Showing posts with label (వ). Show all posts
Showing posts with label (వ). Show all posts

Thursday, October 8, 2020

జుం తనన... నెచ్చెలి నడకే

 




చిత్రం : వివాహ భోజనంబు (1989)

సంగీతం : బాలు 

గీతరచయిత : వెన్నెలకంటి

నేపథ్య గానం : బాలు 


పల్లవి :


జుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం  

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనం



రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు

ఒదిగి ఒదిగి గుసగుసమని

జుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనం


చరణం 1 :



చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా 

చూపులోనే ఓ సుప్రభాతం తలపు తలుపు తీయగా 

ఓపలేని ఓ మౌనగీతం రాగం తీయగా 

నందనాల నవపారిజాతం ఇలకే జారగా 

ఊహలు గీచిన బొమ్మకు ఊపిరి వచ్చిన

వెచ్చని కలలు విరిసి కలిసెను జత



జుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనం



చరణం 2 :



నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక

నీలి నీలి మేఘాల తేలి భువికి దిగిన తారక

ఆలపించే అనురాగ వీణ పలికే గీతిక

వేగిపోయే విరహాలలోన కొసరే కోరిక

అంచులు కలిసిన సంజెలు చిందిన కుంకుమ వన్నెలు 

పెదవి కొసల చిలికెను చెలి



జుం తనన ననన ననన తకజం

నెచ్చెలి నడకే మదగజ గమనం

జుం తనన ననన ననన తకజం

విచ్చిన నగవే మెరిసిన గగనం

రెప్పల మాటున రెపరెపలాడిన రేపటి ఆశలు

ఒదిగి ఒదిగి గుసగుసమని



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11551

Saturday, September 5, 2020

గోల్కొండ ఖిల్లాకాడా



చిత్రం : వస్తాడే మా బావ (1977)
సంగీతం :  ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత :
నేపథ్య గానం : సుశీల 


పల్లవి :


గోల్కొండ ఖిల్లాకాడా ఈలవేసే అల్లరివాడా
తొందరపడితే అందదు వలపు
మెల్లమెల్లగా కన్నులు కలుపు
ఈలవేసే చిన్నావాడా ఓహో రాజా                 
ఈలవేసే చిన్నావాడా


చరణం 1 :


నౌబత్పహాడు మీద నవ్వుకుందామా         
కిలకిల నవ్వుకుందామా
చార్మీనార్ శిఖరాలందు ఆడుకుందామా             
సరదాలాడుకుందామా
గండిపేట తరగల మీద పండుగ చేసుకుందామా
గండిపేట తరగల మీద పండుగ చేసుకుందామా
అందరాని ఆనందాలు అందుకుందామా                   
అందుకుందామా


గోల్కొండ ఖిల్లాకాడా ఈలవేసే అల్లరివాడా
తొందరపడితే అందదు వలపు
మెల్లమెల్లగా కన్నులు కలుపు
ఈలవేసే చిన్నావాడా ఓహో రాజా                 
ఈలవేసే చిన్నావాడా



చరణం 2 :


భాగేరామ్ పచ్చికలోన పచారు చేయాలి             
ఎంతో హుషారు కావాలి
గుల్మనార్ కొమ్మలకింద గుసగుసలాడాలి               
వయసు మిసమిసలాడాలి
అల్లిబిల్లిగా మల్లెతీగలా అల్లుకుపోవాలి
అల్లిబిల్లిగా మల్లెతీగలా అల్లుకుపోవాలి
ఎవ్వరులేని ఏకాంతంలో ఏకం కావాలి... ఏకం కావాలి


గోల్కొండ ఖిల్లాకాడా ఈలవేసే అల్లరివాడా
తొందరపడితే అందదు వలపు
మెల్లమెల్లగా కన్నులు కలుపు
ఈలవేసే చిన్నావాడా ఓహో రాజా                 
ఈలవేసే చిన్నావాడా

Thursday, September 3, 2020

తినబోతు రుచి అడగకు



చిత్రం : వస్తాడే మా బావ (1977)
సంగీతం :  ఘంటసాల విజయ్ కుమార్
గీతరచయిత : 
నేపథ్య గానం : జిక్కి  


పల్లవి :


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు 



చరణం 1 :


అందం నీదేలే... ఆనందం అతనిదేలే
అందం నీదేలే... ఆనందం అతనిదేలే
పండుగనేడేలే పండుగనేడే
తొందర ఎందుకు ఎందుకు... ఎందుకు


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు 



చరణం 2 :


గదిలోన  ఉన్నాడు గడసరి బావ
మొదటిరేయి ముచ్చటకోసం మోము వాచిపోయె పాపం
మొదటిరేయి ముచ్చటకోసం మోము వాచిపోయె పాపం


చెంతకు వస్తాడే... చిటికెలు వేస్తాడే
చెంతకు వస్తాడే... చిటికెలు వేస్తాడే
ఇంతకుముందు తెలియని వింతలు చేస్తాడే చేస్తాడే
ఏంచేస్తాడే... మురిపిస్తాడే


తినబోతు రుచి అడగకు
తీయని కోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు 


చరణం 3 :


చిలకరించుతుంది హాయి తొలకరి వలపు
పలకరించి నవ్వగానే పులకరించు లేత వయసు
పలకరించి నవ్వగానే పులకరించు లేత వయసు


