Friday, July 26, 2013

కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ

చిత్రం: దేవత (1965)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: వీటూరి
నేపథ్య గానం: ఘంటసాల, 
సుశీల

పల్లవి: 


కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ
గుండెల్లొ గుసగుసలు వినిపించనీ
కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
నీ చూపుతో నన్ను ముడివేయకు

చరణం 1 :

సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు
సెలయేరు నవ్వుతుంది చిరుగాలి చూస్తుంది
నాపైట చెంగులాగి కవ్వించకు

అనువైనవేళ అందాలు దాచకు
అనువైనవేళ అందాలు దాచకు
అణువణువు నిన్నే కోరె మురిపించకు
ఇకనైనా ననును సిగ్గు తెరవేయకూ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు
కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ..ఈ..

చరణం 2 :


ఎటు చూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మొహాలతో నన్ను మంత్రించకు
ఎటుచూసినా నువ్వే వినిపించె నీ నవ్వే
మోహాలతో నన్ను మంత్రించకు

మనలోని ప్రేమ మారాకు వేయనీ 
మనలోని ప్రేమ మారాకు వేయనీ
మనసార ఒడిలో నన్ను నిదురించనీ
నీ నీలి ముంగురులు సవరించనీ

నీ చూపుతో నన్ను ముడివేయకు
ఈ పూలు వింటాయి సడిచేయకు

కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ
గుండెల్లొ గుసగుసలు వినిపించనీ
కన్నుల్లొ మిసమిసలు కనిపించనీ..ఈ..


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=580

No comments:

Post a Comment