల నొసగే ఈ మందిరము...  శాంతికి నిలయం కావాలి
లక్ష్మి.. సరస్వతి పొందికగా ...  ఈ ఇంటను కాపురం వుండాలి
ఈ ఇంటను కాపురం వుండాలి .... 

ఈ చల్లని లోగిలిలో .... 


చరణం 3 :


ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
ఇల్లాలే శ్రీ అన్నపూర్ణగా....  ప్రతి రోజు ఒక పండుగగా
వచ్చే పోయే అతిధులతో....
వచ్చే పోయే అతిధులతో... మీ వాకిలి కళకళ లాడాలి
మీ వాకిలి కళకళ లాడాలి


ఈ చల్లని లోగిలిలో....  ఈ బంగరు కోవెలలో
ఆనందం నిండాలి...  అనురాగం పండాలి...  అనురాగం పండాలి



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1213