Showing posts with label రాజ్ - కోటి. Show all posts
Showing posts with label రాజ్ - కోటి. Show all posts

Thursday, April 28, 2016

ఒకటే తనువంతా






చిత్రం : బాల గోపాలుడు (1989)
సంగీతం : రాజ్ - కోటి
గీతరచయిత :
నేపధ్య గానం : బాలు, చిత్ర 







పల్లవి :




ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత 


సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె
వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే 


ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత



చరణం 1 :



నీ చూపు పడ్డనాడే చుక్కలాడే
నీ ముగ్గు పచ్చలన్నీ ఎర్రనాయే
నీ గాలి సోకగానే సోకులాడె
నీ ఒంపుసొంపులన్నీ ఒళ్ళు చేసే 


ఈ తాకిడి ఒక తారంగము
ముద్దాడితే తొలి తాంబూలము
హత్తుకుంటే హాయి పుట్టసాగే
గుడ్డు పిట్ట కూతే పెట్టసాగే 


శృంగార వీధుల్లో ఊరేగుతుంటే 
అందాలు కళ్ళల్లో ఆరేసుకుంటే 

ఒయ్యారంగా ఒళ్ళోకొస్తాలే..హో..  వన్నె చిన్నె మెల్లో వేస్తాలే ఈనాడే 



ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత 



చరణం 2 :



నీ కాటు పడ్డ బుగ్గ కందిపోయె
నీ చాటు అందమంతా చిందిపోయె
నీరెండ పడ్డ నీడ నిన్ను కోరె
నీ వెన్నపూస మీద గవ్వలాడె 


ఈ చీమలే చలి నారింజలై
పండించినా తొలి గోరింటలై
మత్తుగాలి వీచే మాపటేలా
కొత్త ఊపుకొచ్చే రాసలీల 


సయ్యాట తోటల్లో సంపెంగ పూసె.. నీ కంటి పాపల్లో జాబిల్లి కాసె
కళ్యాణాలే కల్లోకొస్తుంటే.. ఓ.. కట్నాలన్నీ ముందే ఇస్తాలే ఈనాడే 



ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత 


సందేల పొద్దట్టా చల్లారిపోతే
సందిళ్ళ ముద్దుల్లో సన్నాయి మోగె 


వెన్నెల్లోనే వెచ్చాలిస్తాలే.. ఓ.. కౌగిళ్ళమ్మ గంధాలిస్తాలే ఈనాడే 


ఒకటే తనువంతా ఒక వింత తకధిం తా
ఒడిలో చెలరేగె సరికొత్త గిలిగింత










http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=10325

Thursday, April 3, 2014

స్వాతిలో ముత్యమంత

చిత్రం :  బంగారు బుల్లోడు (1993)
సంగీతం: రాజ్ - కోటి
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, చిత్ర


పల్లవి:


వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..
తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..
ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..
కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా
వానా వానా వచ్చేనంటా.. వాగు వంకా మెచ్చేనంటా.. ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ... 


అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..

ఆమె :  సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

అతడు : అల్లో మల్లో...

ఆమె: అందా....లెన్నో.. యాలో..ఓ..ఓ..యాల...

అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..

ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా...


చరణం 1:

అతడు : తాకిడి పెదవుల మీగడ తరకలు కరిగే వేళ..

ఆమె : మేనక మెరపులు.. ఊర్వశి ఉరుములు కలిసేనమ్మా..

అతడు : కోకకు దరువులు రైకకు బిగువులు పెరిగే వేళ..ఆ..

ఆమె : శ్రావణ సరిగమ యవ్వన ఘుమఘుమ లయనీదమ్మ..

అతడు : వానా వానా వల్లప్పా.. వాటేస్తేనే తప్పా..

ఆమె : సిగ్గు యెగ్గూ చెల్లెప్పా.. కాదయ్యో నీ గొప్పా..

అతడు : నీలో...మేఘం.. నాలో దాహం.. యాలో.. యాల...

అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..

ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా..


చరణం 2:

ఆమె :  వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..

            తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..


అతడు :  ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..

              కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా

ఆమె : తుమ్మెద చురకలు తేనెల మరకలు కడిగే వాన

అతడు : తిమ్మిరి నడుమున కొమ్మల తొడిమలు వణికే వాన..

ఆమె : జన్మకు దొరకని మన్మధ తలుపులు ముదిరే వాన..

అతడు : చాలని గొడుగున నాలుగు అడుగుల నటనే వాన

ఆమె : వానల్లోన సంపెంగ.. ఒళ్ళంతా ఓ బెంగా..

అతడు : గాలి వాన గుళ్ళోనా.. ముద్దే లే  జేగంట..

ఆమె : నాలో.... రూపం.. నీలో తాపం... యాలో....యాల

అతడు : స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్య వాన..

ఆమె : సందెలో చీకటంత సిగ్గులా అంటుకుంది లోనలోనా

అతడు : అల్లో మల్లో...

ఆమె : అందా....లెన్నో..

అతడు, ఆమె : యాలో..ఓ..ఓ..యాల...


వానా వానా వచ్చేనంట.. వాగు వంకా మెచ్చేనంట..

తీగా డొంకా కదిలేనంట.. తట్టాబుట్టా కలిసేనంట..

ఎండా వానా పెళ్ళాడంగా.. కొండా కోనా నీళ్ళాడంగా..

కృష్ణా గోదారమ్మ కలిసి.. పరవళ్ళెత్తి పరిగెత్తంగా..