Wednesday, July 17, 2013

నీకు నాకు పెళ్ళంట

చిత్రం: జ్యోతి (1976)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

నీకు నాకు పెళ్ళంట...నింగి నేలకు కుళ్ళంట
నీకు నాకు పెళ్ళంట...నింగి నేలకు కుళ్ళంట
ఎందుకంటా?
యుగ యుగాలుగా ఉంటున్నా
అవి కలిసిందెపుడు లేదంటా...అలాగా..

నీకు నాకు పెళ్ళంట...నదికీ కడలికి పొంగంట
నీకు నాకు పెళ్ళంట...నదికీ కడలికి పొంగంట
ఎందుకంటా?
యుగ యుగాలుగా వేరైనా ..అవి కలవనిదెపుడు లేదంట...

నీకు నాకు పెళ్ళంట...
నింగి నేలకు కుళ్ళంట...నదికీ కడలికి పొంగంట

చరణం 1:

ప్రతి రేయి మనకొక తొలి రేయంట ...ఆ.....
తొలి ముద్దు పెదవులు విడిపోవంట ...ఆ...

జగతి కంతటికి మన జంటే జంట
ఇరు సంధ్యలను ఒకటిగ చేస్తామంట
ఆ...నా కంట నిను చూసుకుంటా
ఆ..నీ చూపు నా రేపు పంట ఆ...ఆ..

నీకు నాకు పెళ్ళంట...నింగి నేలకు కుళ్ళంట...
నీకు నాకు పెళ్ళంట...నదికీ కడలికి పొంగంట

చరణం 2:

మన కోర్కెలన్నీ పసిపాపలంట ఆ..ఆ..
చిగురాకు మనసుల చిరునవ్వులంట ఆ..ఆ...

వయసు లేనిది మన వలపేనంట
మన జీవితం ఆటాపాటేనంట
ఆ..నాలోన నిను దాచుకుంటా
ఆ.. నీ ఊపిరై కాచుకుంట ఆ..ఆ..

నీకు నాకు పెళ్ళంట...నదికీ కడలికి పొంగంట
యుగ యుగాలుగా వేరైనా ..అవి కలవనిదెపుడు లేదంట...
నీకు నాకు పెళ్ళంట...నదికీ కడలికి పొంగంట


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=5308

No comments:

Post a Comment