పక్కకు వస్తాడే పరువం దోస్తాడే
పక్కకు వస్తాడే పరువం దోస్తాడే
చక్కిలిగిలితో ఉక్కిరిబిక్కిరి చేస్తాడే.. చేస్తాడు
ఏంచేస్తాడే...  ఊరిస్తాడే 



తినబోతు రుచి అడగకు
తీయనికోర్కెలు దాచకు దాచకు
తినబోతు రుచి అడగకు
తీయనికోర్కెలు దాచకు దాచకు


తినబోతు రుచి అడగకు

Monday, July 27, 2020

అందాలా విందుచేయు బాలా

చిత్రం : వధూవరులు (1976)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :
నేపథ్య గానం :  జానకి 



పల్లవి : 



అందాలా విందుచేయు బాలా
నీ ముద్దు బాలా... చల్లనివేళ
తేలించు మోహాల డోలా


అందాలా విందుచేయు బాలా
నీ ముద్దు బాలా... చల్లనివేళ
తేలించు మోహాల డోలా


చరణం 1 :


చంద్రుడు లేని తారకలేలా
ప్రణయమెరుంగని పరువం ఏలా
మైకంలో ఇలా మరపించును రా
కమ్మని వలపుల కరగింతునురా
ఈడైనవాడా నేనే నీకు నీడా
ఈడైనవాడా నేనే నీకు నీడా
తేలించు మోహాల డోలా



అందాలా విందుచేయు బాలా
నీ ముద్దు బాలా... చల్లనివేళ
తేలించు మోహాల డోలా



చరణం 2 :


మమతల పూవుల మాలలు వేసి
మోజులలోన లాలించేనా
చల్లని నవ్వులే శయ్యగ చేసి
చూపుల కౌగిలి సోలించేనా
నీ అడుగుజాడ నా బంగారుమేడ
నీ అడుగుజాడ నా బంగారుమేడ
తేలించు మోహాల డోలా


అందాలా విందుచేయు బాలా
నీ ముద్దు బాలా... చల్లనివేళ
తేలించు మోహాల డోలా



Sunday, July 26, 2020

వాలుచూపులో తేలి

చిత్రం : వధూవరులు (1976)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :
నేపథ్య గానం :  ఎల్. ఆర్. ఈశ్వరి 




పల్లవి : 


వాలుచూపులో తేలి... వలపు కైపులో తూలి
ఈ గులాబిపై వాలి... మత్తుగా వత్తుగా హత్తుకో
ఓ.. నా.. రాజా 


వాలుచూపులో తేలి... వలపు కైపులో తూలి
ఈ గులాబిపై వాలి... మత్తుగా వత్తుగా హత్తుకో
ఓ.. నా.. రాజా  


చరణం 1 :


సరాగాల సరదాలే... వయ్యారాలె మురిపాలే
సరాగాల సరదాలే... వయ్యారాలె మురిపాలే
నా నడుమ వంపులలో ఉయ్యాల జంపాలరా


వాలుచూపులో తేలి... వలపు కైపులో తూలి
ఈ గులాబిపై వాలి... మత్తుగా వత్తుగా హత్తుకో
ఓ.. నా.. రాజా 



చరణం 2 :


ఘమఘమలాడే సొగసు... నీ కౌగిలి కోరే వయసు
ఘమఘమలాడే సొగసు... నీ కౌగిలి కోరే వయసు
మల్లెలు చల్లిన పానుపు మీదికి నిన్ను రమ్మంది మనసు
నిన్ను రమ్మంది మనసు


వాలు చూపులో తేలి... వలపు కైపులో తూలి
ఈ గులాబిపై వాలి... మత్తుగా వత్తుగా హత్తుకో
ఓ.. నా.. రాజా 



చరణం 3 :


మజావున్న జవరాలి ఖజానాకు రావాలి
మజావున్న జవరాలి ఖజానాకు రావాలి
నీమదిలో దిగులు ఏడారి
నీమదిలో దిగులు ఎడారి..
నందనమై నవ్వాలి నందనమై నవ్వాలి


వాలుచూపులో తేలి... వలపు కైపులో తూలి
ఈ గులాబిపై వాలి... మత్తుగా వత్తుగా హత్తుకో
ఓ.. నా.. రాజా 

ఎక్కడున్నావో చెలి

చిత్రం : వధూవరులు (1976)
సంగీతం :  మాస్టర్ వేణు
గీతరచయిత :
నేపథ్య గానం :  బాలు


సాకి :


నా చెలిని విడదీసి.. నరకాన తోసావు
కన్నీట భగ్గుమని.. కానిపోతున్నాను
ఆ.. ఆ.. ఆ..
దయలేని దైవమా.. ధరకు ఎప్పుడు దిగిరాకుమా 


పల్లవి : 



ఎక్కడున్నావో చెలి
ఎక్కడున్నావో చెలి
అలనాటి నా జాబిలి... ఎక్కడున్నావో చెలి


చరణం 1 :


ఆనాడు ననుచేర హంసలా వచ్చావు
సంధ్యరాగాలన్ని తాంబూలమిచ్చావు
ఆనాడు ననుచేర హంసలా వచ్చావు
సంధ్యరాగాలన్ని తాంబూలమిచ్చావు


వద్దంటు ముద్దిచ్చి ఒడిలోన వాలావు
ఆ బిగువు కౌగిలే అందాల లోగిలి
ఆ బిగువు కౌగిళ్ల లోగిలి...  కనులముందే నిలిచేనెే
కలనైన మరువలేనే...  కలనైన మరువలేనే


