Tuesday, July 23, 2013

బంగారు గూటిలోని చిలుక

చిత్రం: తల్లా? పెళ్ళామా? (1970)
సంగీతం: టి.వి. రాజు
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

ఓ..బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా
ఓ..బంగారు గూటిలోని చిలుక...పేదముంగిట్లో వాలానని ఉలుకా

ఓ.
.
DON'T BE SILLY

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిల్క వచ్చిందని కేరింతా
ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిల్క వచ్చిందని కేరింతా

చరణం 1:

పవళించగ ..పూల పానుపు లేదూ
తలవూనగ ..పట్టు తలగడయే లేదు
జలకలాడగ ..పన్నీరు లేదు
జలకలాడగ ..పన్నీరు లేదు
పరిచర్యలు చేయ చెలులైన లేరు

ఓ..బంగారు గూటిలోని చిలుక
పేదముంగిట్లో వాలానని ఉలుకా


" SWEETNESS OF THE ROSES..
BRIGHTNESS OF THE SKY..
SMELL IN THE MOON LIGHT..
THRILL OF MY LIFE

చరణం 2:

మెత్తని నీ మది విరిపాన్పు కాదా
వెచ్చని కైదండ నా అండ లేదా
మెత్తని నీ మది విరిపాన్పు కాదా
వెచ్చని కైదండ నా అండ లేదా
కురిసే వెన్నెల పన్నీరు కాదా
కురిసే వెన్నెల పన్నీరు కాదా
కొండంత నీ వుండ కోరిక లేలా..

ఓ..వగలొలుకు మగసిరి గోరింకా
తానై రా చిల్క వచ్చిందని కేరింతా..

ఓ..బంగారు గూటిలోని చిలుక...
పేదముంగిట్లో వాలానని ఉలుకా...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=674

No comments:

Post a Comment