Tuesday, July 8, 2014

ఏ గీత గీసినా నీ రూపమే

చిత్రం :  ముత్తైదువ (1979)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు



పల్లవి:


ఏ గీత గీసినా... నీ రూపమే...
ఏ గీత గీసినా... నీ రూపమే...
ఏ గీతి పాడినా... నీ గానమే....
రతివో... భారతివో... అనురాగవతివో..
ఎవరివో... ఎవరివో... నీవెవరివో...


ఏ గీత గీసినా... నీ రూపమే...



చరణం 1:


దివి నుండి వచ్చిన దేవతవో... 

భువిలోన వెలసిన మోహినివో..
మిసమిస అందాల రసరాగ లతవో... 

అసమాన లావణ్య కుసుమానివో...


ఎవరివో... ఎవరివో... నీవెవరివో...


ఏ గీత గీసినా... నీ రూపమే...



చరణం 2:


కాళిదాసుని దివ్య కావ్యనాయికవో...
కణ్వముని కనువెలుగు శకుంతలవో..
మధుమాస శుభవేళ మాధవుని రాకకై...
మధుమాస శుభవేళ మాధవుని రాకకై...
ఎదురుతెన్నులు చూచు రాధికవో...


ఏ గీత గీసినా...నీ రూపమే...



చరణం 3:


అజంతా గుహలోని చిత్రానివో...
అమరావతి సీమ శిల్పానివో..
రామప్ప గుడిలోన రమణీయ భంగిమల..
రక్తినొలికించే నర్తన బాలవో...


ఎవరివో... ఎవరివో... నీవెవరివో...


ఏ గీత గీసినా... నీ రూపమే...
ఏ గీతి పాడినా... నీ గానమే....
రతివో... భారతివో... అనురాగవతివో..
ఎవరివో... ఎవరివో... నీవెవరివో...


ఏ గీత గీసినా... నీ రూపమే...


No comments:

Post a Comment