Sunday, May 11, 2014

మనసా.. శిరసా.. నీ నామము చేసెదనీ వేళ

చిత్రం :  మంత్రిగారి వియ్యంకుడు ( 1983)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  వేటూరి
నేపథ్య గానం :  బాలు, జానకి



పల్లవి:


మనసా.. శిరసా.. నీ నామము చేసెదనీ వేళ
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ
భవ బంధన
మో భయ కంపనమో .. శివశంకర వణికింపగ శరణని
మనసా.. శిరసా.. నీ నామము చేసెదనీ వేళ


చరణం 1:


తాండవమాడే నటుడైనా..ఆ..ఆ..ఆ... తలిచిన వేళ హితుడేలే
తాండవమాడే నటుడైనా...  తలిచిన వేళ హితుడేలే
గిరిజనులే ఆ శివున్ని గురి విడక ధ్యానించు
ఆ శివ శంకర నామము చేసిన నీకిక చింతలు ఉండవులే
బెరుకుమాని ప్రేమించి .. ప్రేమ మీద లాలించె
యముడు చూపు తప్పించి .. తప్పులున్న మన్నించేయ్
ఇష్టదైవమతని మీద దృష్టిని నిలిపి శివుని పిలవ వేళ ..
ఓ మనసా..  శిరసా..  నీ నామము చేసెదనీ వేళ


భవ బంధనమో భయ కంపనమో .. శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ


చరణం 2:


సప్త మహర్షుల సన్నిధిలో ..గరి రిస సని నిద దప
పగమ పదస పద సరిగమ గ .. సప్త మహర్షుల సన్నిధిలో
సప్త మహర్షుల సన్నిధిలో .. సప్త స్వరాల ప్రియ శృతిలో
గౌరి వలె ఆ శివుని గౌరవమే కాపాడు


ఆ నవజాతకు ఈ భువజాతకు కలిసిన జాతకమీ వరుడే
లంక చెరను విడిపించి .. శంకలన్నీ తొలగించి
ఈసులన్నీ కరిగించి .. నీ సుశీల మెరిగించె
లగ్నమైన మనసుతోడ పెళ్ళికి లగ్నమిపుడు కుదురు వేళ ..

ఓ మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

భవ బంధనమో భయ కంపనమో .. శివశంకర వణికింపగ శరణని
మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

మనసా శిరసా నీ నామము చేసెదనీ వేళ

No comments:

Post a Comment