Tuesday, December 30, 2014

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు

చిత్రం :  మన ఊరి కథ (1976)
సంగీతం :  జె.వి. రాఘవులు
గీతరచయిత :  మైలవరపు గోపి
నేపధ్య గానం :  బాలు, సుశీల 



పల్లవి :


వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు
అహ.. హా.. ఆ.. హా.. ఆ..
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది.. కొండంత వెలుతురు



చరణం 1 :

అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... లలలలలాల... లలలలలాల
నడయాడే వెన్నెలలా.. 
ఆ.. చిరుగాలి తెమ్మెరలా.. 

నడయాడే వెన్నెలలా.. చిరుగాలి తెమ్మెరలా
ఎలమావి లే చిగురులా.. సొగసు విరిబోణిలా నిండు తరవాణిలా     

 
వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది...  కొండంత వెలుతురు



చరణం 2 :


అహ.. హా.. ఆ.. హా.. ఆ.. ఓహోహో... లలలలలాల... లలలలలాల
పరువాలా మిసమిసలు... ఆ..  చిరునవ్వు దొ౦తరలు.. ఆ..
పరువాలా మిసమిసలు..  చిరునవ్వు దొ౦తరలు
నడిచేను రాయంచలా.. ముద్ద చామంతిలా...  ముద్దు పూబంతిలా

వచ్చిందీ కొత్త పెళ్లికూతురు.. మనసుకు తెచ్చింది కొండంత వెలుతురు




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3600

No comments:

Post a Comment