Monday, October 27, 2014

లేత కొబ్బరి నీళ్లల్లే

చిత్రం :  అల్లుడొచ్చాడు (1976)
సంగీతం : టి. చలపతిరావు
గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ
నేపథ్య గానం : బాలు





పల్లవి :


లేత కొబ్బరి నీళ్లల్లే... పూత మామిడి పిందల్లే..
లేత కొబ్బరి నీళ్లల్లే ..పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసు...
 


చరణం 1 :



పోంగువస్తుంది నీ బాల అంగాలకు .. ఏహే...
రంగు తెస్తుంది నీ పాల చెక్కిళ్ళకు...


కోక కడతావు మొలకెత్తు అందాలకు.. ఏహే...
కొంగు చాటేసి గుట్టు అంతా దాచేందుకు...
దాగలేనివి.. ఆగలేనివి... దారులేవో వెతుకుతుంటవి...


లేత కొబ్బరి నీళ్లల్లే ..పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు.. మనసు... 


చరణం 2 : 


కోటి అర్ధాలు చూసేవు నా మాటలో..ఓ...
కోర్కెలేవేవో రేగేను నీ గుండెలో...
నేర్చుకుంటాయి నీ కళ్ళు దొంగాటలు..
ఆడుకుంటాయి నాతోటి దోబూచులు..


చూ
చుకోమ్మని.. దోచుకోమ్మని... 

చూచుకోమ్మని దోచుకోమ్మని... దాచుకున్నవి పిలుస్తుంటవి...


లేత కొబ్బరి నీళ్లల్లే ..పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు... మనసు... 



చరణం 2 : 



ఓ...వయసు తెస్తుంది ఎన్నెన్నో పేచిలను..ఏహే...
మనసు తానోల్లనంటుంది రాజీలను...


ఆహా...పగలు సెగపెట్టి పెడుతుంది లోలోపల
రాత్రి ఎగదోస్తు ఉంటుంది తెల్లారులు...
రేపు ఉందని తీపి ఉందని.. ఆశలన్ని మేలుకుంటవి...


లేత కొబ్బరి నీళ్లల్లే .. పూత మామిడి పిందల్లే..
చెప్పకుండ వస్తుంది చిలిపి వయసు..
నిప్పుమీద నీరౌతుంది పాడు మనసు... మనసు...




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4624

No comments:

Post a Comment