Monday, August 5, 2013

కవ్వించే కళ్ళల్లో


చిత్రం: పంచభూతాలు (1979)

సంగీతం: ఇళయరాజా

గీతరచయిత: సినారె

నేపథ్య గానం: బాలు, సుశీల



పల్లవి :




ఆ..ఆ..ఆ..ఆ... ఆ..ఆ..ఆ..ఆ
కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా

కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలి కల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..ఆ..ఆ




కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలి కల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..





చరణం 1 :




అనురాగ వీణపై.. మనసేమో నాదమై..

తీయ తీయగా మ్రోయగా పదములాడగా

సుదతి తనువే.. మదన ధనువై

అదను గని పదును పదును మరుల విరులు కురియగ





కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలి కల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..




చరణం 2 :



ఆ..ఆ..ఆ..ఆ... ఆ..ఆ..ఆ..ఆ

లలిత పవన కర చలిత జలదగతిలో...

నవ వికచ కుసుమ ముఖ ముఖర భ్రమర రుతిలో...

వనమే వధువై మనువే వరమై పులకించే ఈ వేళా

ఆషాఢ మేఘమే... ఆనంద రాగమై..

చల చల్లగా ఝల్లుగా కవితలల్లగా




ప్రియుని తలపే.. పెళ్ళి పిలుపై..
చెలియకై ముత్యాల పందిట రత్నాల పల్లకి నిలుపగా



కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా

ఆ కలల కదలి కల ఊగెనులే తొలకరి వలపుల రసడోలా..


కవ్వించే కళ్ళల్లో కలలేవో ఏవో ఏవో కదలాడే ఈవేళా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7287

No comments:

Post a Comment