ఎక్కడున్నావో చెలి

చరణం 2 :


ఎన్నో వసంతాలు నన్నుగని నవ్వినా
ఎన్ని హేమంతాలు ఎదకోత కోసినా
ఎన్నో వసంతాలు నన్నుగని నవ్వినా
ఎన్ని హేమంతాలు ఎదకోత కోసినా


కాలానికెదురీది కలుసుకుంటాను
కాలానికెదురీది కలుసుకుంటాను
కనుమూసి నీలోన కలిసిపోతాను 



ఎక్కడున్నావో చెలి
ఎక్కడున్నావో చెలి
అలనాటి నా జాబిలి... ఎక్కడున్నావో చెలి


Thursday, July 16, 2020

ఏదో మోహం... ఎదలో దాహం

చిత్రం : వీరభద్రుడు (1982)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత : 
నేపథ్య గానం :  బాలు, జానకి 
  


పల్లవి : 


ఏదో మోహం... ఎదలో దాహం
నిదురించే నా మనసే
ఉలికిపడే ఊహలతో
నాలో ఏదో...  అలజడిగా




ఏదో మోహం, ఎదలో దాహం
నిదురించే నా మనసే
కదిలించే ఊహలతో
నాలో ఏదో...  అలజడిగా




ఏదో మోహం... ఎదలో దాహం



చరణం 1 :


సందెగాలి తాకితేనే... సన్నజాజులారిపోయే
సందెగాలి తాకితేనే... సన్నజాజులారిపోయే
లేత ఉసురు సోకితేనే... కన్నె వయసు గాయమాయే
లేత ఉసురు సోకితేనే... కన్నె వయసు గాయమాయే



కన్ను బాసలాడగానే... మాటలన్నీ మూగబోయే
దాచుకున్న మాటలన్నీ... చెలిమి కోరు పాటలాయే
తాళలేని తపన వేడిలో... రెండు ఎదలలో ఏక తాళమై


ఏదో మోహం... ఎదలో దాహం
నిదురించే నా మనసే
కదిలించే ఊహలతో
నాలో ఏదో...  అలజడిగా



చరణం 2 :



చందమామ ఎండ కాసే... నిప్పు పూల దండలేసే
చందమామ ఎండ కాసే... నిప్పు పూల దండలేసే
గుబులు గుబులు గుండెలోన... అర్థరాత్రి తెల్లవారే
గుబులు గుబులు గుండెలోన... అర్థరాత్రి తెల్లవారే 



అతని చేయి తాకితేనే... అలవికాని ఆశలాయే
ఉండి ఉండి ఊపిరంతా... పరిమళాల వెల్లువాయే
ఆపలేని విరహ వేదనే... తీపి తీపిగా ఎదను కోయగా


ఏదో మోహం... ఎదలో దాహం
నిదురించే నా మనసే
కదిలించే ఊహలతో
నాలో ఏదో...  అలజడిగా


ఏదో మోహం... ఎదలో దాహం
నిదురించే నా మనసే
ఉలికిపడే ఊహలతో
నాలో ఏదో...  అలజడిగా



అలజడిగా....
అలజడిగా....

Tuesday, January 1, 2019

నలుగురు నవ్వేరురా

చిత్రం :  విచిత్ర కుటుంబం (1969)
సంగీతం :  టి.వి. రాజు
గీతరచయిత :  సినారె
నేపథ్య గానం :  సుశీల 




పల్లవి : 

నలుగురు నవ్వేరురా... స్వామి
నలుగురు నవ్వేరురా...
గోపాల... నడివీధిలో నా కడకొంగు లాగిన
నడివీధిలో... నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా... అవ్వ
నలుగురు నవ్వేరురా... ఆ...  ఆ..  ఆ..  ఆ 



చరణం 1 :


చల్ల  చిలికే  వేళ చక్కిలిగిలి చేసి
దండలల్లే వేళ రెండూ కళ్ళూ మూసి
చల్ల చిలికే వేళ...
చల్ల చిలికే వేళ..చక్కిలిగిలి చేసి
దండలల్లేవేళ రెండూ కళ్ళూ మూసి
ఒంటిగా ఏమన్నా... ఆ... ఆ... ఆ..
ఒంటిగా ఏమన్నా... ఊరకుంటిని గాని...
రచ్చపట్టున నన్ను... రవ్వచేయు పాడికాదులేరా... 


నలుగురు నవ్వేరురా... గోపాల
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా... ఆ ఆ ఆ ఆ
నలుగురు నవ్వేరురా... ఆ ఆ ఆ ఆ



చరణం 2 :


పొన్నచెట్టున చేరి... పొంచినట్టుల కాదు
చీరలను కాజేసి... కేరినటుల కాదు
పొన్నచెట్టున చేరి... పొంచినట్టుల కాదు
చీరలను కాజేసి... కేరినటుల కాదు
కన్నెమనసే వెన్న... గమనించరా కన్నా
అన్నీ తెలిసిన నీవే... ఆగడాలు చేయనేల ఔరా.. 


