స్వరాల పల్లకి
Guest Book
[Sign My Guestbook]
[View My Guestbook]
Powered by E-Guestbooks Server
.
Tuesday, October 14, 2014
కొత్తగా రెక్కలొచ్చెనా
చిత్రం : స్వర్ణ కమలం (1988)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : సిరివెన్నెల
నేపధ్య గానం : బాలు, జానకి
పల్లవి :
కొత్తగా రెక్కలొచ్చెనా... గూటిలోని గువ్వ పిల్లకి
మెత్తగా రేకు విచ్చెనా ...
మెత్తగా రేకు విచ్చెనా... కొమ్మ చాటునున్న కన్నె మల్లికి..
కొమ్మ చాటునున్న కన్నె మల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా రేకు విచ్చెనా
చరణం 1 :
కొండ దారి మార్చింది... కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది... కలికి ఏటి నీరు
అహ అ హ హ హా.. అహ హా హా హా..
కొండ దారి మార్చింది... కొంటె వాగు జోరు
కులుకులెన్నో నేర్చింది... కలికి ఏటి నీరు
బండరాల హోరు మారి.. పంట చేల పాటలూరి
బండరాల హోరు మారి.. పంట చేల పాటలూరి
మేఘాల రాగాల మాగాణి ఊగేల సిరి చిందులేసింది కనువిందు చేసింది
కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా రేకు విచ్చెనా
చరణం 2 :
వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగిందీ.. మధురగానకేళి
అహ అ హ హ హా.. అహ హా హా హా.. అ....
అ
వెదురులోకి ఒదిగిందీ.. కుదురులేని గాలి
ఎదురులేక ఎదిగిందీ.. మధురగానకేళి
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని... అబ్బా
భాషలోన రాయలేని రాసలీల రేయిలోని
యమున తరంగాల.. కమనీయ శృంగార కళలెన్నో చూపింది.. కలలెన్నో రేపింది
కొత్తగా రెక్కలొచ్చెనా... గూటిలోని గువ్వ పిల్లకి
మెత్తగా.... రేకు విచ్చెనా... మెత్తగా... రేకు విచ్చెనా
కొమ్మ చాటునున్న.. కన్నె మల్లికి... కొమ్మ చాటునున్న... కన్నె మల్లికి
కొత్తగా రెక్కలొచ్చెనా... మెత్తగా... రేకు విచ్చెనా
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=11003
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment