చిత్రం : మంచివాడు (1974)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : ఘంటసాల, సుశీల
పల్లవి:
అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది
అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు.. అచ్చం నాన్నలాగే ఉంటాడు
అబ్బాయే పుడతాడు.. అచ్చం నాన్నలాగే ఉంటాడు
చరణం 1:
కోటేరులాంటి ముక్కు.. కోలకళ్ళు..
లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..చిలిపి నవ్వులు
కోటేరులాంటి ముక్కు... కోలకళ్ళు..
లేత కొబ్బరంటి చెక్కిళ్ళు ..చిలిపి నవ్వులు
ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు..
ఆ నవ్వుల్లో వస్తాయి చిన్ని నొక్కులు
..ఆ నొక్కులే తెస్తాయి మనకెన్నో సిరులు
అబ్బాయే పుడతాడు.. అచ్చం నాన్నలాగే ఉంటాడు
అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది
చరణం 2:
దోబూచులాడు కళ్ళు.. దొంగ చూపులు...
తియ్యతియ్యని మాటలు... ...తెలివితేటలు...
దోబూచులాడు కళ్ళు.. దొంగ చూపులు...
తియ్యతియ్యని మాటలు... ...తెలివితేటలు..
ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు..
ఆ మాటలకే పడతారు కన్నె పిల్లలు..
ఈ ఆత్తగారికప్పుడు ఎందరమ్మా కోడళ్ళు..
అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు.. అచ్చం నాన్నలాగే ఉంటాడు
చరణం 3:
నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...
ఊహు.. మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను
అహా.. నీలాంటి ఆడపిల్ల కావాలి నాకు...
ఊహు.. మీలాంటి పిల్లాడ్నే కంటాను నేను..
ఇద్దర్ని కంటె వద్దన్నదెవరు? ఆ ఇద్దరు అబ్బాయిలైతేనో?
హ హా..హా..
అమ్మాయే పుడుతుంది.. అచ్చం అమ్మలాగే ఉంటుంది
అబ్బాయే పుడతాడు.. అచ్చం నాన్నలాగే ఉంటాడు
అహా... అమ్మలాగే ఉంటుంది
ఊహు... నాన్నలాగే ఉంటాడు
No comments:
Post a Comment