నలుగురు నవ్వేరురా..గోపాల
నడివీధిలో నా కడకొంగు లాగిన
నలుగురు నవ్వేరురా... ఆ... ఆ ఆ ఆ
నలుగురు నవ్వేరురా... ఆ..అవ్వ
నలుగురు నవ్వేరురా... ఆ... ఆ ఆ ఆ






http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=177

Tuesday, November 20, 2018

ఆడవే రాజహంస

చిత్రం :  వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా 


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస
లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా 


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస



చరణం 1 :


తొలకరి అందాల పులకరమే నీవు... నవ్వితేనే వసంతం
తొలకరి అందాల పులకరమే నీవు... నవ్వితేనే వసంతం
అరుణిమ చరణాల విరిసిన ఉదయాల... కళలే నాలోన కురిసే మకరందం


నీరాక వలపు తొలి ఏరువాక.. నీ అందమంత నాదే...
నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. ఆనందమంత నాదే
నీరాక వలపు తొలి ఏరువాక.. నీ అందమంత నాదే...
నీ నవ్వులందు సిరిమువ్వ చిందు.. ఆనందమంత నాదే


రావే.. మనుగడవు కావే... మధువనివి నీవే
నీవే నేనైపోవే...



పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం
ప్రియలయలన్నీ... అభినయమైన...
రాగ.. భావ.. రాసలీల తేలగా
పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం



చరణం 2 :



లలలలా... లలలల... ఆ.. ఆ.. హ..
ఆ.. హా.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. 


కనులకు నిదురేది కౌగిలి నీవై... కళలకు  గిలిగింత పెడితే
కనులకు నిదురేది కౌగిలి నీవై... కళలకు  గిలిగింత పెడితే

కలలకు సెలవేది కమ్మని కలతై... వయసుకు పులకింత నీవైతే


కూసంతా వెన్నెల్లలో... వయసంతా వయ్యారమై...
పూసింది పున్నాగలా... మెరిసేటి మిన్నాగులా
ఎదయ విరుల పొదల నీడలా... ఆ... ఆ.. ఆ


ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస


ప్రియలయలన్నీ... అభినయమైన...
రాగ.. భావ.. రాసలీల తేలగా
పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం   




చరణం 3 :


సరిసరి నటనాల సరిగమలో తేలి... ఆడితేనే విలాసం
సరిసరి నటనాల సరిగమలో తేలి... ఆడితేనే విలాసం

కడలిని పొంగించి... సుధలను చిందించు జతులే నీ నోట పలికే నవలాస్యం


కాలాలు కరిగి గతమవ్వు దాక నీ కౌగిలింత నాదే...
లోకాలు సురిగి కథలవ్వు దాక నా జలదరింత నీదే


నాలో రసధునివి నీవే... ఉదయినివి కావే
నాలో వెలుగై పోవే....



పాడనా హంసగీతం... మురిపాల నా నాట్యవేదం 


లయలే నీవై.. హొయలిక నీదై..
రాగ...  భావ...  రాసలీల తేలగా
ఆడవే రాజహంస... నడయాడవే రాజహంస





http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=886

మేఘాల పందిరిలోనా

చిత్రం :  వయ్యారి భామలు - వగలమారి భర్తలు (1982)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, సుశీల


పల్లవి :


మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా
ఓ... కురిసింది పూలవానా


రాగాలపల్లకిలోనా...  పిలిచింది వలపే ఔనా
అది పాటై... విరిబాటై... వెలసింది జీవితానా
ఓ... వెలసింది జీవితానా


మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా  




చరణం 1 :


గగనాల తార భువనాల జారి.. నన్ను చేరు వేళలో
నీవే ఆ తారై మదిని వెలిగినావులే...


ఇల వంక జారు.. నెలవంక తీరు... గోట మీటు వేళలో
నీవే నా నీడై... మనసు తెలిపినావులే... మరులుగొలిపినావులే

అననీ విననీ ఏ రాగం... మనలో పలికే సరాగం..


మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా
అది చూపై.. విరి తూపై... కురిసింది పూలవానా
ఓ... కురిసింది పూలవానా


రాగాలపల్లకిలోనా...  పిలిచింది వలపే ఔనా



చరణం 2 :


నీ తీపి ఉసురు... నా వైపు విసిరి... వెల్లువైన వేళలో
నాలో అల నీవై... కలలు రేపినావులే


నీ నీలికనుల లేలేత కలలు వెల్లడైన  వేళలో...

నాలో ఎద నీవై... నిదుర లేచినావులే
కదలి పాడినావులే


మనసే కలిసే వేతీరం... విరిసే మమతా కుటీరం 



రాగాలపల్లకిలోనా.. పిలిచింది వలపే ఔనా
అది పాటై... విరిబాటై... వెలసింది జీవితానా
ఓ... వెలసింది జీవితానా


మేఘాల పందిరిలోనా... మెరిసింది మెరుపే ఔనా







Monday, November 12, 2018

ఇదేనా మన సంప్రదాయమిదేనా

చిత్రం : వరకట్నం (1969)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపథ్య గానం : ఘంటసాల




పల్లవి :


ఇదేనా... సంప్రదాయమిదేనా
తరతరాలుగా సంఘంలోన... కరడుగట్టిన దురాచారం... ఇదేనా...



ఇదేనా మన సంప్రదాయమిదేనా
ఇదేనా మన సంప్రదాయమిదేనా
వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో...
వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో...
అణ్యంపుణ్యం ఎరుగని ఆడబ్రతుకు బలియేనా
ఆడబ్రతుకు బలియేనా ....


