Showing posts with label మహానది (1993). Show all posts
Showing posts with label మహానది (1993). Show all posts

Thursday, June 26, 2014

శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే

చిత్రం :  మహానది (1993)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత :  వెన్నెలకంటి
నేపధ్య గానం :  బాలు, చిత్ర, బేబి శోభన


పల్లవి:



గంగా శంకాశ కావేరీ
శ్రీరంగేశ మనోహరీ
కళ్యాణకారి కలుషారీ
నమస్తేస్తు సుధాఝరీ


ఆ ఆ ఆ ఆ.......


శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే


నీలవేణిలో నీటి ముత్యాలు.. కృష్ణవేణిలో అలలగీతాలు
నీలవేణిలో నీటి ముత్యాలు.. నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు.. కృష్ణ గీతలే పాడగా


శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే


చరణం 1:


కృష్ణాతీరాన అమరావతిలో.. శిల్పకళావాణి పలికిన శృతిలో
అలలై పొంగేను జీవనగీతం
కలలే పలికించు మధుసంగీతం
చల్లగా గాలి పల్లకీలోన పాట ఊరేగగా...
వెల్లువై గుండె పల్లె పదమల్లె పల్లవే పాడగా...
శ్రీ త్యాగరాజ కీర్తనై సాగె తీయనీ జీవితం...


శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా


శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే


చరణం 2:


గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగును ప్రవహించు తెలుగింటి రాణీ
పాపాల హరియించు పావన జలమూ...
పచ్చగ ఈనేల పండించు ఫలమూ...
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా...
సిరిలెన్నో పండి ఈ భువి స్వర్గలోకమై మారగా...
కల్లకపటమే కానరానీ ఈ పల్లెసీమలో....

శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే

శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలలగీతాలు కృష్ణ గీతలే పాడగా


శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీరంగ రంగనాధునీ దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకీ నామం సంతతం పాడవే


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5797