Friday, August 3, 2012

ప్రేమ లేదని ప్రేమించరాదని

చిత్రం: అభినందన (1988)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం: బాలు



పల్లవి :

లాల లాలల... లలలా లాలల
ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు ...



ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు


చరణం 1 :



మనసు మాసిపోతే మనిషే కాదని
కటికరాయికైనా కన్నీరుందని
వలపు చిచ్చు రగులుకుంటే ఆరిపోదని
గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పని


ఉసురు తప్పి మూగవోయి నీ ఊపిరీ
ఉసురు తప్పి మూగవోయి నీ ఊపిరి
మోడువారి నీడ తోడు లేకుంటినీ


ప్రేమ లేదని 
లలలాల్ల లాలల


చరణం 2 :



గురుతు చెరిపివేసి జీవించాలని
చెరపలేకపోతే మరణించాలని
తెలిసికూడ చెయ్యలేని వెర్రివాడిని
గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని
ముక్కలలో లెక్కలేని రూపాలలో
ముక్కలలో లెక్కలేని రూపాలలో
మరల మరల నిన్ను చూసి రోదించనీ 



ప్రేమ లేదని ప్రేమించరాదని
ప్రేమ లేదని ప్రేమించరాదని
సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటని
ఓ ప్రియా జోహారులు



లాల లాలల ...లల లాల లాలల

లాల లాలల...లల లాల లాలల



https://kuteeram.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=12411

No comments:

Post a Comment