ఇదేనా మన సంప్రదాయమిదేనా 



చరణం 1:


చట్టాలను చేసి లాభమేమి...
దినదినం శాసనాలు వేసి లాభమేమి
చట్టాలను చేసి లాభమేమి...
దినదినం శాసనాలు వేసి లాభమేమి 


బుసగొట్టే స్వార్ధమ్మున్ను  విసిరిగొట్టలేనిది
బుసగొట్టే స్వార్ధమ్మున్ను  విసిరిగొట్టలేనిది

సహనమూర్తి ఐన స్త్రీని గౌరవించలేనిది... గౌరవించలేనిది


ఇదేనా మన సంప్రదాయమిదేనా 


చరణం 2 :


పురాణాలు తిరగేసిన చాలదు...హోయ్
ధర్మపన్నాలు వల్లించిన తీరదు
ఓ..ఓ..ఓ..ఓ...
పురాణాలు తిరగేసిన చాలదు...హోయ్
ధర్మపన్నాలు వల్లించిన తీరదు


చెప్పే నీతులన్నీ చేతలలో చూపాలి...
చెప్పే నీతులన్నీ చేతలలో చూపాలి...


అబలల కన్నీటి మంటలార్పి వేయగలగాలి
అబలల కన్నీటి మంటలార్పి వేయగలగాలి


ఇదేనా మన సంప్రదాయమిదేనా
వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో...
వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో...
అణ్యంపుణ్యం ఎరుగని ఆడబ్రతుకు బలియేనా
ఆడబ్రతుకు బలియేనా ....


ఇదేనా మన సంప్రదాయమిదేనా 
ఇదేనా మన సంప్రదాయమిదేనా 






http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=165

Monday, February 5, 2018

ఇన్నాళ్ళ ఈ మూగ బాధ

చిత్రం :  విచిత్ర జీవితం (1978)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత : సినారె
నేపధ్య గానం :  బాలు   


పల్లవి :



ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 


ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 



చరణం 1 :



ఎన్నేళ్ళు వేచింది మనసు... కన్నీట సాగింది బ్రతుకు
ఎన్నేళ్ళు వేచింది మనసు... కన్నీట సాగింది బ్రతుకు
ఈనాటి ఏకా౦త సమయం... ఏ రేయి లేనంత మధురం
చెలియా ఈ మౌన వేళ...  నన్ను అలవోలే చెలరేగి పోనీ 


ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 



చరణం 2 :



ఎవరైన ఏ వేళనైనా... మనజాడ గమనించరాదు
ఎవరైన ఏ వేళనైనా... మనజాడ గమనించరాదు
జగమేలు పరమాత్ముడైనా... మన జంట విడదీయరాదు
నీ కళ్ళలో నేను దాగీ... నిన్ను నా గుండెలో దాచుకోనీ



ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని 



చరణం 3 :



కావాలి ఎన్నెన్నో కనులు... నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎన్నెన్నో కనులు... నిను కరువారగా చూసుకోగా
కావాలి ఎంతెంతొ కాలం... తీపికలలన్ని పండించుకోగా
రగిలే ఈ హాయిలోనా...  నన్ను బతుకంత జీవించిపోనీ



ఇన్నాళ్ళ ఈ మూగ బాధ...  ఈనాటితో మాసి పోనీ
నీ నుదుట తిలకమ్ము దిద్ది...  నిత్య కల్యాణిగా చూసుకొని






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1270

భాగ్యనగర గాథా

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ 
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల




పల్లవి :



భళి భళి వినరా ఆంధ్ర కుమారా భాగ్యనగర గాథా మన రాజధాని గాథా
వలపులవంతెన మూసీ నదిపై వెలసినట్టి గాథా
మన రాజధాని గాథా 


గోలుకొండను ఏలుచుండెను గొప్పగ మల్కిభరాం
ఓయ్...గొప్పగ మల్కిభరాం
ఆతని కొడుకు అందాల రాజు...  కులీ కుతుబ్ షా
కులీ కుతుబ్ షా


చంచలపల్లెను వసించుచుండెను
నర్తకి భాగమతి... నర్తకి భాగమతి
సరసుడు యువరాజామెను చూసి
మనసునిచ్చినాడు...  తందాన తాన తానతందనాన





చరణం 1 :



కలల జల్లుల కారుమబ్బులు కాటుకలద్దిన కన్నులు
మబ్బు విడిచిన చంద్రబింబము మగువ చక్కని వదనము
మెల్లమెల్లగ హృదయ వీణను మీటగలవీ లేతవేళ్ళు
ఘల్లుఘల్లున గుండె ఝల్లన కదలి ఆడును కన్నెకాళ్ళు


అందరి కన్నులు నా మీద...  నా కన్నులు మాత్రం నీ మీద...  శభాష్ 
అందరి కన్నులు నా మీద...  నా కన్నులు మాత్రం నీ మీద


కాసులు విసిరే చేతులకన్నా...  కలసీ నడిచే కాళ్ళేమిన్నా
మనుగడకోసం పాడుతువున్న... ఆ..ఆ..ఆ..ఆ
మనసున నిన్నే పూజిస్తున్నా
అందరి కన్నులు నా మీద...  నా కన్నులు మాత్రం నీ మీద..
నీ మీద..నీ మీద..నీ మీద

నింగివి నీవు...  రంగుల హరివిల్లు నీవు
పూర్ణిమ నీవు...  పొంగే కడలివి నీవు
నీ మువ్వలలో...  నీ నవ్వులలో
నీ మువ్వలలో...  నీ నవ్వులలో
మురిసింది మూసీ...  విరిసింది నీ ప్రణయదాసి
ఆహాహా..ఆహాహా .... ఆహాహా..ఆహాహా...
అందరి కన్నులు నా మీద...  నా కన్నులు మాత్రం నీ మీద..
నీ మీద..నీ మీద..నీ మీద
 


చరణం 2 :




రారా నా ప్రియతమా...  రారా నా హృదయమా
నా వలపే నిజమైతే...  ఈ పిలుపు నీవు వినాలి
రారా నా ప్రియతమా...
నేనీ ఇలలోన...  నువ్వా గగనాన
మూసీనది చేసినది ప్రళయ గర్జన
పెను తుఫాను వీచినా...  ఈ ప్రమిద ఆరిపోదురా
వరద వచ్చి ముంచినా...  ఈ బ్రతుకు నీది నీదిరా
రా  రా రా ప్రియతమా... రా రా రా ప్రియతమా... రా రా రా ప్రియతమా 


పిలుపును విన్న యువరాజు... సై
పెటపెటలాడుచు లేచెను... సై
ఎదురైన పహరావారిని... సై
ఎక్కడికక్కడకూల్చెను...  సై
ఉరుముల మెరుపుల వానల్లో... సై
ఉరికెను మూసీ నదివైపు...


ఆవలి ఒడ్డున బాగమతి... ఈవల ప్రేమ సుధామూర్తి
ప్రియా... ఓ ప్రియా... ప్రియా... ప్రియా
ఓ ప్రియా ప్రియా...  అను పిలుపులు దద్దరిల
వరదనెదిర్చి వలపు జయించి... ఒదిగిరి కౌగిలిలో


మల్కిభరామా పవిత్రప్రేమకు మనసు మారిపోయి
చార్మినారూ పురానపూలు... చరితగ నిర్మించె
భాగమతి పేరిట వెలసెను భాగ్యనగరమపుడు
భాగమతి పేరిట వెలసెను భాగ్యనగరమపుడు
మన రాజథాని ఇపుడు...మన రాజథాని ఇపుడు









చల్లని బాబూ

చిత్రం :  విచిత్ర బంధం (1972)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  దాశరథి
నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల




పల్లవి :



చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటి పాపవు నీవే
మా ఇంటి దీపం నీవే
చల్లని బాబూ... నా అల్లరి బాబూ 



చరణం 1 :



పంచవన్నెల రామచిలకను... పలకరించబోయేవు
పంచవన్నెల రామచిలకను... పలకరించబోయేవు
వింతచేష్టల కోతుల చూసి గంతులెన్నో వేసేవు
నీ పలుకులు వింటూ పరుగులు చూస్తూ పరవశమైపోతాను 



బాబూ...
చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటిపాపవు నీవే... మా ఇంటి దీపం నీవే 



చరణం 2 :



ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను
ఎన్నెన్నో ఆశలతోటి ఎదురు చూస్తూ ఉన్నాను
వెచ్చని ఒడిలో నిన్ను దాచి ముచ్చటలెన్నో చెబుతాను


అమ్మా నాన్నల అనురాగంలో అపురూపంగా పెరిగేవు 


చల్లని బాబూ... నా అల్లరి బాబూ
నా కంటి పాపవు నీవే మా ఇంటి దీపం నీవే



చరణం 3 :



నీ బాబును తల్లి ఆదరించునని భ్రమపడుతున్నావా
చితికిపోయిన మగువ మనసులో మమతలు వెతికేవా 


నీవు చేసిన అన్యాయాన్ని మరచిందనుకున్నవా
నీ ఆలోచనలు అనుబంధాలు అడియాసలుకావా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=6518

మధురం జీవన సంగీతం

చిత్రం :  వసంత గీతం (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 



పల్లవి :


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆ హా హా హా ఆ హా హా హా
ఆ హా హా హా ఆ హా హా హా


మధురం జీవన సంగీతం..
మధురం జీవన సంగీతం..
అమరం ప్రణయసుధ పొంగి పొరలు హృదయం..



మధురం మానస సంగీతం
మధురం మానస సంగీతం
విరహం ప్రణయసుధ ఇగిరిపోవు సమయం
మధురం మానస సంగీతం



చరణం 1 :



మరుమల్లెపూల పొదరిల్లు... మనసిచ్చుకొన్న కౌగిళ్ళు
పిలిచే..ఈ క్షణము విడిచి నీ పోలేవు


మనసే వయసై... విరబూసే వలపు పూదోటా
నింగి నేల జంటా... నీవు నేనే నంటా
మేఘలన్ని పోతే వెన్నెలాడేనంటా
మమతలు మధురిమలందిన తరుణంలో


మధురం మానస సంగీతం
మధురం మానస సంగీతం



చరణం 2 :



లలలలలలలలలాలాలా
లలలలలా లలా లాలా


పరువాలతావి వెద జల్లు... విరిజాజిపూల విరి జల్లు
కురిసే...  ఈ అనుభవానికే జోహారు


ఎదలో చిలికే అధరాల మధువు ఈ పూటా
కొమ్మ రెమ్మ ఇంటా పూలే పూసేనంటా
వేసవిలన్నీపోతే సంధ్యరాగాలంటా
నీ కనుపాపలు నవ్విన తరుణంలో


మధురం జీవన సంగీతం....
విరహం ప్రణయసుధ ఇగిరిపోవు సమయం


మధురం జీవన సంగీతం
లలలలలలలలలాలాలా







http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1934

వసంతాలు విరిసే వేళా

చిత్రం :  వసంత గీతం (1985)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి 



పల్లవి :


వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూశాను
వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూశాను
నీ పూజకే పువ్వునై వేచినాను
వసంతాలు విరిసే వేళా నిన్ను నేను చూశాను



చరణం 1 :


దిగంతాల అంచులు దాటి...  స్మరించాను నీవే దిక్కనీ
మరో జన్మ హద్దులు దాటి...  వరించాను నిన్నే ప్రేయసీ
నదినడిగే కడలివలే... పదమడిగే కవితవలే
ఇలా సాగిపోనీ సంగమాలు
ఇదే స్వప్నమో... సత్యమై నిలిచిపోనీ


వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
నీ పూజకే పువ్వునై వేచినాను..
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను



చరణం 2 :



చైత్రమాస కుసుమాలన్నీ... సుమించేను నీలో ప్రేమగా
శృంగార భావాలెన్నో జ్వలించెను నాలో లీలగా


లత అడిగే తరువు వలే... జత అడిగే తనువు వలే
ఇలా సాగిపోనీ జీవితాలు..
ఇదే కావ్యమై... గానమై మిగిలిపోనీ


వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను
నీ పూజకే పువ్వునై వేచినాను
వసంతాలు విరిసే వేళా నిన్నునేను చూశాను




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1903

ఊర్వశివో... ఉదయానివో

చిత్రం :  వసంత గీతం (1985) 
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం : బాలు, జానకి  



పల్లవి :


ఓ..హో..హో...హో... హో.... ఓ...
ఆ..ఆ...ఆ..హాహాహా..ఆ...ఆ
లలలలాలాలలలలలలలలల
లాలాలాలా.....


ఊర్వశివో... ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో
ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..రసధ్వనివో... బృందావనికే ఆమనివో
ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో



చరణం 1 :



ఆలయగంటల లయలో పుట్టిన సంగీతానికి హారతివో
మదనబాణము మదికి ప్రాణమై సాగివచ్చిన ఆరతివో


తూరుపుదిక్కున కుంకుమవీణలు మీటిన సంధ్యాభానుడివో
వెలుగు కావ్యమున బ్రతుకు నాట్యమై పరిమళించిన భరతుడివో
కనులు పండే కలవు నీవై...  కదలిరావే కళవు నీవై
స్వరమూ సుఖము జతగా కలిసే నీ పద సన్నిధిలో


ఊర్వశిలా..ఉదయినిలా ... మువ్వల నవ్వుల మోహినిలా
ఊర్వశిలా..ఉదయినిలా...  మువ్వల నవ్వుల మోహినిలా
కవితలతో నా ఎదలో కదిలిక లూరిన ఊపిరివో
ఊర్వశిలా..ఉదయినిలా...  మువ్వల నవ్వుల మోహినిలా 



చరణం 2 :



నీ పెదవులనే పదములు కోరిన అష్టపదములలో గోపికనో
పదము పాదమై నటన వేదమై నీవు పలికిన గీతికనో..


శిలలధుళిలో శిల్పకాంతలా చిగురువేసిన శైలికవో..
దివికి నేలగా భువికి నింగిలా మేనువిరిచినా మేనకవో... 


జలదరించే జలదనాదం...  కదలిరానా నెమలినేనై
శృతులు జతులు సుధలై పొంగే నీ శుభ వీక్షణలో


ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో
రాగిణివో..రసధ్వనివో... బృందావనికే ఆమనివో


ఊర్వశిలా..ఉదయినిలా మువ్వల నవ్వుల మోహినిలా
కవితలతో నా ఎదలో కదిలిక లూరిన ఊపిరివో


ఊర్వశివో..ఉదయానివో... మువ్వల నవ్వుల మోహినివో





Wednesday, January 31, 2018

బంగరు నావ బ్రతుకు బంగరు నావ

చిత్రం :  వాగ్దానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం :   సుశీల
 


పల్లవి :


బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బంగరు నావ బ్రతుకు బంగరు నావ


దాన్ని నడిపించు నలుగురికి మేలైన త్రోవ
బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ




చరణం 1 :



అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
అనుమానం చీకటులు ఆవరించినా
అపనిందల తుఫానులు అడ్దగించినా
కదలిపోవు కాలచక్రమాగిపోవునా
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ


బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ 



చరణం 2 :



అనురాగం వెన్నెలలు అంతరించినా
అనురాగం వెన్నెలలు అంతరించినా
ఆశలన్ని త్రాచులై కాటు వేసినా
జీవితము జీవించి ప్రేమించుటకే
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ


బంగరు నావ బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ 




చరణం 3 :



కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
ఆ... ఆ... ఆ... ఆ
కనులున్నది కన్నీటికి కొలనులవుటకా
వలపన్నది విఫలమై విలపించుటకా
దొరకబోని వరము బ్రతుకు మరణించుటకా
నావ నడిపించు నలుగురికి మేలైన త్రోవ


బంగరు నావ...   బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ
బ్రతుకు బంగరు నావ... బ్రతుకు బంగరు నావ






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1105


కాశీపట్నం చూడర బాబు

చిత్రం :  వాగ్దానం (1961)
సంగీతం :  పెండ్యాల
గీతరచయిత :  శ్రీశ్రీ
నేపథ్య గానం :  ఘంటసాల, సుశీల 



పల్లవి :


ఓహో నిలబడితే పడిపోయే నీరసపు నీడవంటి బీదవాడా
ఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆఆ
మనిషిగా బ్రతికేందుకు కనీస అవసరాలైనా లేనివాడా


అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!


కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే..  పల్లెల దుస్థితికేమి జవాబు
అల్లో లక్షణ అని అల్లాడే.. పల్లెల దుస్థితికేమి జవాబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు 




చరణం 1 :



నిరాశతోను నిస్పృహలోను...  తెరువెరుగని నిరుపేదలు
మురికి గుంటలు ఇరుకు కొంపలు నిండిన చీకటి పేటలు
పాడు రోగాలు మోసుకు తిరిగి...  ప్రజలను చంపే ఈగలు
కరువు బరువు పరితాపాలు...  కలిసి వెరసి మన పల్లెలు


కాశీపట్నం చూడర బాబు..  కల్లా కపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లా కపటం లేని గరీబు



చరణం 2 :



శరీరాల్లో అరచాటాకైనా రక్తం లేని దరిద్రులనే
పీల్చుకు తింటాడు దోమరాక్షసుడు...
వాడి దుంప తెగ
మేడల్లో మిద్దెల్లో నివసించే వారి జోలికైనా పోడు గదా
అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!

వైద్య సహాయం అసలే లేదు ఉన్నా దొరకవు మందులు
డాక్టర్ కోసం వెతికే లోగా...  రోగులు గుటుక్కుమందురు
నెత్తురు పీల్చే వృత్తి పరులే మన గ్రామాలకు కామందులు
దొరలూ దోమలు పల్లె జనాలను పంచుకు నంచుకు తిందురు


కాశీపట్నం..హోయ్ హోయ్
కాశీపట్నం చూడర బాబు...  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు...  కల్లాకపటం లేని గరీబు



చరణం 3 :



ప్రజలతో సమానంగా కష్టసుఖాలను పంచుకుంటామంటారు మన వినాయకులు
అవునవును
సుఖాలన్నీ తమకు దక్కించుకుని కష్టాలన్నీ మనకు వదిలేస్తారు
ఊ.. ఊ.. ఊ..అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో!


ఎవరో వచ్చి సాయం చేస్తారనుకోవడమే పొరపాటు
పదవులు వస్తే ప్రజను మరవడం బడా నాయకుల అలవాటు
మనలో శక్తి మనకే తెలియదు అదే కదా మన గ్రహపాటు
తెలిసి కలిసి నిలిచిన నాడు ఎదుటివాడికది తలపోటు


కాశీపట్నం..ఓ హోయ్
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
అల్లో లక్షణ అని అల్లాడే పల్లెల దుస్థితికేమి జవాబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు
కాశీపట్నం చూడర బాబు..  కల్లాకపటం లేని గరీబు






http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1606

Sunday, November 26, 2017

పుట్టింటోళ్ళు తరిమేసారు

చిత్రం : వేటగాడు (1979)
సంగీతం :  చక్రవర్తి
గీతరచయిత :  వేటూరి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


పుట్టింటోళ్ళు తరిమేసారు... కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యో ... పుట్టింటోళ్ళు తరిమేసారు...  కట్టుకున్నోడు వదిలేసాడు


పట్టుమని పదారేళ్ళురా నా సామి...  కట్టుకుంటే మూడే ముళ్ళురా
పట్టుమని పదారేళ్ళురా నా సామి...  కట్టుకుంటే మూడే ముళ్ళురా


అయ్యోపాపం పాపయమ్మ... టింగురంగా బంగారమ్మ
అయ్యోపాపం పాపయమ్మ...  టింగురంగా బంగారమ్మ


పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి...  కట్టు కధలు చెప్పమాకులే
పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి...  కట్టు కధలు చెప్పమాకులే


పుట్టింటోళ్ళు తరిమేసారు... అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు...  టింగురంగా బంగారమ్మ


చరణం 1 :


హా గడపదాటిననాడె కడప చేరాను
తలకుపోసిన్నాడే తలుపు తీసాను
వలపులన్ని కలిపి వంట చేసుంచాను
ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను... వడ్డించుకుంటాను

అమ్మతోడు ఆదివారం నాడు...  అన్నమైనా అంటుకోను నేను...ఓయబ్బో..
అమ్మతోడు ఆదివారం నాడు...  అన్నమైనా అంటుకోను నేను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి...  ముద్దుకైనా ముట్టుకోను
అమ్మమ్మతోడు అర్ధరాతిరి... ముద్దుకైనా ముట్టుకోను... ముద్దుకైనా ముట్టుకోను


పుట్టింటోళ్ళు తరిమేసారు...  అయ్యోపాపం పాపయమ్మ
కట్టుకున్నోడు వదిలేసాడు...  టింగురంగా బంగారమ్మ


చరణం 2 :


గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను
రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను
తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను
నీ మీద ఒట్టు నువ్వే...  అ.... నువ్వే మొగుడనుకుంటాను
నువ్వే మొగుడనుకుంటాను


అమ్మతల్లి ఆషాఢమాసం
అందులోను ముందుంది మూఢం... అహహ
అమ్మతల్లి ఆషాఢమాసం...  అందులోను ముందుంది మూఢం
అమ్మబాబోయ్ కాలేను నీతోడు...  నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
అమ్మబాబోయ్ కాలేను నీతోడు...  నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ
నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ


పుట్టింటోళ్ళు తరిమేసారు.. హ.... కట్టుకున్నోడు వదిలేసాడు
అయ్యోపాపం పాపయమ్మ...  టింగురంగా బంగారమ్మ 




http://www.kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=775